lawmakers
-
ఫ్రాన్స్ పార్లమెంట్లో అబార్షన్ బిల్లుకు ఆమోదం!
ఫ్రాన్స్ పార్లమెంట్లో జరిగిన సంయుక్త సమావేశంలో అబార్షన్ బిల్లుకు ఆమోదం లభించింది. ఫ్రాన్స్ రాజ్యాంగంలో మహిళలకు గర్భస్రావం చేయించుకునే హక్కును పొందుపరిచే బిల్లుకు ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. అబార్షన్‌ను రాజ్యాంగంలో చేర్చిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఈ బిల్లు అత్యధిక ఓట్లతో ఆమోదం పొందిన నేపధ్యంలో ఉమ్మడి సెషన్‌లోని సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మహిళా హక్కుల కోసం పనిచేస్తున్నవారంతా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ బిల్లుకు చట్టపరమైన రూపం కల్పించేందుకు ఫ్రెంచ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 34ను సవరించారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో అంటే జాతీయ అసెంబ్లీ,సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మహిళలకు అబార్షన్ హక్కును కల్పిస్తుంది. ఉమ్మడి సెషన్‌ను ప్రారంభించిన దిగువ సభ స్పీకర్ యాయెల్ బ్రాన్-పివెట్ మాట్లాడుతూ మహిళకు అబార్షన్ హక్కును కల్పించిన మొదటి దేశం ఫ్రాన్స్ అని అన్నారు. ఈ బిల్లు ఆమోదానికి ముందు ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియెల్ అటల్ మాట్లాడుతూ మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. మరోవైపు అబార్షన్‌ను వ్యతిరేకిస్తున్న సంస్థలు, కార్యకర్తలు ఈ బిల్లును ఆమోదంపై పార్లమెంటు నిర్ణయాన్ని తప్పుబట్టారు. అధ్యక్షుడు మాక్రాన్ రాజకీయ లబ్ధి కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని వారు ఆరోపించారు. NEW: France's Parliament votes to make abortion a constitutional right, the first country in the world to do so. French PM Gabriel Attal: " We're sending a message to all women: your body belongs to you and no one can decide for you." pic.twitter.com/xI7EyZwvMv — Lewis Goodall (@lewis_goodall) March 4, 2024 -
ఎన్నదగిన తీర్పు
చట్టసభల సభ్యులు చెట్లకూ, పుట్లకూ ప్రాతినిధ్యం వహించరు. ఓటు హక్కున్న పౌరులు వారిని ఎన్నుకుంటారు. తమ ప్రతినిధులుగా చట్టసభలకు పంపుతారు. అలా ఎన్నికైనవారి ప్రవర్తన అందరికీ ఆదర్శనీయంగా వుండాలనీ, వుంటుందనీ జనం ఆశిస్తారు. అందుకు భిన్నంగా వున్నపక్షంలో ఆ సభ్యులపై మాత్రమే కాదు... ఆ చట్టసభలపైనే ప్రజలు నమ్మకం కోల్పోతారు. కనుకనే సోమవారం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైనది. చట్టసభల్లో ఓటేయటానికీ లేదా ప్రసంగించటానికీ లంచం తీసుకునే ప్రజాప్రతినిధులు చట్టపరమైన చర్యలనుంచి తప్పించుకోలేరంటూ ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన ఈ ఏకగ్రీవ తీర్పు మన ప్రజాస్వామ్యానికి పట్టిన అనేకానేక చీడల్లో ఒకదాన్ని తొలగించటానికి దోహదపడుతుందని భావించాలి. 1993 సంవత్సరంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై లోక్‌సభలో వచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఓడించటానికి అయిదుగురు జేఎంఎం సభ్యులు, జనతాదళ్ (ఏ) సభ్యుడొకరు లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారన్నది ప్రధానమైన ఆరోపణ. నాటి ప్రధాని పీవీ, ఈ ఆరుగురు సభ్యులూ ఆ తీర్మానాన్ని ఓడించటానికి ఉమ్మడిగా నేరపూరిత కుట్రకు పాల్పడ్డా రన్నది ఆ ఆరోపణ సారాంశం. లంచావతారాలైన ప్రభుత్వోద్యోగులు ముడుపులు తీసుకుంటే అవినీతి నిరోధక విభాగాలు అరెస్టు చేస్తాయి. వారి నేరం రుజువైన పక్షంలో శిక్ష కూడా పడుతుంది. ఇదే పని మరింత భారీ స్థాయిలో చేసే ప్రజాప్రతినిధి చట్టపరిధిలోకి ఎందుకు రారన్నది సామాన్యులకొచ్చే సందేహం. నిజానికి 1998లో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తూ తీర్పు వెలువరించినప్పుడు రాజ్యాంగ నిపుణులు నివ్వెరపోయారు. ఈ తీర్పు పార్లమెంటరీ వ్యవస్థ పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుందనీ, ప్రజాస్వామ్యం పతనమవుతుందనీ హెచ్చరించారు. నాటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును అర్థం చేసుకున్న తీరూ, చట్టసభల సభ్యు లకు రక్షణకల్పించే రాజ్యాంగ అధికరణ 105కు చెప్పిన భాష్యమూ లోపభూయిష్టం. పార్లమెంటు నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలూ, ఇతరత్రా ఆదేశాలకు లోబడి పార్లమెంటు సభ్యులకు వాక్ స్వాతంత్య్రం వుంటుందన్నది 105(1) అధికరణ చెప్పిన మాట. సభలో సభ్యులు చేసే ప్రసంగాలు, ఏదైనా అంశంపై వారు వేసే ఓటు, సమర్పించే నివేదికలు న్యాయస్థానాల్లో సవాలు చేయటానికి అతీతమైనవని 105(2) అధికరణ చెబుతోంది. కానీ వారు చేసే ప్రసంగాలూ, వేసే ఓటూ వెనక ముడుపుల ప్రమేయం వున్నప్పుడు కూడా రక్షణ పొందగలరా అన్నదే ప్రధాన ప్రశ్న. అయితే చిత్రంగా నాటి ధర్మాసనంలోని మెజారిటీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన అయిదుగురు జేఎంఎం ఎంపీలకూ 105(2) అధికరణ కింద రక్షణ వుంటుందని భావించారు. అయితే అదే తరహాలో లంచం తీసుకుని కూడా ఓటింగ్‌కు గైర్హాజరైన జనతాదళ్(ఏ) సభ్యుడు అజిత్ సింగ్‌కు మాత్రం ఆ రక్షణ వర్తించదని తీర్పునిచ్చారు. నాటి ముడుపుల కేసులో ఆరోపణ లెదుర్కొన్న అయిదుగురు జేఎంఎం సభ్యుల్లో ఒకరైన శిబూ సోరెన్ కుమార్తె సీతా సోరెన్ ఎమ్మెల్యేగా వుంటూ 2012లో రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్వతంత్ర సభ్యుడికి ఓటేస్తానని మాటిచ్చి ముడుపులు తీసుకున్నారు. అయితే ఎన్నిక బహిరంగ విధానంలో జరగటంతో గత్యంతరం లేక తన పార్టీ ఎంపిక చేసిన సభ్యుడికి అనుకూలంగా ఓటేశారు. దానిపై నమోదైన కేసులో తనకు పీవీ కేసు తీర్పే వర్తిస్తుందనీ, కేసు కొట్టేయాలనీ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ లంచం తీసుకుని కూడా అప్పట్లో ఓటింగ్‌కు గైర్హాజరైన అజిత్ సింగ్ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయమే సీతా సోరెన్‌కు కూడా వర్తిస్తుందని హైకోర్టు భావించి ఆ పిటిషన్‌ను తోసిపుచ్చటంతో 2014లో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏదైనా కొత్త అంశం తెరపైకొచ్చినప్పుడు గత తీర్పులు నిశితమైన పరీక్షకు నిలబడక తప్పనిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సీతా సోరెన్ అప్పీల్ సర్వోన్నత న్యాయస్థానానికి ఆ మాదిరి అవకాశాన్ని చ్చింది. పౌరస్వేచ్ఛ పౌరులకు చట్టం ఇచ్చిన బహుమతి మాత్రమేననీ, ఆత్యయిక పరిస్థితి వున్నప్పుడు దాన్ని వెనక్కి తీసుకునే హక్కు రాజ్యానికుంటుందనీ ఏడీఎం జబల్పూర్ కేసుగా ప్రసిద్ధిచెందిన హెబియస్ కార్పస్ పిటిషన్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం మెజారిటీ తీర్పు వెలువ రించింది. ధర్మాసనంలోని జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా ఒక్కరే దాంతో విభేదించారు. ఎమర్జెన్సీ కాలంలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ తీర్పును అడ్డం పెట్టుకుని దేశవ్యాప్తంగా వేలాదిమంది పౌరులను జైళ్లపాలు చేసింది. ఆ తీర్పును 1978లో సుప్రీంకోర్టు సవరించుకుంది. అలాగే 2017లో పుట్టస్వామి కేసులో గోప్యత హక్కుపై వెలువరించిన తీర్పు సందర్భంగా ఏడీఎం జబల్పూర్ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. తమ తీర్పు ఏ పర్యవసానాలకు దారితీస్తుందో, ఎలాంటి దుçస్సంప్రదాయాలకు సాకుగా మారుతుందో గమనించుకోవటం న్యాయస్థానాలకు తప్పనిసరి. ప్రజాప్రతినిధులు పార్లమెంటులో వ్యవహరించే తీరుపై లంచాల ప్రభావంవున్నా వారు చర్యకు అతీతులన్న గత భావనను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చటం హర్షించదగింది. ముడుపులు ఎక్కడైనా ముడుపులే. ప్రజాప్రతినిధులు అటువంటి ప్రలోభాలకు లొంగితే వారి అనైతికత మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది. చట్టసభలపై ప్రజానీకానికుండే విశ్వాసం కుప్పకూలుతుంది. అవినీతి కేసుల్లో దోషులందరికీ ఒకే చట్టం, న్యాయం వర్తిస్తుందన్న తాజా తీర్పు ఎన్నదగింది. -
Maldives: మాల్దీవుల పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
పార్లమెంట్లో ఎంపీలు తీవ్రంగా విమర్శలు చేసుకోవటం వింటున్నాం. కానీ చట్టాలు చేయాల్సిన ప్రజాప్రతినిధులు వీధి రౌడీల్లా కొట్టుకోవటం చూశారా? మాల్దీవుల పార్లమెంట్లో అధికార పార్టీ ఎంపీలు, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు బాహాబాహికి దిగారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు కేబినెట్లోని మంత్రుల సంబంధించి పార్లమెంట్ ఆమోదం కోసం ఆదివారం ఏర్పాటు చేసిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో తీవ్రమైన ఘర్షణ చెలరేగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం మాల్దీవుల ప్రజా ప్రతినిధుల ఘర్షణ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. *Viewer discretion advised* Parliament proceedings have been disrupted after clashes between PPM/PNC MPs and opposition MPs. pic.twitter.com/vhvfCBgQ1s — Adhadhu (@AdhadhuMV) January 28, 2024 అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(PNC), ప్రభుత్వ అనుకూల పార్టీ ప్రొగ్రెసీవ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్(PPM) ఎంపీలకు... ప్రతిపక్ష పార్టీ మాల్దీవీయిన్ డెమోక్రటిక్ పార్టీ (MDP)ఎంపీల మధ్య గొడవ జరిగింది. అయితే అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు కేబినెట్లో నలుగురు మంత్రుల ఆమోదానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ నిరసన తెలియజేశారు. ఈ క్రమంలోనే పీఎన్సీ ఎంపీ షహీమ్.. ఎండీపీ ఎంపీ ఇసా కాలు పట్టుకొని నేలపై పడగొట్టాడు. దీంతో ఇసా... షహీమ్ మెడపై పిడిగుద్దులు గుద్దాడు. సహచర ఎంపీలు వారిగొడవను శాంతింపచేశారు. తీవ్రంగా గాయపడ్డ షహీమ్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు మంత్రి వర్గంలోని మంత్రులకు ఆమోదం తెలపకపోవటంతో పాటు స్పీకర్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్ చేశాయి. మరోవైపు కెబినెట్లో మంత్రులకు ఆమోదం తెలపకపోవటం ప్రజా సేవలకు విఘాతం కల్పించడమేనని ప్రతిపక్షాలపై అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ పార్టీ మండిపడుతోంది. చదవండి: Dinosaurs: పక్షులు డైనోసార్ల వంశమా? -
జాహ్నవికి న్యాయం జరగాల్సిందే
వాషింగ్టన్: అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతాన్ని అక్కడి భారతీయ చట్ట సభ్యులు సీరియస్‌గా తీసుకున్నారు. వాషింగ్టన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయిన 23 ఏళ్ల జాహ్నవి గత జనవరిలో సియాటిల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీ కొని మరణించడం తెలిసిందే. 25 మైళ్ల స్పీడ్ లిమిట్ ఉన్న చోట సదరు వాహనం ఏకంగా 74 మైళ్ల వేగంతో దూసుకురావడమే ప్రమాదానికి కారణమని తేలింది. కానీ డేనియల్ ఆడరర్ అనే సియాటెల్ పోలీసు అధికారి ఈ ఉదంతంపై చేసిన అత్యంత అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అయితే ఏమయిందిప్పుడు?! ఆమెకు ఆల్రెడీ 26 ఏళ్లు. అంత విలువైనదేమీ కాదు. ఏ 11 వేల డాలర్లకో ఓ చెక్కు రాసి పారేయండి‘ అంటూ అతనన్న మాటలు బాడీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అతనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్ తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా పోలీసుల్లో జాత్యహంకారం ఎంతగా జీరి్ణంచుకుపోయిందో చెప్పేందుకు ఈ ఉదంతం మరో నిదర్శనమని వారన్నారు. డేనియల్‌పై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. ‘జాహ్నవి దుర్మరణానికి కారకులైన పోలీసులే ఆమె జీవితం విలువే లేనిదంటూ అంత నీచంగా మాట్లాడటం వింటే చెప్పరానంత జుగుప్స కలుగుతోంది. జాతి విద్వేషం, జాత్యహంకారం అమెరికాలో ఆమోదనీయత పొందుతున్నాయనేందుకు ఇది సంకేతం. ఈ చెడు ధోరణికి తక్షణం అడ్డుకట్ట పడాలి‘ అని కృష్ణమూర్తి అన్నారు. ఈ ఉదంతం మీద పూర్తి అధికారాలతో కూడిన పౌర సంఘ సభ్యుల కమిటీ వేసి స్వతంత్రంగా విచారణ జరిపించాలని సావంత్ కోరారు. డేనియల్ మీద 2014 నుంచి కనీసం 18 విచారణలు జరిగితే అతన్ని ఒక్క దాంట్లోనూ శిక్షించకపోవడం దారుణమన్నారు. పోలీసులే ఇంతటి నోటి దురుసుతో జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డ ఇలాంటి హై ప్రొఫైల్ కేసులో కూడా విచారణను ఆర్నెల్లు సాగదీయడం, రివ్యూ పేరిట ఏడాది దాకా లాగడం క్షమించరానిదని సౌత్ సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యుడు టామీ జె.మోరల్స్ ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ అసోసియేషన్స్ కూడా ఒక ప్రకటనలో కోరింది. వందలాది మంది గురువారం సియాటిల్‌లో నిరసన ప్రదర్శన కూడా చేశారు. దోషులైన పోలీసులకు శిక్ష పడి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. జాహ్నవికి మరణానంతరం డిగ్రీ అమెరికాలో పోలీసు వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రకటించింది. మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబ సభ్యులకు అందజేస్తామని వెల్లడించింది. జాహ్నవి మృతి పట్ల నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ చాన్సలర్ సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. -
విలీనానికి రష్యా చట్టసభ సభ్యుల ఆమోదం
ఉక్రెయిన్‌లోని ఆయా కీలక ప్రాంతాలను అధికారికంగా విలీనం చేస్తున్న డిక్రీపై పుతన్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై పుతిన్ గ్రాండ్‌గా సెలబ్రెషన్ చేసుకున్నారు కూడా. ఇప్పుడూ ఆ విలీన చట్టానికి అనూకూలంగా రష్యా చట్టసభ సభ్యులు ఓటు వేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పార్టమెంట్ని ఉద్దేశించి మాట్లాడుతూ...రష్యాన్ భాష, సంస్కృతి, సరిహాద్దులను రక్షించడానికి బిల్లుకు మద్దుతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తాము ఊహజనిత బెదిరింపులకు లొంగి ఇలా చేయడం లేదు, కేవలం తమ దేశ సరిహద్దులను, మాతృభూమిని, ప్రజలను రక్షించుకునే నిమిత్తం ఇలా చేశామని తెలిపింది. అదీగాక ఉక్రెయిన్ సాధనంగా చేసుకుని అమెరికా యావత్తు పశ్చిమ దేశాలను సమీకరించిందని ఆరోపణలు చేశారు. అలాగే ఈనాలుగు భూభాగాలు మాస్కోకి మధ్య ల్యాండ్ కారిడర్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ విలీనంతో మొత్తంగా ఐదు ప్రాంతాలు అంటే ఉక్రెయిన్‌లో దాదాపు 20 శాతం స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. వాస్తవానికి రష్యా బలగాలు ఖైర్సన్, జపోరిజ్జియాపై పూర్తి నియంత్రణ కలిగి లేవు. మరీ మాస్కో ఆయా ప్రాంతాల్లోని ఏ ప్రాంతాలను స్వాధీనం చేసుకుందో స్పష్టం చేయాల్సి ఉంది. (చదవండి: భగవద్గీతా పార్క్‌పై భారత్ వ్యాఖ్యలు...వివరణ ఇచ్చిన కెనడా) -
తైవాన్‌కు మళ్లీ అమెరికా బృందం
తైపీ: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శనతో రేగిన ఉద్రిక్తతలు చల్లారకమునుపే మరికొందరు అమెరికా ప్రజాప్రతినిధులు ఆదివారం అక్కడ పర్యటించారు. డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఈ బృందం ఆదివారం రాత్రి 7 గంటలకు తైపీ చేరింది. ఈ బృందం ఆది, సోమవారాల్లో అక్కడే ఉండి అమెరికా–తైవాన్‌ల సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై సీనియర్ నేతలతో చర్చలు జరుపనుంది. ఈ బృందం ఈనెల 2వ తేదీన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పెలోసీ సందర్శనపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత 12 రోజులుగా తైవాన్ చుట్టు పక్కల ప్రాంతాల్లో యుద్ధ విమానాలు, క్షిపణులు, యుద్ధ నౌకలతో విన్యాసాలు జరుపుతోంది. -
ఫిరాయింపులకు పరిష్కారం చూడండి
న్యూఢిల్లీ: ఎన్నికైన చట్ట సభల సభ్యులు సొంత పార్టీ నుంచి వేరే పార్టీకి ఫిరాయించే అనైతిక చర్యలను నిరోధించేలా ఒక పరిష్కారం చూపాలని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభలో గురువారం జీరోఅవర్ సందర్భంగా వెంకయ్యనాయుడు పై సూచన చేశారు. ‘దురదృష్టవశాత్తూ వారు అంటున్నారు ఇది ఫిరాయింపు(డిఫెక్షన్) కాదు.. అభిమానం(అఫెక్షన్) అని. వారు ఆ ఫిరాయింపును ఫర్ఫెక్షన్తో చేస్తున్నారు. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద సమస్య ఇది’ అని ఫిరాయింపు నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఈ అనైతిక చర్యకు ముగింపు పలికేందుకు అన్ని రాజకీయ పార్టీలు సూచనలు చేయాలని కోరారు. -
జైసింగ్ దంపతుల ఇళ్లపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: ప్రముఖ సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్‌లపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) దాడులు నిర్వహించింది. విదేశీ నిధుల చట్టం నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. గురువారం తెల్లవారుజామున 5గంటలకు ఢిల్లీలోని ఇందిరా జైసింగ్ ఇల్లు, జంగ్‌పురాలో లాయర్స్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ ఆఫీస్, ముంబైలోని మరో ఆఫీస్‌లో దాడులు నిర్వహించినట్లు సీబీఐ ప్రకటించింది. ఆనంద్ గ్రోవర్ తన ఆధ్వర్యంలో నడుస్తోన్న లాయర్స్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థకు వచ్చిన విదేశీ విరాళాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. 2006 నుంచి 2014 మధ్య ఆనంద్ గ్రోవర్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా రూ.32.39 కోట్లకుపైగా అవకతవకలకు పాల్పడ్డారని హోం శాఖ ఫిర్యాదిచ్చింది. దీంతో సంస్థ అధ్యక్షుడు గ్రోవర్‌పై విదేశీ సహకార నియంత్రణ చట్టాన్ని(ఎఫ్సీఆర్ఎ) ఉల్లంఘించారన్న ఆరోపణల కింద సీబీఐ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగానే గురువారం సోదాలు నిర్వహించింది. ఫిర్యాదులో ఇందిరను నిందితురాలిగా పేర్కొనలేదు. 2009–14లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఇందిర పనిచేశారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఇందిర, గ్రోవర్, లాయర్స్ కలెక్టివ్ తరఫున ఓ ప్రకటన వెలువడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఓ మాజీ ఉద్యోగి చేసిన లైంగిక ఆరోపణల కేసును ఇందిర వాదిస్తుండడంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని సంయుక్త ప్రకటన పేర్కొంది. ఖండించిన రాజకీయ పార్టీలు.. సీబీఐ దాడులు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. సీబీఐ దాడులను టీఎంసీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎంలకు చెందిన ఎంపీలు మూకుమ్మడిగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేస్తోందన్నారు. ఈ మేరకు వారంతా ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. -
కళంకిత నేతలు పోటీ చేయకుండా అడ్డుకోలేం
-
కళంకిత నేతలు పోటీ చేయకుండా అడ్డుకోలేం : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : క్రిమినల్ నేరారోపణలు ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులను వారిపై అభియోగాల నమోదు దశలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించలేమని సుప్రీం కోర్టు మంగళవారం తేల్చిచెప్పింది. ప్రస్తుత ప్రజాప్రాతినిథ్యం చట్టం కింద ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో వారు దోషులుగా తేలితేనే పోటీ చేసేందుకు అనర్హులుగా పరిగణిస్తున్నారు. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం కళంకిత చట్టసభ సభ్యులను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే నిర్ణయాన్ని పార్లమెంట్‌కే వదిలివేస్తున్నట్టు స్పష్టం చేసింది. క్రిమినల్ కేసుల్లో చార్జిషీట్ దాఖలైన సమయంలోనే ఆరోపణలను ఎదుర్కొంటున్న నేతలను అనర్హులుగా ప్రకటించే పరిస్థితిలో తాము లేమని తీర్పును చదువుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా పేర్కొన్నారు. క్రిమినల్ నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా జాతి ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్ ఓ నిర్ణయం తీసుకోవాలని, దేశం ఈ నిర్ణయం కోసం వేచిచూస్తోందని అన్నారు. నేరచరిత్ర కలిగిన నేతలు ప్రజా జీవితంలోకి ప్రవేశించి, చట్టాల రూపకల్పనలో భాగం కాకుండా పార్లమెంట్ ఓ చట్టాన్ని తీసుకురావాలని స్పష్టం చేశారు. ఇలాంటి చట్టం తీసుకురవావాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న కళంకిత నేతలు తమ కేసుల వివరాలను ఈసీకి సమర్పించాలని, రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్స్‌లో విస్తృతం ప్రచారం కల్పించాలని అన్నారు. కాగా సుప్రీం బెంచ్‌లో జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, ఏఎం కన్విల్కార్, డీవై చంద్రచూడ్, ఇందూ మల్హోత్రాలు సభ్యులుగా ఉన్నారు. శాసనవ్యవస్థ పరిధిలోకి వెళ్లే ఉద్దేశం తమకు లేదని, అభ్యర్థి గుణగణాలు, నేపథ్యాన్ని తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని సర్వోన్నత న్యాయస్ధానం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, అయితే వారు పార్టీ గుర్తు, టికెట్‌పై పోటీ చేయరాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కాగా అనర్హథకు సంబంధించి ప్రజాప్రాతినిథ్య చట్టం ఉన్నందున న్యాయవ్యవస్థ శాసన వ్యవస్థ పరిధిలోకి సర్వోన్నత న్యాయస్ధానం ప్రవేశించరాదని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పేర్కొన్నారు. -
నేడు ఎమ్మెల్యే పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు తీర్పు
-
గన్‌మెన్ ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తమైనట్లు తెలిసింది. ఎన్నికలు సమీపిస్తుండటం, ఇతరత్రా కారణాల వల్ల వారి భద్రత విషయమై జాగ్రత్తలు తీసుకుంటోంది. నాలుగేళ్లుగా గన్మెన్లను నియమించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు అధికారులు నివేదించినట్లు సమాచారం. ఉండాల్సిందే.. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల్లో కొంతమంది ఒకే గన్‌మెన్‌తో, మరికొంత మంది గన్మెన్లు లేకుండానే నియోజకవర్గాలు, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో అనుకోని సంఘటనలు జరగకుండా ఉండేందుకు గన్మెన్లను నియమిస్తే మరుసటి రోజే హెడ్‌క్వార్టర్స్‌కు రిటర్న్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌కు ఎస్పీలు రిపోర్టు చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు లేఖలు రాశారు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్ఓ)లను తొలగించుకోవడం సరికాదని చెప్పారు. ఎమ్మెల్యేలు సొంతగా కారు డ్రైవ్ చేసుకుంటూ తిరగడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతపై ఆయా జిల్లాల మంత్రులతోనూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సీఎం కార్యాలయం నుంచి నేరుగా కొంతమందికి ఫోన్లు వెళ్లడంతో తప్పక పలువురు గన్మెన్లను నియమించుకున్నట్లు తెలిసింది. ముగ్గురు ఎంపీలూ.. ముగ్గురు ఎంపీల విషయంలోనూ ఇదే వ్యవహారం బయటపడినట్లు తెలిసింది. గన్మెన్లను కేటాయిస్తే క్యాంపు ఆఫీసు, ఇళ్లలో వదిలి కార్యకర్తలు, అనుచరులతో వెళ్తున్నారని.. ఆ ఎంపీలకూ మందలింపులు జరిగాయని సమాచారం. దీంతో ఇద్దరు 2+2 నియమించుకోగా, ఓ ఎంపీ 1+1 స్వీకరించినట్లు తెలిసింది. కాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఎస్పీలు, కమిషనర్ల మధ్య గన్మెన్లు ఒత్తిడికి గురవుతున్నారు. వారిని ఎమ్మెల్యేలు వెంట తీసుకెళ్లకపోవడం.. వెళ్లకపోతే అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుండటంతో ఏం చేయాలో తెలియడం లేదని వారు వాపోతున్నారు. -
స్త్రీలపై నేరాల కేసుల్లో 48 మంది చట్టసభ్యులు
న్యూఢిల్లీ: అత్యాచారాలు సహా మహిళలపై అనేక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్న 48 మంది ప్రస్తుతం దేశంలోని వివిధ చట్టసభల్లో దర్జాగా సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరిలో అత్యధికంగా బీజేపీ నుంచే 12 మంది ఉన్నారు. ఎన్నికల్లో పోటీచేసే సమయంలో అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించే ప్రమాణ పత్రాల్లోని కేసులను విశ్లేషించిన ఓ స్వచ్ఛంద సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఎన్నికల సంస్కరణల కోసం శ్రమిస్తున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ మొత్తం 4,845 ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన మీదట ఓ నివేదికను తయారుచేసింది. నేరాలకు పాల్పడి చట్టసభల్లో కూర్చుంటున్న ఈ 48 మందిలో ముగ్గురు పార్లమెంటు సభ్యులు కాగా, మిగిలిన 45 మంది వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్రలో 12 మంది, పశ్చిమ బెంగాల్లో 11 మంది, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో చెరో 5 మందితో కలిపి 48లో మొత్తం 33 మంది ఈ నాలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. పార్టీల వారీగా అయితే ఈ 48 మందిలో బీజేపీకి చెందినవారు 12 మంది, శివసేన పార్టీ వారు ఏడుగురు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఆరుగురు కలిపి ఈ మూడు పార్టీల నుంచే 25 మంది ఉన్నారు. తీవ్ర నేరారోపణలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల్లో నిర్ణీత సమయంలో త్వరితగతిన విచారణ పూర్తి చేసి, నేరం రుజువైతే వారి సభ్యత్వాలను రద్దుచేయడం తదితర సంస్కరణలను ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) స్వచ్ఛంద సంస్థలు సూచిస్తున్నాయి. అన్ని పార్టీలూ నేరగాళ్లకు టికెట్లు ఇస్తున్నాయనీ, గత ఐదేళ్లలో ఎన్నికల్లో పోటీ చేసిన వివిధ పార్టీల అభ్యర్థుల్లో మొత్తం 327 మందిపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులున్నాయని ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. -
మరో సంక్షోభంలో ఆప్
వివాదాలూ, ఘర్షణలు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కొత్త కాదు. కానీ ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం రూపంలో వచ్చిన సంక్షోభం వాటన్నిటినీ మించిపోయింది. ఆయన ప్రభుత్వం పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించిన 20మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫార్సు తోనే షాక్ తిన్న ఆయన ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభిం చకపోవడం మరో షాక్. 70మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో 65మంది బలం ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఈ చర్యవల్ల వెనువెంటనే ఏర్పడగల ముప్పేమీ లేకపోవచ్చు. కానీ ఎన్నికల సంఘం సిఫార్సును రాష్ట్రపతి ఆమోదిస్తే, దాన్ని న్యాయస్థానాలు సబ బేనని తేల్చి చెబితే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ఆ ఇరవైచోట్లా మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహిస్తే, అందులో మెజారిటీ సీట్లు తిరిగి సాధించలేకపోతే ఏమైనా జర గొచ్చు. ఆ సంగతలా ఉంచి ఎన్నికల సంఘం సిఫార్సులోని సహేతుకతపై కూడా విమర్శలు రాక తప్పదు. ఆప్ ప్రభుత్వం 2015 మార్చి 13న చేసిన ఈ నియామకా లను ఆ మరుసటి సంవత్సరం సెప్టెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు చెల్లుబాటు కావంటూ కొట్టేసింది. కోర్టు కొట్టేశాక ఇక ఫిర్యాదు స్వీకరించడమేమిటని ఆప్ అభ్యంతరపె ట్టినా ఎన్నికల సంఘం ఖాతరు చేయలేదు. ఆ కొన్నాళ్లపాటూ ‘లాభదాయక పద వుల్లో’ ఉన్నారు గనుక విచారణ జరుపుతామని చెప్పింది. వాస్తవానికి ‘లాభదాయక పదవులు’ అనే మాటను ఏ చట్టమూ నిర్వచించడం లేదు. అయితే చట్టసభల సభ్యుల అనర్హతను నిరోధించే చట్టం ఉంది. అందులో అన ర్హత పరిధిలోనికి రాని ప్రభుత్వ పదవులేమిటన్న వివరాలు మాత్రమే ఉన్నాయి. రాజ్యాంగంలోని 102వ అధికరణ పార్లమెంటు సభ్యుల అనర్హత గురించీ, 191వ అధికరణ అసెంబ్లీ సభ్యుల అనర్హత గురించీ మాట్లాడుతున్నాయి. 103(2) అధికరణ ప్రకారం చట్టసభల సభ్యులపై అనర్హత వేటు విషయంలో తుది నిర్ణయం రాష్ట్రపతిదే. అయితే ఆయన ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని దాని ఆధా రంగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆ అధికరణ నిర్దేశిస్తోంది. 1982లో అన్నా డీఎంకే ఎంపీ ఆర్. మోహనరంగంను అప్పటి ఎంజీఆర్ ప్రభుత్వం ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించినప్పుడు ఆయన రాజ్యసభ సభ్యత్వం పోయింది. ప్రముఖ నటి జయాబచ్చన్ రాజ్యసభ సభ్యురాలిగా ఉంటూ ఉత్తరప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి మండలి చైర్‌పర్సన్‌గా వ్యవహరించడం చెల్లదని 2004లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆమె రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఆ నిర్ణయం సబబేనని 2006లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2006లో సోనియాగాంధీ జాతీయ సలహా మండలి చైర్‌పర్సన్‌గా వ్యవహరించడంపై అభ్యంతరాలొచ్చినప్పుడు ఆమె అటు మండలి పద వికి, ఇటు లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీచేసి నెగ్గారు. నిర్దిష్టమైన చట్టం లేదు గనుక... ఏది లాభదాయక పదవి, ఏది కాదు అని నిర్వ చించడానికి సర్వోన్నత న్యాయస్థానం వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులే ఆధారం. ప్రభుత్వం నుంచి జీతం, అలవెన్సులు, ఇతర సౌకర్యాలు పొందితేనే ‘లాభదాయక పదవి’గా పరిగణించాలన్నది ఆ తీర్పుల సారాంశం. మొత్తానికి న్యాయస్థానాల నుంచి సమస్యలెదురవుతున్నా, ఎదురవుతాయని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేస్తూనే ఉన్నాయి. అధికార పక్షం ఎమ్మెల్యేల్లో మంత్రి పదవులు ఆశించేవారు ఎక్కువ కావడం, రాజ్యాంగం అందుకు పరిమితి విధించడంతో ఎటూ పాలుబోని ప్రభు త్వాలు పార్లమెంటరీ సెక్రటరీ పదవులివ్వడాన్ని పరిష్కారంగా భావిస్తున్నాయి. వాటిపై విమర్శలు వెల్లువెత్తి, ఫిర్యాదులు వెళ్లి ఎన్నికల సంఘం కదలడానికి... న్యాయస్థానాల్లో ఎవరైనా సవాలు చేసినా దానిపై తీర్పు వెలువడటానికి సమయం పడుతుంది గనుక ఈ పదవుల పందేరాన్ని ఆపనవసరం లేదని ప్రభుత్వాలు భావి స్తున్నాయి. రాజ్యాంగంలోని 164(1ఏ) అధికరణ ప్రకారం మొత్తం అసెంబ్లీ సంఖ్యా బలంలో 15 శాతానికి మించి మంత్రి పదవులు ఇవ్వడానికి వీల్లేదు. ఢిల్లీ అసెంబ్లీ విషయానికొచ్చేసరికి ఇది 10 శాతం మాత్రమే. 2015లో తెలంగాణకు, పశ్చిమ బెంగాల్‌కు పార్లమెంటరీ సెక్రటరీ పదవుల నియామకాల విషయంలో న్యాయ స్థానాల్లో చుక్కెదురైంది. ఇప్పుడు ఆప్ ఎమ్మెల్యేల విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు పాలించే రాష్ట్రాల్లో కూడా అక్కడి ప్రభుత్వాలు సైతం ఇలాంటి నియామకాలు చేశాయి. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్లతోసహా 11 రాష్ట్రాల్లో పార్లమెంటరీ సెక్ర టరీలున్నారు. ఈ విషయంలో వివిధ న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అస్సాం తీసుకొచ్చిన చట్టాన్ని నిరుడు అక్టోబర్‌లో సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పటికి ఆ రాష్ట్రంతోపాటు ఈశాన్యంలోని మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరం రాష్ట్రాల్లో మొత్తం 93మంది పార్లమెంటరీ సెక్రటరీలున్నారు. ఆ తీర్పుతో వారందరి పదవులూ ఊడాయి. ఢిల్లీకి సంబంధించినంతవరకూ 1997నాటి ఎమ్మెల్యేల అనర్హత నిరోధక చట్టంలో మినహాయింపు పొందిన పదవుల జాబితాలో పార్లమెంటరీ సెక్రటరీ పదవి లేదు. అలా లేనంతమాత్రాన ఆ పదవి ‘అనర్హత’కు దారితీయదని ఆప్ వాదిస్తోంది. తాము పార్లమెంటరీ సెక్రటరీకి ఎలాంటి జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు కల్పించ లేదంటున్నది. పనిలో పనిగా నిరుడు ఎందుకైనా మంచిదని 1997నాటి అనర్హత నిరోధక చట్టానికి సవరణలు తెస్తూ బిల్లు తీసుకొచ్చింది. అయితే అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ దాన్ని తోసిపుచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆప్ ఎన్నికల సంఘానికి ఉద్దేశాలు ఆపాదిస్తోంది. అది పెనువేగంతో ఈ కేసును తేల్చిన తీరును ప్రశ్నిస్తోంది. వేరే పార్టీల ప్రభుత్వాలున్నచోట ఇలాగే వ్యవహరించారా అంటున్నది. ఇవన్నీ అడ గాల్సిన ప్రశ్నలే. కానీ విలువలతో కూడిన పాలన అందిస్తానని, ఉన్నత ప్రమాణాలు పాటిస్తామని చెప్పిన ఆప్ కూడా సగటు రాజకీయ పక్షాల దారిలో అసంతృప్త ఎమ్మె ల్యేలను బుజ్జగించడానికి దొడ్డిదోవన పదవుల పందేరానికి ఎందుకు దిగినట్టు? ఆత్మవిమర్శ చేసుకోవాలి. -
ఎమ్మెల్యేలకు బంగారు బిస్కెట్లు!
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ప్రజలు ఎలా పోతే మనకేంటి, మనం బాగున్నామా లేదా? వరుస వర్షాలతో రాష్ట్రం, రాజధాని వణికిపోతున్నా పాలకులు మాత్రం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అడుగేయాలంటే భయపడుతూ ప్రజలు గుంతల రోడ్లపై తిరుగుతుంటే ప్రభుత్వం ఆండబరాలకు పోతోంది. వర్షం వస్తే చాలు మురుగునీరు రోడ్లపై ఏరులై పారుతుంది. గుంతల రోడ్ల కారణంగా వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా రాష్ట్రం మొత్తం సమస్యలతో సతమతమౌతుంటే, ప్రభుత్వం వీటన్నింటినీ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజా ప్రతినిధులకు బంగారు బిస్కెట్లు కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక అసెంబ్లీ(విధాన సౌధా) నిర్మించి 60 ఏళ్లు కావొస్తోంది. ఇందులో భాగంగా 300మంది ప్రజాప్రతినిధులకు బంగారు బిస్కెట్లను కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.3కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతోంది. ముఖ్యమంత్రి నుంచి ఆమోదం రాగానే సభ్యులందరికీ ఈ బంగారు బిస్కెట్లను అందిస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ సిబ్బందికి మాత్రం రూ.6వేలు విలువ చేసే వెండి వస్తువులను ఇవ్వాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం కోసం ఈ నెల 25, 26న ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈకార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించే యోచనలో ఉన్నారు. అయితే ఈ విషయమై సిద్ధరామయ్య ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని అధికారులు వెల్లడించారు. అయితే ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. తీవ్ర వర్షాలతో రాష్ట్రం అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం ఆడంబరాలకు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నగరంలో రోడ్లు నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా బంగారు బిస్కెట్లు పంచుకోవడం ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఆ వార్తలు అబద్ధం : స్పీకర్ తన చేతుల మీదుగా బంగారు కాయిన్లు, వెండి పళ్లాలు పంచబోతున్నారన్న వార్తలను అసెంబ్లీ స్పీకర్ కేబీ కొలివాదా ఖండించారు. ‘ ఆ వార్త పచ్చి అబద్ధం. అలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో కూడా తెలీటం లేదు’ అని ఆయన మీడియాతో అన్నారు. అయితే 26 కోట్ల రూపాయిలతో 19 రకాల వస్తువులను మాత్రం పంచబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఓ ప్రతిపాదన పంపినట్లు ఆయన అంగీకరించారు. లెక్కలు ఎలా ఉన్నాయంటే... పూల అలంకరణకు 75 లక్షలు, కాఫీ, టీల ఖర్చు కోసం 35 లక్షలు, తిండి ఖర్చు 3 కోట్ల 75 లక్షలు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాధించిన ఘనతలను ప్రత్యేక డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించటం.. అందుకోసం 3 కోట్లు కేటాయించాలని నిర్ణయం. -
ఎంపీలందరిని ఇళ్లకు వెళ్లండన్న మోదీ!
న్యూఢిల్లీ: ఎవరి నియోజక వర్గాలకు వారు వెళ్లాలని ప్రధాని నరేంద్రమోదీ తన పార్టీ ఎంపీలను ఆదేశించారు. ఒక్కో ఎంపీ కనీసం ఏడు రాత్రుల పాటు తమ సొంత నియోజక వర్గాల్లోనే గడపాలని చెప్పారు. ఈ నెలలోనే ఎన్డీయే ప్రభుత్వం రెండో సావత్సరిక వేడుకలు జరపనున్న నేపథ్యంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయమే ప్రధాని మోదీ వారికి ఈ సూచనలు చేసినట్లు అధికార వర్గాల సమాచారం. దీంతోపాటు ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, ఇతర కార్యక్రమాల గురించి ప్రకటనలు ఇచ్చి వాటిపై ప్రజల స్పందన ఎలా ఉందనే విషయం కూడా తనకు చెప్పాలని మోదీ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నెల (మే)26న మోదీ సర్కారు రెండేళ్లు పూర్తి చేసుకోనుంది. -
పార్లమెంటుకు ట్యాక్సీల్లో రావాలా?
విభేదాలు పక్కనపెట్టి ఏకమైన ఎంపీలు న్యూఢిల్లీ: నిత్యం ఏదో ఒక విషయంలో పార్టీల పరంగా విభేదించుకుంటూ.. పార్లమెంటులో రచ్చరచ్చ చేసే ఎంపీలంతా ఒక విషయంలో మాత్రం ఏకమయ్యారు. పార్టీకతీతంగా అందరూ కలిసి ఒకే గొంతు వినిపించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరి-బేసి నిబంధనను ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఈ నిబంధన నుంచి తమను మినహాయించాలని పార్లమెంటులో ఎంపీలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, ట్రాఫిక్ నియంత్రించడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం వాహనాల నంబర్ ప్లేట్ల ఆధారంగా సరి-బేసి నిబంధనను అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిబంధనలతో పార్లమెంటుకు రాకుండా ఎంపీలను అడ్డుకుంటున్నారని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ నిరసన వ్యక్తం చేశారు. సరి-బేసి నిబంధన కారణంగా పార్లమెంటుకు రావడం కష్టంగా మారిందని ఎస్పీ ఎంపీ నరేశ్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభం కావడంతో పార్లమెంటుకు బయలుదేరిన పలువురు ఎంపీలకు సరి-బేసి షాక్ తగిలింది. సరి-బేసిని ఉల్లంఘించి బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ తన వాహనంలో దర్జాగా పార్లమెంటుకు వచ్చారు. దీనిపై విలేకరులు ప్రశ్నించడంతో ఆయన క్షమాపణ చెప్పారు. ఇతర ఎంపీలూ ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో సరి-బేసి నిబంధన నుంచి ఎంపీలను మినహాయించాలని, తాము ట్యాక్సీల్లో పార్లమెంటుకు రాలేమని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. -
2022 నుంచి గంటకు వెయ్యిరూపాయల జీతం!
లాస్ ఎంజెల్స్: అమెరికాలోని కాలిఫోర్నియాలో పనిచేసే ఉద్యోగులకు జీతభత్యాలు అమాంతం పెరగనున్నాయి. గంటకు కనీసం చెల్లించాల్సిన మొత్తాన్ని పదిహేను డాలర్లు చెల్లించాలని నిర్ణయించారు. ఇండియన్ కరెన్సీలో గంటకు రూ.994 అన్నమాట. అంటే ఇంచుమించూ వెయ్యి రూపాయలు. దీనిని 2022 నుంచి అమలు చేయాలని చట్ట ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో గంటకు పది డాలర్లు చెల్లిస్తున్నారు. మస్సాచుస్సెట్స్లో కూడా ఇంతే మొత్తం చెల్లిస్తున్నారు. ప్రస్తుతానికి అమెరికా మొత్తంలో కూడా అత్యధిక జీతభత్యాలు ఉద్యోగులకు చెల్లిస్తున్న రాష్ట్రాలు కూడా ఇవే కావడం విశేషం. ఈ బిల్లును గురువారం రాష్ట్ర సెనేట్‌లో ప్రవేశ పెట్టగా 26మంది అనుకూలంగా ఓటెయ్యగా.. 12 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లు చట్టంగా ఏప్రిల్ 4న గవర్నర్ సంతకంతో రూపొందనుంది. -
బిహార్‌లో ‘బహుమతుల’ రగడ
పాట్నా: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం బహుమతులు ఇచ్చే ఆనవాయితీపై బిహార్‌లో దుమారం రేగింది. ఓ పక్క లక్షలాది మంది టీచర్లకు జీతాలు ఇవ్వకుండా లక్షల రూపాయలు వెచ్చించి చట్ట సభ్యులకు ఈ బహుమతులేమిటంటూ నితీశ్ కుమార్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. విద్యాశాఖ తమకు ఇచ్చిన బహుమతులను బీజేపీ శాసనసభా పక్ష నేత సుశీల్ కుమార్ మోదీ, రాష్ట్ర పార్టీ చీఫ్ మంగళ్ పాండే వెనక్కి ఇచ్చేశారు. మైక్రో ఓవెన్లతో సహా ఇతర గిఫ్ట్స్‌ను తిరిగి ఇచ్చేశామని మోదీ చెప్పారు. వివాదంపై అసంతృప్తితో ఉన్న సీఎం నితీశ్ కుమార్.. వచ్చే ఏడాది నుంచి ఈ బహుమతుల ప్రక్రియకు మంగళం పాడాలని నిర్ణయించారు. -
'నితీశ్ గిఫ్ట్‌లు మాకొద్దు'
పాట్నా: బిహార్ బీజేపీ శాసన సభ్యులు ప్రభుత్వంపట్ల వినూత్న నిరసన వ్యక్తం చేసేందుకు నిర్ణయించారు. తమకు బహుమతులుగా ఇచ్చిన మైక్రో వేవ్స్‌ను తిరిగి వెనక్కి ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారు. గత కొద్ది నెలలుగా బిహార్ ప్రభుత్వం తమ రాష్ట్ర ఉపాధ్యాయులకు జీతభత్యాలు చెల్లించడం లేదని అందుకు నిరసనగా తాము మైక్రోవేవ్స్ వెనక్కి ఇచ్చేయాలనుకుంటున్నామని చెప్పారు. 'గత నాలుగు నెలలుగా లక్షలమంది పాఠశాల ఉపాధ్యాయులు జీతభత్యాలు లేకుండా ఉన్నారు. ప్రేమ్ కుమార్, మంగళ పాండే నేను గిఫ్ట్‌లను తిరిగి వెనక్కి ఇస్తున్నాం' అని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ అన్నారు. -
దళితులే లక్ష్యంగా దాడులు
548 ఆరోగ్య ఉపకేంద్రాలకు అద్దె జబ్బు ప్రభుత్వం ఇచ్చేది రూ.250 అది కూడా నాలుగేళ్లుగా పెండింగ్ ఖాళీ చేయాలని యజమానుల ఒత్తిడి మచిలీపట్నం/కంచికచర్ల : పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలకు అద్దె జబ్బు పట్టింది. నాలుగేళ్ల క్రితం పట్టిన ఈ జబ్బును నయం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న 548 ఆరోగ్య ఉపకేంద్రాలు ఖాళీ చేయాల్సిన ప్రమాదం ముంచుకొస్తోంది. పేదలకు ప్రాథమిక వైద్యం దూరమయ్యే దుస్థితి దాపురిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 620 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 72 భవనాలను మాత్రమే ప్రభుత్వం నిర్మించింది. మిగిలిన 548 ఆరోగ్య ఉప కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ భవనాలకు ప్రభుత్వం నెలకు రూ.250 చొప్పున అద్దె మంజూరు చేస్తోంది. వాస్తవానికి ఒక్కో ఆరోగ్య ఉప కేంద్రానికి ఆయా ప్రాంతాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1,200 వరకు ప్రతి నెలా ఏఎన్ఎంలే సొంత డబ్బుతో అద్దె చెల్లిస్తున్నారు. భారీగా బకాయిలు ప్రభుత్వం ప్రకటించిన రూ.250 కూడా నాలుగేళ్లుగా మంజూరు చేయడంలేదు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఒక్కో ఆరోగ్య ఉప కేంద్రానికి ఏడాదికి అద్దె బకాయిలు చెల్లించాలంటే జిల్లా వ్యాప్తంగా రూ.16.44 లక్షలు కావాలి. ప్రభుత్వం ఏటా కేవలం రూ.5 లక్షలకు మించి విడుదల చేయటం లేదు. ఈ నగదు కూడా ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 25వ తేదీన విడుదల చేసి 31లోపు ఖర్చు చేయాలనే నిబంధన విధిస్తోంది. ఈ సమయంలో ట్రెజరీలో బిల్లులు మార్చుకునేందుకు ఫ్రీజింగ్ అడ్డుగా ఉండటంతో ఆరోగ్య ఉపకేంద్రాలకు సంబంధించిన అద్దె బకాయిలు చెల్లించే అవకాశం లేకుండాపోతోంది. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి నెలకొందని డీఎం, హెచ్‌వో జె.సరసిజాక్షి ‘సాక్షి’కి తెలిపారు. అద్దె భారం ఏఎన్ఎంల పైనే అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేసే ఏఎన్ఎంలు ప్రతి నెలా తమ జీతంలో నుంచి ఆయా కేంద్రాలకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఆరోగ్య ఉప కేంద్రాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను సైతం తామే చెల్లిస్తున్నామని పలువురు ఏఎన్ఎంలు వాపోతున్నారు. ప్రస్తుతం గృహాల అద్దె పెరిగిపోవటంతో ఆరోగ్య ఉప కేంద్రాలను ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఆరోగ్య ఉప కేంద్రాలు ఎక్కడ కొనసాగించాలా.. అని ఏఎన్ఎంలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాదైనా ఆరోగ్య ఉప కేంద్రాలకు అద్దె బకాయిలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో విడుదల చేయాలని పలువురు ఏఎన్ఎంలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ జిల్లా స్థాయి అధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
నాలుగేళ్లుగా అద్దెల్లేవ్
548 ఆరోగ్య ఉపకేంద్రాలకు అద్దె జబ్బు ప్రభుత్వం ఇచ్చేది రూ.250 అది కూడా నాలుగేళ్లుగా పెండింగ్ ఖాళీ చేయాలని యజమానుల ఒత్తిడి మచిలీపట్నం/కంచికచర్ల : పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలకు అద్దె జబ్బు పట్టింది. నాలుగేళ్ల క్రితం పట్టిన ఈ జబ్బును నయం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న 548 ఆరోగ్య ఉపకేంద్రాలు ఖాళీ చేయాల్సిన ప్రమాదం ముంచుకొస్తోంది. పేదలకు ప్రాథమిక వైద్యం దూరమయ్యే దుస్థితి దాపురిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 620 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 72 భవనాలను మాత్రమే ప్రభుత్వం నిర్మించింది. మిగిలిన 548 ఆరోగ్య ఉప కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ భవనాలకు ప్రభుత్వం నెలకు రూ.250 చొప్పున అద్దె మంజూరు చేస్తోంది. వాస్తవానికి ఒక్కో ఆరోగ్య ఉప కేంద్రానికి ఆయా ప్రాంతాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1,200 వరకు ప్రతి నెలా ఏఎన్ఎంలే సొంత డబ్బుతో అద్దె చెల్లిస్తున్నారు. భారీగా బకాయిలు ప్రభుత్వం ప్రకటించిన రూ.250 కూడా నాలుగేళ్లుగా మంజూరు చేయడంలేదు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఒక్కో ఆరోగ్య ఉప కేంద్రానికి ఏడాదికి అద్దె బకాయిలు చెల్లించాలంటే జిల్లా వ్యాప్తంగా రూ.16.44 లక్షలు కావాలి. ప్రభుత్వం ఏటా కేవలం రూ.5 లక్షలకు మించి విడుదల చేయటం లేదు. ఈ నగదు కూడా ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 25వ తేదీన విడుదల చేసి 31లోపు ఖర్చు చేయాలనే నిబంధన విధిస్తోంది. ఈ సమయంలో ట్రెజరీలో బిల్లులు మార్చుకునేందుకు ఫ్రీజింగ్ అడ్డుగా ఉండటంతో ఆరోగ్య ఉపకేంద్రాలకు సంబంధించిన అద్దె బకాయిలు చెల్లించే అవకాశం లేకుండాపోతోంది. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి నెలకొందని డీఎం, హెచ్‌వో జె.సరసిజాక్షి ‘సాక్షి’కి తెలిపారు. అద్దె భారం ఏఎన్ఎంల పైనే అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేసే ఏఎన్ఎంలు ప్రతి నెలా తమ జీతంలో నుంచి ఆయా కేంద్రాలకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఆరోగ్య ఉప కేంద్రాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను సైతం తామే చెల్లిస్తున్నామని పలువురు ఏఎన్ఎంలు వాపోతున్నారు. ప్రస్తుతం గృహాల అద్దె పెరిగిపోవటంతో ఆరోగ్య ఉప కేంద్రాలను ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఆరోగ్య ఉప కేంద్రాలు ఎక్కడ కొనసాగించాలా.. అని ఏఎన్ఎంలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాదైనా ఆరోగ్య ఉప కేంద్రాలకు అద్దె బకాయిలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో విడుదల చేయాలని పలువురు ఏఎన్ఎంలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ జిల్లా స్థాయి అధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఇక ప్రజాప్రతినిధుల వంతు..
బడ్జెట్ సమావేశాల తరువాత సింగపూర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తరువాత రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిధులను సింగపూర్, మలేసియా దేశాలకు పంపించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. ఆ రెండు దేశాలు సాధించిన ప్రగతి అద్భుతమని, పరిమిత వనరులున్నప్పటికీ ఆ దేశాలు ఉన్నతస్థాయిని అందుకోవడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. ఐదు రోజుల సింగపూర్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న సీఎంను సోమవారం సచివాలయంలో మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగురామన్న, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా తన పర్యటన విశేషాలను కేసీఆర్ వారికి వివరించారు. సింగపూర్ దేశం పచ్చికబయళ్లతో నిండి ఉంటుందని, ఆరుబయట ఎక్కడా చిన్నకాగితం ముక్క కూడా కనిపించలేదని ఆయన పేర్కొన్నారు . ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఓ దేశం ఎలా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లిందో సింగపూర్ నిరూపించిందని చెప్పారు. తమ ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని సింగపూర్ ప్రధాని లీసీన్ లూంగ్‌ను కోరినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. సింగపూర్ జనాభా కేవలం 53 లక్షలు మాత్రమేనని.. కానీ అక్కడికి ఏటా ఐదు కోట్ల మందికిపైగా పర్యాటకులు వస్తుంటారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ దేశానికి భూభాగం తక్కువగా ఉండడంతో సముద్రంలోకి భూభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. స్థానికంగా కనీసం మంచినీళ్లు కూడా ఆ దేశంలో దొరకవని, అన్నీ దిగుమతి చేసుకోవాల్సిందేనని చెప్పారు. అలాంటిది అపారమైన వనరులు, జనాభా, భూభాగం ఉన్న మనదేశం అభివృద్ధి చెందకపోవడం ఆవేదన కలిగించిందని కేసీఆర్ పేర్కొన్నారు. సింగపూర్ ఈ స్థాయికి రావడానికి ఆ దేశ మొదటి ప్రధాని లీ క్వాన్ యూ కారణమని, ఆయన రాసిన ‘సింగపూర్ ఫ్రమ్ థర్డ్ వరల్డ్ టూ ఫస్ట్’ పుస్తకాన్ని తాను 1995లో చదివానని సీఎం చెప్పారు. ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించనున్నట్లు వివరించారు. ఈ పర్యటనలో తాను అనేక మందితో చర్చలు జరిపానని, పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై వారు ఆరా తీశారని తెలిపారు. -
కళంకిత నేతలను రక్షించే ఆర్డినెన్స్ ఉపసంహరణ
-
నేడు సీమాంద్ర తెలంగాణ నేతల భేటీ
-
‘అనర్హత’పై రాజ్యాంగాస్త్రం!
ఎంపీలు, ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం తీర్పు వర్తించకుండా ప్రభుత్వం కసరత్తు న్యూఢిల్లీ: చట్టసభల సభ్యులు కేసుల్లో దోషులుగా తేలిన క్షణం నుంచే పదవులకు అనర్హులవుతారని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వర్తించకుండా ఉండేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని కోసం రాజ్యాంగాన్ని సవరించాలని యోచిస్తోంది. తీర్పును వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలను కలుపుకువెళ్లడానికి ప్రయత్నిస్తోంది. తీర్పును సమీక్షించాలని త్వరలో సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేసే అవకాశముందని న్యాయ మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి. సుప్రీం తీర్పును అమలు చేయాలని ఎన్నికల సంఘం ఇటీవల రాష్ట్రాలను ఆదేశించడం, దోషులుగా తేలే ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల వివరాలను ప్రతి నెలా తమకు అందజేయాలని ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ తీర్పు వర్తించకుండా ఉండేందుకు చట్టబద్ధ మార్గాల్లో చర్యలు ప్రారంభించింది. రాజకీయ పార్టీల మద్దతు లభిస్తే ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లుతో ముం దుకెళ్తుందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. సుప్రీం ఆదేశాన్ని పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం రాజ్యాంగ సవరణ మార్గాన్ని ఎంచుకున్నట్లు పేర్కొన్నాయి. సర్వోన్నత న్యాయస్థానం సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అనర్హత పై ఇచ్చిన తీర్పులోని రాజ్యాంగ అంశాలపై సవరణ బిల్లును తెస్తారని, పార్టీల అంగీకారం ఆధారంగానే తుది నిర్ణయం ఉంటుందని తెలిపాయి. సుప్రీం తీర్పుపై పార్టీలతో చర్చలు జరుపుతున్నామని, ఏకాభిప్రా యం ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ ఇటీవల చెప్పారు. రివ్యూ పిటిషన్ వేస్తామని, చట్టబద్ధ మార్గంలో పరిష్కరం కోసం ప్రస్తుత చట్టాలను సవరించే అవకాశం కూడా ఉందన్నారు. కాగా, పై కోర్టుల్లో అప్పీలు పెండింగ్‌లో ఉందన్న కారణంతో చట్టసభల సభ్యుల అనర్హత వాయిదాకు వీలు కల్పిస్తున్న ప్రజా ప్రాతి నిధ్య చట్టం 8వ సెక్షన్‌లోని 4వ సబ్-సెక్షన్ రాజ్యాం గ విరుద్ధంగా ఉందంటూ సుప్రీం కొట్టేయడం తెలిసిందే. దోషులుగా తేలిన వెంటనే అనర్హతను అమలు చేయాలన్న రాజ్యాంగంలోని 101(3)(ఏ), 190(3)(ఏ) అధికరణలకు పార్లమెంటు చేర్చిన ఈ సబ్ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది.