Actress Kubbra Sait Reveals About Her Abortion After One Night Stand At 30, Goes Viral - Sakshi
Sakshi News home page

Kubbra Sait: ఫ్రెండ్‌తో వన్‌ నైట్‌ స్టాండ్‌.. తల్లిని కావాలని లేదు: నటి

Published Sat, Jul 2 2022 11:45 AM | Last Updated on Sat, Jul 2 2022 1:46 PM

Actress Kubbra Sait Reveals About Her Abortion After One Night Stand - Sakshi

Actress Kubbra Sait Reveals About Her Abortion After One Night Stand: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ 'రెడీ' మూవీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్‌ భామ కుబ్రా సైట్. తర్వాత వచ్చిన 'సేక్రెడ్‌ గేమ్స్‌' వెబ్‌ సిరీస్‌ ద్వారా మంచి ఫేమ్‌ సంపాందించుకుంది. సుల్తాన్, జవానీ జానేమన్‌, సిటీ ఆఫ్‌ లైఫ్‌ వంటి తదితర సినిమాల్లో నటించింది. తాజాగా కుబ్రా 'ఓపెన్‌ బుక్‌: నాట్‌ ఏ క్వైట్‌ మెమోయిర్‌' (Open Book: Not A Quite Memoir) అనే పుస్తకాన్ని రాసింది. జూన్‌ 27న విడుదలైన ఈ పుస్తకంలో తన పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన అనేక విషయాలను పొందుపరిచినట్లు ఆమె తెలిపింది. బాడీ షేమింగ్, వన్‌ నైట్‌ స్టాండ్‌, అబార్షన్‌, లైంగిక వేధింపులు వంటి తదితర ఆసక్తికర విషయాలను గుర్తు చేసుకుంది. 

ఓ ఇంటర్వ్యూలో కుబ్రా సైట్ 'నా 30 ఏళ్లప్పుడు 2013లో అండమాన్‌ పర్యటనకు వెళ్లాను. స్కూబా డైవింగ్ సెషన్‌ తర్వాత కొన్ని డ్రింక్స్‌ తీసుకున్నాను. తర్వాత ఒక స్నేహితుడితో బెడ్‌ షేర్ చేసుకున్నాను. శారీరకంగా కలిశాను (వన్‌ నైట్‌ స్టాండ్‌). కొన్నాళ్లకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగా పాజిటివ్‌ అని తేలింది. వారం రోజుల తర్వాత అబార్షన్‌ చేయించుకోవాలనుకున్నాను. నేను తల్లిని కావడానికి సిద్ధంగా లేను. నేను ఊహించుకున్నట్లుగా నా జీవిత ప్రయాణం సాగట్లేదు. ఇప్పటికీ కూడా నేను సిద్ధంగా ఉన్నానని అనుకోవట్లేదు. అమ్మాయిలు 23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలి. 30 ఏళ్లకు పిల్లలను కనాలి వంటి విషయాలు నాకు అర్థం కావు. 

చదవండి: నగ్నంగా విజయ్‌ దేవరకొండ.. ఫొటో వైరల్‌

అబార్షన్‌ చేయించుకున్నా. నాకు తప్పు చేశానన్న భావన లేదు. ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా ఛాయిస్‌ నాకు ఉంటుంది. ప్రస్తుతం నా ఆలోచనల్లో క్లారిటీ ఉందనుకుంటున్నాను. ఈ విషయాలను ఇలా షేర్ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని భావిస్తున్నాను. అందుకే ఈ పుస్తకాన్ని రాశాను. గతంలో జరిగిన సంఘటనల నుంచి కొన్ని విషయాలను నేర్చుకున్నాను. బాడీ షేమింగ్‌కు గురయ్యాను. నా కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి లైంగికంగా వేధించేవాడు. మళ్లీ అలాంటి పరిస్థితులు ఎదురైతే నేను వ్యవహరించే తీరు వేరే విధంగా ఉంటుంది. నేను రాసిన పుస్తకంలో 24 చాప్టర్స్‌ ఉంటాయి. ప్రతి చాప్టర్ చదివించేలా ఆసక్తికరంగా ఉంటుంది' అని తెలిపింది. 



చదవండి: నా రిలేషన్‌ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్‌
తొలిసారిగా మోహన్‌ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్‌.. టైటిల్ ఫిక్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement