
మాస్కో: రష్యా వ్యూహాత్మక పథకం ఫలించింది. గత వారమే రిఫరెండమ్ నిర్వహించి ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడూ తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయా ప్రాంతాలను అధికారికంగా విలీనం చేసుకున్నట్లు ప్రకటించారు. తమ భూభాగాలను రక్షించుకోవడానికి రష్యా ఏమైనా చేస్తుందని, రష్యన్ ప్రజల విముక్తే తమ లక్ష్యం అని చెప్పారు.
ఈ మేరకు డోనెట్స్క్, లుహాన్స్క్, ఖైరన్, జపోరిజ్జియా అధికారికంగా విలీనం చేయబడ్డాయని ప్రకటించారు. తమ బలగాలు సాధించిన విజయాన్ని పుతిన్ గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకున్నారు. అంతేగాదు ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంలో సహాయం చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో పుతిన్ కీవ్‌ని తక్షణమే సైనిక చర్యను ఆపేసి చర్చలకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. తాము ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, అలాగే విముక్తి పొందిన భూభాగాల్లో ప్రజా సేకరణ విషయమై చర్చించమని స్పష్టం చేసింది.
అలాగే విలీనం చేసుకున్న ప్రాంతాల్లోని ప్రజలు ఎప్పటికీ రష్యన్ పౌరులుగానే ఉంటారని అన్నారు. రష్యాను వలస రాజ్యంగా చేసేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నయా వలసవాద వ్యవస్థను ప్రోత్సహించేలా ప్రపంచాన్ని దోచుకుంటున్నాయన్నారు. అణ్వాయుధాల వినియోగం గురించి ప్రస్తావిస్తూ...అణ్వాయుధాలను రెండుసార్లు ఉపయోగించిన ఏకైక దేశం అమెరికానే అని అన్నారు.
(చదవండి: రష్యా రక్తపిపాసి! ఉగ్రవాదులే ఇలా చేయగలరు: జెలెన్‌స్కీ)
Comments
Please login to add a commentAdd a comment