
హీరోయిన్ సనా ఖాన్ (Sana Khan) సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటోంది. యూట్యూబ్‌లో వ్లాగ్స్ చేయడంతోపాటు రంజాన్ స్పెషల్ పాడ్‌క్యాస్ట్ కూడా చేస్తోంది. సనా చేసే ఈ పాడ్‌కాస్ట్‌లోని ఓ ఎపిసోడ్‌లో నటి సంభావన సేత్ (Sambhavna Seth) కూడా భాగం కానుంది. ఈ ఎపిసోడ్ షూట్ చేయడానికి ముందు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
దెబ్బలు పడ్తాయ్
అందులో సనా.. నీ డ్రెస్ మార్చుకుంటావా? అని అడగ్గా సంభావన లేదని చెప్పింది. అందుకామె నీ సల్వార్ కమీజ్ ఏమీ బాగోలేదు.. చెప్పింది వినకపోతే నీకు దెబ్బలు పడ్తాయి.. చున్నీ ఎక్కడుంది? ఎవరైనా బుర్ఖా తీసుకురండి. సంభావనకు బుర్ఖా వేయండి అని నవ్వుతూ చెప్పింది. అందుకు సంభావన.. నాకిప్పుడు ఏ డ్రెస్ కూడా పట్టదు. నేను చాలా బరువు పెరిగాను. దాదాపు 15 కిలోలు పెరిగుంటాను. అయినా జనాలు (పాడ్‌కాస్ట్‌లో) మనం ఏం మాట్లాడామన్నదే చూస్తారు కానీ మన దుస్తులు కాదు. మనం సహజంగా ఉంటేనే జనాలు ఇష్టపడతారు అని పేర్కొంది.
ఎందుకు ఒత్తిడి చేస్తున్నావ్?
వీళ్లు సరదాగా మాట్లాడుకున్నప్పటికీ జనాలకు సనా వైఖరి ఏమాత్రం నచ్చలేదు. అవతలివారు మీ వేషధారణను, పద్ధతులను గౌరవించాలంటే ముందుగా సనా కూడా అవతలివారిని గౌరవించాలి. సనా తన ఆలోచనలను, పద్ధతులను సంభావనపై రుద్దాలని చూడటం దారుణం.. ఎవరికి నచ్చినట్లు వారిని బతకనివ్వండి, ఆమె సల్వార్ ధరించలేదు, చున్నీ వేసుకోలేదు.. ఎందుకిదంతా.. ఆమెను బలవంతం చేయడానికి సనాకు ఏం హక్కు ఉంది? అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మజాక్ చేసిందంతే..
ఈ ట్రోలింగ్‌పై సంభావన స్పందిస్తూ.. సనా తన ఫ్రెండ్ అని, తను సరదాగా అన్న మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని సూచించింది. ఇద్దరు ఫ్రెండ్స్ అన్నాక.. సరదాగా వంద మాట్లాడుకుంటామని దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. తనను బుర్ఖా వేసుకోమని సనా ఏమీ బలవంతం చేయలేదని క్లారిటీ ఇచ్చింది. దయచేసి సనాను విమర్శించడం ఆపేయండని కోరింది.
సినిమా
సనా ఖాన్.. కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య వంటి తెలుగు చిత్రాలతో పాటు మలయాళ, కన్నడ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేసింది. కొన్ని మూవీస్‌లో ఐటం సాంగ్‌లోనూ మెరిసింది. తర్వాత సడన్‌గా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. 2020 నవంబర్‌లో అనాస్‌ను పెళ్లి చేసుకుంది. అంతేకాదు తన సోషల్ మీడియా నుంచి గ్లామరస్ ఫోటోలు, ట్రిప్పులకెళ్లిన వీడియోలు అన్నింటినీ డిలీట్ చేసింది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో సెలబ్రిటీల రంజాన్ అనుభవాలు తెలియజేస్తూ యూట్యూబ్‌లో ప్రత్యేక పాడ్‌కాస్ట్ చేస్తోంది.
చదవండి: ఇంకా ఎందుకు బతికున్నావ్.. ఎలుకల మందు తిను అన్నారు: నటుడు
Comments
Please login to add a commentAdd a comment