ఆయన బాడీ చూసి ఈయన ముగ్దుడయారు | Schwarzenegger inspired Vikram's character in 'I': Shankar | Sakshi
Sakshi News home page

ఆయన బాడీ చూసి ఈయన ముగ్దుడయారు

Published Wed, Sep 17 2014 12:05 PM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM

ఆయన బాడీ చూసి ఈయన ముగ్దుడయారు - Sakshi

ఆయన బాడీ చూసి ఈయన ముగ్దుడయారు

చెన్నై : 'ఐ' చిత్రంలోని హీరో విక్రమ్ పాత్రను చూసి ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ స్ఫూర్తి పొందారని ఆ చిత్ర దర్శకుడు శంకర్ తెలిపారు. బుధవారం చెన్నైలో దర్శకుడు శంకర్ మీడియాతో మాట్లాడుతూ... ఆ చిత్రంలో విక్రమ్ శరీర ధారుణ్యాన్ని చూసి ష్వార్జ్ నెగర్ ముగ్దుడయ్యాడని చెప్పారు. ఈ సందర్బంగా ఆ హాలీవుడ్ నటుడు తన చిన్ననాటి విశేషాలను నెమరువేసుకున్నారని వివరించారు. ఐ చిత్రంలో బాడీ బిల్డింగ్ పాత్రలో విక్రమ్ ఒదిగిపోయిన తీరుపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారన్నారు. ఐ చిత్రంలో పాత్రలో నటించేందుకు విక్రమ్ తన శరీరాన్ని తగిన విధంగా మలచుకున్న తీరు అద్బుతమని ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ అన్నారని తెలిపారు.

ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాల కోసం విక్రమ్ కండలు పెంచుకుంటే.... మరో కొన్ని సన్నివేశాల కోసం శరీరాన్ని బాగా తగ్గించుకున్నారన్నారు. ఐ చిత్రం ఆడియో విడుదల సందర్బంగా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రంలోని విక్రమ్ నటనకు అర్నాడ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఐ చిత్రంలో దీపావళీకి విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రంలో అమ్మీ జాక్సన్, ఉపెన్ పటేల్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement