TV Actress Sameera Sherief Shares Home Tour Video in Telugu - Sakshi
Sakshi News home page

Sameera Sherief: నటి సమీరా ఇల్లు చూశారా? ఒక్క అవార్డు కూడా కనిపించదు!

Published Fri, Apr 1 2022 9:28 AM | Last Updated on Fri, Apr 1 2022 10:08 AM

TV Actress Sameera Sherief Shares Home Tour Video - Sakshi

బుల్లితెర ఆడియన్స్‌కు నటి సమీరా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆడపిల్ల, అభిషేకం, భార్యామణి, ముద్దు బిడ్డ, మూడుముళ్ల బంధం, మంగమ్మగారి మనవరాలు, తోటికోడలు.. ఇలా ఎన్నో సీరియల్స్‌లో నటించిందామె. ఓ పక్క సీరియల్స్‌ చేస్తూనే అడపాదడపా షోలలోనూ పాల్గొంటోంది సమీరా. 'పాగల్‌ నిలవు' సీరియల్‌తో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె అదే సీరియల్‌లో నటించిన అన్వర్‌ను పెళ్లాడింది. వీరికి గతేడాది ఓ బాబు జన్మించాడు.

తాజాగా ఆమె హైదరాబాద్‌లోని తన ఇంటిని చూపిస్తూ హోమ్‌ టూర్‌ వీడియో చేసింది. తన కష్టార్జితానికి ప్రతిరూపమే ఈ ఇల్లని, ఇందులో తన పేరెంట్స్‌తో కలిసి ఉన్నానని, తన పెళ్లి, తన చెల్లి పెళ్లి కూడా ఈ ఇంట్లోనే జరిగిందని తెలిపింది. తన ఇంట్లో మూడు బెడ్‌రూమ్‌లు ఉన్నాయంది సమీరా. ముందుగా తన బెడ్‌రూమ్‌ను అంతా కలియతిరిగి చూపించింది. తన కొడుకు కోసం బేబీ మానిటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మరో గదిని పరిస్థితులను బట్టి రకరకాలుగా వాడుతున్నామని చెప్పింది. ప్రస్తుతానికైతే దాన్ని స్టోర్‌ రూమ్‌లా మార్చామంది. మరో బెడ్‌రూమ్‌ తన తల్లిదండ్రులదని చెప్పింది. తనకు వచ్చిన అవార్డులను షోకేజీలా బయట పెట్టినని, దాన్ని ఓ బ్యాగ్‌లో పెట్టేసి అటక మీద పెట్టేస్తానంది. ఎందుకంటే అవార్డుల కన్నా మంచి ప్రశంసలే తనకు విలువైనవని పేర్కొంది.

చదవండి: కోట్లలో మోసపోయిన హీరోయిన్‌ రిమీ సేన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement