ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఇటీవలే పండంటి కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరిలో ఒకరికి ద్రిప్త అని.. మరొకరికి శర్వాస్ అని పిల్లల పేర్లు కూడా రివీల్ చేశారు. 2014లో నటుడు రాహుల్‌ని పెళ్లాడిన చిన్మయి ఇటీవలె ట్విన్స్‌కు జన్మనిచ్చి మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. అయితే తాజాగా చిన్మయి తన ప్రెగ్నెన్సీ స్టోరీని నెటిజన్లతో పంచుకుంది. తన స్వంత యూట్యూబ్ ఛానల్‌లో ఈ మేరకు వీడియోను షేర్ చేసింది.
'నేను, రాహుల్ ఎప్పటినుంచో తల్లిదండ్రులు కావాలనుకున్నాం. 2020లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నాం. కానీ అప్పుడు కరోనాతో అంతా అయోమయ పరిస్థితి. ప్రపంచమంతా తలకిందులయ్యింది. మా డాక్టర్ కూడా బయట ఏం జరుగుతుంతో తెలియదు.. ఇంతకాలం వెయిట్ చేశారు కదా ఇంకాస్త సమయం ఓపిక పట్టండి అని చెప్పింది. సెకండ్ వేవ్ అయిపోయాక నేను గర్బవతిని అయ్యాను. కానీ మూడు నెలలకే గర్భస్రావం(అబార్షన్)అయ్యింది. దీంతో చాలా బాధపడ్డాను.
మానసికంగా చాలా డిస్ట్రబ్ అయ్యాను. కానీ తర్వాత కొన్నిరోజులకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెడిషనల్ చైనీస్ మెడికల్ డాక్టర్ ఎమిలీ నాకు పరిచయం అయ్యింది. తన సలహాతో నా డైట్, ఎక్సర్‌సైజ్ అన్నీ పాటించాను. అవి దాదాపు మన ఇండియన్ ఆయుర్వేదిక్ పద్దతులే. ఇక కొంతకాలానికి నేను మళ్లీ గర్భం దాల్చాను. కవలలకు జన్మనిచ్చాను. 37ఏళ్ల వయసులో తల్లి అయ్యాను' అంటూ చిన్మయి తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment