Sambhavna Seth
-
చున్నీ లేదేంటి? నీకు బుర్ఖా వేయాల్సిందే.. హీరోయిన్‌పై ట్రోలింగ్
హీరోయిన్ సనా ఖాన్ (Sana Khan) సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటోంది. యూట్యూబ్‌లో వ్లాగ్స్ చేయడంతోపాటు రంజాన్ స్పెషల్ పాడ్‌క్యాస్ట్ కూడా చేస్తోంది. సనా చేసే ఈ పాడ్‌కాస్ట్‌లోని ఓ ఎపిసోడ్లో నటి సంభావన సేత్ (Sambhavna Seth) కూడా భాగం కానుంది. ఈ ఎపిసోడ్ షూట్ చేయడానికి ముందు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దెబ్బలు పడ్తాయ్అందులో సనా.. నీ డ్రెస్ మార్చుకుంటావా? అని అడగ్గా సంభావన లేదని చెప్పింది. అందుకామె నీ సల్వార్ కమీజ్ ఏమీ బాగోలేదు.. చెప్పింది వినకపోతే నీకు దెబ్బలు పడ్తాయి.. చున్నీ ఎక్కడుంది? ఎవరైనా బుర్ఖా తీసుకురండి. సంభావనకు బుర్ఖా వేయండి అని నవ్వుతూ చెప్పింది. అందుకు సంభావన.. నాకిప్పుడు ఏ డ్రెస్ కూడా పట్టదు. నేను చాలా బరువు పెరిగాను. దాదాపు 15 కిలోలు పెరిగుంటాను. అయినా జనాలు (పాడ్‌కాస్ట్‌లో) మనం ఏం మాట్లాడామన్నదే చూస్తారు కానీ మన దుస్తులు కాదు. మనం సహజంగా ఉంటేనే జనాలు ఇష్టపడతారు అని పేర్కొంది.ఎందుకు ఒత్తిడి చేస్తున్నావ్?వీళ్లు సరదాగా మాట్లాడుకున్నప్పటికీ జనాలకు సనా వైఖరి ఏమాత్రం నచ్చలేదు. అవతలివారు మీ వేషధారణను, పద్ధతులను గౌరవించాలంటే ముందుగా సనా కూడా అవతలివారిని గౌరవించాలి. సనా తన ఆలోచనలను, పద్ధతులను సంభావనపై రుద్దాలని చూడటం దారుణం.. ఎవరికి నచ్చినట్లు వారిని బతకనివ్వండి, ఆమె సల్వార్ ధరించలేదు, చున్నీ వేసుకోలేదు.. ఎందుకిదంతా.. ఆమెను బలవంతం చేయడానికి సనాకు ఏం హక్కు ఉంది? అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.మజాక్ చేసిందంతే..ఈ ట్రోలింగ్‌పై సంభావన స్పందిస్తూ.. సనా తన ఫ్రెండ్ అని, తను సరదాగా అన్న మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని సూచించింది. ఇద్దరు ఫ్రెండ్స్ అన్నాక.. సరదాగా వంద మాట్లాడుకుంటామని దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. తనను బుర్ఖా వేసుకోమని సనా ఏమీ బలవంతం చేయలేదని క్లారిటీ ఇచ్చింది. దయచేసి సనాను విమర్శించడం ఆపేయండని కోరింది.సినిమాసనా ఖాన్.. కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య వంటి తెలుగు చిత్రాలతో పాటు మలయాళ, కన్నడ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేసింది. కొన్ని మూవీస్‌లో ఐటం సాంగ్‌లోనూ మెరిసింది. తర్వాత సడన్‌గా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. 2020 నవంబర్‌లో అనాస్‌ను పెళ్లి చేసుకుంది. అంతేకాదు తన సోషల్ మీడియా నుంచి గ్లామరస్ ఫోటోలు, ట్రిప్పులకెళ్లిన వీడియోలు అన్నింటినీ డిలీట్ చేసింది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో సెలబ్రిటీల రంజాన్ అనుభవాలు తెలియజేస్తూ యూట్యూబ్‌లో ప్రత్యేక పాడ్‌కాస్ట్ చేస్తోంది. View this post on Instagram A post shared by BollywoodTalks (@bolywoodtalks) చదవండి: ఇంకా ఎందుకు బతికున్నావ్.. ఎలుకల మందు తిను అన్నారు: నటుడు -
పాపం.. ఇక అదృష్టం లేదేమో.. ఐదోసారి నటికి హార్ట్ బ్రేకింగ్!
ఈ సమాజంలో ఏ మహిళకైనా ఒక్కసారైనా అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుంది. అందుకోసమే పిల్లల కోసం తెగ ఆరాటపడుతుంటారు. కానీ గర్భధారణలో వచ్చే ఇబ్బందుల వల్ల చాలామంది ఐవీఎఫ్, సరోగసీ పద్ధతుల ద్వారా పిల్లలను కనేందుకు యత్నిస్తుంటారు. ప్రస్తుత సరోగసీ అనే పద్ధతి చాలా వరకు సాధారణ ప్రక్రియగా మారిపోయింది.అయితే ప్రముఖ బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంభావన సేత్ సైతం పిల్లల కోసం తెగ ఆరాటపడుతోంది. అందుకే ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్)ను ఆశ్రయించారు. ఇప్పటికే నాలుగుసార్లు ఐవీఎఫ్ ప్రక్రియ ఫెయిల్ అయినప్పటికీ మరోసారి ప్రయత్నించారు బాలీవుడ్ నటి. అయితే ఐదోసారి కూడా ఆమెకు నిరాశే మిగిలింది.ప్రెగ్నెన్సీ ధరించిన మొదటి త్రైమాసికంలోనే గర్భస్రావం అయిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది సంభావన. తన భర్తతో కలిసి యూట్యూబ్ ఛానెల్ ద్వారా బాధను వ్యక్తం చేసింది. తాము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 12 వారాల ఇలా జరిగిందని బోరున ఏడ్చేసింది. నటి భర్త అవినాష్ ద్వివేది సైతం తాము గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటే.. ఇలా జరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని ప్రకటిస్తూ సంభవనా ఎమోషనలైంది. మా బిడ్డను రక్షించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది. మూడు నెలల్లో 65 ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చిందని నటి తెలిపింది. కానీ చాలా ఇంజెక్షన్లు తీసుకోవలసి ఉంటుందని నాకు తెలియదు.. ఇది తలచుకుంటే చాలా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ప్రతిరోజూ 2-3 సార్లు ఇంజెక్షన్స్ ఇచ్చేవారని.. మేము మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మా ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదని ఆమె భర్త అవినాశ్ బాధపడ్డారు.కాగా..గతంలోనూ ఈ జంట ఐవీఎఫ్‌కు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇది ఐదోసారి కావడంతో వారిని తీవ్ర మనో వేదనకు గురి చేసింది. గతంలో ఐవీఎఫ్ ఆధునిక పద్ధతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడినట్లు నటి వివరించింది. అంతేకాకుండా ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్‌తో సతమతమవుతున్నట్లు తెలిపింది.. తన బాధను అభిమానులతో పంచుకుంటూ కంటతడి పెట్టుకుంది. -
రాక్షస డాక్టర్లు నా తండ్రిని చంపారు: నటి ఆవేదన
బుల్లితెర నటి సంభావన సేత్ తండ్రి ఇటీవలే కోవిడ్‌తో కన్నుమూశారు. అతడికి ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్నప్పటికీ వైద్యులు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం వల్లే ఆయన చనిపోయాడని నటి ఆరోపణలు చేసింది. తన తండ్రిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని మండిపడింది. దీనికి కారణమైన వారిని వదిలిపెట్టనని హెచ్చరించింది. ఈ మేరకు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. "అందరు డాక్టర్లు దేవుళ్లు కాదు.. వారిలో మనలాంటి వాళ్లను హత్య చేసే రాక్షసులు కూడా ఉన్నారు. వాళ్లే నా తండ్రిని చంపేశారు. తండ్రిని కోల్పోవడం అనేది నా జీవితంలోనే ఓ భయంకరమైన పరిస్థితి. కానీ నేను ఇప్పుడు ధైర్యంగా ముందడుగు వేస్తాను. నా తండ్రి నేర్పిన బాటలోనే న్యాయం కోసం పోరాడుతాను. ఈ పోరాటంలో నేను గెలిచినా గెలవకపోయినా కొందరిని కచ్చితంగా బయటకు లాగి వారి నిజ స్వరూపాన్ని చూపిస్తాను. నా తండ్రి చావుకు కారణమైన జైపూర్ గోల్డెన్ ఆస్పత్రికి లీగల్ నోటీసులు పంపాం. మీలో చాలామంది ఇలాంటి కష్టాన్ని ఎదుర్కొనే ఉంటారు. కానీ అనేక కారణాల వల్ల వాటిని ఎదురించలేకపోవచ్చు. ఇప్పుడు మాత్రం నా పోరాటానికి మద్దతు తెలపండి" అని అభ్యర్థించింది. View this post on Instagram A post shared by Sambhavna Seth (@sambhavnasethofficial) మే 8న సంభావన ఈ వీడియో రికార్డ్ చేసింది. ఇందులో తను అడిగే ప్రశ్నలకు సిబ్బంది నిర్లిప్తంగా సమాధానాలు చెప్పడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆక్సిజన్ లెవల్స్ కేవలం 55 మాత్రమే ఉన్నా ఆక్సిజన్ సాచురేషన్ బాగుందని సిబ్బంది చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ వీడియో తీసిన రెండు గంటలకే తన తండ్రి తుది శ్వాస విడిచాడంటూ సంభావన ఉద్వేగానికి లోనైంది. చదవండి: న్యూడ్ వీడియో లీక్.. 4 రోజులు బయటకు రాలేదు: నటి -
బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లిచేసుకోబోతున్న నటి!
ప్రముఖ భోజ్‌పురి హీరోయిన్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సంభావన సేథ్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నది. ఆమె గురువారం తన బాయ్‌ఫ్రెండ్ అవినాశ్ ద్వివేదిని పెళ్లాడబోతున్నది. భోజ్‌పురి సినీ పరిశ్రమలో పేరొందిన నటి అయిన సంభావనకు బాలీవుడ్‌లోనూ పరిచయం ఉంది. ఇప్పటికే ప్రముఖ టీవీ నటి దివ్యాంక త్రిపాఠి పెళ్లి చేసుకోగా తాజాగా సంభావన కూడా పెళ్లికి రెడీ అవ్వడం అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతోంది. ఇప్పటికే ప్రీ వెడ్డింట్ షూట్‌కు సంబంధించి ఈ జంట పోస్టుచేసిన ఫొటోలు ఆన్లైన్లో హాల్చల్ చేస్తున్నాయి. బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి గురువారం న్యూఢిల్లీలో జరగనుంది.