తీవ్ర రక్తస్రావం, ప్రాణానికే ప్రమాదమన్నారు: సీరియల్‌ నటి | Serial Actress Gowriraj Reveals About Shocking Reason Behind Why She Quit Serials, Video Viral - Sakshi
Sakshi News home page

Gowri Raj: మూడుసార్లు ప్రెగ్నెన్సీ ఫెయిల్‌, డిప్రెషన్‌.. అందుకే సీరియల్స్‌కు గుడ్‌బై..

Published Sat, Oct 21 2023 3:30 PM | Last Updated on Sat, Oct 21 2023 3:57 PM

Serial Actress Gowriraj Reveals About Shocking Reason Behind Why She Quit Serials, Video Viral - Sakshi

బుల్లితెర నటి గౌరీ రాజ్‌ ఉన్నట్లుండి సీరియల్స్‌ మానేసింది. ప్రేమ ఎంత మధురంలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించిన గౌరీ బెస్ట్‌ విలన్‌గా అవార్డు సైతం అందుకుంది. మల్లి సీరియల్‌ ద్వారా కూడా తగినంత గుర్తింపు సంపాదించుకుంది. కానీ సడన్‌గా యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసింది. కొంతకాలంగా ఆమె ఏ సీరియల్‌లోనూ కనిపించడం లేదు. అందుకు గల కారణాన్ని తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో వెల్లడించింది నటి.

తీవ్ర రక్తస్రావం.. ప్రెగ్నెన్సీ అని తెలీక..
గౌరీ రాజ్‌ మాట్లాడుతూ.. 'ఒక నటిగా సీరియల్స్‌, సినిమాలు చేయాలని నా కోరిక. కానీ సడన్‌గా యాక్టింగ్‌ ఎందుకు మానేశాననేది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో నేను నెల తప్పాను. కానీ నేను ప్రెగ్నెంట్‌ అన్న విషయం నాకూ తెలియదు. అప్పుడు సీరియల్‌లో చాలా ఫైటింగ్‌ సీన్లలో నటించాను. ఆ తర్వాత నాకు 20-25 రోజులపాటు తీవ్ర రక్తస్రావం జరిగింది. అయినా పెద్దగా పట్టించుకోలేదు. ప్రెగ్నెన్సీ అని తెలియక లైట్‌ తీసుకున్నాను. కడుపు నొప్పి ఉన్నప్పటికీ షూటింగ్‌లో పాల్గొనేదాన్ని.

సడన్‌గా ఐసీయూకు తీసుకెళ్లారు
ఓసారి నొప్పి ఎక్కువ కావడంతో ఆస్పత్రికి వెళ్లాను. అప్పటికే చాలా ఆలస్యం చేశాను. స్కానింగ్‌లో నేను గర్భం దాల్చానని చెప్పారు. తల్లి కాబోతున్నానని సంతోషపడ్డాను. తర్వాతి రోజు నేను రెడీ అయి షూటింగ్‌కు వెళ్తుంటే నా భర్త నన్ను ఆపేసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నాకు టెస్టులు, స్కానింగ్‌ చేశారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పటికే డాక్టర్‌ నా ఫ్యామిలీతో మాట్లాడారు. వీళ్లంతా డల్‌గా ఉన్నారు. కానీ నాకు ఏదీ చెప్పలేదు. ఇంతలో ఐసీయూకు తీసుకెళ్లారు. ఏం జరుగుతోందని నిలదీశాను.

సర్జరీ వల్ల నిలబడలేకపోయా..
దానికి డాక్టర్స్‌.. లోపల ఉన్న శిశువు బ్లాస్ట్‌ అయింది. శరీరమంతా ముక్కలు ముక్కలుగా ఛిద్రమైపోయింది. అది తీయకపోతే నీ ప్రాణానికే ప్రమాదం అన్నారు. సర్జరీతో పాటు లాపరోస్కోపీ చేశారు. ఇలా ప్రెగ్నెన్సీ పోవడం రెండోసారి. నరకం అనుభవించాను. అయినా ఆ డిప్రెషన్‌ నుంచి బయటపడి మళ్లీ నా పనిపై ధ్యాస పెట్టాను. కానీ సర్జరీ వల్ల ఎక్కువసేపు నిలబడలేకపోయాను. అందుకే కొంతకాలానికే రెండు సీరియల్స్‌ మానేశాను. ఆ సమయంలో ఉత్తమ విలన్‌గా అవార్డు వచ్చింది. అప్పుడు చాలా సంతోషపడ్డాను. 

ఎంతమంది పిల్లలని అడుగుతున్నారు..
అయితే ఒక్క సీరియల్‌ మాత్రం చేస్తూ పోయాను. కానీ ఇక్కడ కూడా మూడో ప్రెగ్నెన్సీ పోయింది. అది ముందుగానే గుర్తించగలిగాం కాబట్టి ఇంజక్షన్‌తోనే బయటకు వెళ్లిపోయింది. డాక్టర్‌ ఈసారైనా విశ్రాంతి తీసుకోమని హెచ్చరించాడు. ఇప్పుడు ఏ సీరియల్‌ కూడా చేయడం లేదు  అయితే మూడుసార్లు ఇలా జరగడం, ఇంజక్షన్స్‌, మెడిసిన్స్‌ తీసుకోవడంతో కొంత లావైపోయాను. నాకు ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు? నాకు ముగ్గురు పిల్లలు.. ఆ ముగ్గురు దేవుడి దగ్గరే ఉన్నారు' అంటూ ఏడ్చేసింది గౌరీ రాజ్‌.

చదవండి: భగవంత్‌ కేసరి రెండు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement