బుల్లితెర నటి, యాంకర్ సమీరా (Sameera Sherief) విషాద వార్తను పంచుకుంది. మరోసారి తల్లి కాబోతున్నానన్న ఆనందం తనకు ఎంతోకాలం నిలవలేదంది. కడుపులోనే బిడ్డ కన్నుమూసిందంటూ ఏడ్చేసింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించింది. నేను మొదటిసారి 2020లో తొలిసారి గర్భం దాల్చాను. ఆ సమయంలో నేను మిస్టర్ అండ్ మిసెస్ చిన్నతిరై అనే రియాలిటీ షో చేస్తున్నాను.
తొలిసారి గర్భస్రావం
షూటింగ్ అయిపోయాక హాస్పిటల్‌కు వెళ్దామనుకున్నాను. చెన్నైకి చేరుకోగానే తీవ్ర రక్తస్రావమైంది (Miscarriage). ఫస్ట్ ప్రెగ్నెన్సీలో గర్భస్రావమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్స్ చెప్పారు. అలా మొదటి బిడ్డనే కోల్పోయాను. దేవుడి దయ వల్ల ఏడాది తిరగకముందే మరోసారి గర్భం దాల్చాను. 2021 జనవరిలో ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాను.. అలా అర్హాన్ పుట్టాడు.
అంతా బాగుందని తెలిసి..
2023 నవంబర్‌లో మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను. ఇంట్లో అందరూ ఎగ్జయిట్ అయ్యారు. అర్హాన్ అయితే నా కడుపులో బిడ్డతో మాట్లాడేవాడు. రెండుసార్లు స్కానింగ్‌కు వెళ్లినప్పుడు బేబీ బాగుందన్నారు. పన్నెండోవారంలో మరోసారి స్కానింగ్‌కు వెళ్లాను. ఎనిమిదో వారంలోనే బిడ్డ ఎదుగుదల ఆగిపోయింది. తన గుండె కొట్టుకోవడం లేదని డాక్టర్ చెప్పింది.
నాలుగువారాలు ప్రాణం లేని బిడ్డను మోశా
అంటే నాలుగువారాల నుంచి బేబీ నా పొట్టలోనే ఉంది. నన్ను వదిలి వెళ్లాలనుకోవడం లేదు. మా కలలు కుప్పకూలిపోయినట్లనిపించింది. ఎంతగానో ఏడ్చాము. ఈ లోకంలో ఆ బిడ్డతో నేను కలిసిలేకపోయినా చనిపోయిన తర్వాత మాత్రం మళ్లీ తనను కలుస్తాను. డిసెంబర్ 31న టాబ్లెట్స్ ద్వారా గర్భంలోని శిశువును తీసేశాం అని చెప్తూ ఎమోషనలైంది.
ఎవరీ సమీరా?
నటి సమీరా ఆడపిల్ల అనే సీరియల్‌తో పాపులారిటీ తెచ్చుకుంది. అభిషేకం, ముద్దు బిడ్డ, భార్యామణి, మూడు ముళ్ల బంధం.. ఇలా ఎన్నో సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత ‘అదిరింది’ షోకి కొద్ది రోజులుపాటు యాంకర్‌గానూ పని చేసింది. అనంతరం సడన్‌గా బుల్లితెరకు దూరమైపోయింది. సమీరా 2019లో అన్వర్ జాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీరికి 2021లో బాబు పుట్టాడు.
చదవండి: గతేడాది ఒకేచోట సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈసారి మాత్రం!
Comments
Please login to add a commentAdd a comment