ఉక్రెయిన్‌లోని ఆయా కీలక ప్రాంతాలను అధికారికంగా విలీనం చేస్తున్న డిక్రీపై పుతన్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై పుతిన్ గ్రాండ్‌గా సెలబ్రెషన్ చేసుకున్నారు కూడా. ఇప్పుడూ ఆ విలీన చట్టానికి అనూకూలంగా రష్యా చట్టసభ సభ్యులు ఓటు వేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ పార్టమెంట్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ...రష్యాన్ భాష, సంస్కృతి, సరిహాద్దులను రక్షించడానికి బిల్లుకు మద్దుతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే తాము ఊహజనిత బెదిరింపులకు లొంగి ఇలా చేయడం లేదు, కేవలం తమ దేశ సరిహద్దులను, మాతృభూమిని, ప్రజలను రక్షించుకునే నిమిత్తం ఇలా చేశామని తెలిపింది. అదీగాక ఉక్రెయిన్ సాధనంగా చేసుకుని అమెరికా యావత్తు పశ్చిమ దేశాలను సమీకరించిందని ఆరోపణలు చేశారు. అలాగే ఈనాలుగు భూభాగాలు మాస్కోకి మధ్య ల్యాండ్ కారిడర్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ఈ విలీనంతో మొత్తంగా ఐదు ప్రాంతాలు అంటే ఉక్రెయిన్‌లో దాదాపు 20 శాతం స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. వాస్తవానికి రష్యా బలగాలు ఖైర్సన్, జపోరిజ్జియాపై పూర్తి నియంత్రణ కలిగి లేవు. మరీ మాస్కో ఆయా ప్రాంతాల్లోని ఏ ప్రాంతాలను స్వాధీనం చేసుకుందో స్పష్టం చేయాల్సి ఉంది.
(చదవండి: భగవద్గీతా పార్క్‌పై భారత్ వ్యాఖ్యలు...వివరణ ఇచ్చిన కెనడా)
Comments
Please login to add a commentAdd a comment