Hollywood star
-
ప్రేయసితో సహజీవనం.. ఆమె ప్రెగ్నెన్సీపై డౌట్ పడ్డ నటుడు!
ప్రముఖ హాలీవుడ్ స్టార్, గాడ్ ఫాదర్ ఫేమ్ అల్ పాసినో 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే! అయితే ఈ వయసులో తను తండ్రిగా ప్రమోషన్ పొందడాన్ని నమ్మలేకపోయాడట. తనకు పిల్లలు పుట్టే సామర్థ్యం ఉందా? అని ఆలోచనలో పడ్డాడట! ఈ క్రమంలో తన ప్రియురాలు నూర్ అల్ఫల్లా గర్భం దాల్చడంపై అనుమానం వ్యక్తం చేశాడట. తన కడుపులో ఉన్న బిడ్డకు డీఎన్ఏ డెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టాడట! దీంతో నూర్ కడుపులో ఉన్న బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు చేయించగా.. ఈ రిపోర్టులో అల్ పాసినోయే తండ్రి అని వెల్లడైనట్లు తెలుస్తోంది. అంటే ఈ హాలీవుడ్ స్టార్ 83 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నారు. కానీ అతడి ప్రియురాలు నూర్ అల్ఫల్లా మాత్రం మొదటిసారి తల్లి కాబోతోంది. కాగా అల్ పాసినో గతంలో మీటల్ దోహన్, జాన్ టరంట్, బెవెర్లీ డీఆంగెలోతో రిలేషన్స్ కొనసాగించాడు. ఈ క్రమంలో జాన్ టరంట్కు జూలీ మేరీ అనే కుమార్తె, బెవెర్లీ డీఆంగెలె కవలలకు జన్మనిచ్చింది. అయితే వీరిద్దరికీ బ్రేకప్ చెప్పిన తర్వాత అల్ పాసినో కోవిడ్ సమయంలో నూర్ అల్ఫల్లాతో లవ్‌లో పడ్డాడు. అప్పటినుంచి వీరు సహజీవనం చేస్తున్నారు. అల్ఫల్లా కూడా గతంలో రోలింగ్ స్టోన్స్ సింగర్ మిక్ జాగర్‌తో డేటింగ్ చేయగా 2018లో బ్రేకప్ చెప్పింది. చదవండి: హీరోయిన్‌తో లవ్.. ముద్దు ఫోటో షేర్ చేసిన నటుడు -
అల్లా వుద్దీన్ కమెడియన్ కన్నుమూత
హాస్యనటుడు గిల్బర్ట్ గాట్ఫ్రెడ్(67) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణించిన విషయాన్ని అతడి కుటుంబసభ్యులు మంగళవారం ధృవీకరించారు. ఆయన మరణం మాకు తీరని లోటు అంటూ పలువురు హాలీవుడ్ ప్రముఖులు గాట్ఫ్రెడ్కు నివాళులు అర్పిస్తున్నారు. కాగా బ్రూక్లిన్‌లో జన్మించిన గాట్ఫ్రెడ్ న్యూయార్క్‌లో పెరిగారు. దేని గురించైనా కామెడీ చేసే తత్వం ఆయన్ను కమెడియన్‌గా నిలబెట్టింది. గాట్ఫ్రెడ్ అన్ని అంశాల మీద కూడా కామెడీ చేసేవారు. 2001లో న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో దాడులు జరిగి సుమారు మూడు వేల మంది చనిపోగా దాని మీద కూడా చమత్కారాలు పేల్చారు. సునామీ, భూకంపాలు, వాటివల్ల జరిగే ప్రాణనష్టంపై కూడా జోక్స్ చేసేవారు. ఇదిలా ఉంటే గాట్ఫ్రెడ్.. యానిమేటెడ్ ఫిలిం అల్లా వుద్దీన్లో చిలుక పాత్రకు వాయిస్ అందించారు. చదవండి: రెండేళ్లు సహజీవనం..బ్రేకప్..20 ఏళ్లకు మళ్లీ పెళ్లి! టాస్క్ ఆడబోతున్నారా? ఫస్ట్ నైట్‌కు పోతున్నారా?: అషూ -
వింత వ్యాధి వల్ల సినిమాలకు గుడ్‌బై చెప్పిన స్టార్
హాలీవుడ్ స్టార్ బ్రూస్ విలీస్ నటనకు గుడ్‌బై చెప్పాడు. అఫాసియా వ్యాధి వల్ల అతడు సినిమాలకు దూరమవుతున్నట్లు కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వెల్లడించారు. బ్రూస్ అభిమానులకు ఓ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. అతడు అనారోగ్యంతో సతమతమవుతున్నాడు. ఇటీవలే అఫాసియా వ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధి వల్ల అతడు సరిగా మాట్లాడలేడు. అందువల్ల బ్రూస్ తన యాక్టింగ్ కెరీర్ నుంచి తప్పుకుంటున్నాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో మీరందిస్తున్న ప్రేమాభిమానాలకు సంతోషిస్తున్నాము అని ఓ లేఖ విడుదల చేశారు. కాగా అఫాసియా అనేది ఒక భాషా రుగ్మత. ఈ వ్యాధి వల్ల పదాలను కనుగొనడంలో ఇబ్బంది నుంచి మాట్లాడే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మెదడులోని ఓ భాగం దెబ్బతినడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఇదిలా ఉంటే బ్రూస్ 'ది ఫస్ట్ డెడ్లీ సిన్' చిత్రంలో ఓ చిన్నపాత్రతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. డై హార్డ్ సిరీస్‌లో ఒకటైన 'మెక్లేన్' మూవీతో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. 'ది ఫిఫ్త్ ఎలిమెంట్', 'అర్మగెడన్', 'ది సిక్త్ సెన్స్', 'ది లాస్ట్ బాయ్ స్కౌట్', 'డెత్ బికమ్స్ హర్', 'పల్ప్ ఫిక్షన్', '12 మంకీస్' వంటి పలు హిట్ సినిమాల్లో నటించాడు. బ్రూస్ చివరగా 'ఎ డే టు డై' మూవీలో నటించగా ఇది మార్చిలో రిలీజైంది. View this post on Instagram A post shared by Rumer Willis (@rumerwillis) చదవండి: ఫొటోలు తీసేందుకు ఇంట్లోకి వచ్చిన మీడియా, క్లాస్ పీకిన ప్రియుడు -
నటుడు నిక్ కన్నుమూత
హాలీవుడ్ నటుడు నిక్ కార్డెరో (41) కరోనా కారణంగా మృతి చెందారు. కెనడా దేశానికి చెందిన నిక్ న్యూయార్క్‌లోని బ్రాడ్వే సంస్థలో రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ‘రాక్ ఆఫ్ ఏజెస్’, ‘బుల్లెట్ ఓవర్ బ్రాడ్వే’, ‘వెయిట్రస్’ తదితర నాటకాల్లో మంచి పాత్రలు చేశారు. ‘ఏ స్టాండప్ గై’, ‘గోయింగ్ ఇన్ స్టయిల్’, ‘ఇన్సైడ్ గేమ్’, ‘మాబ్‌టౌన్’ తదితర చిత్రాల్లో నటించారు. 2005 నుండి 2020 వరకూ టీవీ, థియేటర్, సినిమాలలో ఎన్నో రకాల పాత్రలతో మెప్పించారు. బుల్లితెర కోసం చేసినవాటిలో ‘బ్లూబ్లడ్స్’లో కనబర్చిన నటనకు నిక్ మంచి మార్కులు తెచ్చుకున్నారు. నిక్ మరణం పట్ల ఆయన సతీమణి అమందా క్లూట్స్ తన బాధను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘‘కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించే నిక్ లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. అందరితో స్నేహంగా ఉండేవాడు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేసేవాడు. అద్భుతమైన నటుడే కాదు గొప్ప సంగీత దర్శకుడు కూడా. 95 రోజులు ఆçస్పత్రిలో పోరాటం సాగించి, నిక్ తనువు చాలించాడు. డియర్ నిక్.. ప్రతిరోజూ నేను, మన బిడ్డ ఎల్విస్ నిన్ను మిస్ అవుతూనే ఉంటాం’’ అని పేర్కొన్నారు అమందా క్లూట్స్. -
హాలీవుడ్ లెజండరీ నటుడు కన్నుమూత
హాలీవుడ్ లెజండరీ నటుడు, దర్శకుడు బుర్ట్ రెనాల్డ్స్ (82) గురువారం ఫ్లోరిడాలో కన్నుమూశారు. గుండెపోటు కారణంగా రెనాల్డ్స్ తుదిశ్వాస విడిచారని ఆయన మేనేజర్ ఎరిక్ క్రిట్జెర్ అధికారికంగా ప్రకటించారు. 1936లో పుట్టిన బర్ట్ రెనాల్డ్స్ హాలీవుడ్ మోస్ట్ పాపులర్ నటుల్లో ఒకడిగా గుర్తింపు పొందారు. గన్స్మోక్, బాక్ టెలివిజన్ సిరీస్‌లో పేరుతెచ్చకున్న బుర్ట్ 1970 లో భారీ బాక్స్ ఆఫీస్ ఆకర్షణగా నిలిచిన బర్ట్ రెనాల్డ్స్, డెలివరెన్స్, బూగీ నైట్స్ మూవీల పాత్రలతో మంచి పేరు సంపాదించారు. అలాగే లాంగెస్ట్ యార్డ్, బూగీ నైట్స్, స్మోకీ అండ్ ది బాండిట్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధించాయి. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత రెనాల్డ్స్ దర్శకత్వాన్ని కూడా చేపట్టారు. అనంతరం ఆయన ఫ్లోరిడాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ను కూడా స్థాపించారు. మై లైఫ్ (1994) ఎనఫ్ అబౌట్ మి (2015) లో రాశారు. రెనాల్డ్స్మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆయన రెండు ఆటోబయోగ్రఫీలను కూడా తీసుకొచ్చారు. ఆర్నాల్డ్, స్టీవ్ హార్వే, రెబా తదితర హాలీవుడ్ ప్రముఖులు రెనాల్డ్స్ ఆకస్మిక మరణంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. Burt Reynolds was one of my heroes. He was a trailblazer. He showed the way to transition from being an athlete to being the highest paid actor, and he always inspired me. He also had a great sense of humor - check out his Tonight Show clips. My thoughts are with his family. — Arnold (@Schwarzenegger) September 6, 2018 Very sad to hearing about the passing of Burt Reynolds. He was a great actor, a philanthropist and a pioneer of the cool mustache. Thank you, Burt. You will be missed. pic.twitter.com/nuuFWMSnJg — Steve Harvey (@IAmSteveHarvey) September 6, 2018 My good friend has started a new journey. Rest in my peace my friend. I’ll never forget the wonderful times we spent together. #BurtReynolds pic.twitter.com/DXzIchYDjl — Reba (@reba) September 6, 2018 -
నన్ను చంపాలని అనుకున్నారు: స్టార్ నటి
‘ఆరోజు ఆ షూటింగ్ స్పాట్లో, ఆ యాక్సిడెంట్‌తో నన్ను చంపాలనుకున్నారు..’ అంటూ హాలీవుడ్ స్టార్ ఉమా థర్మన్ ఇచ్చిన స్టేట్మెంట్ వారం రోజులుగా సంచలనం సృష్టిస్తోంది. ఆమె తనను చంపాలనుకున్నట్టు చెబుతూ ప్రకటించిన పేర్లలో హాలీవుడ్ టాప్ స్టార్ డైరెక్టర్ క్వెంటీన్ టరంటీనో ఉండడం ఇక్కడ చర్చకు కారణమైంది. దాదాపు పదిహేనేళ్ల కిందట జరిగిన యాక్సిడెంట్ అది. ఇప్పుడు చర్చ జరుగుతున్నది దాని మీదే. ఎలా జరిగిందీ యాక్సిడెంట్? క్వెంటిన్ టరంటీనో దర్శకత్వంలో ‘కిల్‌బిల్’ (2003) సినిమా తెరకెక్కుతోంది. అందులో ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఉమా థర్మన్ అడవిలో ఉన్న ఒక రోడ్ మీద వేగంగా కారు నడుపుతూ వెళ్లాలి. గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో థర్మన్ కారు నడుపుతూ చెట్ల మధ్యలోంచి దూసుకెళ్తోంది. సడెన్‌గా ఓ దగ్గర మలుపొచ్చింది. ఆమె ఆ మలుపును చూసి కార్‌ను కంట్రోల్ చేస్కోలేక రోడ్డుకి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఆ యాక్సిడెంట్లో ఆమె మోకాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఉదర భాగానికి స్టీరింగ్ గట్టిగా ఢీ కొట్టింది. ప్రాణాలే పోయాయనుకుంది ఆ క్షణం. పదిహేనేళ్లు దాటినా థర్మన్‌ను ఆ గాయాలింకా బాధపెడుతూనే ఉన్నాయి. థర్మన్ ఏమంటోందంటే.. హార్వీ వెయిన్‌స్టీన్ అనే నిర్మాతపై లైంగిక ఆరోపణలు రావడం, తద్వారా ‘మీటూ’ అన్న ఒక ఉద్యమమే పుట్టడం గతేడాది చూశాం. ఆ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా హార్వీ వెయిన్‌స్టీన్‌పై థర్మన్ కూడా ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే ‘కిల్‌బిల్’ టైమ్‌లో తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి కూడా చెప్పిందామె. ‘‘అది నన్ను చంపడానికి వేసిన ప్లాన్. స్టంట్‌మెన్‌తో ఆ సీన్ చేయించమని చెప్పినా టరంటీనో దానికి ఒప్పుకోలేదు. ఆ కారు కండీషన్ బాగాలేదు. కావాలనే ఇన్నేళ్లైనా ఆ యాక్సిడెంట్ విజువల్స్ సాక్ష్యాలకు అందకుండా నిర్మాత వెయిన్‌స్టీన్ నాకు చూపించలేదు’’ అని వాదించింది థర్మన్. ఆ యాక్సిడెంట్లో తనకు అయిన గాయాలు ఈరోజుకీ బాధిస్తున్నాయని చెప్పిందామె. టరంటీనో ఏమంటున్నాడు... ‘‘నా కెరీర్లోనే కాదు. నా జీవితంలోనే నేను చేసిన దిద్దుకోలేని తప్పది..’’ అన్నాడు టరంటీనో, తనపై థర్మన్ చేసిన ఆరోపణలకు సమాధానంగా. కాకపోతే అది కావాలని చేసింది కాదని కూడా ఆయన అన్నాడు. ‘‘ఆ రోడ్ అంతా స్ట్రెయిట్‌గా ఉందని నేననుకున్నా. అసలా మలుపు ఉందన్న విషయం గ్రహించలేదు. అది నా తప్పే. జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు..’’ అని చెబుతూ, థర్మన్‌కు క్షమాపణలు చెప్పాడు టరంటీనో. ఆ యాక్సిడెంట్ విజువల్స్‌ను థర్మన్‌కు తానే స్వయంగా పంపించాడు కూడా! చివరకు ఈ కథ ఎక్కడికొచ్చింది? ఈ కథ పదిహేనేళ్ల తర్వాత మొన్నే మళ్లీ మొదలైంది. ఇంకా చివరకు రాలేదు కానీ, ఎవరెవరు ఏమేం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసుకున్నారు. టరంటీనో ఇచ్చిన సమాధానం తర్వాత అతణ్ణి థర్మన్ పొగిడింది. ‘‘ఈ విజువల్స్‌ను బయటకు తేవడానికి టరంటీనో పెద్ద సాహసమే చేసి ఉండాలి. ఆయన చూపిన తెగువకు గర్వంగా కూడా ఉంది’’ అంటూ నిర్మాతలు హార్వీ వెయిన్‌స్టీన్, లారెన్స్ బెండర్, ఇ. బెన్నెట్లు ఇంతకాలం ఈ వీడియో తనకు అందకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారని చెప్పుకొచ్చింది థర్మన్. నిర్మాతలైతే దీన్ని ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా బాగా ట్రెండింగ్. టరంటీనోను థర్మన్ క్షమించినా నెటిజన్లు మాత్రం క్షమించడం లేదు. ఇందులో అసలు ట్విస్ట్ అంటే ఇదే! ఇంకా ఈ కథ ఏయే మలుపులు తిరుగుతుందో చూడాలి!! -
వందేళ్లు బతకాలని ఉంది: హీరో
తనకు వందేళ్లు బతకాలని ఉందని, అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నానని సీనియర్ నటుడు డిక్ వాన్ డైక్ చెబుతున్నారు. ఇప్పటికే 91 ఏళ్ల వయసున్న ఈ హీరో.. తాను ఏమాత్రం ముసలాడినని అనుకోవడం లేదని, 2025లో తన పుట్టినరోజు జరుపుకోవడం కోసం పనిచేస్తూనే ఉంటానని అంటున్నారు. వందో పుట్టినరోజు జరుపుకోడానికి కృషి చేస్తున్నానని, ఇప్పటికీ ప్రతిరోజూ డాన్సు చేస్తూ, జిమ్‌కు వెళ్తున్నానని చెప్పారు. మానసిక పరంగా అయితే అసలు తాను ముసలివాడినని ఏమాత్రం అనుకోవడం లేదన్నారు. తన వయసువారే అయిన చాలామంది హాలీవుడ్ స్టార్లు కూడా బతికుంటే బాగుండేదని ఆయన చెప్పారు. తన సమకాలీకులు కావాలని అనిపిస్తోందని, కానీ వాళ్లలో చాలామంది ఇప్పుడు లేరన్న విషయమే తనను బాధపెడుతోందని తెలిపారు. కొద్ది మంది మాత్రం ఇప్పటికీ కలుస్తుంటారని, వాళ్లలో తన మెంటార్ అయిన కార్ల్ రీనర్ (94), మెల్ బ్రూక్స్ లాంటివాళ్లు ఉన్నారని తెలిపారు. గతంలో తాము చేసిన పనులు తమ వర్తమానం మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయన్న విషయం గురించే తాము ఎక్కువగా మాట్లాడుకుంటామన్నారు. అప్పుడు చేసిన తప్పులను గుర్తుచేసుకుంటామని, ఎలాగైనా పాత రోజులు అద్భుతంగా ఉండేవని డైక్ తెలిపారు. -
వాళ్లే నా సైన్యం!
‘‘సెలబ్రిటీగా అందరి దృష్టిలో పడడం ఎవరికైనా ఆనందమే. ఓ స్టార్‌గా మనల్ని ఓ కంట కనిపెట్టే కళ్లు కోట్లలో ఉంటాయి. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని ప్రియాంకా చోప్రా అంటున్నారు. బాలీవుడ్లో తిరుగులేని తార అనిపించుకుని, ‘క్వాంటికో’ టీవీ షోతో హాలీవుడ్ స్టార్ అయిపోయారామె. హోదా పెరిగే కొద్దీ ప్రశంసలతో పాటు కొన్ని అపాయాలు కూడా పొంచి ఉంటాయి. ఆ అపాయాల్లో ‘సైబర్ క్రైమ్’ ఒకటి. సెలబ్రిటీల్లో సోషల్ మీడియా బాధితులు చాలామంది ఉన్నారు. ఆ విషయం గురించి ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ - ‘‘సామాజిక మాధ్యమం ద్వారా నన్ను ప్రోత్సహించే అభిమానులతో పాటు ఫేక్ ఐడీతో అభ్యంతరకర పోస్ట్‌లు చేసేవాళ్లూ ఉన్నారు. కొంతమంది అసభ్యకరమైన కామెంట్లు పెడుతూ ఉంటారు. అవి చదివినప్పుడు రక్తం మరిగినంత పని అవుతుంది. సెలబ్రిటీ అయిన కారణంగా ఈ బాధ పడక తప్పదు’’ అని వాపోయారు. అయితే, ‘‘అభిమానులే నా సైన్యం’’ అంటూ, సోషల్ మీడియాలో ఏవైనా పోస్ట్ చేసినప్పుడు ఏదైనా పొరబాటు దొర్లితే వివరణ ఇవ్వడానికి వెనకాడనన్నారు. ‘‘ఎప్పుడైనా పొరపాటున ఏదైనా వార్త పోస్ట్ చేస్తే వివరణ ఇచ్చేస్తాను. అయినా ఆ వివరణ వినేవాళ్లు చాలా తక్కువే. కామెంట్లు పెట్టడానికి ఇచ్చే టైమ్, వివరణ తెలుసుకోవడానికి ఇవ్వరు. అలాగని నేను వాళ్లతో ఆన్లైన్లో యుద్ధాలకు దిగను’’ అన్నారు -
పదేళ్ల తర్వాత మళ్లీ జంటగా...
‘‘నా భర్తను డెరైక్ట్ చేయడం ఓ సరికొత్త అనుభూతినిస్తోంది’’ అంటున్నారు హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలీ. ప్రస్తుతం ఆమె దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బై ది సీ’. వైవాహిక బంధాన్ని కాపాడుకోవడానికి ఓ భార్య, భర్త ఏం చేశారన్న కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. ఎన్నో ఏళ్ల క్రితం జోలీ ఈ కథ రాసుకున్నారట. కథానాయికగా బిజీగా ఉన్నందున, దర్శకత్వ శాఖలోకి అప్పుడే అడుగుపెట్టడం ఇష్టం లేక ఆమె ఈ కథను తెరకెక్కించలేదు. గత ఏడాది ఆమె బ్రాడ్ పిట్‌ను పెళ్లి చేసుకున్నారు. అప్పట్నుంచీ ఈ కథను వెండితెరపై ఆవిష్కరించాలనే పట్టుదలతో ఉన్నారు జోలీ. ఇందులో తన నిజజీవిత భర్త బ్రాడ్‌పిట్, తానూ భార్యాభర్తలుగా నటిస్తే బాగుంటుందని భావించి, ఈ ఏడాది ఈ చిత్రాన్ని ఆరంభించారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. 2005లో జోలీ, పిట్లు ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’లో నటించారు. పదేళ్ల తర్వాత తామిద్దరం మళ్లీ జంటగా నటిస్తున్నందుకు జోలీ పరమానందపడిపోతున్నారు. -
ఐ వాంట్ మోర్!
ప్రపంచమంతా ఫ్యామిలీ ప్లానింగ్ వైపు అడుగులు వేస్తుంటే... హాలీవుడ్ స్టార్ నికోల్ కిడ్మన్ మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తోంది. ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నా... తనకు ఇంకా పిల్లలు కావాలంటోందీ తార. ఉన్న నలుగురులో ఇద్దరు మాజీ భర్త టామ్ క్రూజ్‌కు సంబంధించిన సంతానం. మిగిలిన ఇద్దరినీ దత్తత తీసుకుంది. ‘నా సంతానాన్ని ఎనిమిదికి పెంచాలని కోరుకుంటున్నా. మా అమ్మ లాగా నా సోదరికి ఆరుగురు పిల్లలు. అలాగే నాకూ మరో నలుగురు కావాలి’ అని ఎంతో ముచ్చటగా చెప్పింది నలభై ఏడేళ్ల నికోల్ కిడ్మన్. -
ఆ పోటాపోటీయే మా ఎదుగుదలకు కారణం!
హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్, సిల్వెస్టర్ స్టాలెన్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నాయి. ఈ ఇద్దరూ నటించిన చిత్రాల జాబితా చెప్పాలంటే చాలానే ఉంది. ఆర్నాల్డ్ చేసిన ‘ది టెర్మినేటర్’, సిల్వెస్టర్ స్టాలెన్ చేసిన ‘రాంబో’ చిత్రాలను చూస్తే.. వీళ్లు ఏ స్థాయి నటులో అర్థమవుతుంది. మంచి యాక్షన్ హీరోలుగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరూ 1980ల్లో పోటాపోటీగా సినిమాలు చేసేవాళ్లు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్నాల్డే చెప్పారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్నాల్డ్ గతాన్ని నెమరువేసుకున్నారు. ముఖ్యంగా సిల్వెస్టర్ స్టాలెన్కూ, తనకూ మధ్య ఉన్న పోటీ గురించి చెబుతూ - ‘‘మాలో ఎవరు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు? అనే విషయం నుంచి సినిమాల్లో ఎవరు ఎక్కువమంది విలన్లను చంపాం? ఎంత కొత్తగా చంపాం? అని చెక్ చేసుకునేవాళ్లం. ఫిట్నెస్ విషయంలో కూడా పోటీయే. ఎవరి సినిమా ఎక్కువ వసూలు చేసిందో చూసుకునేవాళ్లం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది కాదు. ఒకరినొకరు బాగా ద్వేషించుకునేవాళ్లం. పరిపక్వత లేకనే ఆ ద్వేషం. 1990లలో ఇద్దరికీ మానసిక పరిపక్వత పెరగడంతో స్నేహితులమయ్యాం. అయితే.. ఒక్కటి మాత్రం నిజం. మా మధ్య ఉన్న పోటీతత్త్వమే మా అభివృద్ధికి తోడ్పడింది. శత్రువులుండడం చాలా ముఖ్యం. ఆ శత్రువును ఢీ కొనడానికి పరుగులుపెడతాం, కష్టపడతాం. ఫలితంగా పైకొస్తాం. మా విషయంలో జరిగింది అదే’’ అని చెప్పారు. -
మడోనా వస్తువులు వేలానికి...!
హాలీవుడ్ స్టార్ మడోనా మరో నాలుగేళ్లలో 60వ పడిలోకి అడుగుపెడతారు. మామూలుగా అయితే వయసులో ఉన్న తారలతో పోల్చితే.. ఇలా వయసు పైబడిన తారలకు తక్కువమంది అభిమానులుంటారు. కానీ, మడోనా విషయంలో అలా కాదు. టీనేజ్ తారలకు కూడా లేనంత మంది అభిమానులు ఈ హాట్ లేడీకి ఉన్నారు. ఆ అభిమానులందరికీ ఓ శుభవార్త. మడోనా నటించిన పలు చిత్రాల్లోని చెప్పుకోదగ్గ దుస్తులు, నగలను వేలానికి పెట్టనున్నారు. అలాగే పాదరక్షలు, చలువ కళ్లద్దాలు, వ్యక్తిగతంగా ఆమె వాడిన సౌందర్య సాధనాలు, దుస్తులు... ఇలా మొత్తం 140 వస్తువులు వేలానికి రానున్నాయి. ఈ వేలం పాటను నిర్వహించనున్న జూలియన్స్ ఆక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మార్టిన్ నోలన్ ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు రోజుల పాటు జూలియన్స్ ఆక్షన్స్లోను, ఆన్లైన్ ద్వారాను ఈ వేలం పాట జరగనుంది. మడోనాకి సంబంధించిన వస్తువులను వేలానికి పెట్టడం ఇప్పుడు కొత్త కాదు. ఇప్పటివరకు చాలాసార్లు జరిగింది. కానీ, ఏకంగా 140 వస్తువులు వేలానికి రావడం ఇదే మొదటిసారి. దీని ద్వారా 30 కోట్ల రూపాయల రాబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తంలో ఎక్కువ శాతం సేవా కార్యక్రమాలకు వినియోగించాలనుకుంటున్నారు. నవంబర్ 7న ఈ వేలం పాట ఆరంభం కానుంది. -
న్యూ బిగినింగ్..!
మనసు పారేసుకోవడానికి వయసుతో పనిలేదని చెప్పకనే చెప్పాడు హాలీవుడ్ స్టార్ కీను రీవ్స్. యాభై ఏళ్ల ఈ హీరో బ్రిటిష్ మోడల్ బ్రూక్‌తో ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఇటీవల కాలిఫోర్నియాలోని ఓ జిమ్‌లో తారసపడ్డ వీరిద్దరూ కళ్లూ.. కళ్లూ కలిపి.. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని.. డేటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసుకున్నారట. ఇక అక్కడి నుంచి ‘సందడే సందడి’ అని ఓ ఆంగ్ల పత్రిక కథనం. రీసెంట్గా బాయ్‌ఫ్రెండ్ డేవిడ్ మాకింతోష్కు గుడ్‌బై చెప్పి మెంటల్‌గా కాస్త అప్సెట్ అయిన బ్రూక్‌కు రీవ్స్‌తో రొమాన్స్ ఎంతో రిలీఫ్నిస్తుందట! -
ఆయన బాడీ చూసి ఈయన ముగ్దుడయారు
చెన్నై : 'ఐ' చిత్రంలోని హీరో విక్రమ్ పాత్రను చూసి ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ స్ఫూర్తి పొందారని ఆ చిత్ర దర్శకుడు శంకర్ తెలిపారు. బుధవారం చెన్నైలో దర్శకుడు శంకర్ మీడియాతో మాట్లాడుతూ... ఆ చిత్రంలో విక్రమ్ శరీర ధారుణ్యాన్ని చూసి ష్వార్జ్ నెగర్ ముగ్దుడయ్యాడని చెప్పారు. ఈ సందర్బంగా ఆ హాలీవుడ్ నటుడు తన చిన్ననాటి విశేషాలను నెమరువేసుకున్నారని వివరించారు. ఐ చిత్రంలో బాడీ బిల్డింగ్ పాత్రలో విక్రమ్ ఒదిగిపోయిన తీరుపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారన్నారు. ఐ చిత్రంలో పాత్రలో నటించేందుకు విక్రమ్ తన శరీరాన్ని తగిన విధంగా మలచుకున్న తీరు అద్బుతమని ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ అన్నారని తెలిపారు. ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాల కోసం విక్రమ్ కండలు పెంచుకుంటే.... మరో కొన్ని సన్నివేశాల కోసం శరీరాన్ని బాగా తగ్గించుకున్నారన్నారు. ఐ చిత్రం ఆడియో విడుదల సందర్బంగా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రంలోని విక్రమ్ నటనకు అర్నాడ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఐ చిత్రంలో దీపావళీకి విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రంలో అమ్మీ జాక్సన్, ఉపెన్ పటేల్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. -
అప్పుడప్పుడూ అంతే..!
హాలీవుడ్ స్టార్, ఐరన్ వ్యూన్ హీరో రాబర్ట్ డౌనె జూనియుర్... బాలీవుడ్ ఫాలోవర్స్‌కు షాకిచ్చాడు. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్ ఫొటో ఉన్న ఓ భారత వెబ్సైట్ లింక్‌ను తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దానికి లైకూ కొట్టేశాడు. అంతేనా... హీత్ లెడ్జర్, హగ్ జాక్వ్యూన్లతో సన్నీని పోల్చాడు. అరుుతే ఇదంతా రాబర్ట్ పీఆర్ టీమ్ పనంటూ లైట్ తీసుకొంటున్నారు కొందరు. ఏదేమైనా... తవు హీరోను ప్రపంచ ప్రఖ్యాత స్టార్ పొగడటం సన్నీ ఫ్యాన్స్‌ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. -
వస్తా నీ వెనుకా!
హాలీవుడ్ స్టార్ విల్‌స్మిత్ సరదా సన్నివేశంలో ఓ అందాల భామ అలజడి రేపింది. లాస్‌ఏంజెలిస్‌లోని ఇబిజా బీచ్‌లో బిజీ షెడ్యూల్స్కు బై చెప్పి ఈ హీరోగారు సేద తీరుతుండగా జరిగిందా ఘటన. అభిమానులు గుమిగూడగా ఫొటోలు తీసుకుంటూ స్మిత్ ఉల్లాసంగా గడుపుతున్నాడు. అప్పుడే మల్లె తీగ లాంటి చిన్నది టాప్‌లెస్‌గా ప్రత్యక్షమైంది. హీరో, అభిమానులు తీసుకుంటున్న ఫొటో ఫ్రేమ్ల్లోకి చొరబడింది. అక్కడితో ఆగక హీరోగారి వెంటపడింది. ‘వస్తా నీ వెనుకా’ అంటూ సతాయించింది. స్మిత్ స్పానిష్ వెకెషన్‌లో ఇలా అనుకోని ఘటన చోటుచేసుకుంది. నా ఫోన్ 24/7 మొబైల్ ఫోన్ విలాసం కాదు అవసరం అంటున్నాడు బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్‌కపూర్. సినిమా షూటింగ్‌లతో రోజంతా బిజీగా ఉండే తనను సేద తీర్చేది సెల్ఫోనేనన్నాడు. ‘ఇషాక్జాదె’తో తెరంగేట్రం చేసిన బోనీకపూర్ తనయుడు అర్జున్ ‘గండే’, ‘2స్టేట్స్’ సినిమాలతో పెద్ద సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. టెక్నాలజీ చెరుపు కాదని మంచివాళ్ల చేతిలో బాగా ఉపకరిస్తుందని చెప్పాడు. అలాగే సామాజిక బంధాలు, నైపుణ్యాలకు కూడా అది అడ్డంకి కాదన్నాడు. ట్విట్టర్ ద్వారా తను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులతో టచ్‌లో ఉన్నట్లు చెప్పాడు అర్జున్‌కపూర్. -
జోలీ భయపెడుతుందా?
హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలీని అక్కడి నిర్మాతలు, పంపిణీదారులు ముద్దుగా ‘బంగారు బాతు’ అని పిలుచుకుంటారు. ఎందుకంటే, ఆమె నటించిన చిత్రాల్లో లాభాలు తెచ్చిపెట్టినవే ఎక్కువ. కానీ, ఇప్పుడే ద గోల్డెన్ స్టార్ చేసిన ‘మేల్‌ఫిసెంట్’ ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చని పంపిణీదారులు సందేహిస్తున్నారట. ఇందులో ఏంజెలినా నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేశారు. తన పాత్ర పేరు మేల్‌ఫిసెంట్. స్వతహాగా మంచితనానికి చిరునామా అయిన మేల్ఫిషెంట్ మోసానికి గురవుతుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. పలు రకాల మోసాలకు గురైన తర్వాత ఆమె మనసు బండరాయి అవుతుందని. దాంతో విలన్‌గా మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మామూలుగా అన్ని సినిమాల్లోనూ అందంగా కనిపించే ఏంజెలినా ఈ చిత్రంలో మాత్రం తలకు కొమ్ములు, విరబోసిన జుత్తు, కళ్లకు లెన్స్... ఇలా విచిత్రమైన గెటప్‌లో కనిపిస్తారు. మొత్తానికి ఈ లుక్ పిల్లలను భయపెడుతుందని చెప్పొచ్చు. కానీ, ఈ చిత్రాన్ని పంపిణీ చేయనున్న వాల్ట్ డిస్నీ అధినేతలు కూడా భయపడుతున్నారట. దేవకన్యలా అందంగా కనిపించే ఏంజెలినా అందుకు భిన్నంగా విచిత్రమైన గెటప్‌లో కనిపిస్తే, ప్రేక్షకులు ఆదరించరేమోననే భయం పట్టుకుందట. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం పరాజయం పాలవుతుందని భావిస్తున్నారట. మే 30న ఈ సినిమా విడుదల కానుంది. డిస్నీవాళ్లు భయపడినట్లే జరుగుతుందో లేక వాళ్లకి ఈ సినిమా స్వీట్ షాక్ ఇస్తుందో వేచి చూడాల్సిందే మరి. -
ప్రకృతిని జయించలేను... క్షమించండి!
సినిమా తారలకు వయసు పైబడుతుంటే వారి అభిమానులకు ఆందోళనగా ఉంటుంది. వాళ్లు నిత్యయవ్వనంగా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. వయసు కనబడనివ్వకుండా ఆర్టిస్టులు కూడా యంగ్‌గా కనిపించడానికి జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, శారీరక మార్పులు స్పష్టంగా కనిపించేస్తాయి. ప్రస్తుతం ఈ విషయంలోనే హాలీవుడ్ తార కామరూన్ డయాజ్ ఆందోళన చెందుతున్నారు. ఆమె వయసు 41. కానీ, అభిమానులు మాత్రం 25 ఏళ్ల పడుచు పిల్లలా కనిపించాలని కోరుకుంటున్నారట. ఎప్పటికీ తనని అలానే చూడాలని ఆశపడుతున్నారట. ఈ విషయం గురించి ప్రస్తావించి, తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు కామరూన్. నిజానికి తనకూ అలాగే కనిపించాలని ఉందని, కానీ వయసనేది ప్రకృతితో ముడిపడింది కాబట్టి దాన్ని జయించలేనని, అభిమానులను నిరుత్సాహపరుస్తున్నందుకు బాధగా ఉందని పేర్కొన్నారు కామరూన్.