ముంబై: టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) బోర్డు సోమవారం కీలక నిర్ణయం ప్రకటించింది. దేశీయ అతి పెద్ద ఐటీ సర్వీసుల టీసీఎస్ ఇటీవల ప్రకటించిన రూ.16,000 కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్‌కు వాటాదారుల ఆమోదం లభించింది. కంపెనీ షేర్‌హోల్డర్ల ఆమోదం లభించిందనీ టీసీఎస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ బైబ్యాక్‌ను ప్రతింపాదించగా మొత్తం వచ్చిన ఓట్లలో 99.81 శాతం చెల్లుబాటయ్యే ఓట్లు అనుకూలంగా వచ్చినట్టు సమాచారం ఇచ్చింది. మొత్తం 2.85 ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించగా.. ఒక్కో షేర్‌కు రూ. 2850 చొప్పున వెచ్చించి కొనుగోలు చేయనున్నారు. దీంతో రూ. 16 వేల కోట్లతో 5.61 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు ఇప్పుడు టీసీఎస్‌కు అన్ని అనుమతులు లభించాయి.
భారత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో షేర్ల బ్యాక్‌ను ప్రకటించిన టీసీఎస్ సుమారు 5.61 కోట్ల షేర్లు లేదా క్యాపిటల్ షేర్‌లో 2.85 శాతం వాటాను రూ.2,850 చొప్పున తిరిగి కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.