మండూకాసనం గర్భకోశ వ్యాధులు, రుతుక్రమ సమస్యలను నివారిస్తుంది. ఈ ఆసనంలో మొదట..వెన్ను నిటారుగా వజ్రాసన స్థితిలో కూర్చుని, అరచేతులను తొడల మీద ఉంచాలి.రెండు పిడికిళ్లు బిగించి కింది పొట్టకు ఆనించాలి. మోకాళ్లను కొంచెం దూరం జరిపి, నడుమును (వెన్నును కాదు) వంచి నుదురును నేలకు ఆనించాలి. ఆ స్థితిలో పదిసార్లు శ్వాస తీసుకుని వదిలిన తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి. మొదటి ప్రయత్నంలో నుదుటిని నేలకు ఆనించడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు బలవంతంగా ఆనించే ప్రయత్నం చేయరాదు. సాధనతో సాధ్యం చేసుకోవాలి.
ఉపయోగాలు:
గర్భకోశ వ్యాధులు, రుతు సంబంధ సమస్యలు పోతాయి. మోకాళ్ల నొప్పులు పోతాయి. నడుము ప్రదేశంలోని దేహభాగాలను ఆరోగ్యవంతంగా ఉంటాయి. పిరుదులలోని కొవ్వు కరిగిపోతుంది.
జాగ్రత్తలు:
బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు, విపరీతమైన మోకాళ్లనొప్పులతో బాధపడుతున్న వాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయకూడదు.
Comments
Please login to add a commentAdd a comment