పాట్నా: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం బహుమతులు ఇచ్చే ఆనవాయితీపై బిహార్లో దుమారం రేగింది. ఓ పక్క లక్షలాది మంది టీచర్లకు జీతాలు ఇవ్వకుండా లక్షల రూపాయలు వెచ్చించి చట్ట సభ్యులకు ఈ బహుమతులేమిటంటూ నితీశ్ కుమార్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. విద్యాశాఖ తమకు ఇచ్చిన బహుమతులను బీజేపీ శాసనసభా పక్ష నేత సుశీల్ కుమార్ మోదీ, రాష్ట్ర పార్టీ చీఫ్ మంగళ్ పాండే వెనక్కి ఇచ్చేశారు. మైక్రో ఓవెన్లతో సహా ఇతర గిఫ్ట్స్ను తిరిగి ఇచ్చేశామని మోదీ చెప్పారు. వివాదంపై అసంతృప్తితో ఉన్న సీఎం నితీశ్ కుమార్.. వచ్చే ఏడాది నుంచి ఈ బహుమతుల ప్రక్రియకు మంగళం పాడాలని నిర్ణయించారు.