గోల్కొండ కోట ఓకే అంటూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
Published Mon, Aug 11 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం తెలిపారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పంద్రాగస్టు వేడుకలు పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండ కోటకు మార్పు ప్రతిపాదనకు మంత్రులు ఆమోదం తెలిపారు.
రుణమాఫీ, దళితులకు భూ పంపిణీ, గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు, గవర్నర్ల అడ్వైజర్ల నియామకం, ఎంసెట్‌పై సుప్రీం తీర్పుపై కేబినెట్ చర్చించింది. రుణమాఫీపై రిజర్వు బ్యాంక్ అధికారుల దగ్గరికి ప్రభుత్వాధికారుల బృందాన్ని పంపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
జిల్లాల్లో నిర్వహించే పంద్రాగస్టు వేడుకల్లో ఆయా జిల్లాల మంత్రులు జెండా ఎగురవేయనున్నారు. ప్రాతినిధ్యం లేని మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్, ఖమ్మంలో మంత్రి పద్మారావు జెండా ఎగురవేయనున్నారు.
Advertisement