ప్రముఖ భోజ్‌పురి హీరోయిన్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సంభావన సేథ్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నది.
ప్రముఖ భోజ్‌పురి హీరోయిన్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సంభావన సేథ్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నది. ఆమె గురువారం తన బాయ్‌ఫ్రెండ్ అవినాశ్ ద్వివేదిని పెళ్లాడబోతున్నది.
భోజ్‌పురి సినీ పరిశ్రమలో పేరొందిన నటి అయిన సంభావనకు బాలీవుడ్‌లోనూ పరిచయం ఉంది. ఇప్పటికే ప్రముఖ టీవీ నటి దివ్యాంక త్రిపాఠి పెళ్లి చేసుకోగా తాజాగా సంభావన కూడా పెళ్లికి రెడీ అవ్వడం అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతోంది. ఇప్పటికే ప్రీ వెడ్డింట్ షూట్‌కు సంబంధించి ఈ జంట పోస్టుచేసిన ఫొటోలు ఆన్‌లైన్‌లో హాల్‌చల్ చేస్తున్నాయి. బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి గురువారం న్యూఢిల్లీలో జరగనుంది.