భారీ బ్యాటరీతో లెనోవో పీ2 వచ్చేసింది! | Lenovo P2 smartphone with 5,100 mAh battery launched, price starts at Rs 16,999 | Sakshi
Sakshi News home page

భారీ బ్యాటరీతో లెనోవో పీ2 వచ్చేసింది!

Published Wed, Jan 11 2017 2:26 PM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

భారీ బ్యాటరీతో లెనోవో పీ2 వచ్చేసింది!

భారీ బ్యాటరీతో లెనోవో పీ2 వచ్చేసింది!

భారీ బ్యాటరీ, 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో లెనోవో పీ2 స్మార్ట్ఫోన్ వచ్చేసింది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ను లెనోవో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎక్స్క్లూజివ్గా ఈ ఫోన్ రాత్రి 11.59 నుంచి ఫ్లిప్కార్ట్లోనే అందుబాటులో ఉండనుంది. 3జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999కాగ, 4జీబీ ర్యామ్తో ఉన్న వేరియంట్ ధర రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది.  2016 ఐఎఫ్ఏ ట్రేడ్షోలో మొదటిసారి ఈ ఫోన్ను కంపెనీ లాంచ్ చేసింది. 
 
 
లెనోవో పీ2 స్మార్ట్ఫోన్ ఫీచర్స్....
 
5100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో ఓఎస్
2 గిగాహెడ్జ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 625 ఎంఎస్ఎం8953 ప్రాసెసర్
3జీబీ/4జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
13 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement