
సాధారణ మహిళల నుంచి సెలబ్రిటీల వరకు 'అమ్మ' అని పిలుచుకోవాలని తహతహలాడతారు. పిల్లల కోసం ఎంతో ప్రయత్నిస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించక అమ్మ అనే మాధుర్యాన్ని పొందలేని మహిళల బాధ వర్ణణాతీతం.
Actress Sharon Stone Reveals She Lost 9 Childrens By Miscarriage: సాధారణ మహిళల నుంచి సెలబ్రిటీల వరకు 'అమ్మ' అని పిలుచుకోవాలని తహతహలాడతారు. పిల్లల కోసం ఎంతో ప్రయత్నిస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించక అమ్మ అనే మాధుర్యాన్ని పొందలేని మహిళల బాధ వర్ణణాతీతం. మరి అలాంటిది గర్భస్రావం వల్ల ఏకంగా తొమ్మిది సార్లు పిల్లలను కోల్పోతే. ఇక వారి ఆవేదన గురించి ఎంత చెప్పిన తక్కువే. అలాంటి బాధను అనుభవించింది 64 ఏళ్ల ఒకప్పటి స్టార్ హీరోయిన్ షరాన్ స్టోన్.
ఈ అమెరికన్ నటి షరాన్ స్టోన్ 'బేసిక్ ఇన్‌స్టింక్ట్' సినిమా సిరీస్ ద్వారా అత్యధిక పాపులారిటీని సంపాదించుకుంది. తాజాగా తాను 9 మంది పిల్లలను కోల్పోవడం గురించి తెలిపింది. 'నేను గర్భస్రావం వల్ల తొమ్మిది మంది పిల్లలను కోల్పోయాను. ఇదేం చిన్న విషయం కాదు. శారీరకంగా, మానసికంగా నేను అనుభవించాను. మహిళలుగా మాకు ఈ నష్టం గురించి మాట్లాడేందుకు పదాలు లేవు. ఒకరకమైన ఓటమి భావనతో ఒంటరిగా, రహస్యంగా భరించాల్సిన విషయం. కానీ దీనికి బదులు కాస్తా సానుభూతి, ప్రేమ, కనికరం అవసరం.' అని తెలిపింది.
(చదవండి: నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్)
షరాన్ స్టోన్ తన మొదటి గర్భస్రావం గురించి 'అలా జరిగినందుకు నేను ఎంతో సిగ్గుపడ్డాను. ఎంతో అవమానకరంగా అనిపించింది. దాని గురించి ఎలా చెప్పాలో నా నోటి నుంచి మాటలు కూడా రావట్లేదు. నిజానికి నా ఆరోగ్యం పట్ల గర్వంగా ఉంటాను. ఎందుకంటే నేను ప్రతిరోజూ వ్యాయామం చేస్తాను. కానీ నాకు తెలిసినంత వరకు పునురుత్పత్తి కోసం అది అంతగా సహాయపడలేదనుకుంటా.' అని పేర్కొంది.
(చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం
నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ?)