Rs 16
-
టీసీఎస్ షేర్ల బై బ్యాక్‌కు షేర్‌హోల్డర్ల ఆమోదం
ముంబై: టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) బోర్డు సోమవారం కీలక నిర్ణయం ప్రకటించింది. దేశీయ అతి పెద్ద ఐటీ సర్వీసుల టీసీఎస్ ఇటీవల ప్రకటించిన రూ.16,000 కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్‌కు వాటాదారుల ఆమోదం లభించింది. కంపెనీ షేర్‌హోల్డర్ల ఆమోదం లభించిందనీ టీసీఎస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ బైబ్యాక్‌ను ప్రతింపాదించగా మొత్తం వచ్చిన ఓట్లలో 99.81 శాతం చెల్లుబాటయ్యే ఓట్లు అనుకూలంగా వచ్చినట్టు సమాచారం ఇచ్చింది. మొత్తం 2.85 ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించగా.. ఒక్కో షేర్‌కు రూ. 2850 చొప్పున వెచ్చించి కొనుగోలు చేయనున్నారు. దీంతో రూ. 16 వేల కోట్లతో 5.61 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు ఇప్పుడు టీసీఎస్‌కు అన్ని అనుమతులు లభించాయి. భారత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో షేర్ల బ్యాక్‌ను ప్రకటించిన టీసీఎస్ సుమారు 5.61 కోట్ల షేర్లు లేదా క్యాపిటల్ షేర్లో 2.85 శాతం వాటాను రూ.2,850 చొప్పున తిరిగి కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘నవీ ముంబై’.. జీవీకేదే!
చేజిక్కిన ఎయిర్‌పోర్టు కాంట్రాక్టు ♦ చివరి వరకు ప్రయత్నించిన జీఎంఆర్ ♦ ప్రాజెక్టు విలువ రూ.16,000 కోట్లు ♦ 2019 నాటికి అందుబాటులోకి.. సాక్షి, బిజినెస్ ప్రతినిధి: నవీ ముంబై ఎయిర్‌పోర్టు కాంట్రాక్టును తెలుగు రాష్ట్రానికి చెందిన జీవీకే గ్రూపు దక్కించుకుంది. రూ.16,000 కోట్ల విలువైన ప్రాజెక్టును దక్కించుకోవడానికి జీవీకే గ్రూపునకు చెందిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్(ఎంఐఏఎల్)తో పాటు జీఎంఆర్, టాటా రియల్టీ, హిరానందని డెవలపర్స్ వంటి సంస్థలు పోటీపడినా చివరకు జీవీకే, జీఎంఆర్‌లు మాత్రమే ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేశాయి. జీఎంఆర్ కంటే జీవీకే ఎక్కువ ఆదాయం ఇవ్వడానికి ముందుకు రావడంతో జీవీకేకి కాంట్రాక్టు పనులు అప్పచెప్పినట్లు సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) ప్రకటించింది. ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేయడానికి సోమవారం ఆఖరి రోజు కాగా కేవలం రెండు బిడ్లు మాత్రమే వచ్చాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ మోడల్లో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఆదాయంలో 12.60 శాతం వాటా ఇవ్వడానికి జీవీకే ముందుకు రాగా, జీఎంఆర్ 10.44 శాతం ఆఫర్ చేసింది. ఇప్పటికే జీవీకే ముంబై, బెంగళూరు ఎయిర్‌పోర్టులను, జీఎంఆర్ ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ముంబై ఎయిర్‌పోర్టు సామర్థ్యం నిడిపోవనుండటంతో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు నిర్మించాలని నిర్ణయించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నవీ ముంబైలో కొత్త ఏయిర్పోర్టు నిర్మించాలని తొలుత 1997లో ప్రతిపాదించగా, దీన్ని 2007లో ప్రభుత్వం ఆమోదించింది. అప్పటి నుంచి భూసేకరణ, పర్యావరణ అనుమతులు వంటి అనేక అవాంతరాలను ఎదుర్కొన్న ఈ ప్రాజెక్టు చివరకు సోమవారం బిడ్డింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. 2019 డిసెంబర్ నాటికీ ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీవీకే సమర్పించిన బిడ్డింగ్‌కు ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ ఆమోదం తర్వాత అధికారికంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సిడ్కో అధికారులు తెలిపారు. 2,867 ఎకరాల్లో 5,23,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు రన్‌వేలతో ఈ ఎయిర్‌పోర్టును జీవీకే నిర్మించనుంది. ముంబైలోని ఛత్రపతి శివాజి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణించే సామర్థ్యంతో నిర్మించారు. కానీ ఇప్పటికే ఈ ఎయిర్‌పోర్టు సామర్థ్యం 4.5 కోట్లకు చేరుకోగా, వచ్చే రెండేళ్లలో ఇది 5.5 కోట్లకు దాటుతుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ప్రస్తుత ఎయిర్‌పోర్టు నవీ ముంబైకి దూరంగా ఉన్న దృష్ట్యా నవీ ముంబైలో కొత్త ఎయిర్‌పోర్టుకు ఓకే చెప్పారు. గర్వకారణం: జీవీకే రెడ్డి నవీ ముంబై ప్రాజెక్టు దక్కించుకోవడం తమకు గర్వకారణమని, సంక్లిష్టమైన ముంబై విమానాశ్రయంలో టెర్మినల్ 2ను ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తమ సమర్ధతకు ఇది తార్కాణమని జీవీకే గ్రూప్ వ్యవస్థాపకుడు జీవీకే రెడ్డి పేర్కొన్నారు. 15 ఏళ్ల సాఫ్ట్‌లోన్: ఈ ప్రాజెక్టు మొదలు పెట్టడానికి అయ్యే ప్రీడెవలప్మెంట్ వ్యయాన్ని సిడ్కో సాఫ్ట్ లోన్‌గా ఇవ్వనుంది. రుణ కాలపరిమితిని తొలుత 11 ఏళ్లుగా నిర్ణయించగా ఇప్పుడు దాన్ని 15 ఏళ్లకు పొడిగించారు. అసలు వ్యయంతో సం బంధం లేకుండా ప్రీడెవలప్మెంట్ వ్యయాన్ని రూ. 3,500 కోట్లకు పరిమితం చేశారు. 3,420 కోట్లను 11వ ఏడాది నుంచి ప్రతీనెలా చెల్లించాలి. రూ.430 కోట్లను సిడ్కో ఈక్విటీగా పరిగణిస్తారు. -
భారీ బ్యాటరీతో లెనోవో పీ2 వచ్చేసింది!
భారీ బ్యాటరీ, 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో లెనోవో పీ2 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ను లెనోవో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్ రాత్రి 11.59 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లోనే అందుబాటులో ఉండనుంది. 3జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999కాగ, 4జీబీ ర్యామ్‌తో ఉన్న వేరియంట్ ధర రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది. 2016 ఐఎఫ్ఏ ట్రేడ్‌షోలో మొదటిసారి ఈ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. లెనోవో పీ2 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్.... 5100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్ 2 గిగాహెడ్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ఎంఎస్ఎం8953 ప్రాసెసర్ 3జీబీ/4జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా -
దీపావళి ఆఫర్‌తో ఇంటెక్స్ కొత్త టీవీ
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ హ్యాండ్సెట్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ కొత్త ఎల్ఈడి టీవీని లాంచ్ చేసింది. తన సరికొత్త 32 అంగుళాల ఎల్ఈడి టీవీని సోమవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధరను రూ 16,490గా కంపెనీ ప్రకటించింది. 3222 మోడల్ ఎల్ఈడిటీవీలో అన్ డ్యూ ల్యాగ్ తొలగించి, అన్ని వైపుల నుంచి స్మార్టీ లుకింగ్ వ్యూని అందించే ఐ సేఫ్ టి-మ్యాట్రిక్స్ టెక్నాలజీ ని అమర్చారు. ఇప్పటికే వినియోగదారుల్లో మంచి ఆదరణ పొందిన తాము తమ పోర్ట్‌ఫోలియోలో ఈ కొత్త శ్రేణి ఎల్ఈడి టీవీని జోడించడానికి సంతోషిస్తున్నామని , ఇంటెక్స్ డైరెక్టర్, బిజినెస్ హెడ్, నిధి మార్కండేయ ప్రకటించారు. అలాగు ఈ టీవీ కొనుగోలుపై దీపావళి ఆఫర్ గా వినియోగదారులు ఐదు సంవత్సరాల వారంటీ తో పాటు 8000ఎంఏహెచ్ పవర్ బ్యాంకు ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు చెల్లుతుందని నిధి వెల్లడించారు.