Pop Singer Britney Spears Shares Naked Photos In Social Media Ahead Marriage, See Fans Reaction - Sakshi
Sakshi News home page

Britney Spears: త్వరలో పెళ్లి, ఇంతలో నగ్న ఫొటోలు షేర్‌ చేసిన సింగర్‌

May 11 2022 9:34 PM | Updated on May 12 2022 11:03 AM

Pop Singer Britney Spears Shares Naked Photos On Instagram - Sakshi

పాప్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌ గురించి తెలియనివారుండరు. తన గాత్రంతో కోట్లాదిమంది మనసులు గెలుచుకున్న ఈ గాయని సుమారు 13 ఏళ్ల పాటు తండ్రి సంరక్షణలోనే జీవితాన్ని గడిపింది. దీనిపై కోర్టులో గట్టిగా పోరాడిన బ్రిట్నీ ఎట్టకేలకు కేసు గెలిచి గతేడాది  తండ్రి చెర నుంచి విముక్తి పొందింది.

ఇదిలా ఉంటే బ్రిట్నీ గతంలో వెకేషన్‌ సమయంలో దిగిన ఫొటోలను మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తోంది. తను గర్భం దాల్చిన తొలినాళ్లలో నగ్నంగా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 'నా కడుపులో బేబీ ఉన్నప్పుడు, నేను మెక్సికోలో ఉన్న సమయంలో దిగిన పొటో ఇది..' అంటూ దానికి క్యాప్షన్‌ ఇచ్చింది. ఒంటి మీద నూలు పోగు లేకుండా, కేవలం చేతులతో శరీరాన్ని దాచుకుంటూ దర్శనమిచ్చిన ఫొటోలను చూసి ఫ్యాన్స్‌ ఒక్కసారిగా షాకవుతున్నారు.

'మరీ ఇలా తయారవుతుందేంటి? ఒంటి మీద బట్టలు లేకుండా ఫొటోలు షేర్‌ చేయడమేంటి?' అని అసహనానికి లోనవుతున్నారు. 'తన మానసిక స్థితి సరిగా లేదేమో, అందువల్లే ఆమె తండ్రి బ్రిట్నీని ఇన్నేళ్లు సంరక్షణలో ఉంచుకున్నాడు కాబోలు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే బ్రిట్నీ త్వరలోనే తన ప్రియుడు సామ్‌ను పెళ్లాడబోతోంది. ఇందుకోసం డోనటెల్లా వెర్సాస్‌ తన పెళ్లి గౌనును తయారు చేస్తున్నాడని తెలిపింది.

చదవండి: కంటికి ఆపరేషన్‌, అందుకే నెలరోజుల నుంచి దూరం..

గ్రాండ్‌గా హీరోయిన్‌ సంజన సీమంతం, వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement