ప్రముఖ హాలివుడ్ తార డెమీ మోర్ పేరు వినగానే ‘ఇండీసెంట్ ప్రపోజల్’ పేరు గుర్తుకు రాక తప్పదు. అదురు బెదురు లేకుండా రొమాంటిక్ చిత్రాల్లో నటించిన డెమీ మోర్ జీవితం కూడా ‘ఇండీసెంట్’గానే నడిచింది. ప్రస్తుతం 56 ఏళ్ల ఆమెపై 15వ ఏటనే అత్యాచారం జరిగిందట. అప్పుడు ఆమె లాస్ ఏంజెలిస్‌లోని ఫెయిర్ ఫాక్స్ హై స్కూల్లో చదువుకుంటున్నారట. 2004లో తన బాయ్‌ఫ్రెండ్ ఆష్టన్ కుచర్‌తో ప్రేమాయణంలో గర్భవతి అయిందట. కడుపులోని బిడ్డకు ఆరు నెలలు నిండగానే గర్భస్రావం అయిందట. దాంతో ఆమె మద్యానికి, డ్రగ్స్‌కు మరోసారి అలవాటు పడిందట. 2005లో భాయ్ ఫ్రెండ్ ఆష్టన్ కుచర్‌ను పెళ్లి చేసుకొని వైద్య చికిత్సల ద్వారా తల్లి అయ్యేందుకు ప్రయత్నించిందట. అయినా లాభం లేకపోవడంతో ఆ ప్రయత్నాలను విరమించిందట.
డెమీ మోర్‌కు 42 ఏళ్లు ఉన్నప్పుడు (2003లో) తనకంటే 15 ఏళ్లు చిన్నవాడయిన ఆష్టన్ కుచర్‌తో డేటింగ్ మొదలు పెట్టారట. అప్పుడే ఆమె గర్భవతి అయ్యారు. పుట్టబోయే పాపకు ‘చాప్లిన్ రే’ అని కూడా పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారట. 2004లో గర్భస్రావం అయ్యాక 2005లో ఆమె కుచర్‌ను పెళ్లి చేసుకున్నారట. మరి ఆమె యవ్వనంలో ఏం చేశారని ఎవరికైనా సందేహాలు రావచ్చు. డెమీ మోర్ తన 16వ ఏటనే ఓ గిటారిస్ట్‌తో సహ జీవనం చేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేశారట. ఆ తర్వాత రెండేళ్లకు గిటారిస్ట్‌ను వదిలేసి రాక్ మ్యుజీషియన్ ఫ్రెడ్డీ మోర్‌ను ప్రేమించారట. అప్పుడే ‘జనరల్ హాస్పటల్’, ‘లాస్ట్ నైట్’ లాంటి హాలివుడ్ చిత్రాల్లో నటించే అవకాశం రావడం, వాటి ద్వారా పేరు రావడంతో మద్యానికి, కొకైన్‌కు బానిస అయ్యారట.
కొచర్ పరిచయం అయ్యాక మద్యానికి, డ్రగ్స్‌కు దూరమై సంతానం కోసం ప్రాధాన్యత ఇచ్చారట. కొచర్ తనను మోసం చేస్తున్నాడని గ్రహించి ఆయనతో 2011లో విడిపోయినప్పటికీ వారిద్దరికి 2013లో వారికి విడాకులు మంజూరయ్యారట. డెమీ మోర్ 1990 దశకంలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు బ్రూస్ విల్లీస్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాలను ఎవరో చెప్పడం లేదు. స్వయంగా డెమీ మోరే ‘ఇన్‌సైడ్ అవుట్’ అనే ఆత్మ కథలో చెప్పుకుంది. ఆ పుస్తకం ఈనెల 24వ తేదీన మార్కెట్లోకి వస్తోంది. బ్రూస్ విల్లీస్‌తో ఆమె ప్రేయాణం, అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోలేక పోయిందీ, ఆయన పిల్లలతో అనుబంధాన్ని ఎందుకు తెంచుకోవాల్సి వచ్చింది వంటి అంశాలు ఈ పుస్తకంలో ఉండే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment