regions
-
హార్బర్లకు సమాంతరంగా ఆహ్లాదం
సాక్షి, అమరావతి : ఫిషింగ్ హార్బర్లు కేవలం చేపల వేటకే పరిమితం కాకుండా పర్యాటక ప్రదేశాలుగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. వాటి పక్కనే రిసార్టులు, వెల్నెస్ సెంటర్లు, వాటర్ పార్క్స్, అమ్యూజ్మెంట్ పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించేలా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పర్యాటకుల డిమాండ్ అధికంగా ఉన్న హార్బర్లను పరిశీలించి అక్కడ పర్యాటక అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో అభివృద్ధి చేస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్లలో మచిలీపట్నం వద్ద పర్యాటక అవకాశాలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్లలో పర్యాటక ఏర్పాట్లు చేయడం ద్వారా ఏటా రూ.131 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. అలాగే ఫిషింగ్ హార్బర్లలో పట్టే చేపలను ప్రోసెసింగ్ చేయడం ద్వారా ఆదాయం తెచ్చేందుకు ఏర్పాట్లూ చేస్తోంది. తొలి దశ ఫిషింగ్ హార్బర్ల పనులు పూర్తి కావస్తుండటంతో పీపీపీ విధానంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రతి ఫిషింగ్ హార్బర్ వద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో టూనా చేపలు, రొయ్యల కోసం ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఈ ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల మూలంగా నాలుగు ఫిషింగ్ హార్బర్ల ద్వారా ఏటా రూ.225.18 కోట్ల ఆదాయం వస్తుందని ఏపీ మారిటైమ్ బోర్డు చెబుతోంది. కేవలం చేపల వేట కాకుండా టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రూ.357 కోట్ల ఆదాయం పొందొచ్చని అంచనా వేసింది. జువ్వలదిన్నెలో 90 శాతం పనులు పూర్తి సుమారు రూ.1523 కోట్లతో అభివృద్ధి చేస్తున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తేవాలని ఏపీ మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి కావడంతో ఈ సెప్టెంబర్ నాటికి సీఎం వైఎస్ జగన్ చేతులు మీదుగా ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మిగిలిన మూడు హార్బర్లు నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో 60 శాతానికి పైగా పనులు పూర్తి కావడంతో వీటిని డిసెంబర్ నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్ల ద్వారా 5,900 బోట్లు నిలుపుకొనే అవకాశం రావడంతో పాటు ఏటా 2,37,350 టన్నుల చేపలను పడతారని అంచనా. ఈ ఫిషింగ్ హార్బర్ల ద్వారా రాష్ట్రంలోని 555 మత్స్యకార గ్రామాల్లోని 6.3 లక్షల మత్స్యకారులు లబ్ధిపొందనున్నారు. -
విలీనానికి రష్యా చట్టసభ సభ్యుల ఆమోదం
ఉక్రెయిన్‌లోని ఆయా కీలక ప్రాంతాలను అధికారికంగా విలీనం చేస్తున్న డిక్రీపై పుతన్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై పుతిన్ గ్రాండ్‌గా సెలబ్రెషన్ చేసుకున్నారు కూడా. ఇప్పుడూ ఆ విలీన చట్టానికి అనూకూలంగా రష్యా చట్టసభ సభ్యులు ఓటు వేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పార్టమెంట్ని ఉద్దేశించి మాట్లాడుతూ...రష్యాన్ భాష, సంస్కృతి, సరిహాద్దులను రక్షించడానికి బిల్లుకు మద్దుతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తాము ఊహజనిత బెదిరింపులకు లొంగి ఇలా చేయడం లేదు, కేవలం తమ దేశ సరిహద్దులను, మాతృభూమిని, ప్రజలను రక్షించుకునే నిమిత్తం ఇలా చేశామని తెలిపింది. అదీగాక ఉక్రెయిన్ సాధనంగా చేసుకుని అమెరికా యావత్తు పశ్చిమ దేశాలను సమీకరించిందని ఆరోపణలు చేశారు. అలాగే ఈనాలుగు భూభాగాలు మాస్కోకి మధ్య ల్యాండ్ కారిడర్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ విలీనంతో మొత్తంగా ఐదు ప్రాంతాలు అంటే ఉక్రెయిన్‌లో దాదాపు 20 శాతం స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. వాస్తవానికి రష్యా బలగాలు ఖైర్సన్, జపోరిజ్జియాపై పూర్తి నియంత్రణ కలిగి లేవు. మరీ మాస్కో ఆయా ప్రాంతాల్లోని ఏ ప్రాంతాలను స్వాధీనం చేసుకుందో స్పష్టం చేయాల్సి ఉంది. (చదవండి: భగవద్గీతా పార్క్‌పై భారత్ వ్యాఖ్యలు...వివరణ ఇచ్చిన కెనడా) -
అధికారికంగా విలీనం..చర్చలకు రమ్మని ఉక్రెయిన్‌కి పుతిన్ పిలుపు
మాస్కో: రష్యా వ్యూహాత్మక పథకం ఫలించింది. గత వారమే రిఫరెండమ్ నిర్వహించి ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడూ తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయా ప్రాంతాలను అధికారికంగా విలీనం చేసుకున్నట్లు ప్రకటించారు. తమ భూభాగాలను రక్షించుకోవడానికి రష్యా ఏమైనా చేస్తుందని, రష్యన్ ప్రజల విముక్తే తమ లక్ష్యం అని చెప్పారు. ఈ మేరకు డోనెట్స్క్, లుహాన్స్క్, ఖైరన్, జపోరిజ్జియా అధికారికంగా విలీనం చేయబడ్డాయని ప్రకటించారు. తమ బలగాలు సాధించిన విజయాన్ని పుతిన్ గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకున్నారు. అంతేగాదు ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంలో సహాయం చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో పుతిన్ కీవ్‌ని తక్షణమే సైనిక చర్యను ఆపేసి చర్చలకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. తాము ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, అలాగే విముక్తి పొందిన భూభాగాల్లో ప్రజా సేకరణ విషయమై చర్చించమని స్పష్టం చేసింది. అలాగే విలీనం చేసుకున్న ప్రాంతాల్లోని ప్రజలు ఎప్పటికీ రష్యన్ పౌరులుగానే ఉంటారని అన్నారు. రష్యాను వలస రాజ్యంగా చేసేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నయా వలసవాద వ్యవస్థను ప్రోత్సహించేలా ప్రపంచాన్ని దోచుకుంటున్నాయన్నారు. అణ్వాయుధాల వినియోగం గురించి ప్రస్తావిస్తూ...అణ్వాయుధాలను రెండుసార్లు ఉపయోగించిన ఏకైక దేశం అమెరికానే అని అన్నారు. (చదవండి: రష్యా రక్తపిపాసి! ఉగ్రవాదులే ఇలా చేయగలరు: జెలెన్స్కీ) -
ఉక్రెయిన్ ఆక్రమణ.. పుతిన్ స్ట్రాటజీకి అమెరికా కౌంటర్?
రష్యా ఉక్రెయిన్ సంక్షోభం మరింత ముదురుతోంది. వెనక్కి తగ్గినట్లే తగ్గి.. దూకుడు చూపిస్తోంది రష్యా. ప్రతిగా అమెరికా కౌంటర్ ఇస్తోంది. ముఖ్యంగా వేర్పాటువాద ప్రాంతాల మద్ధతుతో ఉక్రెయిన్ సరిహద్దు వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది రష్యా. ఈ క్రమంలో ఇవాళ కీలక పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. రష్యాకి దన్నుగా నిలుస్తున్న ఉక్రెయిన్ తూర్పు వైపు ఉన్న తిరుగుబాటు ప్రాంతాలకు ఊహించని ఝలక్ ఇచ్చింది అమెరికా. ఆర్థిక ఆంక్షలతో పాటు రష్యా మీదా కొత్త ఆంక్షలను విధించనున్నట్లు ఇవాళ (మంగళవారం) ప్రకటించేసింది. ఒకపక్క రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ తిరుగుబాటునేతలతో క్లెమ్లిన్‌లో సమావేశమై.. పరస్సర సహకారం, స్నేహపూర్వక ఒప్పందాలపై సంతకం చేశాడు. ఆ వెంటనే డోనెట్స్క్, లుగన్స్క్లను(ఉక్రెయిన్ రెబల్ ప్రాంతాలు) స్వతంత్ర్య రాజ్యాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు పుతిన్. ఉక్రెయిన్ను పశ్చిమ దేశాల చేతిలో కీలుబొమ్మగా, ఒక విఫల రాజ్యంగా అభివర్ణించాడు. అంతేకాదు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో తిష్ట వేయాలని రష్యా సైన్యాన్ని ఆదేశించాడు కూడా. ఈ నేపథ్యంలో.. అమెరికా వెంటనే కౌంటర్ ఇచ్చింది. ఆ రెండు రెబల్ రాజ్యాలపై ఆంక్షలు విధించింది. ‘అంతర్జాతీయ చట్టాల కఠోరమైన ఉల్లంఘనలకు గానూ ప్రతిగా రష్యాకు ఒరిగే లాభాన్ని దూరం చేయడానికే(రెబల్స్‌తో ఒప్పందాన్ని ఉద్దేశించి) నేను ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశా. తక్షణమే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయి. తదుపరి చర్యలపై ఉక్రెయిన్‌తో సహా మిత్రదేశాలు, భాగస్వాములతో అమెరికా సన్నిహితంగా సంప్రదింపులు జరుపుతోంది.’ : తాజా ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ రెబల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వొద్దంటూ అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ముందు నుంచి రష్యాను హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆ హెచ్చరికలను తుంగలో తొక్కి.. సంక్షోభాన్ని చల్లబర్చే పరిస్థితుల్ని మరింత సంక్లిష్టం చేసింది రష్యా. రెబల్స్ మద్ధతుతో ఉక్రెయిన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు, దాడులకు తెగబడుతోంది. మరోవైపు అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశిస్తూ.. తాము దౌత్యపరమైన చర్చలకు సిద్ధమని, కేవలం సరిహద్దు డ్రిల్స్‌ను ముప్పుగా ఎలా పరిగణిస్తారని రష్యా వాదిస్తోంది. ఆక్రమణ మొదలైనట్లే.. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై ఇవాళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఉక్రెయిన్, అమెరికా, మెక్సికో, ఐదు యూరోపియన్ దేశాల విజ్ఞప్తి మేరకే ఈ సమావేశం నిర్వహించింది భద్రతా మండలి. మరోవైపు రష్యా ఉక్రెయిన్ ఆక్రమణ మొదలుపెట్టిందంటూ బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ ప్రకటించడం విశేషం. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ఇప్పటికే ప్రారంభమైంది. కాబట్టి బ్రిటన్ రష్యాపై ఆంక్షలు విధిస్తోంది’’ అని ప్రకటించారాయన. ఉక్రెయిన్ సంక్షోభంపై మంగళవారం జరిగిన emergency government response meetingకి ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ అధ్యక్షత వహించినట్లు తెలుస్తోంది. -
మోదీ మెగా టీం: రేసు గుర్రాలు వీరే?!
సాక్షి, న్యూఢిల్లీ: 2019 మేలో రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన క్యాబినెట్‌ను భారీగా విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. 2024లో కూడా అధికార పీఠం లక్క్ష్యంగా పలు సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని మంత్రుల మండలి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూండటంతో పాటు యువ రక్తానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం. కేంద్ర కేబినెట్లో కొత్తగా 43 మందికి అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని ఆహ్వానం అందుకున్న నేతలు ఆయన నివాసానికి చేరుకున్నారు. కేబినెట్ బెర్త్ ఖాయం చేసుకున్న వారి జాబితాలో జ్యోతిరాదిత్య సింధియా, సర్బానంద సోనోవాల్, నారాయణ్ రాణే, భూపేంద్ర యాదవ్, ఆర్.పి.సింగ్, అనుప్రియ పటేల్, పశుపతి పరాస్, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాల, కిషన్‌రెడ్డి, కపిల్ పాటిల్, మీనాక్షి లేఖి, అశ్వినీ వైష్ణవ్, శాంతను ఠాకూర్, పంకజ్ చౌదరి, దిలేశ్వర్ కామత్, రాహుల్ కాస్వా, వినోద్ సోంకర్, చందేశ్వర్ ప్రసాద్, రామ్‌నాథ్ ఠాకూర్, రాజ్‌కుమార్ రంజన్‌సింగ్, అజయ్ మిశ్ర, బీఎల్ వర్మ, అజయ్ భట్, శోభా కరంద్లాజే ఉన్నారు. సామాజిక సమీకరణాలు.. వివిధ అంచనాలు కేంద్ర కేబినెట్లో 12 మంది ఎస్సీలకు చోటు దక్కనుంది. వీరిలో ఇద్దరికి కేబినెట్ హోదా లభించే అవకాశం. అలాగే 8 మంది ఎస్టీలకు చాన్స్ దక్కనుండగా, వీరిలో ముగ్గురికి కేబినెట్ హోదా కల్పించనున్నారు. ఇక బీసీల విషయానికి వస్తే 27 మంది ఓబీసీలకు చోటు దక్కనుంది. వీరిలో ఐదుగురికి కేబినెట్ హోదా లభించనుంది. వీరితో పాటు ఐదుగురు మైనారిటీ మంత్రులకు ఛాన్స్ లభించనుంది. ముగ్గురికి కేబినెట్ హోదా దక్కనుంది. వీరితోపాటు ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధులకు ఒక్కొక్కరు చొప్పున సమానం ప్రాతినిధ్యాన్నివ్వనున్నారు. మహిళలు భారీగా విస్తరించనున్న మోదీ కొత్త కేబినెట్లో 11 మంది మహిళలకు మంత్రులుగా అవకాశం లభించనుందని అంచనా. ముఖ్యంగా ఇద్దరికి కేబినెట్ హోదా కల్పించ నున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం, రాష్ట్రపతి భవన్లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుంది. కేంద్రమంత్రుల సగటు వయసు 58 సంవత్సరాలు కాగా 50 ఏళ్ల లోపు వయసు ఉన్న మంత్రులు 14 మంది ఉండగా, 50 ఏళ్ల లోపు వయసు ఉన్నవారిలో ఆరుగురికి కేబినెట్ ర్యాంక్ ఉంది. దీంతో ప్రస్తుతం 53గా ఉన్న కేబినెట్ సభ్యుల సంఖ్య 81 వరకు పెరగ వచ్చనేది ప్రధాన అంచనా. -
నిన్న పన్సారే.. నేడు కల్బుర్గి.. రేపు ఎవరి వంతు?
తమకు నచ్చిన దేవుళ్లను పూజించుకునే స్వేచ్ఛనూ, మెచ్చిన మతాలను అనుసరించే హక్కును పౌరు లకు మన రాజ్యాంగం కల్పించింది. ఏ దేవుళ్ల పట్లా, మతాల పట్లా నమ్మకం లేని పౌరుల భావాలకు కూడా రాజ్యాంగ రక్షణ ఉంది. భక్తులు, సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఫాదర్లు, పాస్టర్లు, ఉలేమాలు, బిక్షువులతోపాటు హేతువాదులు, నాస్తి కులు, భౌతికవాదులకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ను రాజ్యాంగం కల్పించింది. ఈ హక్కులను కాల రాసే హక్కు ఎవరికీ లేదు. ప్రముఖ హేతువాద ఉద్యమకారుడు నరేంద్ర దభోల్కర్‌ను 2013లో హిందుత్వశక్తులు హత్య చేశా యి. మతమౌఢ్యాన్ని వ్యతిరేకిస్తూ విస్తృతంగా ప్రచా రం చేసిన గోవింద పన్సారే (సీపీఐ నేత)ను కూడా 2015లో అవే శక్తులు హత్య చేశాయి. ఈ ఇద్దరూ మహారాష్ట్రీయులే. తాజాగా 30-08-2015న కర్ణాట కలోని ధార్వాడ్‌లో ప్రముఖ హేతువాద ఉద్యమకా రుడు, సాహితీవేత్త మల్లేశప్ప కల్బుర్గిని హత్య చేశా రు. ఈ ముగ్గురూ వృద్ధులే. తాము నమ్మిన విశ్వా సాల పట్ల నిబద్ధ సేవకులే. ఈ ముగ్గురినీ హత్య చేసింది హిందుత్వ శక్తులే. పైగా హత్య చేసిన పద్ధతి కూడా ఒకేమాదిరిగా ఉంది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి, ఇది ప్రజాస్వామ్యం, లౌకికవాదాలపై దాడి, సైన్స్ మీద దాడి, సమాజ శాస్త్రంపై దాడి, మన రాజ్యాంగంపై దాడి. భారత జాతి జనుల గుండెల్లో వెలుగొందుతున్న భగత్‌సింగ్ నాస్తి కుడే, భారత తొలి ప్రధాని నెహ్రూ తనకు అతీతశక్తులపై నమ్మకంలేదని ప్రకటించిన వాడే. లోహియా, జయ ప్రకాశ్లదీ అదేమాట. కరుణానిధితో సహా ద్రావిడ ఉద్యమ పునాదులతో ఎదిగిన నేతలదీ అదేబాట. ఇక తెలుగు చలనచిత్ర నటులు అక్కినేని తన జీవితాంతం హేతువాదే. కమ ల్హసన్దీ అదే దారి. నార్ల వెంకటేశ్వరరావు నుంచి ఏబీకే వరకూ ప్రముఖ సంపాదకులందరూ హేతు వాదులే. తెలుగునాట త్రిపురనేని, సి.వి. నుంచి గోరా వరకు ఇదే పాయలో కొనసాగినవారే. హేతు వాద, భౌతిక ఉద్యమాలు సమాజంలో ఒక మేధో ప్రవాహంగానే ఉన్నాయి. అలాంటి మెదళ్లకు మేకు లుకొట్టి నిర్మూలించాలని కలలు కన డం మూర్ఖత్వం మాత్రమే. హేతువాద, భౌతికవాద ఉద్య మాలకు 3 వేల ఏళ్ల చరిత్ర ఉంది. గౌతమ బుద్ధుడికంటే ముందున్న చార్వాకులు, లోకాయతుల నుంచి బుద్ధుడు, మహావీరుడు, వేనరాజు, అశ్వఘోషుడు, నాగార్జునుడు, ది గ్నాగుడు, వంటి తాత్వికులు, మధ్య యుగాల్లో బ్రహ్మనాయుడు, బస వన్న, తర్వాత వీర బ్రహ్మం, వేమన, కబీరు, మీరా బాయి, చైతన్యుడు వంటి సంస్కర్తలు, ఆధునిక యుగారంభంలో రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రాజారామమోహన్‌రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, గురజాడ, కందుకూరి వంటి సంస్కర్తలు హేతువాదానికి ఆయా కాలాల్లో ప్రాతి పదికను కల్పించినవారే. భారతీయ సామాజిక జీవ నంలో ఎప్పటినుంచో ఉన్న హేతువాద, భౌతికవాద ఉద్యమాలపై ఈ హైటెక్ యుగంలో తుపాకీ దాడు లేమిటి? నిజానికి ఇది మతావలంబకులకీ, మత రహి తులకీ మధ్య వివాదం కాదు. ఇది ప్రజాస్వామ్యా నికీ, నిరంకుశత్వానికీ మధ్య వివాదం మాత్రమే. హిందుత్వశక్తుల హత్యా రాజకీయాలను ఇలాగే కొనసాగనిద్దామా? ఈ నేలమీద నాజీయిజాన్ని పెర గనిద్దామా? రేపు మన గ్రామ పొలిమేరలకూ, పట్ట ణ శివార్లకూ హత్యా రాజకీయాల విస్తరణకు అను మతించుదామా? మన విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నాలనూ పుణే, ధార్వాడ్, ఔరం గాబాద్లుగా మార్చనిద్దామా? అలా కాకూడ దను కుంటే గొంతులన్నీ ఏకం చేసి మానవహారంలో పాల్గొందాం. కొవ్వొత్తులతో దభోల్కర్, పన్సారే, కల్బుర్గిల అమరత్వానికి నివాళులర్పిద్దాం. (నేటి సాయంత్రం గం.6.30లకు విజయవాడ లెనిన్ సెంటర్లో మానవహారం సందర్భంగా...) ఎ.రవిచంద్ర ఏపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) మొబైల్: 9492274365