
Pop Singer Britney Spears Shares Heartbreaking Note: త్వరలోనే శుభవార్త చెబుతుందనుకున్న పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల తాను తల్లి కాబోతున్నట్లు బ్రిట్నీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగిపోయారు. కానీ, అంతలోనే బిడ్డను కొల్పోయానంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ భావోద్యేగ పోస్ట్‌ను షేర్ చేసింది. ‘మేం మా బిడ్డను కోల్పోయాం. మా జీవితంలో విషాదంలో నెలకొంది. ఇది తల్లిదండ్రులగా మాకు ఎంతో కఠిన సమయం.
చదవండి: సమంత ‘ఊ అంటావా..’ పాట సింగర్‌కు గోల్డ్ మెడల్!
రిలేషల్‌లో ఒక అడుగకు ముందుకేళ్లి కుటుంబాన్ని విస్తరించుకోవాలని ఎన్నో కలలు కన్నాం. మా తొలి బిడ్డను ఈ లోకానికి పరిచయం చేయాలని ఎంతో ఆత్రుతుగా ఎదురు చూశాం. కానీ అంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. నాకు గర్భస్రావం జరిగింది. ఈ కఠిన సమయంలో మాకు సపోర్టు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే మా ప్రైవసిని కూడా గౌరవిస్తారని కోరుకుంటున్నాం’ అంటూ ఆమె పోస్ట్ షేర్ చేసింది. కాగా బ్రిట్నీ ఇటీవల తన ప్రెగ్నెన్సీ ప్రకటిస్తూ త్వరలోనే తన ఫియాన్సీ సామిని పెళ్లి చేసుకోబుతున్నట్లు ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే.
చదవండి: కరాటే కల్యాణితో పెట్టుకున్నాడు, బిగ్‌బాస్ ఛాన్స్ పట్టేశాడు!