ప్రాణం తీసిన గర్భస్రావ మాత్ర | Young Woman End life to Abortion pill | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన గర్భస్రావ మాత్ర

Jan 30 2025 1:25 PM | Updated on Jan 30 2025 1:26 PM

Young Woman End life to Abortion pill

ఖలీల్‌వాడి (నిజామాబాద్ జిల్లా): గర్భస్రావం మాత్రలు రిఫర్‌ చేసి ఓ యువతి మరణానికి కారణమైన పీఎంపీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏసీపీ బుధవారం వెల్లడించారు. మాక్లూర్‌ మండలానికి చెందిన యువతి, మెండోరా మండలం సావెల్‌కు చెందిన యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 

ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కారణంగా యువతి గర్భం (2 నుంచి 3 నెలలు) దాల్చడంతో యువకుడు తన గ్రామంలో క్లినిక్‌ నిర్వహిస్తున్న ముప్కాల్‌ మండలం రెంజర్లకు చెందిన పీఎంపీ హరికృష్ణచారిని ఈనెల 4న సంప్రదించాడు. పీఎంపీ సూచించిన మాత్రలను యువకుడు అదే రోజు యువతికి ఇవ్వగా మూడు రోజుల తరువాత ఆమెకు కడుపు నొప్పితోపాటు బ్లీడింగ్‌ అయ్యింది. దీంతో యువతిని ఆమె తల్లి నిజామాబాద్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లింది. 

యువతికి గర్భస్రావమైందని, కిడ్నీ, లివర్‌కు ఇన్ఫెక్షన్‌ వచ్చిందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈనెల 10న హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో యువతి మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పీఎంపీని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement