నేను డేటింగ్‌కి రెడీ! | 'I'm ready for dating | Sakshi
Sakshi News home page

నేను డేటింగ్‌కి రెడీ!

Published Sat, Jul 12 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

నేను డేటింగ్‌కి రెడీ!

నేను డేటింగ్‌కి రెడీ!

ప్రేమించడానికే కాదు, డేటింగ్ చేయడానికి కూడా వయసుతో పనిలేదంటున్నారు షరాన్ స్టోన్. ఈ హాలీవుడ్ హాట్ లేడీ వయసు ఇప్పుడు 56 ఏళ్లు. మంచి వయసులో ఉన్నప్పుడు ఎంత హాట్‌గా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు షరాన్. అందుకేనేమో డేటింగ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘నేను డేటింగ్ చేయడానికి రెడీ’ అని బాహాటంగా ప్రకటించి, చాలామందికి స్వీట్ షాకిచ్చారామె. చక్కగా ఇంటిపట్టున ఉండి పిల్లలతో కాలక్షేపం చేసుకోకుండా, ఇలాంటి పనులేంటి? అని కొంతమంది అంటున్నారు.
 
కానీ, డేటింగ్ చేయడానికి ఈ వయసే కరెక్ట్ అంటున్నారు షరాన్. ‘‘ఇప్పుడు నా పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్ల బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించుకోగలరు. అందుకని, నేను రిలీఫ్ అయ్యాను. పిల్లలకు చిన్నప్పుడు     నా అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నా ఎంజాయ్‌మెంట్స్‌ని పక్కనపెట్టా. ఇప్పుడా అవసరం లేదు. అందుకే, నచ్చిన వ్యక్తితో డేటింగ్ చేయాలనుకుంటున్నా’’ అని అసలు విషయాన్ని చెప్పారు షరాన్. ఈవిడగారు ఇలా ప్రకటించగానే..     ఎలాగైనా షరాన్ మనసు గెల్చుకోవాలని హాలీవుడ్‌లో చాలామంది ఆరాటపడుతున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement