Demi Moore
-
నా తల్లి కారణంగా రేప్‌కి గురయ్యా!
పిల్లలకు తల్లిదండ్రుల దగ్గర రక్షణ ఉంటుంది. కానీ కొందరి విషయంలో తల్లిదండ్రులే విలన్లు అవుతారు. హాలీవుడ్ నటి డెమీ మూర్ జీవితంలో జరిగిన ఓ చేదు సంఘటనకు ఆమె తల్లే కారణమయ్యారు. ఓ చాట్ షోలో ఆమె ఈ విషయం గురించి చెప్పారు. ‘‘నా టీనేజ్‌లో ఓ వ్యక్తి నాపై అత్యాచారం జరిపాడు. ఆ భయంకరమైన సంఘటనను నేనెప్పటికీ మరచిపోలేను. కూతురిపై అత్యాచారం జరగడానికి తల్లే కారణం అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు’’ అంటూ ఆ షోలో భావోద్వేగానికి గురయ్యారు డెమీ మూర్. ఇంకా మాట్లాడుతూ – ‘‘నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి నా పై అత్యాచారం జరిపాడు. దానికి కారణం మా అమ్మే. మద్యం కోసం అతని దగ్గర మా అమ్మ 500 డాలర్లు తీసుకుని, నన్ను బలి చేసింది. అయితే ఎక్కడో ఒక మూల మా అమ్మ ఈ నిర్ణయం తీసుకుని ఉండదనే ఫీలింగ్ ఉంది. నేరుగా ఈ ఒప్పందం జరిగి ఉండదని అనుకుంటున్నాను. అయితే ఈ సంఘటనకు దారి ఇచ్చింది తనే కదా. ఒక క్రూరమైన వ్యక్తికి నన్ను అప్పగించింది. ఆ వ్యక్తి మా అమ్మ చేసిన మోసం గురించి చెప్పినప్పుడు షాక్ అయ్యాను. అలా నా బాల్యం నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది’’ అని బాధపడ్డారు డెమీ. ‘‘టీనేజ్లోనే నేను ఇంటి నుంచి బయటికు వచ్చేశాను. చేతిలో చిల్లిగవ్వ లేదు. హాలీవుడ్లో సినిమా కెరీర్ మొదలుపెట్టాలనుకున్నాను. కానీ అనుభవం లేదు. అయితే నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఆ ధైర్యంతోనే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. ‘జనరల్ హాస్పిటల్’ అనే టీవీ సిరీస్ నా జీవితానికి మంచి మలుపు అయింది. వెనక్కి తిరిగి చూసుకోలేనంతగా సినిమాల్లో బిజీ అయ్యాను. నా ధైర్యం, ప్రతిభ, కష్టపడే తత్వం నన్ను స్టార్‌ని చేశాయి’’ అని డెమీ తెలిపారు. -
15వ ఏట అత్యాచారం.. నటి సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ హాలివుడ్ తార డెమీ మోర్ పేరు వినగానే ‘ఇండీసెంట్ ప్రపోజల్’ పేరు గుర్తుకు రాక తప్పదు. అదురు బెదురు లేకుండా రొమాంటిక్ చిత్రాల్లో నటించిన డెమీ మోర్ జీవితం కూడా ‘ఇండీసెంట్’గానే నడిచింది. ప్రస్తుతం 56 ఏళ్ల ఆమెపై 15వ ఏటనే అత్యాచారం జరిగిందట. అప్పుడు ఆమె లాస్ ఏంజెలిస్‌లోని ఫెయిర్ ఫాక్స్ హై స్కూల్లో చదువుకుంటున్నారట. 2004లో తన బాయ్‌ఫ్రెండ్ ఆష్టన్ కుచర్‌తో ప్రేమాయణంలో గర్భవతి అయిందట. కడుపులోని బిడ్డకు ఆరు నెలలు నిండగానే గర్భస్రావం అయిందట. దాంతో ఆమె మద్యానికి, డ్రగ్స్‌కు మరోసారి అలవాటు పడిందట. 2005లో భాయ్ ఫ్రెండ్ ఆష్టన్ కుచర్ను పెళ్లి చేసుకొని వైద్య చికిత్సల ద్వారా తల్లి అయ్యేందుకు ప్రయత్నించిందట. అయినా లాభం లేకపోవడంతో ఆ ప్రయత్నాలను విరమించిందట. డెమీ మోర్‌కు 42 ఏళ్లు ఉన్నప్పుడు (2003లో) తనకంటే 15 ఏళ్లు చిన్నవాడయిన ఆష్టన్ కుచర్‌తో డేటింగ్ మొదలు పెట్టారట. అప్పుడే ఆమె గర్భవతి అయ్యారు. పుట్టబోయే పాపకు ‘చాప్లిన్ రే’ అని కూడా పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారట. 2004లో గర్భస్రావం అయ్యాక 2005లో ఆమె కుచర్ను పెళ్లి చేసుకున్నారట. మరి ఆమె యవ్వనంలో ఏం చేశారని ఎవరికైనా సందేహాలు రావచ్చు. డెమీ మోర్ తన 16వ ఏటనే ఓ గిటారిస్ట్తో సహ జీవనం చేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేశారట. ఆ తర్వాత రెండేళ్లకు గిటారిస్ట్ను వదిలేసి రాక్ మ్యుజీషియన్ ఫ్రెడ్డీ మోర్‌ను ప్రేమించారట. అప్పుడే ‘జనరల్ హాస్పటల్’, ‘లాస్ట్ నైట్’ లాంటి హాలివుడ్ చిత్రాల్లో నటించే అవకాశం రావడం, వాటి ద్వారా పేరు రావడంతో మద్యానికి, కొకైన్కు బానిస అయ్యారట. కొచర్ పరిచయం అయ్యాక మద్యానికి, డ్రగ్స్‌కు దూరమై సంతానం కోసం ప్రాధాన్యత ఇచ్చారట. కొచర్ తనను మోసం చేస్తున్నాడని గ్రహించి ఆయనతో 2011లో విడిపోయినప్పటికీ వారిద్దరికి 2013లో వారికి విడాకులు మంజూరయ్యారట. డెమీ మోర్ 1990 దశకంలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు బ్రూస్ విల్లీస్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాలను ఎవరో చెప్పడం లేదు. స్వయంగా డెమీ మోరే ‘ఇన్సైడ్ అవుట్’ అనే ఆత్మ కథలో చెప్పుకుంది. ఆ పుస్తకం ఈనెల 24వ తేదీన మార్కెట్లోకి వస్తోంది. బ్రూస్ విల్లీస్‌తో ఆమె ప్రేయాణం, అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోలేక పోయిందీ, ఆయన పిల్లలతో అనుబంధాన్ని ఎందుకు తెంచుకోవాల్సి వచ్చింది వంటి అంశాలు ఈ పుస్తకంలో ఉండే అవకాశం ఉంది. -
నటి మూర్ స్విమ్మింగ్ పూల్ లో యువకుడి మృతదేహం
లాస్ ఏంజిల్స్:అమెరికన్ నటి డెమీ మూర్ స్విమ్మింగ్ పూల్ లో ఆదివారం ఓ యువకుడు మృతదేహం లభించింది. 21 సంవత్సరాల వయస్సున్న ఆ యువకుడు అనుమానాస్పద రీతిలో నటి మూర్ స్విమ్మింగ్ పూల్ లో పడి మృతిచెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆ సమయంలో డెమీ మూర్ ఇంట్లో లేనట్లు లాస్ ఏంజిల్స్ లోని టైమ్స్ పత్రిక తెలిపింది. అతను స్విమ్మింగ్ చేద్దామని భావించి స్విమ్మింగ్ పూల్ లో దిగి ఈత రాక చనిపోయి ఉండవచ్చని.. ఒకవేళ కాని పక్షంలో ఏదైనా రోగంతో స్విమ్మింగ్ పూల్ లోకి జారిపడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. -
'నా కూతురు సమస్యలకు నేనే కారణం'
నా కూతురి సమస్యలకు తానే కారణమని హాలీవుడ్ నటి డెమీ మూర్ అన్నారు. మద్యం, డ్రగ్స్ కు బానిసైన తన కూతురు తల్లులా వాటి నుంచి బయటపడేందుకు రిహాబిలిటేషన్ సెంటర్ లో చేరింది. తన భర్త అష్టన్ కుచ్చర్ తో విడిపోయి.. తాను సమస్యల్లో కూరుకుపోయానని మూర్ అన్నారు. ప్రస్తుతం ఓ రిహాబిలిటేషన్ సంస్థలో చికిత్స పొందుతున్న తన కూతురు పరిస్థితి మెరుగు పడుతోందని డేమీ మూర్ తెలిపారు. సమస్యలతో బాధపడుతున్న తన తల్లికి పెద్ద కూతురు రుమెర్ బాసటగా నిలిచింది. త్వరలోనే తన తల్లి, చెల్లి సమస్యల నుంచి బయటపడుతారనే ఆశాభావంతో రుమెర్ ఉన్నారు. డేమీ మూర్ కు బ్రూస్ విల్లీస్ ద్వారా కలిగిన మరో కూతురు స్కౌట్ కూడా ఉన్నారు.