ఫ్రాన్స్ పార్లమెంట్‌లో జరిగిన సంయుక్త సమావేశంలో అబార్షన్ బిల్లుకు ఆమోదం లభించింది. ఫ్రాన్స్ రాజ్యాంగంలో మహిళలకు గర్భస్రావం చేయించుకునే హక్కును పొందుపరిచే బిల్లుకు ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు.
అబార్షన్‌ను రాజ్యాంగంలో చేర్చిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఈ బిల్లు అత్యధిక ఓట్లతో ఆమోదం పొందిన నేపధ్యంలో ఉమ్మడి సెషన్‌లోని సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మహిళా హక్కుల కోసం పనిచేస్తున్నవారంతా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ బిల్లుకు చట్టపరమైన రూపం కల్పించేందుకు ఫ్రెంచ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 34ను సవరించారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో అంటే జాతీయ అసెంబ్లీ,సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మహిళలకు అబార్షన్ హక్కును కల్పిస్తుంది.
ఉమ్మడి సెషన్‌ను ప్రారంభించిన దిగువ సభ స్పీకర్ యాయెల్ బ్రాన్-పివెట్ మాట్లాడుతూ మహిళకు అబార్షన్ హక్కును కల్పించిన మొదటి దేశం ఫ్రాన్స్ అని అన్నారు. ఈ బిల్లు ఆమోదానికి ముందు ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియెల్ అటల్ మాట్లాడుతూ మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు.
మరోవైపు అబార్షన్‌ను వ్యతిరేకిస్తున్న సంస్థలు, కార్యకర్తలు ఈ బిల్లును ఆమోదంపై పార్లమెంటు నిర్ణయాన్ని తప్పుబట్టారు. అధ్యక్షుడు మాక్రాన్ రాజకీయ లబ్ధి కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని వారు ఆరోపించారు.
NEW: France's Parliament votes to make abortion a constitutional right, the first country in the world to do so.
— Lewis Goodall (@lewis_goodall) March 4, 2024
French PM Gabriel Attal: " We're sending a message to all women: your body belongs to you and no one can decide for you." pic.twitter.com/xI7EyZwvMv
Comments
Please login to add a commentAdd a comment