తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం రెండూ వేగంగా అడుగులు వేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం. దీంతో రాష్ట్ర విభజన అంశం దాదాపుగా క్లైమాక్స్ కు చేరినట్టయ్యింది. ప్రధాని నివాసంలో సుమారు రెండు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో జీవోఎం సమర్పించిన తెలంగాణ ముసాయిదాపై చర్చించారు.