Bruce Willis
-
చికిత్స లేని వ్యాధితో బాధపడుతున్న గోల్డెన్ గ్లోబ్ అవార్ట్ విన్నింగ్ నటుడు
చలన చిత్ర పరిశ్రమలో చాలా మంది నటీనటులు పలు అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొందరు క్యాన్సర్ వంటి హెరిడిటి వ్యాధి బారిన పడితే మరికొందరు అసలు చికిత్సే లేని అరుదైన సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో స్టార్ హీరోయిన్ సమంత, నటి కల్పిక గణేశ్, అనుష్క శెట్టితో పాటు పలువురు నటీనటులు ఉన్నారు. తాజాగా మరో దిగ్గజ నటుడు కూడా ఈ జాబితాలో చేరాడు. హాలీవుడ్ అగ్ర నటుడుల్లో ఒకరైన బ్రూస్ విల్లీస్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఫ్రాంటోటెంపోరల్ డెమెన్షియా వ్యాధి బారిన పడినట్లు తాజాగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 67 ఏళ్ల వయసున్న బ్రూస్ విల్లీస్ గతేడాది అనారోగ్యం కారణంగా నటనకు బ్రేక్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైన ఆయన తాజాగా ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా అనే మెదడు సంబంధిత అరుదైన వ్యాధితో బాధపడుతున్నారట. ఈ వ్యాధి బారిన పడినవారిలో పలు మానసికి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే దీనికి చికిత్స లేదని వైద్యులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం బ్రూస్ మానసిక పరిస్థితి బాగానే ఉందని, భవిష్యత్తులో కూడా ఆయన ఆరోగ్యం ఇదే విధంగా కానసాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నామంటూ ఆయన కుటుంబ సభ్యులు ట్వీట్ చేశారు. దీంతో ఆయన కోలుకోవాలని, క్షేమంగా ఉండాలని కోరుకుంటూ బ్రూస్ సహ నటీనటులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. కాగా ‘డై హార్డ్’ సినిమాలతో బ్రూస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. మూన్‌లైటింగ్ అనే టీవీ షో ద్వారా ఆయన బాగా పాపులర్ అయ్యాడు. తన కెరీర్లో బ్రూస్ ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, రెండు ఎమ్మీ అవార్డులను గెలుపొందారు. ఇంతకి ఈ ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే మెదడు కణాల్లో అసాధారణ రీతిలో ప్రోటీన్లు పేరుకుపోవడంతో ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా మెదడులోని ఫ్రాంటల్, టెంపోరల్ భాగాలు క్రమంగా కుచించుకుపోవడం ప్రారంభిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ.. రోగి ప్రవర్తనలో మార్పులు రావడం, చిరాకు, కోపం, భాషాపరమైన సమస్యలు తలెత్తడం, నడకలో సమతౌల్యం కోల్పోవడం, ఇతర మానసిక సమస్యలు తలెత్తుతాయి. -
వింత వ్యాధి వల్ల సినిమాలకు గుడ్‌బై చెప్పిన స్టార్
హాలీవుడ్ స్టార్ బ్రూస్ విలీస్ నటనకు గుడ్‌బై చెప్పాడు. అఫాసియా వ్యాధి వల్ల అతడు సినిమాలకు దూరమవుతున్నట్లు కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వెల్లడించారు. బ్రూస్ అభిమానులకు ఓ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. అతడు అనారోగ్యంతో సతమతమవుతున్నాడు. ఇటీవలే అఫాసియా వ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధి వల్ల అతడు సరిగా మాట్లాడలేడు. అందువల్ల బ్రూస్ తన యాక్టింగ్ కెరీర్ నుంచి తప్పుకుంటున్నాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో మీరందిస్తున్న ప్రేమాభిమానాలకు సంతోషిస్తున్నాము అని ఓ లేఖ విడుదల చేశారు. కాగా అఫాసియా అనేది ఒక భాషా రుగ్మత. ఈ వ్యాధి వల్ల పదాలను కనుగొనడంలో ఇబ్బంది నుంచి మాట్లాడే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మెదడులోని ఓ భాగం దెబ్బతినడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఇదిలా ఉంటే బ్రూస్ 'ది ఫస్ట్ డెడ్లీ సిన్' చిత్రంలో ఓ చిన్నపాత్రతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. డై హార్డ్ సిరీస్‌లో ఒకటైన 'మెక్లేన్' మూవీతో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. 'ది ఫిఫ్త్ ఎలిమెంట్', 'అర్మగెడన్', 'ది సిక్త్ సెన్స్', 'ది లాస్ట్ బాయ్ స్కౌట్', 'డెత్ బికమ్స్ హర్', 'పల్ప్ ఫిక్షన్', '12 మంకీస్' వంటి పలు హిట్ సినిమాల్లో నటించాడు. బ్రూస్ చివరగా 'ఎ డే టు డై' మూవీలో నటించగా ఇది మార్చిలో రిలీజైంది. View this post on Instagram A post shared by Rumer Willis (@rumerwillis) చదవండి: ఫొటోలు తీసేందుకు ఇంట్లోకి వచ్చిన మీడియా, క్లాస్ పీకిన ప్రియుడు -
15వ ఏట అత్యాచారం.. నటి సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ హాలివుడ్ తార డెమీ మోర్ పేరు వినగానే ‘ఇండీసెంట్ ప్రపోజల్’ పేరు గుర్తుకు రాక తప్పదు. అదురు బెదురు లేకుండా రొమాంటిక్ చిత్రాల్లో నటించిన డెమీ మోర్ జీవితం కూడా ‘ఇండీసెంట్’గానే నడిచింది. ప్రస్తుతం 56 ఏళ్ల ఆమెపై 15వ ఏటనే అత్యాచారం జరిగిందట. అప్పుడు ఆమె లాస్ ఏంజెలిస్‌లోని ఫెయిర్ ఫాక్స్ హై స్కూల్లో చదువుకుంటున్నారట. 2004లో తన బాయ్‌ఫ్రెండ్ ఆష్టన్ కుచర్‌తో ప్రేమాయణంలో గర్భవతి అయిందట. కడుపులోని బిడ్డకు ఆరు నెలలు నిండగానే గర్భస్రావం అయిందట. దాంతో ఆమె మద్యానికి, డ్రగ్స్‌కు మరోసారి అలవాటు పడిందట. 2005లో భాయ్ ఫ్రెండ్ ఆష్టన్ కుచర్ను పెళ్లి చేసుకొని వైద్య చికిత్సల ద్వారా తల్లి అయ్యేందుకు ప్రయత్నించిందట. అయినా లాభం లేకపోవడంతో ఆ ప్రయత్నాలను విరమించిందట. డెమీ మోర్‌కు 42 ఏళ్లు ఉన్నప్పుడు (2003లో) తనకంటే 15 ఏళ్లు చిన్నవాడయిన ఆష్టన్ కుచర్‌తో డేటింగ్ మొదలు పెట్టారట. అప్పుడే ఆమె గర్భవతి అయ్యారు. పుట్టబోయే పాపకు ‘చాప్లిన్ రే’ అని కూడా పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారట. 2004లో గర్భస్రావం అయ్యాక 2005లో ఆమె కుచర్ను పెళ్లి చేసుకున్నారట. మరి ఆమె యవ్వనంలో ఏం చేశారని ఎవరికైనా సందేహాలు రావచ్చు. డెమీ మోర్ తన 16వ ఏటనే ఓ గిటారిస్ట్తో సహ జీవనం చేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేశారట. ఆ తర్వాత రెండేళ్లకు గిటారిస్ట్ను వదిలేసి రాక్ మ్యుజీషియన్ ఫ్రెడ్డీ మోర్‌ను ప్రేమించారట. అప్పుడే ‘జనరల్ హాస్పటల్’, ‘లాస్ట్ నైట్’ లాంటి హాలివుడ్ చిత్రాల్లో నటించే అవకాశం రావడం, వాటి ద్వారా పేరు రావడంతో మద్యానికి, కొకైన్కు బానిస అయ్యారట. కొచర్ పరిచయం అయ్యాక మద్యానికి, డ్రగ్స్‌కు దూరమై సంతానం కోసం ప్రాధాన్యత ఇచ్చారట. కొచర్ తనను మోసం చేస్తున్నాడని గ్రహించి ఆయనతో 2011లో విడిపోయినప్పటికీ వారిద్దరికి 2013లో వారికి విడాకులు మంజూరయ్యారట. డెమీ మోర్ 1990 దశకంలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు బ్రూస్ విల్లీస్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాలను ఎవరో చెప్పడం లేదు. స్వయంగా డెమీ మోరే ‘ఇన్సైడ్ అవుట్’ అనే ఆత్మ కథలో చెప్పుకుంది. ఆ పుస్తకం ఈనెల 24వ తేదీన మార్కెట్లోకి వస్తోంది. బ్రూస్ విల్లీస్‌తో ఆమె ప్రేయాణం, అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోలేక పోయిందీ, ఆయన పిల్లలతో అనుబంధాన్ని ఎందుకు తెంచుకోవాల్సి వచ్చింది వంటి అంశాలు ఈ పుస్తకంలో ఉండే అవకాశం ఉంది. -
'నా కూతురు సమస్యలకు నేనే కారణం'
నా కూతురి సమస్యలకు తానే కారణమని హాలీవుడ్ నటి డెమీ మూర్ అన్నారు. మద్యం, డ్రగ్స్ కు బానిసైన తన కూతురు తల్లులా వాటి నుంచి బయటపడేందుకు రిహాబిలిటేషన్ సెంటర్ లో చేరింది. తన భర్త అష్టన్ కుచ్చర్ తో విడిపోయి.. తాను సమస్యల్లో కూరుకుపోయానని మూర్ అన్నారు. ప్రస్తుతం ఓ రిహాబిలిటేషన్ సంస్థలో చికిత్స పొందుతున్న తన కూతురు పరిస్థితి మెరుగు పడుతోందని డేమీ మూర్ తెలిపారు. సమస్యలతో బాధపడుతున్న తన తల్లికి పెద్ద కూతురు రుమెర్ బాసటగా నిలిచింది. త్వరలోనే తన తల్లి, చెల్లి సమస్యల నుంచి బయటపడుతారనే ఆశాభావంతో రుమెర్ ఉన్నారు. డేమీ మూర్ కు బ్రూస్ విల్లీస్ ద్వారా కలిగిన మరో కూతురు స్కౌట్ కూడా ఉన్నారు.