హాలీవుడ్ లెజండరీ నటుడు కన్నుమూత | Hollywood star Burt Reynolds dies at 82 | Sakshi
Sakshi News home page

లెజండరీ నటుడు కన్నుమూత: సెలబ్రిటీల సంతాపం

Sep 7 2018 10:18 AM | Updated on Apr 3 2019 8:07 PM

Hollywood star Burt Reynolds dies at 82 - Sakshi

హాలీవుడ్ లెజండరీ నటుడు, దర్శకుడు బుర్ట్ రెనాల్డ్స్ (82) గురువారం ఫ్లోరిడాలో కన్నుమూశారు. గుండెపోటు కారణంగా రెనాల్డ్స్‌  తుదిశ్వాస విడిచారని  ఆయన మేనేజర్ ఎరిక్ క్రిట్జెర్ అధికారికంగా ప్రకటించారు. 1936లో పుట్టిన బర్ట్ రెనాల్డ్స్ హాలీవుడ్ మోస్ట్ పాపులర్ నటుల్లో ఒకడిగా గుర్తింపు పొందారు. గన్‌స్మోక్‌, బాక్‌ టెలివిజన్‌ సిరీస్‌లో పేరుతెచ్చకున్న  బుర్ట్‌  1970 లో భారీ బాక్స్ ఆఫీస్ ఆకర్షణగా నిలిచిన బర్ట్ రెనాల్డ్స్, డెలివరెన్స్,  బూగీ నైట్స్‌ మూవీల పాత్రలతో మంచి పేరు సంపాదించారు. అలాగే లాంగెస్ట్ యార్డ్, బూగీ నైట్స్, స్మోకీ అండ్ ది బాండిట్‌ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధించాయి.

నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత రెనాల్డ్స్‌ ద‍ర్శకత్వాన్ని కూడా చేపట్టారు. అనంతరం ఆయన ఫ్లోరిడాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ను కూడా స్థాపించారు. మై లైఫ్ (1994) ఎనఫ్ అబౌట్ మి (2015) లో రాశారు. రెనాల్డ్స్‌మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక‍్తం చేశారు. అంతేకాదు ఆయన రెండు ఆటోబయోగ్రఫీలను కూడా తీసుకొచ్చారు. ఆర్నాల్డ్‌, స్టీవ్‌ హార్వే, రెబా తదితర హాలీవుడ్‌ ప్రముఖులు రెనాల్డ్స్ ఆకస్మిక మరణంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement