Liver Infection Toxic waste
-
ప్రాణం తీసిన గర్భస్రావ మాత్ర
ఖలీల్‌వాడి (నిజామాబాద్ జిల్లా): గర్భస్రావం మాత్రలు రిఫర్ చేసి ఓ యువతి మరణానికి కారణమైన పీఎంపీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏసీపీ బుధవారం వెల్లడించారు. మాక్లూర్ మండలానికి చెందిన యువతి, మెండోరా మండలం సావెల్‌కు చెందిన యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కారణంగా యువతి గర్భం (2 నుంచి 3 నెలలు) దాల్చడంతో యువకుడు తన గ్రామంలో క్లినిక్ నిర్వహిస్తున్న ముప్కాల్ మండలం రెంజర్లకు చెందిన పీఎంపీ హరికృష్ణచారిని ఈనెల 4న సంప్రదించాడు. పీఎంపీ సూచించిన మాత్రలను యువకుడు అదే రోజు యువతికి ఇవ్వగా మూడు రోజుల తరువాత ఆమెకు కడుపు నొప్పితోపాటు బ్లీడింగ్ అయ్యింది. దీంతో యువతిని ఆమె తల్లి నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. యువతికి గర్భస్రావమైందని, కిడ్నీ, లివర్‌కు ఇన్ఫెక్షన్ వచ్చిందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈనెల 10న హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో యువతి మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పీఎంపీని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
కాలేయాన్ని శుభ్రం చేద్దాం!
అధ్యయనం * కాలేయాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే అనేక వ్యాధులను అరికట్టవచ్చు. అందుకు మూడు సులువైన మార్గాలు... * దేహానికి తగినంత నీటిని అందించాలి. మంచినీళ్లు, గ్రీన్ టీ, తాజా పండ్ల రసాలు సమృద్ధిగా తీసుకుంటే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడాన్ని నివారించవచ్చు. * రోజూ తినే ఆహారంలో పసుపు వాడాలి. పసుపు వాపులను తగ్గించడంతోపాటు లివర్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. * పోషకాహారాన్ని తీసుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలతో కూడిన పోషకాహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో పాలకూర, క్యాబేజ్, వెల్లుల్లి, నిమ్మ, బత్తాయి, కమలా వంటి పుల్లటి పండ్లు తప్పని సరిగా ఉండాలి. ఇవి దేహంలోని విషపూరిత వ్యర్థాలను నశింపచేస్తాయి. తగినంత నీటిని తీసుకోవడం వల్ల అవన్నీ బయటకు విసర్జితమవుతాయి.