ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయమే కొంప ముంచింది! క్లాస్‌రూంలోనే బీటెక్‌ విద్యార్థిని | Student Lost Her Life After Attempting Self Abortion In Nellore District | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయమే కొంప ముంచింది! క్లాస్‌రూంలోనే బీటెక్‌ విద్యార్థిని

Published Sun, Apr 16 2023 10:44 AM | Last Updated on Sun, Apr 16 2023 5:18 PM

Student Lost Her Life After Attempting Self Abortion In Nellore District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రేమ ఆ విద్యార్థిని పాలిట యమపాశమైంది. నయవంచకుడి మాటలకు మోసపోయిన ఆమె గర్భం ధరించింది. తర్వాత ప్రేమికుడు ముఖం చాటేశాడు. పెళ్లి కాకుండానే తల్లినవుతున్నాననే విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భయపడింది. హాస్టల్‌ గదిలోనే స్వీయ గర్భస్రావానికి ఒడిగట్టి అపస్మారక స్థితికి చేరుకోగా.. ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం దక్కక చివరకు ప్రాణాలొదిలింది.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన నెల్లూరు రూరల్‌ మండలం కనుపర్తిపాడులోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన మధు దంపతుల ఏకైక కుమార్తె కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

అధిక రక్తస్రావం కావడంతో.. 
కాగా, ఈ నెల 7, 8 తేదీల్లో ఆ విద్యార్థిని తరగతులకు హా­జ­రుకాకుండా హాస్టల్‌ గదిలోనే ఉండిపోయింది. అదేమని అడిగితే ఆరోగ్యం బాగాలేదని సహచర విద్యార్థినులకు చెప్పింది. 8వ తేదీన మధ్యాహ్నం భోజన సమయంలో అదే గదిలో ఉంటున్న సహచర విద్యార్థిని భోజనం తీసుకు వెళ్లగా.. ఆమె తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలో పడి ఉంది. గది నిండా రక్తం ఉండటం, డస్ట్‌బిన్‌లో పిండం పడి ఉండటాన్ని చూసిన తోటి విద్యార్థిని కేకలు వేయడంతో మరికొందరు గదిలోకి వెళ్లారు. వెంటనే అధ్యాపకులకు తెలియజేయడంతో వారు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.

విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆమెను చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను బతికించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కొద్దిసేపటికే ఆమె మరణించింది. స్వీయ గర్భస్రావానికి ప్రయతి్నంచిన విద్యార్థిని అధిక రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్‌ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేశారు. సీఐ పి.శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో ఎస్‌ఐ కోటిరెడ్డి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి సెల్‌ఫోన్‌ కాల్‌ డీటైల్స్‌ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.

మృతురాలికి నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం లింగంగుంట గ్రామానికి చెందిన కారు డ్రైవర్‌ శశికుమార్‌తో పరిచయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం శశికుమార్‌కు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాగా.. అది కాస్తా ప్రేమకు దారితీసిందని తెలిసింది. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగి చివరకు ఆమె గర్భం దాల్చిందని సమాచారం. పరువు పోతుందన్న భయంతోనే ఆ విద్యార్థిని స్వీయ గర్భస్రావానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుందని వైద్యులు, పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. విద్యార్థిని గర్భవతి అయిన విషయంలో ఎవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది. మరో ఇద్దరు అనుమానితులు కూడా ఉన్నట్టు సమాచారం.

లేకలేక పుట్టిన సంతానం
మృతురాలి తల్లి పోలియో బాధితురాలు కాగా.. తండ్రి వ్య­వసాయ కూలీ. పెళ్లయిన పదేళ్ల తర్వాత పుట్టిన ఏకైక గారాలపట్టి కావడంతో చిన్నతనం నుంచే తల్లిదండ్రులు ఆమెను గారాబంగా పెంచారు. అడిగింది కాదనకుండా ఇచ్చేవారు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా ఆ విద్యార్థిని చదువుల్లో రాణిస్తోంది. మంచి చదువులు చదివి ఉన్నత స్థాయిలో స్థిర­పడుతుందని భావిస్తున్న తమ కలల్ని కల్లలుగా మార్చి ఒక్కగానొక్క కుమార్తె తమకు గర్భశోకం మిగిల్చిందని తల్లిదండ్రులు బావురుమంటున్నారు.
చదవండి: షాకింగ్‌ ఘటన.. నా భార్యతోనే చనువుగా ఉంటావా అంటూ..

శ్రీరామ నవమి ఉత్సవాలకు ఇంటికి వచ్చిందని.. బంధుమిత్రులతో సందడి చేసిందని గ్రా­మస్తులు తెలిపారు. చివరకు ఆమె విగతజీవిగా గ్రామానికి రావడాన్ని తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేక­పో­తున్నారు. కాగా, ప్రేమ పేరుతో యువతిని వంచించిన వ్య­క్తిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులతోపాటు గ్రామస్తు­లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జ­రగకుండా కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరా­రు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement