హాలీవుడ్ స్టార్ బ్రూస్ విలీస్ నటనకు గుడ్‌బై చెప్పాడు. అఫాసియా వ్యాధి వల్ల అతడు సినిమాలకు దూరమవుతున్నట్లు కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వెల్లడించారు. బ్రూస్ అభిమానులకు ఓ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. అతడు అనారోగ్యంతో సతమతమవుతున్నాడు. ఇటీవలే అఫాసియా వ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధి వల్ల అతడు సరిగా మాట్లాడలేడు. అందువల్ల బ్రూస్ తన యాక్టింగ్ కెరీర్ నుంచి తప్పుకుంటున్నాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో మీరందిస్తున్న ప్రేమాభిమానాలకు సంతోషిస్తున్నాము అని ఓ లేఖ విడుదల చేశారు. కాగా అఫాసియా అనేది ఒక భాషా రుగ్మత. ఈ వ్యాధి వల్ల పదాలను కనుగొనడంలో ఇబ్బంది నుంచి మాట్లాడే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మెదడులోని ఓ భాగం దెబ్బతినడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది.
ఇదిలా ఉంటే బ్రూస్ 'ది ఫస్ట్ డెడ్లీ సిన్' చిత్రంలో ఓ చిన్నపాత్రతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. డై హార్డ్ సిరీస్‌లో ఒకటైన 'మెక్‌లేన్' మూవీతో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. 'ది ఫిఫ్త్ ఎలిమెంట్', 'అర్మగెడన్', 'ది సిక్త్ సెన్స్', 'ది లాస్ట్ బాయ్ స్కౌట్', 'డెత్ బికమ్స్ హర్', 'పల్ప్ ఫిక్షన్', '12 మంకీస్' వంటి పలు హిట్ సినిమాల్లో నటించాడు. బ్రూస్ చివరగా 'ఎ డే టు డై' మూవీలో నటించగా ఇది మార్చిలో రిలీజైంది.
చదవండి: ఫొటోలు తీసేందుకు ఇంట్లోకి వచ్చిన మీడియా, క్లాస్ పీకిన ప్రియుడు
Comments
Please login to add a commentAdd a comment