approve
-
ఫ్రాన్స్ పార్లమెంట్లో అబార్షన్ బిల్లుకు ఆమోదం!
ఫ్రాన్స్ పార్లమెంట్లో జరిగిన సంయుక్త సమావేశంలో అబార్షన్ బిల్లుకు ఆమోదం లభించింది. ఫ్రాన్స్ రాజ్యాంగంలో మహిళలకు గర్భస్రావం చేయించుకునే హక్కును పొందుపరిచే బిల్లుకు ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. అబార్షన్‌ను రాజ్యాంగంలో చేర్చిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఈ బిల్లు అత్యధిక ఓట్లతో ఆమోదం పొందిన నేపధ్యంలో ఉమ్మడి సెషన్‌లోని సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మహిళా హక్కుల కోసం పనిచేస్తున్నవారంతా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ బిల్లుకు చట్టపరమైన రూపం కల్పించేందుకు ఫ్రెంచ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 34ను సవరించారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో అంటే జాతీయ అసెంబ్లీ,సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మహిళలకు అబార్షన్ హక్కును కల్పిస్తుంది. ఉమ్మడి సెషన్‌ను ప్రారంభించిన దిగువ సభ స్పీకర్ యాయెల్ బ్రాన్-పివెట్ మాట్లాడుతూ మహిళకు అబార్షన్ హక్కును కల్పించిన మొదటి దేశం ఫ్రాన్స్ అని అన్నారు. ఈ బిల్లు ఆమోదానికి ముందు ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియెల్ అటల్ మాట్లాడుతూ మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. మరోవైపు అబార్షన్‌ను వ్యతిరేకిస్తున్న సంస్థలు, కార్యకర్తలు ఈ బిల్లును ఆమోదంపై పార్లమెంటు నిర్ణయాన్ని తప్పుబట్టారు. అధ్యక్షుడు మాక్రాన్ రాజకీయ లబ్ధి కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని వారు ఆరోపించారు. NEW: France's Parliament votes to make abortion a constitutional right, the first country in the world to do so. French PM Gabriel Attal: " We're sending a message to all women: your body belongs to you and no one can decide for you." pic.twitter.com/xI7EyZwvMv — Lewis Goodall (@lewis_goodall) March 4, 2024 -
ప్రజాస్వామ్యం బలోపేతం
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాలన్న సంకల్పంతోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ‘నారీశక్తి వందన్ అధినియమ్’ను తీసుకొచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పార్లమెంట్లో ఉద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ఆయన ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పార్లమెంట్ నూతన భవనంలో లోక్‌సభలో మొదటి సెషన్లో తొలిసారిగా ప్రసంగించారు. సమాజం ప్రభావవంతంగా పరివర్తన చెందడం వెనుక రాజకీయాల పాత్రను వివరించారు. ఆధునిక యుగంలో మహిళలు ముందంజ వేస్తున్నారని ప్రశంసించారు. అంతరిక్షం నుంచి క్రీడల దాకా, స్టార్టప్ కంపెనీల నుంచి స్వయం సహాయ సంఘాల దాకా అన్ని రంగాల్లో వారు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. పార్లమెంట్లో ప్రధాని ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘మహిళల సారథ్యంలో అభివృద్ధి’ ‘‘నారీశక్తి వందన్ అభియాన్‌ను ప్రభుత్వం తీసుకొచ్చిన సందర్భంగా మన తల్లులకు, సోదరీమణులకు, బిడ్డలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చట్టంగా మార్చడానికి కట్టుబడి ఉన్నామని మహిళలకు హామీ ఇస్తున్నా. ఈ బిల్లుతో మన ప్రజాస్వామ్యం మరింత బలం పుంజుకుంటుంది. ‘మహిళల సారథ్యంలో అభివృద్ధి’ అనే విధానాన్ని మనం అనుసరిస్తున్నాం. జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ దేశాలు ఈ విధానాన్ని ప్రశంసించాయి. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం నానాటికీ ఇనుమడిస్తోంది. ప్రభుత్వ విధాన నిర్ణయాల రూపకల్పనలోనూ వారి భాగస్వామ్యం పెరగాలి. తద్వారా దేశ అభివృద్ధిలో వారి పాత్ర, సహకారం పెరుగుతుంది. ఈ చారిత్రక దినాన మహిళామణుల కోసం అవకాశాల ద్వారాలు తెరవాలని ఎంపీలను కోరుతున్నా. శుభప్రదమైన ప్రారంభానికి శ్రీకారం మహిళల సారథ్యంలో ప్రగతి అనే తీర్మానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో భాగంగా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నాం. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని విస్తృత పర్చడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. శుభప్రదమైన ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని పార్లమెంట్ సభ్యులందరికీ నా విజ్ఞప్తి. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చాలా ఏళ్లపాటు ఎన్నో చర్చలు, సంవాదాలు, సంప్రదింపులు జరిగాయి. బిల్లు చుట్టూ వివాదాలు ఏర్పడ్డాయి. పార్లమెంట్లో బిల్లును ఆమోదించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. మొట్టమొదటిసారిగా 1996లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో పలు సందర్భాల్లో బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ అంకెలు సహకరించకపోవడంతో ఆమోదం పొందలేదు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అనే స్వప్నం నెరవేరలేదు. లక్ష్మణ రేఖ దాటొద్దు పార్లమెంట్లో కొత్త భవనంలో కొలువుదీరాం. ఎంపీలందరూ పాత చేదు అనుభవాలను, జ్ఞాపకాలను మర్చిపోవాలి. నూతన అధ్యయాన్ని ప్రారంభించాలి. కొత్త భవనంలో ఎంపీలు చేసే ఏం చేసినా సరే అది దేశ పౌరులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. పార్లమెంట్ సమావేశా లను ప్రజలు ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. సభ్యులు అధికార పక్షంలో ఉంటారా? లేక ప్రతిపక్షంలో ఉంటారా? అనేది వారి ప్రవర్తనే నిర్దేశిస్తుంది. పార్లమెంట్ సంప్రదాయాలను సభ్యులంతా పాటించాలి. లక్ష్మణ రేఖ దాటకుండా జాగ్రత్తపడాలి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి. ఈ పార్లమెంట్ ఏర్పాటైంది కేవలం దేశ ప్రగతి కోసమే తప్ప ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం కాదు. దేశానికి సేవలందించే విషయంలో పార్లమెంట్ స్థానం అత్యున్నతం. పార్లమెంట్ కొత్త భవనం 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబం. ఇంజనీర్ల, శ్రామికుల శ్రమతోనే ఈ భవనం రూపుదిద్దుకుంది. 30 వేల మందికిపైగా కారి్మకులు స్వేదం చిందించారు. వారి వివరాలతో డిజిటల్ బుక్ తీసుకొచ్చాం. పవిత్ర ‘సెంగోల్’ను పార్లమెంట్ నూతన భవనంలో ప్రతిష్టించుకున్నాం. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ సెంగోల్‌ను స్వీకరించారు. ఎన్నో ఘట్టాలు సెంగోల్‌తో ముడిపడి ఉన్నాయి’’ అని ప్రధానమంత్రి మోదీ వివరించారు. చరిత్రలో నిలిచిపోతుంది మహిళలకు హక్కులు కల్పించడం, వాటిని కాపాడడం, వారి శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకోవడం వంటి గొప్ప పనుల కోసం భగవంతుడు నన్ను ఎన్నుకున్నాడేమో! అందుకే ఆ దిశగా మన ప్రభుత్వం అడుగు ముందుకేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మంత్రివర్గం నిన్న(సోమవారం) ఆమోదముద్ర వేసింది. ఈ రోజు(సెప్టెంబర్ 19) చరిత్రలో నిలిచిపోతుంది. ఏ దేశ అభివృద్ధి ప్రయాణంలోనైనా చరిత్రను సృష్టించే సమయం వస్తుంది. అలాంటి సమయం ఇప్పుడు భారత్‌కు వచ్చింది. -
విలీనానికి రష్యా చట్టసభ సభ్యుల ఆమోదం
ఉక్రెయిన్‌లోని ఆయా కీలక ప్రాంతాలను అధికారికంగా విలీనం చేస్తున్న డిక్రీపై పుతన్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై పుతిన్ గ్రాండ్‌గా సెలబ్రెషన్ చేసుకున్నారు కూడా. ఇప్పుడూ ఆ విలీన చట్టానికి అనూకూలంగా రష్యా చట్టసభ సభ్యులు ఓటు వేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పార్టమెంట్ని ఉద్దేశించి మాట్లాడుతూ...రష్యాన్ భాష, సంస్కృతి, సరిహాద్దులను రక్షించడానికి బిల్లుకు మద్దుతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తాము ఊహజనిత బెదిరింపులకు లొంగి ఇలా చేయడం లేదు, కేవలం తమ దేశ సరిహద్దులను, మాతృభూమిని, ప్రజలను రక్షించుకునే నిమిత్తం ఇలా చేశామని తెలిపింది. అదీగాక ఉక్రెయిన్ సాధనంగా చేసుకుని అమెరికా యావత్తు పశ్చిమ దేశాలను సమీకరించిందని ఆరోపణలు చేశారు. అలాగే ఈనాలుగు భూభాగాలు మాస్కోకి మధ్య ల్యాండ్ కారిడర్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ విలీనంతో మొత్తంగా ఐదు ప్రాంతాలు అంటే ఉక్రెయిన్‌లో దాదాపు 20 శాతం స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. వాస్తవానికి రష్యా బలగాలు ఖైర్సన్, జపోరిజ్జియాపై పూర్తి నియంత్రణ కలిగి లేవు. మరీ మాస్కో ఆయా ప్రాంతాల్లోని ఏ ప్రాంతాలను స్వాధీనం చేసుకుందో స్పష్టం చేయాల్సి ఉంది. (చదవండి: భగవద్గీతా పార్క్‌పై భారత్ వ్యాఖ్యలు...వివరణ ఇచ్చిన కెనడా) -
మూడు మున్సిపల్ కార్పోరేషన్లు ఒక్కటిగా...ఆమోదం తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మున్సిపల్ కార్పొషన్ ఎన్నికలు ప్రకటించడానికి ఒక గంట ముందు ఎన్నికలను వాయిదా వేయాలంటూ బీజేపీ ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇలా ఎప్పుడూ జరగలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఆయన ఇది దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు అని కూడా వ్యాఖ్యానించారు. అయినా గత ఏడేనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ అప్పడే ఎందుకు మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా కేంద్రం మంగళవారం మూడు మున్సిపల్ కార్పొరేషన్ల విలీన ప్రతిపాదన బిల్లును ఆమోదించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేగాదు వచ్చేవారం ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనే మూడు పౌర సంస్థలకు బదులుగా ఒకటి మాత్రమే ఉంటుంది. అయితే ఆప్ మాత్రం బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఈ ఎత్తుగడ వేస్తోందంటూ ఆరోపణలు చేస్తోంది. కానీ ప్రభుత్వ వర్గాలు ప్రతి కార్పొరేషన్‌కి సంబంధించి ప్రాదేశిక విభజనలు, ఆదాయాన్ని ఇచ్చే సంభావ్యత పరంగా కార్పొరేషన్ త్రివిభజన అసమానంగా ఉన్నందున ఈ విలీన బిల్లు చాలా అవసరం అని నొక్కి చెప్పింది. అంతేగాక మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోందని, పైగా అవి ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించలేని స్థితిలో ఉండటం వల్లే ఢిల్లీలోని పౌర సేవల నిర్వహణలో తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయని వివరించింది. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ చట్టం, 1911 ప్రకారం 2011లో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించారు. కానీ ప్రస్తుతం చట్టంలోని సవరణలతో మూడు కార్పొరేషన్లను ఉపసంహరించి ఏకీకృత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీని ఏర్పాటు చేయనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. (చదవండి: ట్విస్ట్ ఇచ్చిన అఖిలేష్.. ‘యోగితో ఇక తాడో పేడో తేల్చుకుంటా’) -
ఏపీ: రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆమోదముద్ర వేశారు. ఒకటి ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లు అయితే మరొకటి విద్యుత్ సుంకం (సవరణ) బిల్లు. వివరాలివీ.. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్ వేర్వేరు కమిషన్లను ఏర్పాటుచేస్తూ బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2019లో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును మండలిలో టీడీపీ సభ్యులు వెనక్కి పంపించారు. దీంతో గతేడాది జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మరోమారు బిల్లును యథాతథంగా ప్రవేశపెట్టి ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించడంతో గత నెల 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వీకే పట్నాయక్ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణామాచార్యులకు పంపిన అధికారిక సమాచారం గురువారం చేరింది. దీంతో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటుచేయాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్‌ను సీఎం నెరవేర్చినట్లయింది. ఇప్పటివరకు ఒకే కమిషన్ పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటుచేయడంవల్ల అవి మరింత సమర్థవంతంగా పనిచేసే వీలు కలుగుతుంది. ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లుకూ.. ఇక రెండోదైన ఏపీ విద్యుత్ సుంకం (సవరణ) బిల్లు–2020కు కూడా రాష్ట్రపతి ఆమోదం లభించింది. గతేడాది డిసెంబర్ 2న ఈ బిల్లును విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దశాబ్దాల క్రితం నిర్ణయించిన విద్యుత్ సుంకంతో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు చట్టంలో స్వల్ప మార్పుచేసి అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఈ బిల్లు రూపొందించారు. దీంతో ఇక రాష్ట్రంలో వేర్వేరు కేటగిరీల వినియోగదారులకు, వేర్వేరు సమయాల్లో వేర్వేరుగా విద్యుత్ సుంకం విధిస్తారు. నష్టాలు తగ్గించి.. నాణ్యమైన విద్యుత్ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని రైతులకు తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అదే విధంగా పదివేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. ప్రజలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం (సవరణ) బిల్లు–2020ను తీసుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో అవసరానికి మించి విద్యుత్‌కు రేటు చెల్లించారు. కేవలం రెండు, మూడు రూపాయలకే యూనిట్ విద్యుత్‌ను ఇస్తామని అమ్మకందారులు ముందుకొచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగా రూ.4.80 చెల్లించి టీడీపీ పాలకులు కొనుగోలు చేశారు. తద్వారా రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారు. దీని నుంచి బయటపడటానికి ఈ బిల్లు దోహదం చేస్తుంది. ఇప్పటివరకు యూనిట్‌కు 6పైసల చొప్పున సుంకం విధిస్తున్నారు. ఈ బిల్లుతో కేటగిరీల బట్టి, విద్యుత్ వాడే సమయాలను బట్టి సుంకం విధిస్తారు. -
మరిన్ని బ్యాంకుల విలీనం: క్యాబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం రంగ బ్యాంకుల విలీనానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పీఎస్‌యూ బ్యాంకుల విలీనానికి సూత్రప్రాయ అంగీకారం లభించింది. ఈ మేరకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రెస్మీట్లో వివరాలను వెల్లడించారు. బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం, ఆర్థిక వృద్ది లక్ష్యాలతో బ్యాంకుల విలీనానికి క్యాబినెట్ ఇన్ ప్రిన్సిపల్ ఆమోదం తెలిపినట్టు చెప్పారు. చట్టప్రకారం, సెబి నిబంధనల ప్రకారం ఆయా బ్యాంకులు తగు చర్యలు తీసుకుంటాయని జైట్లీ ప్రకటించారు. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంకోసం ఒక ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని క్యాబినెట్ ఏర్పాటు చేయనుంది. అలాగే ఈ విలీన ప్రక్రియకోసం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయడంపై ప్రత్యామ్నాయ యంత్రాంగం చర్చలు నిర్వహిస్తుంది. ఎస్సెట్ క్వాలిటీ, మూలధన సంపద నిష్పత్తి, బ్యాంకుల లాభాలు, స్థానం ఆధారంగా ఈ విలీనం చోటు చేసుకోనుంది. మరోవైపు ఈ వార్తలతో స్టాక్మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభపడ్డాయి. ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, దెనా బ్యాంక్, యూకో , కెనరా, అలహాబాద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకింగ్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. దీంతో బ్యాంక్ నిఫ్టీ కూడా హై పాయింట్ వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా ఇటీవలి నెలల్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టనున్నబ్యాంకుల మెర్జర్ ప్రణాళికలపై చాలా అంచనాలు నెలకొన్నాయి. వేగవంతమైన ఆర్థిక విస్తరణకు మద్దతుగా విస్తృత బ్యాంకింగ్ రంగ సంస్కరణలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
ఎట్టకేలకు ఫ్లిప్‌కార్ట్-స్నాప్‌డీల్ బిగ్ డీల్
న్యూఢిల్లీ : ఎట్టకేలకు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌కు స్నాప్‌డీల్ ఓకే చెప్పింది. గతవారం ఫ్లిప్‌కార్ట్ సవరించి ప్రతిపాదించిన 900 మిలియన్ డాలర్ల (రూ.5,850 కోట్లు) నుంచి 950 మిలియన్ డాలర్ల(రూ.6,175 కోట్లు) టేక్ఓవర్ ఆఫర్‌కు స్నాప్‌డీల్ బోర్డు అంగీకరించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇక ఈ డీల్‌ను స్నాప్‌డీల్ షేర్ హోల్డర్స్ ఆమోదించాల్సి ఉందని సంబంధిత వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి. అయితే దీనిపై ఇంకా ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ కంపెనీలు అధికారికంగా స్పందించలేదు. నిధుల కొరతతో కటకటలాడుతున్న స్నాప్‌డీల్‌ను కొనేందుకు ఫ్లిప్‌కార్ట్ ముందు 1 బిలియన్ డాలర్ల దాకా ఇవ్వజూపినప్పటికీ.. మదింపు ప్రక్రియ అనంతరం 800-850 మిలియన్ డాలర్ల దాకా (సుమారు రూ. 5,500 కోట్లు) ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే, స్నాప్‌డీల్ దీన్ని తిరస్కరించడంతో అనంతరం ఫ్లిప్‌కార్ట్ తన ఆఫర్‌ను సవరించింది. ఈ వారంలోనే స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ బోర్డు సభ్యులు సమావేశం కాబోతున్నారని, టర్మ్‌షీట్‌పై సంతకాలు చేసి, డీల్‌ను ఓకే చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడు పార్ట్‌లలో డీల్‌ను పూర్తిచేయబోతున్నారని తెలుస్తోంది. తొలుత స్నాప్‌డీల్, తన ఇన్వెస్టర్లు నెక్సస్, కలారీ క్యాపిటల్ నుంచి సాఫ్ట్‌బ్యాంకు వాటాను కొనుగోలుచేస్తుంది. అనంతరం ఆ క్యాపిటల్‌ను సాఫ్ట్‌బ్యాంకు ఫ్లిప్‌కార్ట్‌లో పెడుతోంది. తుది దశలో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ విలీనం కాబోతున్నాయి. శుక్రవారం రోజు సమావేశమయ్యే ఫ్లిప్‌కార్ట్ బోర్డు సభ్యులు ఈ డీల్‌ను ఆమోదించబోతున్నారు. టర్మ్‌షీట్ మీద సంతకం చేసిన అనంతరం మూడు నెలల్లోపు ఈ డీల్ ప్రక్రియను ముగించాలని కంపెనీలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ రెండింటి విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంకు 20 శాతం వాటాని కలిగి ఉంటుంది. ప్రాథమిక దశలో స్నాప్‌డీల్ బ్రాండు పేరును ఫ్లిప్‌కార్ట్ అలానే కొనసాగించనుంది. -
టీసీఎస్ షేర్ల బై బ్యాక్‌కు షేర్‌హోల్డర్ల ఆమోదం
ముంబై: టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) బోర్డు సోమవారం కీలక నిర్ణయం ప్రకటించింది. దేశీయ అతి పెద్ద ఐటీ సర్వీసుల టీసీఎస్ ఇటీవల ప్రకటించిన రూ.16,000 కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్‌కు వాటాదారుల ఆమోదం లభించింది. కంపెనీ షేర్‌హోల్డర్ల ఆమోదం లభించిందనీ టీసీఎస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ బైబ్యాక్‌ను ప్రతింపాదించగా మొత్తం వచ్చిన ఓట్లలో 99.81 శాతం చెల్లుబాటయ్యే ఓట్లు అనుకూలంగా వచ్చినట్టు సమాచారం ఇచ్చింది. మొత్తం 2.85 ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించగా.. ఒక్కో షేర్‌కు రూ. 2850 చొప్పున వెచ్చించి కొనుగోలు చేయనున్నారు. దీంతో రూ. 16 వేల కోట్లతో 5.61 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు ఇప్పుడు టీసీఎస్‌కు అన్ని అనుమతులు లభించాయి. భారత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో షేర్ల బ్యాక్‌ను ప్రకటించిన టీసీఎస్ సుమారు 5.61 కోట్ల షేర్లు లేదా క్యాపిటల్ షేర్లో 2.85 శాతం వాటాను రూ.2,850 చొప్పున తిరిగి కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వేదాంత, కెయిర్న్ మెర్జర్ కు షేర్ హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్
ప్రముఖ మైనింగ్ సంస్థ వేదాంత లిమిటెడ్..కెయిర్న్ ఇండియా విలీనానికి షేర్ హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విలీన ప్రతిపాదనకు మదుపర్లు, సెక్యూర్డు, అన్సెక్యూర్డ్ రుణదాతలు అంగీకారం తెలిపారు. ఈ విషయాన్నివేదాంత రెగ్యులేటరీ ఫైలింగ్‌లో శుక్రవారం తెలిపింది. గోవాలో గురువారం జరిగిన ప్రతిపాదన ఓటింగ్‌కు వేదాంత లిమిటెడ్ మదుపర్లు అనుమతినిచ్చారని తెలిపింది. ఈ మెర్జర్ ద్వారా దేశంలో అతిపెద్ద విభిన్నమైన సహజ వనరులను సంస్థగా అవతరించాలనేది అగర్వాల్ ప్రణాళిక. సవరించిన ఆఫర్ ప్రకారం10 రూపాయల ముఖ విలువ గల షేర్ కు నాలుగు ప్రిఫరెన్షియల్ షేర్లను మైనారిటీ వాటాదారులకు అందించనుంది. అయితే వేదాంత అసలు పరీక్షను సెప్టెంబర్ 12న ఎదుర్కోనుంది. విలీన ఒప్పందంపై స్టేక్ హోల్డర్ల అభిప్రాయం తెలుసుకునేందుకు కెయిర్న్ ఇండియా ఆరోజునే సమావేశం నిర్వహించనుంది. అక్కడ అంగీకారం లభిస్తేనే ప్రక్రియ ముందుకు సాగుతుంది. కోటీశ్వరుడు అనిల్ అగర్వాల్ నేతృత్వంలో ముందుకు సాగుతున్న ఈ వ్యవహారంలో ఇటీవల వేదాంత రిసోర్సెస్, వేదాంత లిమిటెడ్ మాతృ సంస్థ యొక్క వాటాదారులు మెర్జర్ ను అనుమతించిన విషయం తెలిసిందే. -
ఫోర్టిస్ హెల్త్ కేర్ నుంచి
♦ డయాగ్నాస్టిక్స్ వ్యాపార విభజన ♦ విడదీతకు బోర్డు ఆమోదం ♦ గ్రూప్ సంస్థ ఫోర్టిస్ మలార్ హాస్పిటల్స్‌లోకి విలీనం న్యూఢిల్లీ: డయాగ్నాస్టిక్స్ వ్యాపార విభజన ప్రతిపాదనకు ఫోర్టిస్ హెల్త్‌కేర్ బోర్డు శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం అనుబంధ సంస్థ ఎస్ఆర్ఎల్లో కూడా ఉన్న డయాగ్నాస్టిక్స్ వ్యాపార విభాగం మొత్తం.. మరో గ్రూప్ సంస్థ ఫోర్టిస్ మలార్ హాస్పిటల్స్‌లో (ఎఫ్హెచ్ఎంఎల్) విలీనం చేయనున్నారు. అలాగే ఫోర్టిస్ మలార్ నిర్వహిస్తున్న హాస్పిటల్ వ్యాపారాన్ని ఫోర్టిస్ హెల్త్‌కేర్ (ఎఫ్హెచ్) కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఏకమొత్తంగా రూ. 43 కోట్లు చెల్లిస్తుంది. ఆ తర్వాత ఫోర్టిస్ మలార్ పేరును ఎస్ఆర్ఎల్గా మారి.. ఎన్ఎస్ఈలో లిస్టవుతుందని ఎఫ్హెచ్ తెలిపింది. ఫోర్టిస్ మలార్ ప్రస్తుతం చెన్నైలో ఒక ఆస్పత్రిని నిర్వహిస్తోంది. ఈ లావాదేవీతో అటు ఆసుపత్రి, ఇటు డయాగ్నాస్టిక్స్ వ్యాపార విభాగాలు మరింత మెరుగ్గా రాణించే అవకాశాలు ఉన్నాయని ఫోర్టిస్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మల్వీందర్ సింగ్ తెలిపారు. సంక్లిష్టమైన వ్యాపార విభజన ప్రతిపాదన ప్రకారం .. 0.98:1 నిష్పత్తిలో ఫోర్టిస్ హాస్పిటల్స్ షేర్హోల్డర్లకు ఫోర్టిస్ మలార్ షేర్లను కేటాయిస్తుంది. అలాగే, 10.8:1 నిష్పత్తిలో ఎస్ఆర్ఎల్ షేర్హోల్డర్లకు కూడా షేర్లను కేటాయిస్తుంది. తాజా పరిణామాల దరిమిలా బీఎస్ఈలో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు సుమారు 3 శాతం క్షీణించి రూ. 187.80 వద్ద ముగిశాయి. -
వికలాంగుల ముసాయిదా బిల్లు ఆమోదించాలి
బాలసముద్రం : వికలాంగుల ముసాయిదా బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టి బిల్లును ఆమోదింపజేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌నపీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి అంజయ్య డిమాండ్ చేశారు. వికలాంగు హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటి సమావేశం హంటర్‌రోడ్డులోని సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా అంజయ్య పాల్గొని మాట్లాడుతూ వికలాంగుల ఉద్యోగ రిజర్వేషన్లకై సుప్రీంకోర్టు తీర్పును పార్లమెంట్లో ప్రత్యేక చర్చ చేపట్టాలన్నారు. ప్రస్తుత మోడీ ప్రభుత్వం 100 రోజుల్లోనే బిల్లు ఆమోదానికి కృషి చేస్తామని చెప్పిన హామీ ఇంత వరకు నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ తగిన అర్హతలు ఉన్నా వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల నిరుద్యోగుల వేదిక రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, రమేశ్, మున్నా, నర్సింగ్, యాకయ్య, జయంగీర్, తిరుపతి, రవి, సుమన్, సంపత్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా అడ్డరాజు, గజ్జి పైడిలను ఎన్నుకున్నారు. -
గోల్కొండ కోట ఓకే అంటూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం తెలిపారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పంద్రాగస్టు వేడుకలు పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండ కోటకు మార్పు ప్రతిపాదనకు మంత్రులు ఆమోదం తెలిపారు. రుణమాఫీ, దళితులకు భూ పంపిణీ, గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు, గవర్నర్ల అడ్వైజర్ల నియామకం, ఎంసెట్‌పై సుప్రీం తీర్పుపై కేబినెట్ చర్చించింది. రుణమాఫీపై రిజర్వు బ్యాంక్ అధికారుల దగ్గరికి ప్రభుత్వాధికారుల బృందాన్ని పంపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లో నిర్వహించే పంద్రాగస్టు వేడుకల్లో ఆయా జిల్లాల మంత్రులు జెండా ఎగురవేయనున్నారు. ప్రాతినిధ్యం లేని మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్, ఖమ్మంలో మంత్రి పద్మారావు జెండా ఎగురవేయనున్నారు. -
పోలవరం బిల్లుకు పెద్దల సభ ఓకే
-
పోలవరం బిల్లుకు పెద్దల సభ ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లాలో ముంపునకు గురయ్యే పలు మండలాలు, గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు - 2014కు సోమవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. గత శుక్రవారం నాడే లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు కె.కేశవరావు ‘పోలవరం ఆర్డినెన్స్‌ను ఈ సభ ఆమోదించడం లేదు’ అంటూ తెచ్చిన స్టాట్యుటరీ రిజల్యూషన్ వీగిపోయింది. ఈ రెండు అంశాలను కలిపి సభలో చర్చకు పెట్టగా దాదాపు 3 గంటలకు పైగా చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవ ర్ధన్‌రెడ్డి కూడా స్టాట్యుటరీ రిజల్యూషన్ ఇచ్చినప్పటికీ ఆయన చర్చ సమయంలో తాను రిజల్యూషన్‌ను సభ ముందుంచడం లేదని పేర్కొన్నారు. తరువాత టీఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు బిల్లును, రిజల్యూషన్‌ను విడిగా చర్చించాలని కోరగా సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ కురియన్ అంగీకరించలేదు. ఆర్డినెన్స్ వచ్చినప్పుడు ఆనవాయితీ ప్రకారం రెండూ కలిపి చర్చకు పెడతామని చెప్పారు. స్టాట్యుటరీ రిజల్యూషన్ ప్రవేశపెట్టేందుకు కేకే లేచి మాట్లాడుతూ.. ‘ఆర్టికల్ 3 ప్రకారం తేవాల్సిన చట్టాన్ని ఆర్డినెన్స్ రూపంలో తేవడం ఏ మేరకు సమంజసం? ఇలాంటి పద్ధతులను మీరు అంగీకరిస్తారా? దీనిపై మీరు తగిన ఆదేశాలు ఇవ్వండి...’ అని పేర్కొనగా.. దీనిపై హోంమంత్రి సమాధానమిస్తారని డిప్యూటీ చైర్మన్ పేర్కొంటూ బిల్లును ప్రవేశపెట్టాలని హోంమంత్రికి సూచించారు. ఆయన బిల్లు పూర్వాపరాలను వివరిస్తూ.. ముంపు ప్రాంతాలను ఏపీలో కలపటం ద్వారా ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన పునరావాసం కల్పించేందుకు దోహదపడుతుందని చెప్పి బిల్లును ఆమోదించాలని సభను కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరాంరమేశ్ చర్చను ప్రారంభించారు. ముంపు ప్రాంతాలను ఏపీలో కలపాలని తమ యూపీఏ సర్కారే నిర్ణయించిందని, దీనివల్ల రెండు రాష్ట్రాలకూ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీకి చెందిన కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఈ బిల్లును సమర్థించగా.. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని కోరగా.. వామపక్షాలు, ముఖ్యంగా సీపీఎం ఈ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. చివర్లో హోంమంత్రి చర్చకు సమాధానం చెప్తూ.. బిల్లు విషయంలో ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘనా లేదని స్పష్టంచేశారు. అనంతరం టీఆర్ఎస్ ఎంపీ కేకే స్టాట్యుటరీ రిజల్యూషన్‌ను, సవరణ బిల్లును డిప్యూటీ చైర్మన్ ఓటింగ్‌కు పెట్టగా మూజువాణీ ఓటుద్వారా సభ స్టాట్యుటరీ రిజల్యూషన్‌ను తిరస్కరించింది. సవరణ బిల్లును ఆమోదించింది. అపోహలు అవసరం లేదు: ఏపీ కాంగ్రెస్ ఎంపీలు చర్చ సందర్భంగా జైరాంరమేష్ మాట్లాడుతూ.. ‘‘ఈ బిల్లుకు మేం సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. తెలంగాణ ప్రజలకు ైెహ దరాబాద్ ఎంత ముఖ్యమో సీమాంధ్ర ప్రజలకు పోలవరం అంతే ముఖ్యం. ఇది బహుళార్ధ సాధక ప్రాజెక్టు. దాదాపు 45 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ముంపు తగ్గించుకునేందుకు తగిన కట్టలు కట్టుకునేందుకు గాను రూ. 600 కోట్లు కేటాయిస్తానని ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. ప్రస్తుతం నిర్వాసితుల పునరావాసానికి ఈ సవరణ తప్పనిసరి. అందుకే యూపీఏ ప్రభుత్వమే మార్చి 1న జరిగిన కేబినెట్లో ఈ ఆర్డినెన్స్ రూపొందించింది. ఆ ఆర్డినెన్సులో అక్షరం పొల్లుపోకుండా ఇప్పుడు ఈ సవరణ బిల్లులో వచ్చింది. సభ్యులెవరికీ అపోహలు అవసరంలేదు. నిర్వాసితులకు మేలైన రీతిలో పునరావాస ప్యాకేజీ అందించాల్సిన అవసరం ఉంది...’’ అని పేర్కొన్నారు. ఏపీ కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి మాట్లాడుతూ కృష్ణా నదీ జలాలతో అనుసంధానం చేయడం ద్వారా రాయలసీమ, తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. విభజన బిల్లును ఆమోదించిన వారు దీన్ని మాత్రం వ్యతిరేకంచడం విచిత్రంగా ఉందని మరో ఎంపీ కె.వి.పి.రాంచంద్రరావు వ్యాఖ్యానించారు. నిర్వాసితులకు మెరుగైన పునరావాసం కోసమే ఈ సవరణ జరుగుతోందని ఇంకో ఎంపీ జె.డి.శీలం పేర్కొన్నారు. టీడీపీ సభ్యుడు సి.ఎం.రమేశ్ మాట్లాడుతూ.. ఈ సవరణ బిల్లు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని, గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. గిరిజనులు తుడిచిపెట్టుకుపోతారు: టీ-కాంగ్రెస్ ఎంపీలు ‘‘ఒడిషా మల్కాన్‌గిరి ప్రజలు ఎందుకు ఏడుస్తున్నారు? చత్తీస్‌గఢ్ జిల్లాలు, తెలంగాణ జిల్లాలు ఎందుకు ఏడుస్తున్నాయి? నాలుగు లక్షల ప్రజలు ఎందుకు ఏడుస్తున్నారో కేంద్రం అర్థం చేసుకోవాలి. కొండరెడ్లు కనీసం భోజనమైనా తీసుకోవడం లేదు. గిరిజనులను ఇబ్బంది పెట్టకూడదని అంతర్జాతీయ సహజ న్యాయం సూత్రం చెప్తోంది. లేదంటే వాళ్లు తుడిచిపెట్టుకుపోతారు. బీజేపీ సోదరులు రామచంద్రుడి పేరు తలచుకుంటారు. కానీ ఆ రాముడి ఆలయాన్నే ముంచే ప్రయత్నం చేస్తున్నారు..’’ అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్ విమర్శించారు. అదే పార్టీకి చెందిన మరో ఎంపీ రేణుకాచౌదరి మాట్లాడుతూ ‘‘ఈ ప్రాజెక్టు ఖమ్మంపై చాలా ప్రభావం చూపుతోంది. గిరిజనులను ముంచుతోంది. వారి హక్కులను కాలరాస్తోంది’’ అని వ్యతిరేకించారు. మా హృదయం రక్తమోడుతోంది: టీఆర్ఎస్ ‘‘మేం పోలవరానికి వ్యతిరేకం కాదు. 2.3 లక్షల మంది గిరిజనులు మీకు పట్టడం లేదు. రాష్ట్రపతి కనీసం అభిప్రాయాలు తీసుకోలేదు. రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి ఈ బిల్లును తెచ్చారు. గిరిజనుల బాధ చూస్తుంటే మా హృదయం రక్తమోడుతోంది. సుప్రీంకోర్టు కూడా అడిగింది డిజైన్ మార్చుకోమని. మేం బతిమాలుతున్నాం.. ఒక్కసారి డిజైన్ మార్పు గురించి ఆలోచించండి..’’ అని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు విజ్ఞప్తిచేశారు. వీహెచ్ మాట్లాడుతూ డిజైన్ మార్చాలని కోరారు. ‘‘పోలవరం ప్రస్తుత డిజైన్ వల్ల గిరిజనులకు ముప్పు వాటిల్లుతుందని.. డిజైన్ మార్చాలి. మండలాలను బదిలీ చేస్తే.. కేంద్రం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో ఎందుకు మాట్లాడదు? ఏదైనా ప్రజాస్వామ్య యుతంగా ఉండాలి. గిరిజనులకు నష్టపరిహారాన్ని తాజా చట్టాలకు అనుగుణంగా ఇవ్వాలి..’’ సీపీఐ ఎంపీ డి.రాజా కోరారు. రాజ్యాంగ ఉల్లంఘన లేదు: రాజ్‌నాథ్ పోలవరం సవరణ బిల్లు విషయంలో ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘనా లేదని రాజ్యసభలో చర్చకు బదులిస్తూ రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. ‘‘మే 29వ తేదీన మేంఆర్డినెన్సు జారీ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీలు మనుగడలో లేవు. ఏపీ విడిపోలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలన్నీ రాష్ట్రపతికి పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రపతి సిఫారసు మేరకు (పార్లమెంటు) ఉభయసభల్లో చర్చ జరుగుతోంది. ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదు’’ అని వివరించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలోని ఎక్కువ ప్రాంతాలు ముంపుకు గురికాకూడదని ప్రొటెక్టివ్ ఇంబ్యాంక్మెంట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ హామీ ఇచ్చిందని చెప్పారు. సాధ్యమైనంత మేర ఎక్కువ ప్రాంతాలు మంపుబారిన పడకుండా చర్యలు తీసుకుంటామని.. ముంపు ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికీ పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మండలాలిక్కడ.. ఎమ్మెల్యేలక్కడ! సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలపడంతో ఖమ్మం జిల్లాలోని ఏడు పోలవరం ముంపు మండలాలు ఏపీలో చేరనున్నాయి. కూనవరం, చింతూరు, వీఆర్ పురం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా, భద్రాచలం పట్టణం మినహా ఆ మండలంలోని ఇతర గ్రామాలు, బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలు ఏపీలో కలుస్తున్నాయి. ఇవి ఇప్పటిదాకా తెలంగాణలోని భద్రాచలం (సున్నం రాజయ్య), ఆశ్వారావుపేట (తాటి వెంకటేశ్వర్లు), పినపాక (పాయం వెంకటేశ్వర్లు) అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. ఇకపై వీటికి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోనుంది. ఈ మండలాలను ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ స్థానాల్లో కలిపేదాకా ఇదే పరిస్థితి తప్పదు. కానీ అందుకు పార్లమెంటు ఆమోదంతో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి! పోలవరం బిల్లు ఆమోదంపై స్పందనలు.. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టారు... బీజేపీ, టీడీపీలు కలిసి తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టినయి. పోలవరం డిజైన్ మార్చాలని టీఆర్ఎస్ ముందు నుంచి కొట్లాడుతోంది. వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలోభాగంగానే పోలవరం బిల్లు. తెలంగాణలోని బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకుల అలసత్వంతోనే బిల్లు ఆమోదం పొందింది. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాం. - బాల్క సుమన్, టీఆర్ఎస్ ఎంపీ గిరిజనులు నక్సలైట్లు అవుతారు పోలవరం డిజైన్ మార్చి ముంపు మండలాలు తగ్గిస్తే రెండున్నర లక్షల మంది గిరిజనుల జీవితాలు బాగుపడతాయని పోరాడినం. ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుంది. గిరిజనులకు సరైన పునరావాసం కల్పించకపోతే వాళ్లంతా నక్స్లైట్లుగా మారే ప్రమాదం ఉంది. - వి.హనుమంతరావు, కాంగ్రెస్ ఎంపీ మరో నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం 70 ఏళ్ల పోలవరం ప్రాజెక్టు కల ఇప్పుడు నెరవేరబోతుండడం సంతోషకరం. కాంగ్రెస్ సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే ఇంత జరిగింది. టీఆర్ఎస్ రాజకీయ లబ్ధికోసం పోరాటం చేస్తోంది. - సుజనాచౌదరి, టీడీపీ ఎంపీ శాశ్వత పరిష్కారం లభించింది పోలవరం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. ప్రాజెక్టు త్వరలో పూర్తికానుండడం సంతోషకరం. - కంభంపాటి హరిబాబు, బీజేపీ ఎంపీ బీజేపీ, టీడీపీదే పోలవరం బాధ్యత తెలంగాణ బీజేపీ, టీడీపీ నేతల నిర్వాకం వల్లనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు మునిగిపోతున్నాయి. - మంత్రి ఈటెల రాజేందర్ ఆదివాసీలను జలసమాధి కానివ్వం ఢిల్లీ ధర్నాలో పోలవరం వ్యతిరేక పోరాట కమిటీ సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నీటి కింద ఆదివాసీలను సమాధి కానివ్వబోమని, ఈ సమస్యను జాతీయసమస్యగా భావించి దేశంలోని ఆదివాసీలందరూ కదిలిరావాలని పోలవరం వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. పునరావాస పథకాలు వద్దని, ఆదివాసీలకు జీవించే హక్కు కల్పించాలని డిమాండ్ చేసింది. ముంపు మండలాలను ఏపీలో కలపడాన్ని నిరసిస్తూ సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, గిరిజన, ఆదివాసీ అనుబంధ సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి. బినామీ కాంట్రాక్టర్లయిన ఎంపీల కోసమే పోలవరమని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాం ఆరోపించారు. గిరిజనులు ప్రకృతి పూజారులని టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బాల్కసుమన్, సీతారాంనాయక్ అన్నారు. ఏపీ, తెలంగాణ పార్టీలు ఒకే వైఖరితో ఉంటే పోలవరం ఆగిపోతుందని సీపీఎం నేతలన్నారు. ముంపు మండలాల విలీనం దుర్మార్గమని సీపీఐ శాసనసభాపక్ష నేత రవీంద్రకుమార్ నాయక్ విమర్శించారు. ఆర్డినెన్సపై సుప్రీంకు వెళ్తామని వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్ తదితరులు మాట్లాడారు. -
తెలంగాణ జెన్కోకు ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జెన్కో పేరుతో ప్రత్యేకంగా కంపెనీని రిజిస్టర్ చేసేందుకు జెన్కో పాలకమండలి ఆమోదముద్ర వేసింది. విద్యుత్ సౌధలో శనివారం జెన్కో పాలకమండలి(బోర్డు) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ జెన్కోకు ఆస్తుల పంపిణీకి కూడా బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏ ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్లు అదే ప్రాంతానికి చెందే విధంగా ఆస్తులను పంపిణీ చేయాలని బోర్డు నిర్ణయించింది. బోర్డు సమావేశంలో చైర్మన్ ఎస్కే జోషి, ఎండీ విజయానంద్‌తో పాటు డెరైక్టర్లు సత్యమూర్తి, బలరాం పాల్గొన్నారు. -
కరువు భత్యానికి ఆమోదం
-
కరువు భత్యానికి ఆమోదం
డీఏ ఇచ్చిన తొలి గవర్నర్‌గా నరసింహన్ రికార్డు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త. వారు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కరువు భత్యం (డీఏ) చెల్లింపునకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం ఆమోదముద్ర వేశారు. అయితే ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించారు. కేంద్రం రెండు నెలల క్రితమే డీఏ ప్రకటించడం తెలిసిందే. జనవరి నుంచి జూన్ వరకు వర్తించే ఈ డీఏ చెల్లింపునకు ఆర్థిక శాఖ మొదట మోకాలడ్డినా, విభజన నేపథ్యంలో వేతనాలను వారం ముందుగానే చెల్లిస్తున్నందున డీఏను కూడా చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడం తెలిసిందే. ఆ తర్వాత ‘డీఏపై దయ తలుస్తారా?’ శీర్షికన బుధవారం సాక్షిలో వచ్చిన వార్తను కూడా గవర్నర్ తెలుసుకున్నారు. ఆర్థిక శాఖ నుంచి వచ్చిన డీఏ ఫైలును పరిశీలించి ఆమోదముద్ర వేశారు. ఉద్యోగులకు డీఏ మంజూరు చేసిన తొలి గవర్నర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. గవర్నర్ నుంచి ఆమోదముద్ర లభించడంతో ఉద్యోగులకు 8.56 శాతం డీఏ మంజూరైంది. దీనివల్ల ఖజానాపై నెలకు రూ.193 కోట్ల భారం పడనుంది. గవర్నర్ ఆమోదించిన ఫైలును ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు పంపించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసినందున డీఏ పెంపును ఆయన కూడా నేడో రేపో అనుమతిస్తారని సమాచారం. ఆ వెంటనే డీఏ పెంపు ఉత్తర్వులు వెలువడతాయి. పెన్షన్‌దారుల హర్షం రాష్ట్రంలోని 10 లక్షల మంది పెన్షనర్లకు గవర్నర్ డీఏ మంజూరు చేయడం పట్ల పెన్షన్‌దారుల చర్చా వేదిక అధ్యక్షుడు ఈదర వీరయ్య హర్షం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో వారికిది ఊరట కల్పిస్తుందన్నారు. -
తెలంగాణకు కేబినెట్ ఆమోదం
-
తెలంగాణకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం రెండూ వేగంగా అడుగులు వేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో రాష్ట్ర విభజన అంశం దాదాపుగా క్లైమాక్స్ కు చేరినట్టయ్యింది. ప్రధాని నివాసంలో సుమారు రెండు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో జీవోఎం సమర్పించిన తెలంగాణ ముసాయిదాపై చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కేబినెట్ సమావేశానికి రాష్ట్రానికి చెందిన కావూరి సాంబశివరావు, పల్లంరాజు, జైపాల్ రెడ్డి హాజరయ్యారు. రాయల తెలంగాణ ప్రతిపాదను జీవోఎం తోసిపుచ్చింది. అలాగే హైదరాబాద్ యూటీ ప్రతిపాదనను పక్కనబెట్టింది. అసెంబ్లీ నియోజవర్గాలు పెంచే ప్రతిపాదన లేనట్టే. కాగా పొలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపేలా ప్రతిపాదించింది. ఇదిలావుండగా, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ దృష్టిసారిస్తోంది. కేబినెట్ భేటి ముగిసన వెంటనే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని నివాసానికి వచ్చారు. అక్కడే కోర్ కమిటీ సభ్యులు భేటి అయ్యారు. అంతకుముందు బీజేపీ నేత వెంకయ్య నాయుడుతో కాంగ్రెస్ నాయకులు అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ రహస్యంగా మంతనాలు జరిపారు. సీమాంధ్ర ప్రాంత సమస్యలను పరిష్కరిస్తే మద్దతు ఇచ్చేందుకు బీజేపీ సుముఖత తెలిపినట్టు సమాచారం. బీజేపీ మద్దతు ఇస్తే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి మార్గం సుగుమమైనట్టే.