pan masala ads
-
నిమిషం యాడ్ కోసం రూ. 10 కోట్లు.. రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. దీంతో అతని రెమ్యునరేషన్‌తో పాటు పలు యాడ్ రెమ్యునరేషన్ కూడా పెరిగింది. సుకుమార్ డైరెక్ట్ చేసి పుష్ప నుంచి పార్ట్ -2 త్వరలో విడుదల కానుంది. 2024 కొత్త ఏడాదిలో బన్నీ పేరు మరోసారి పాన్ ఇండియా రేంజ్లో వెలిగిపోవడం ఖాయం. ఇలాంటి సమయంలో కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల కోసం యాడ్స్ రూపంలో ప్రమోట్ చేయాలని కోరడం సహజం. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఒక మద్యం కంపెనీకి చెందిన తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని కోరాయాట. అందుకు సుమారు రూ. 10 కోట్లు ఆఫర్ చేశాయట. కేవలం 60 సెకండ్లు మాత్రమే తమ యాడ్‌లో కనిపిస్తే చాలని కోరాయట.. కానీ ఈ డీల్‌ను అల్లు అర్జున్ సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం. మద్యం, సిగరెట్స్, గుట్కా తదితర దుర్వ్యసనాల యాడ్స్లలో నటిస్తే సమాజంలో చెడును వ్యాప్తి చేసినట్లు అవుతుందని అయన చెప్పారట.. అందు కోసం ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తాను చేయనని చెప్పి పంపించేశాడట బన్నీ. ప్రజలకు హానికరం చేసే వస్తువులను ప్రమోట్ చేసి వాటి ద్వారా వచ్చే డబ్బు తనకు అవసరం లేదని ఆయన ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. సరోగేట్ యాడ్స్ నిషేధం మద్యం, సిగరెట్స్, గుట్కా తదితర హానికరమైన వాటిని సరోగేట్ యాడ్స్ అంటారు. నియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉండే ప్రకటనల (యాడ్స్) నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాలను నిర్ణయించింది. ఈ మేరకు సరోగేట్ యాడ్స్ (ప్రచారం చేయడానికి వీల్లేని ఉత్పత్తులకు సంబంధించి వాటి పేరుతోనే అదేరీతిలో ఉండే వేరే ఉత్పత్తులను చూపించడం)ని కూడా నిషేధించింది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ గతంలో ఒక పాన్ మసాలా ప్రొడక్ట్ తో కుదుర్చుకున్న బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ప్రమోషనల్ డబ్బులను కూడా వాపసు ఇచ్చేశారు. ఈ పాన్ మసాలా ప్రకటనను చట్టం నిషేధించిన సరోగేట్ యాడ్స్ గా పరిగణిస్తారని బిగ్ బీ కి తెలియక ఒప్పుకున్నట్లు ఆయన తెలిపిన విషయం తెలిసిందే. భారతదేశంలో ఎందుకు నేరం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ చట్టం 1995 ద్వారా పొగాకు, మద్యం, సిగరెట్లు వంటి ఉత్పత్తుల ప్రకటనలపై భారత్‌లో నిషేధం ఉంది. దీంతో సెలబ్రీటిలతో ఈ సరోగేట్ ప్రకటనలు పుట్టుకొచ్చాయి. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తుల ప్రకటనలు ఉండకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003, సెక్షన్ 5 అనే చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. సిగరెట్లు, పొగాకు వంటి హానకరమైన ఉత్పత్తుల వినియోగాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించ కూడదని ఆ చట్టం చెబుతుంది. దీంతో ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు వాటిని ప్రమోట్ చేయడం లేదు. -
ఆ యాడ్ చేస్తే.. రూ. కోట్లలో ఇస్తామన్నారు: స్మృతి ఇరానీ
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా, రాజకీయవేత్తగా, అందరికీ సుపరిచితురాలే. 2014లో మోదీ కేబినెట్లో మంత్రి పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా స్మృతి ఇరానీ నిలిచారు. తొలుత టెలివిజన్ నటి అయిన స్మృతి అనంతరం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అమె మోడల్ రంగంలో కూడా రానించారు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' టీషర్ట్ కావాలంటే ఉచితంగా ఇలా బుక్ చేసుకోండి) తాజాగ ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని టీవి సీరియల్స్లలో పనిచేస్తున్న రోజుల్ని గుర్తుచేసుకున్నారు. నటిగా తను కెరీర్ ప్రారంభించిన రోజుల్లో తన వద్ద సరిగ్గా డబ్బుల్లేవు. షూటింగ్‌ల ద్వారా వచ్చే డబ్బు సరిపోయేది కాదు. కనీసం బ్యాంక్ ఖాతాలో రూ.30 వేలు కూడా ఉండేవి కాదని గుర్తు చేసుకుంది. తనకు పెళ్లైన కొత్తలో బ్యాంక్ నుంచి రూ.25 లక్షలు లోన్ తీసుకుని ఒక ఇంటిని కొనుగోలు చేశామని తెలిపారు. కానీ ఆ సమయంలో ఇంటికి సంబంధించిన ఈఎంఐ చెల్లించడం చాలా కష్టంగా అనిపించేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదు. అలాంటి సమయంలో ఓరోజు తన వద్దకు కొంతమంది వ్యక్తులు వచ్చి ఒక భారీ ఆఫర్ ఇచ్చారని ఇలా తెలిపింది. 'పాన్ మసాలా యాడ్‌లో పనిచేయమని, అందుకోసం రూ.కోట్లలో డబ్బులు ఇస్తామని భారీ ఆఫర్ చేశారు. కాకపోతే ఆ ఆఫర్‌ను నేను తిరస్కరించాను. దీంతో నా స్నేహితులు.. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా..? అంత డబ్బు ఇస్తామంటే ఎందుకని కాదంటున్నావు' అని అని స్మృతి ఇరానీ తెలిపారు. (ఇదీ చదవండి: నయనతార రిచ్ లైఫ్.. సొంతంగా విమానంతో పాటు ఇవన్నీ కూడా) ఆ సమయంలో సీరియల్ ద్వారా ప్రేక్షకులందరూ తనను తమ కుటుంబ సభ్యురాలిగా భావించారని ఇరానీ తెలిపారు. దీంతో పాన్ మసాలా లాంటి యాడ్స్‌లో నటిస్తే వాళ్లు ఎలా తీసుకుంటారోననే ఆలోచన రావడంతో నో చెప్పానని ఆమె తెలిపారు. అంతే కాకుండా చిన్నపిల్లలు కూడా ఈ యాడ్స్ చూసే ప్రమాదం ఉండటంతో పాన్ మసాలా, అల్కహాల్ కంపెనీలకు చెందిన యాడ్స్‌కు దూరంగా ఉంటూ వచ్చానని స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. -
బాలీవుడ్ హీరోల భార్యలకు లేఖలు
బాలీవుడ్ నటుల భార్యలకు ఢిల్లీ ప్రభుత్వం లేఖలు రాస్తోంది. షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, అర్బాజ్ ఖాన్, గోవిందా.. వీళ్లందరి భార్యలకు లేఖలు రాసిన ఢిల్లీ ఆరోగ్యమంత్రిత్వ శాఖ.. వాళ్లను పాన్ మసాలా ఉత్పత్తుల ప్రకటనలలో నటించొద్దని కోరాలని అడుగుతోంది. ఈ ఉత్పత్తుల వల్ల కేన్సర్ వస్తుందని, అందువల్ల ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా వాళ్లను ఆ ప్రకటనలలో నటించొద్దని కోరాలని ఆ లేఖలలో పేర్కొన్నారు. షారుక్ భార్య గౌరీఖాన్‌కు ఈ మేరకు ఓ లేఖ వెళ్లింది. ఆమెతోపాటు ఇతర హీరోల భార్యలకు కూడా ఈ తరహా లేఖలు వెళ్లాయి. ఇంతకుముందు షారుక్ ఖాన్‌కు కూడా ఈ ప్రకటనలలో నటించొద్దంటూ ఓ లేఖ రాశామని, కానీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని, అందుకే ఇప్పుడు మీకు లేఖ రాయాల్సి వచ్చిందని గౌరికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పొగాకు లేదా నికోటిన్ లేని పాన్ మసాలాలో కూడా తప్పనిసరిగా సుపారీ ఉంటుందని, దానివల్ల కూడా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇంతకుముందు బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్‌కు కూడా పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్రకటనలలో నటించొద్దని కోరుతూ ఇలాంటి లేఖనే రాశారు.