SGT posts
-
డీఎస్సీ–2008 బీఈడీ అభ్యర్థులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–2008లో ఉద్యోగాలు పొందని బీఈడీ అభ్యర్థులను ఉమ్మడి జిల్లాలవారీగా కాంట్రాక్టు సర్విసుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 1,300 మంది అభ్యర్థులకు ఈ ఉత్తర్వులతో కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా అవకాశం లభించనుంది. డీ.ఎడ్ విద్యార్హతగల అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2009 జనవరి 29న జారీ చేసిన జీవో–28 కారణంగా ఉద్యోగాలు పొందని బీఈడీ అభ్యర్థుల వివరాలను ప్రభుత్వం పాఠశాల విద్య డైరెక్టర్‌ను కోరింది.ఈ మేరకు డీఎస్సీ–2008లో ఎఫెక్ట్ అయిన బీఈడీ అభ్యర్థుల వివరాలను ఉమ్మడి జిల్లాలవారీగా సేకరించి జాబితా రూపొందించినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. వెరిఫికేషన్ ఫాంలను కూడా రూపొందించి www.rchooedu.tea nfana.gov.in వెబ్సైట్లో అందుబాటలో ఉంచినట్లు తెలిపారు. డీఎస్సీ–2008 బీఈడీ అభ్యర్థులు ఈ వెబ్సైట్ నుంచి వెరిఫికేషన్ ఫాంలను డౌన్లోడ్ చేసుకొని వివరాలు నింపడంతోపాటు కాంట్రాక్టు సేవల్లో పనిచేయడానికి సమ్మతి తెలియజేస్తూ పూర్వ జిల్లా డీఈవోకు సమర్పించాలన్నారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 10 వరకు ఉమ్మడి జిల్లా డీఈవో వద్ద సరి్టఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. ఆ తరువాత దరఖాస్తులను అనుమతించబోరని స్పష్టం చేశారు. -
25 వేల మంది ఎస్జీటీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖ చేపట్టిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. సోమవారం ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 25 వేల మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు (ఎస్జీటీలు) బదిలీ ఉత్తర్వులు అందాయి. వీరితో పాటు స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలు.. అంతా కలిపి ఇప్పటివరకూ 40 వేల మందికి స్థానచలనం కలిగింది. కొత్తగా కేటాయించిన స్థానాల్లో వీలైనంత త్వరగా చేరాలని, విద్యార్థుల బోధనకు ఇబ్బంది లేకుండా చూడాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం టీచర్లకు సూచించింది. కాగా చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించేందుకు అధికారులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. వారంలో సమస్యలన్నీ పరిష్కరించాలని నిర్ణయించారు. ఎట్టకేలకు కొలిక్కి.. టీచర్ల బదిలీలు, పదోన్నతుల వ్యవహారం కోర్టు వివాదాలు, ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలతో కొన్నేళ్లుగా జటిలంగా మారింది. జిల్లాల పునర్విభజన తర్వాత 317 జీవో అమలు సందర్భంగానూ ఈ వ్యవహారం అనేక సమస్యలకు దారి తీసింది. సీనియారిటీ ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల జూనియర్లు దూర ప్రాంతాలకు వెళ్లారని, భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేయాల్సి వస్తోందనే ఆందోళన వ్యక్తమైంది. కాగా ప్రస్తుతం ఇవన్నీ కొలిక్కి వచ్చినట్టేనని అధికారులు చెబుతుండగా, మరోవైపు బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. సమస్యలేంటి? స్కూల్ అసిస్టెంట్లు వివిధ సబ్జెక్టులకు బోధించే అర్హత ఉండటంతో అన్నింటికీ ఆప్షన్లు ఇచ్చారు. కానీ ఒక్కదాంట్లోనే ప్రమోట్ చేయాలి. ఉదాహర ణకు సైన్స్, మేథ్స్ రెండు ప్రమోషన్లు వచ్చిన వ్యక్తి ఏదో ఒక దాంట్లోనే చేరతారు. దీంతో ఒక పోస్టు ఖాళీ అవుతుంది. 18,942 మందికి ప్రమోషన్లు ఇస్తే ప్రస్తుతం 17 వేల మంది విధుల్లో చేరారు. దీంతో మిగతా దాదాపు 2 వేల మందికి పదోన్నతులు కల్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. వివిధ మండలాల్లో ఒకే ఊరు పేరుతో ఉన్న స్కూళ్ళు ఉండటంతో ఆన్లైన్లో సమస్యలు వచ్చాయి. వీటిని సరి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద వారం రోజుల్లో సమస్యల పరిష్కార ప్రక్రియ పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖాళీలపై దృష్టి అన్ని స్థాయిల్లోనూ ప్రమోషన్లు, బదిలీలు ముగియడంతో పాఠశాల విద్యాశాఖలో వాస్తవ ఖాళీలపై అధికారులు దృష్టి పెట్టారు. స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య, అవసరమైన టీచర్ల లెక్కతో హేతుబధ్దీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన మేరకు కొన్ని బదిలీలు చేసే ఆలోచనలో ఉంది. విద్యార్థులు లేని స్కూళ్ళల్లో ఎక్కువగా ఉన్న టీచర్లను.. విద్యార్థులు ఎక్కువ ఉన్న స్కూళ్ళకు బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం క్షేత్రస్థాయిలో టీచర్ పోస్టుల ఖాళీలు గుర్తించాల్సి ఉంటుంది. మలీ్టజోన్–1, జోన్–2 పరిధిలో దాదాపు 11 వేల మంది ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇచ్చారు. దీంతో ఈ పోస్టులు ఖాళీ అయ్యాయి. అదే విధంగా 2 వేల మంది స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. హెచ్ఎంల పదోన్నతులతో కూడా కలుపుకుంటే మొత్తం 18,942 మందికి ప్రమోషన్లు దక్కాయి. ఈ ఏడాది చివరి నాటికి రిటైర్ అయ్యే టీచర్లను కలుపుకుంటే దాదాపు 21 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. -
మెగా కాదు.. దగా డీఎస్సీ!
అనంతపురం అర్బన్/ సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ అంటూ అనంతపురం జిల్లాకు సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టుల కేటాయింపులో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని పలువురు ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్జీటీ పోస్టుల సంఖ్య అతి తక్కువగా చూపుతూ మెగా డీఎస్సీ అని చెప్పడం సరికాదని మండిపడ్డారు. పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం అనంతపురం పట్టణంలో వందలాది మంది అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు.అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ అభ్యర్థులు విష్ణు, గంగాధర్, జ్యోతి, హర్షబాను తదితరులు మాట్లాడుతూ ఎస్జీటీ పోస్టుల కేటాయింపులో ప్రభుత్వం అనంతపురం జిల్లాను చిన్నచూపు చూస్తోందన్నారు. జిల్లాలో డీఎడ్ చేసి ఎస్జీటీ పోస్టులకు సిద్ధమవుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారన్నారు. కానీ, జిల్లాకు కేవలం 183 ఎస్జీటీ పోస్టులు కేటాయించడం సరికాదన్నారు.డీఎస్సీ కోసం ఎదురు చూస్తూ తల్లిదండ్రులు పంపిన డబ్బులతో హాస్టళ్లు, రూముల్లో ఉంటూ శిక్షణ తీసుకుంటూ చదువుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తగినన్ని పోస్టులు లేకపోతే తాము తీవ్రంగా నష్టపోతామన్నారు. అనంతపురం జిల్లాలో కనీసం అంటే వెయ్యి ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటన్నింటినీ భర్తీ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో జి.రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎస్జీటీ పోస్టుల సంఖ్య పెంచాలి: డీవైఎఫ్ఐరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో ఎస్జీటీ పోస్టుల భర్తీలో నాలుగు జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పేర్కొంది. మెగా డీఎస్సీకి సంబంధించిన తొమ్మిది అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు రాసిన లేఖను డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాము, జి.రామన్న శనివారం మీడియాకు విడుదల చేశారు.‘మెగా డీఎస్సీలో ప్రకటించిన ఎస్జీటీ పోస్టుల విషయంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 104, ప్రకాశం జిల్లాలో 124, శ్రీకాకుళం జిల్లాలో 144, అనంతపురం జిల్లాలో 183పోస్టులు మాత్రమే చూపించారు. ఆ నాలుగు జిల్లాలకు పోస్టుల సంఖ్య పెంచి అభ్యర్థులకు న్యాయం చేయాలి. అప్రెంటీస్ విధానాన్ని, జీవో 117ను రద్దు చేయాలి. వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి. ప్రస్తుతం ప్రకటించిన 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయగా, ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది వెల్లడించాలి.గతంలో రద్దు చేసిన పాఠశాలలను, పీఈటీ పోస్టులను పునరుద్ధరించాలి. ఈ సంవత్సరం చివరి నాటికి రిటైర్డ్ అవుతున్న ఉపాధ్యాయుల లెక్కలు, రాష్ట్రంలో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలను దృష్టిలో పెట్టుకుని పోస్టులు భర్తీ చేయాలి. ఉపాధ్యాయుల పదవీవిరమణ వయసును 62ఏళ్ల నుంచి 58 ఏళ్లకు తగ్గించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
డీఎడ్ అర్హులకే ఎస్జీటీ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: మెగా డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అర్హులే దరఖాస్తు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పేపర్–2 ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించడం లేదని వెల్లడించింది. బీఈడీ నేపథ్యంతో ఉన్న వాళ్లంతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ విధి విధానాలను రూపొందించింది. ఇందుకు సంబంధించిన సమాచార బులెటిన్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇప్పటికే డీఎస్సీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 2వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి, ఈసారి రిజర్వేషన్ అభ్యర్థులకు కొత్తగా ఇంటర్ మార్కుల అర్హతలో 5 మార్కులు సడలింపు ఇచ్చారు. టెట్ ఉత్తీర్ణులై, బీఈడీ, డీఎడ్ ఆఖరి సంవత్సరంలో ఉన్న వారు కూడా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్ష మొత్తం ఆన్లైన్ విధానంలో ఉంటుందని, 11 పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. కొత్తగా దరఖాస్తు చేసే వాళ్లు రూ.వెయ్యి పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సినవసరం లేదు. పరీక్షాకేంద్రాలు ఇవీ.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి. అయితే ఈ పట్టణాల్లో ఎన్ని పరీక్షాకేంద్రాలు ఉండాలనేది వచ్చే దర ఖాస్తుల ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు. మహిళలకు మూడోవంతు పోస్టులు ఉంటాయి. వయో పరిమితి మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసేవారు 18–46 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. 2005 జూలై 7కు ముందు పుట్టి ఉండాలి. 1977 జూలై 2 నుంచి పుట్టిన వారిని గరిష్ట వయో పరిమితిగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాలు, రోస్టర్ విధానాన్ని తర్వాత వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. నియామక విధానం రాత పరీక్షకు 80 మార్కులుంటాయి. టెట్ వెయిటేజ్ 20 శాతం ఉంటుంది. టీఎస్, ఏపీ టెట్, కేంద్ర టెట్లను పరిగణనలోనికి తీసు కుంటారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దర ఖాస్తు చేసే వారు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45%) డిగ్రీ ఉండాలి. బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి సంవత్సరం బీఈడీ అభ్యర్థులు నియామకం జరిగే నాటికి సర్టిఫికెట్ పొంది ఉండాలి. టెట్ పేపర్ 2 ఉత్తీర్ణులై ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు, సబ్జెక్టు టీచర్లు ఆయా సబ్జెక్టులతో బీఈడీ చేసి ఉండాలి. ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50% మార్కులతో ఇంటర్మిడియెట్ (రిజర్వేషన్ అభ్యర్థులకు 40%) పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల కాలపరిమితి గల డీఎడ్, నాలుగేళ్ల స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. పేపర్–1 టెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు సంబంధిత సబ్జెక్టుల్లో డీఎడ్ చేయాలి. -
ఏపీ: డీఎస్సీ–2008 కాంట్రాక్టు ఎస్జీటీ మిగులు పోస్టుల భర్తీకి చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2008 డీఎస్సీలో అర్హులైన వారిని కాంట్రాక్టు ఎస్జీటీలుగా నియమించగా మిగిలిపోయిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులకు, ఆర్జేడీలకు విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు సోమవారం ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,193 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో మినిమమ్ టైం స్కేల్ మీద తీసుకోవాలని జూన్ నెలలో ఆదేశాలు వెలువడ్డాయి. వీరిలో 144 మంది వివిధ కారణాల వల్ల డ్యూటీలలో చేరలేదు. ఈ మిగులు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్ డీఈవోలకు సూచించారని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక నేతలు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, కరణం హరికృష్ణ, సింహాచలం పేర్కొన్నారు. ఇవీ చదవండి: తాగుబోతు రాతలేల? పాతాళ గంగ.. కరువు తీరంగ -
డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జీటీ పోస్ట్‌లు
సాక్షి, విశాఖపట్నం: డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జీటీ పోస్ట్‌లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కాగా రేపటి నుంచి అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 306-1918 ర్యాంక్ వరకు 110 మంది అభ్యర్థులకు రేపు కౌన్సెలింగ్ జరగనుండగా, 1921-8659 ర్యాంక్ వరకు 119 మందికి ఈనెల 26న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. deovsp.netలో విల్లింగ్ జాబితా, చెక్‌లిస్ట్ అందుబాటులో ఉంచామని డీఈవో లింగేశ్వర్రెడ్డి తెలిపారు. చదవండి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు -
12 ఏళ్ల కల సాకారం: మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: తన పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. డీఎస్సీ–2008 క్వాలిఫైడ్ అభ్యర్థుల కలను సాకారం చేశారు. వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. గత ముఖ్యమంత్రులెవ్వరూ పట్టించుకోని ఈ సమస్యను.. సీఎం వైఎస్ జగన్ పరిష్కరించారు. 2,193 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీలు)గా నియమించారు. సీఎం ఆదేశాల మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ సోమవారం దీనికి సంబంధించిన జీవో 39 జారీ చేశారు. మానవతా దృక్పథంతో.. డీఎస్సీ–2008లో అర్హత సాధించినప్పటికీ ప్యాట్రన్‌లో మార్పుల వల్ల పలువురు అభ్యర్థులు అప్పట్లో అవకాశాలు కోల్పోయారు. దీంతో గత ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ అభ్యర్థులు కాళ్లరిగేలా తిరిగారు. చివరకు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా ఆశ్రయించారు. అయినా గత ప్రభుత్వాలు న్యాయం చేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపారు. చివరకు అనేక పోరాటాల ద్వారా ఒత్తిడి చేస్తే.. తూతూమంత్రంగా ఓ ఎమ్మెల్సీల కమిటీ వేశారు. వీరికి విద్యా వలంటీర్లుగా కానీ, కాంట్రాక్టు పద్ధతిలో గానీ, అవుట్‌సోర్సింగ్‌లో గానీ ఉద్యోగాలిచ్చి, 60 ఏళ్ల వరకు జాబ్ సెక్యూరిటీ ఉండేలా చూడాలని ఆ ఎమ్మెల్సీల కమిటీ సిఫార్సు చేసింది. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత.. ఎమ్మెల్సీ కమిటీ సిఫార్సులను పరిశీలించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో మరో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యయనం చేసి అర్హులైన అభ్యర్థుల్లో మినిమమ్ టైమ్ స్కేల్‌పై కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు అంగీకరించే వారిని ఎస్జీటీలుగా నియమించాలని సిఫార్సు చేసింది. మానవతా దృక్పథంతో దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాఠశాల విద్యా శాఖ క్వాలిఫైడ్ అభ్యర్థులను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. మొత్తం 4,657 మందిలో 2,193 మంది తమ సమ్మతి లేఖలు అందించారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను ఇటీవల సీఎం వైఎస్ జగన్‌కు పంపగా.. ఆయన ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రయోజనాలు, నిబంధనలివే.. – వీరి నియామకం కాంట్రాక్టు సిబ్బందికి వర్తించే నిబంధనలు, షరతులతో 60 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉంటుంది. – 2008 డీఎస్సీకి సంబంధించిన ఈ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆ తర్వాత వచ్చిన డీఎస్సీలో పేర్కొన్న ఇతర విద్యా, సాంకేతిక అర్హత నిబంధనలను రెండేళ్లలో సాధించాలి. – అలాగే రెండేళ్లలో ఎన్సీటీఈ ఆమోదించిన ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. – ఇతర కాంట్రాక్టు టీచర్లకు అమలయ్యే ప్రయోజనాలు వీరికి కూడా వర్తిస్తాయి. రెగ్యులర్ టీచర్లకు వచ్చే ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. – మానవతా దృక్పథంతో 2008 డీఎస్సీ అభ్యర్థుల వరకు మాత్రమే ఈ నియామక ప్రక్రియ. తదుపరి ఇది ప్రామాణికం కాదు. – కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ అభ్యర్థులను నియమించిన ఖాళీల సంఖ్య.. భవిష్యత్ ఎస్జీటీ పోస్టులకు ఇచ్చే నియామకాల్లో తగ్గిస్తారు. చదవండి: ఏపీ: ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు నూతన ఎమ్మెల్సీలు -
ఎస్జీటీ ఉద్యోగార్థులకు ఏపీ శుభవార్త
సాక్షి, విజయవాడ: డీఎస్సీ- 2018లో ఉత్తీర్ణులైన ఎస్జీటీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువడిందన్న విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎస్జీటీ కేటగిరీలో 3524 పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 2203 అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తైందని, మిగిలిన 1321 మంది రికార్డుల వెరిఫికేషన్ నేటితో పూర్తవుతుందన్నారు. బుధవారంలోగా ఎస్ఎంఎస్లతో అభ్యర్థులకు సమాచారం అందిస్తామని తెలిపారు. ఈనెల 24న సర్టిఫికేట్ వెరిఫికేషన్, 25, 26 తేదీల్లో మిగిలిన ప్రక్రియ పూర్తి చేసి, 26న అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అదే విధంగా స్కూలు అసిస్టెంట్లు ఖాళీలకు భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలోనే డీఎస్సీ-2020 విడుదల చేస్తామన్నారు. ఈ మేరకు మంగళవారమిక్కడ ఆదిమూలపు సురేశ్‌తో మాట్లాడుతూ.. డీఎస్సీ 2020కి ఏ అడ్డంకులూ లేవని, పెండింగ్‌లో ఉన్న డీఎస్సీలకు కూడా త్వరలో ఉత్తర్వులు వెలువడతాయన్నారు. టెట్ సిలబస్ కూడా మారుతున్న విద్యార్ధుల అవసరాల మేరకు ఆధునికీకరించి తయారుచేస్తామని తెలిపారు. ఇక డీఎడ్ కేసు విషయం కోర్టులో వాయిదా పడిందని, ట్రిపుల్ ఐటీకి సంబంధించినంత కార్యాచరణపై రేపు తుది నిర్ణయం తీసుకోనున్నామని పేర్కొన్నారు. రేపు సాయంత్రం ఎస్జీకేటీ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నిర్ణయం వెలువడుతుందన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో ప్రాధమిక విషయాలు వదలకుండా సిలబస్ కుదించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇక డౌట్లు క్లియర్ చేసుకోవడానికే స్కూల్స్ ప్రారంభమయ్యాయని, 9,10, ఇంటర్ విద్యార్ధులు స్కూలుకు వస్తున్నారన్నారు. అయితే తల్లిదండ్రుల అనుమతితోనే స్కూలుకు రావాలని స్పష్టం చేశారు. అదే విధంగా యాభై శాతం మాత్రమే ఉపాధ్యాయులు స్కూళ్ళకు వస్తారన్నారు. జాతీయ విద్యా విధానంలో ఏపీ ఇప్పటికే ముందుందని, 5+3+3+4 విధానంలో విద్య అమలు చేయనున్న మొదటి రాష్ట్రం మనదేనని హర్షం వ్యక్తం చేశారు. ఇక జగనన్న విద్యా దీవెన కిట్లు ఇప్పటికే స్కూళ్లకు చేరిందన్నారు. అదే విధంగా ఇంటర్ కొత్త కాలేజీలకు అనుమతి ఇచ్చిన తరువాత ఆన్లైన్ అడ్మిషన్లు గురించి చెబుతామన్నారు. ఒక్కొక్క ఇంటర్మీడియట్ కాలేజీ బ్రాంచికి 40 సీట్లు మాత్రమే ఇస్తామని తెలిపారు. ఇక కరోనా నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్ళు ఎక్కడైనా ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చి ఉండకపోతే చర్యలు తీసుకుంటామని ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. -
త్వరలోనే డీఎస్సీ 2020: ఆదిమూలపు సురేశ్
-
సీట్లు 65 వేలు.. దరఖాస్తులు 20 వేలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎలిమెంటరీ టీచర్ శిక్షణ విద్యా కోర్సు (డీఎడ్)కు ఆదరణ తగ్గిపోతోందా? ఈ కోర్సు పట్ల విద్యార్థులకు ఆసక్తి తగ్గుతోందా? అంటే.. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. తాజాగా ప్రకటించిన డీసెట్–2019కి అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన లేదు. ఏప్రిల్ 22వ తేదీతో డీసెట్‌కు గడువు ముగియగా 17 వేల మందే దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో 33 ప్రభుత్వ, 891 ప్రయివేటు డీఎడ్ కాలేజీల్లో 65,350 సీట్లున్నాయి. తక్కువ మంది దరఖాస్తు చేసుకోవడంతో అధికారులు డీసెట్ గడువును ఏప్రిల్ 28 వరకు పెంచినా వచ్చిన దరఖాస్తులు 18,544 మాత్రమే. దీంతో మళ్లీ మే ఐదో తేదీ వరకూ గడువు పొడిగించారు. ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో కాలేజీల్లో సీట్లు ఎలా భర్తీచేయాలో అధికారులకు, కాలేజీల యాజమాన్యాలకు అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఏటా డీఎస్సీ అని ప్రకటించి కేవలం ఒకే ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది డీసెట్‌కు 56 వేల దరఖాస్తులొచ్చాయి. 15, 16 తేదీల్లో ఆన్లైన్ పరీక్ష డీసెట్‌ను ఆన్లైన్లో 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈసారి దరఖాస్తులు తక్కువ రావడంతో ఆన్లైన్ పరీక్షలు ఎలా నిర్వహించాలన్న సందిగ్ధంలో అధికారులున్నారు. మరోపక్క ఇంటర్ అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షలు, డీసెట్ ఒకేసారి జరుగుతుండటం కూడా దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. ఇంటర్ పరీక్షలు 14 నుంచి 22 వరకూ జరగనున్నాయి. అయితే డీసెట్ జరిగే 15, 16 తేదీల్లో ఇంటర్ పరీక్షల్లేకుండా రెండు రోజులు వాయిదా వేయాలని పాఠశాల విద్యాశాఖ.. ఇంటర్ బోర్డుకు లేఖ రాసింది. షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు అధికారులు స్పష్టంచేశారు. అయితే డీసెట్‌ను ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున వాయిదా వేసే అవకాశం లేకుండాపోయిందని అధికారులంటున్నారు. మరోసారి ఇంటర్ బోర్డుకు లేఖ రాస్తామని కన్వీనర్ పార్వతి చెప్పారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రెండు రోజులు వాయిదా పడితే దరఖాస్తులు పెరిగే అవకాశముంది. బీఈడీకి దరఖాస్తులు రెట్టింపు ఇదిలా ఉండగా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు బీఈడీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 350 బీఈడీ కాలేజీలుండగా 45 వేల వరకు సీట్లున్నాయి. వీటికి గతంలో వచ్చిన దరఖాస్తులు ఎనిమిది వేలలోపే. పరీక్ష రాసి అర్హత సాధించాక కాలేజీల్లో చేరేవారి సంఖ్య ఐదు వేలకు మించేదికాదు. దీంతో రాష్ట్రంలోని ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల్లో దళారీలను నియమించుకుని అక్కడి విద్యార్థులను చేర్చుకుని సీట్లు భర్తీచేసుకునేవి. అయితే బీఈడీ అభ్యర్థులకు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకూ అనుమతిస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిర్ణయం తీసుకుంది. దీంతో బీఈడీ చేసిన వారికి అవకాశాలు మెరుగయ్యాయి. ఈ నేపథ్యంలో ఎడ్‌సెట్‌కు దరఖాస్తులు పెరిగాయి. ఎడ్‌సెట్–2019కి ఇప్పటివరకు 22 వేలకు పైగా దరఖాస్తులొచ్చాయి. గతేడాదితో పోలిస్తే వీటిసంఖ్య మూడు రెట్లు అయినట్లు అధికారులు చెబుతున్నారు. -
డీఎస్సీకి కొత్త చిక్కులు
తెర్లాం మండలం నందిగాం గ్రామానికి చెందిన ఈయన పేరు గొట్టాపు సతీష్. ఈయన సోషల్ స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లిష్ పోస్టులు రెండింటికీ అర్హత కలిగి ఉంటంతోరెండు పరీక్షలకూ దరఖాస్తు చేసుకున్నారు. రెండింటికి జిల్లా కేంద్రాన్ని వెబ్ ఆప్షన్స్గాపెట్టారు. అయితే ఉదయం పూట జరిగే సోషల్ పోస్టుకు శ్రీకాకుళం, అదే రోజు మధ్యాహ్నం పూట జరిగే ఇంగ్లిష్ పోస్టుకు విజయనగరం పరీక్ష కేంద్రాన్ని ఎలాట్ చేశారు. ఇప్పుడు రెండు పరీక్షలు ఎలా రాయాలో తెలీయక ఒక పరీక్ష మాత్రమే రాయగలుగుతాననీ, రెండో అవకాశం కోల్పోతున్నాననీ, రెండూ ఒకే పట్టణంలో రాసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ నిరుద్యోగులకు డీఎస్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకున్న సమయంలో వచ్చిన సమస్యలు ఇప్పుడిప్పుడే ముగిశాయి. తాజాగా పరీక్ష కేంద్రాలకు ఎంపిక ఆప్షన్ కష్టాలు మొదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఎస్జీటీ అభ్యర్థుల ఈ–ఎంపిక వెబ్ సైట్ ఆప్షన్ ద్వారా సోమవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జరగాలి. ఇందుకోసం ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల పోర్టల్ సోమవారం ప్రారంభం అవ్వాలి. అయి తే సోమవారం సాయంత్రం వరకు ఎస్జీటీల ఆప్షన్ కాలమ్ తెరచుకోలేదు. ఇటీవల ముగిసిన స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల పరీక్ష కేంద్రాల వెబ్ ఆప్షన్ ప్రక్రియలో విభిన్న సమస్యలను అభ్యర్థులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఆప్షన్ పరిధి రాష్ట్రస్థాయిలో ఉండడం వల్ల కోరుకున్న పరీక్ష కేంద్రాన్ని దక్కించుకోలేకపోతున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న శిక్షణా కేంద్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఇక్కడి పరీక్ష కేంద్రాలనే ఎంచుకోవడంతో ఆలస్యంగా వెబ్ ఆప్షన్ ఇచ్చిన వారికి పక్క జిల్లాల కేంద్రాలనుకేటాయిస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ల పరీక్ష కేంద్రాలకు ఎదురైన ఈ సమస్య తెలుసుకున్న ఎస్జీటీ అభ్యర్థులు తొలిరోజే ఆప్షన్స్ పెట్టుకోవాలని తొందరపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం పలు నెట్ సెంటర్లకు పరుగులు తీశారు. వెబ్ ఆప్షన్ పోర్టల్‌లో కనిపించకపోవడం చూసి ప్రభుత్వ కాల్ సెంటర్ 1100కి కాల్ చేసారు. ఈ నెల 16 నుంచి వెబ్ ఆప్షన్ ఓపెన్ అవుతాయని ఓరల్‌గా సమాధానం వచ్చింది. కానీ ఇదే సమాచారాన్ని అధికారికంగా వెబ్సైట్లో పెట్టి తెలియజేయజేస్తారని ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17నుంచి హాల్ టిక్కెట్లు విడుదల చేయాల్సి ఉంది. అయితే కాల్ సెంటర్ నుంచి వచ్చిన సమాధానం దీనికి విభిన్నంగా ఉండడంతె అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. పోర్టల్‌లో కనిపించని పరీక్షల పొడిగింపు తేదీలు డీఎస్సీ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను పొడిగిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. అయితే ఆ తేదీలను డీఎస్సీ పోర్టల్‌లో ఇప్పటికీ పెట్టలేదు. ఇటీవల ముగిసిన స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల అభ్యర్థుల పరీక్ష కేంద్రాల ఆప్షన్స్ గుర్తింపు కార్డులు పాత తేదీలతోనే విడుదలయ్యాయి. అసలు పరీక్షల తేదీలు పొడింగించారో లేదోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభ్యర్ధులు కంగారు పడుతున్నారు. ఒకే రోజు వేర్వేరు జిల్లాల్లో రెండు పరీక్షలు ఆన్లైన్ పరీక్షల నిర్వహణ వల్ల పరీక్ష కేంద్రాల ఆప్షన్స్ ఏ జిల్లానైనా ఎంపిక చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. వివిధ కేటగిరీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వేర్వేరుగా పరీక్ష రాయవచ్చు. ఉదయం, మధ్యాహ్నం వేర్వేరు పోస్టులకు పరీక్ష ఉంటుంది. అయితే ఆ రెండు పరీక్షలు రాసే అభ్యర్థికి పరీక్ష కేంద్రాలు అందుబాటులో కేటాయించకపోవడం వల్ల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట పరీక్షకు పక్కజిల్లాలో, మధ్యాహ్నం పూట జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాలను కేటాయించడంవల్ల అనేక మంది ఒక్క పరీక్షకే పరిమితం కావాల్సి ఉంటుంది. -
డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ సర్కార్ మరో షాక్
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2018కి సంబంధించి రోజుకో నిర్ణయం వెలువరిస్తూ ప్రభుత్వం లక్షలాది మంది అభ్యర్థులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. పరీక్షలు మరో 12 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో 250 ఎస్జీటీ పోస్టులను పీఈటీ పోస్టులుగా మార్పు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో 79 జారీ చేసింది. పరీక్షల సమయాన్ని 3 గంటల నుంచి 2.30 గంటలకు కుదించింది. దీనిపై నిరుద్యోగులు అగ్గిమీద గుగ్గిలమవడంతో తిరిగి మూడు గంటలకు మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. తగ్గిపోయిన ఎస్జీటీ పోస్టులు 372 డీఎస్సీ–2018 నోటిఫికేషన్లో భాగంగా 7,729 పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఆ తర్వాత మరో 173 పోస్టులను కలిపింది. మొత్తం పోస్టుల్లో 47 మాత్రమే పీఈటీ పోస్టులు. దీనిపై పీఈటీ అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వానికి పోస్టుల సంఖ్యను పెంచాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం ఆర్థిక భారం పేరిట అంగీకరించకుండా ఎస్జీటీ పోస్టులను పీఈటీ పోస్టులుగా మార్చి పీఈటీ పోస్టులను 372కి పెంచి నోటిఫికేషన్ ఇచ్చింది. ఫలితంగా ఎస్జీటీ పోస్టులు 4,211 ఉండాల్సి ఉంటే 3,839 మిగిలాయి. 122 పోస్టులను గతంలోనే పీఈటీ పోస్టులుగా మార్చారు. ఎస్జీటీ పోస్టులకు పోటీ తీవ్రం గతంలో కేవలం డీఎడ్ చేసిన వారికి మాత్రమే ఎస్జీటీ పోస్టులకు అర్హత ఉండగా ఈసారి బీఈడీ చేసినవారికి, బీటెక్‌తో బీఈడీ చేసినవారికీ అవకాశం కల్పించారు. ఫలితంగా ఈ పోస్టులకు గతంలో ఎన్నడూ లేనంతగా పోటీ పెరిగింది. ఎస్జీటీ పోస్టులకు టెట్ కమ్ టీఆర్టీ–2014లో కేవలం 58 వేల మంది మాత్రమే పోటీపడగా ఈసారి 3,45,733 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అంటే.. ఒక్కసారిగా ఆరు రెట్లు పోటీ పెరిగింది. ఒక్కో ఎస్జీటీ పోస్టుకు దాదాపు వందమంది చొప్పున పోటీపడుతున్నారు. అభ్యర్థులు లక్షల్లో ఉన్న తరుణంలో పోస్టులను పెంచాల్సింది పోయి ఉన్న పోస్టుల్లోనే కోతపెట్టడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. పీఈటీ పోస్టులు పెంచాలని భావిస్తే ప్రభుత్వం కొత్త పోస్టులు ఇవ్వాలి. కానీ ఎస్జీటీ పోస్టులకు కోత పెట్టి నిరుద్యోగుల కడుపుకొడుతోంది. టెట్ కమ్ టీఆర్టీతో సతమతం ఈసారి టీచర్ పోస్టుల భర్తీలో ఎస్జీటీ పోస్టులకు టెట్ కమ్ టీఆర్టీని, ఇతర పోస్టులకు డీఎస్సీని ప్రకటించారు. టెట్‌ను కలపడంతో అభ్యర్థులు డీఎస్సీ సిలబస్‌తోపాటు టెట్ సిలబస్‌ను కూడా చదవాల్సి వస్తోంది. డీఎస్సీలో 160 ప్రశ్నలు మాత్రమే ఉండేవి. కానీ టెట్ కమ్ టీఆర్టీలో ఆ ప్రశ్నల సంఖ్య 200కు పెరిగింది. డీఎస్సీని ఈసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎస్జీటీలో ప్రశ్నల సంఖ్య పెరగడం, పరీక్ష సమయం కుదింపు, అవగాహన లేని ఆన్లైన్ పరీక్షతో మరిన్ని కష్టాలు తప్పవని వాపోతున్నారు. పరీక్ష సమయంపై గందరగోళం డీఎస్సీ నోటిఫికేషన్‌కు, పరీక్షల షెడ్యూల్‌కు మధ్య సమయం చాలా తక్కువగా ఉందని, తమ సన్నద్ధతకు సమయం చాలదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. పైగా నోటిఫికేషన్ వెలువరించిన తర్వాత సిలబస్‌ను ప్రకటించడంతో ఆ సమయం కూడా కుదించుకుపోయింది. ముందు ఎస్జీటీ పోస్టులకు ఎనిమిదో తరగతి వరకు ఉన్న అంశాలకే పరిమితం చేస్తూ సిలబస్‌ను ప్రకటించారు. సరిగ్గా పరీక్షలకు పక్షం రోజుల ముందు ఈ సిలబస్‌ను పదో తరగతి అంశాలతో సమానం చేయడంతో పాటు డీఎస్సీలో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయని కొత్త నిబంధన విధించారు. దీనిపై నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది. గోరుచుట్టుపై రోకటిపోటులా పరీక్ష సమయంపై కూడా అభ్యర్థులను అయోమయానికి గురిచేశారు. నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టుల పరీక్షకు మూడు గంటల సమయం ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు అరగంట కోతపెట్టి దాన్ని 2.30 గంటలకు కుదించారు. దీనిపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో శుక్రవారం అర్ధరాత్రివేళ తిరిగి పరీక్ష సమయాన్ని మూడు గంటలకు పెంచుతూ తాజా నోటిఫికేషన్ జారీ చేశారు. -
బీఈడీ అభ్యర్థులకు తీపి కబురు
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అభ్యర్థులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఎనిమిదేళ్లుగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు దూరమైన బీఎడ్ అభ్యర్థులకు మళ్లీ ఎస్జీటీ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 4 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు ఎస్జీటీ పోస్టులకూ అర్హులు కానున్నారు. అయితే ఒకటి నుంచి 5వ తరగతి వరకూ బోధించేందుకు టీచర్‌గా ఎంపికయ్యే బీఎడ్ అభ్యర్థి తాను నియామకం అయిన తేదీ నుంచి రెండేళ్లలోగా తాము గుర్తించిన విద్యా సంస్థ నుంచి ఎలిమెంటరీ విద్యలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని ఎన్సీటీఈ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అసలేం జరిగిందంటే.. బీఎడ్‌లో చైల్డ్ సైకాలజీ లేదని, చిన్న పిల్లలకు వారు బోధించేందుకు అర్హులు కాదని, 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఎస్జీటీ పోస్టులకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) అభ్యర్థులే అర్హులంటూ 2008లో డీఎడ్ అభ్యర్థుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయిం చింది. వాదోపవాదాల తర్వాత 2010లో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులని, బీఎడ్ అభ్యర్థులు అర్హులు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు బీఎడ్ వారు అర్హులు కాదని 2010 ఆగస్టు 23న ఎన్సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో చేపట్టిన నియామకాల్లో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను తీసుకోలేదు. వారిని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం చేసింది. ఎస్జీటీ పోస్టులను డీఎడ్ అభ్యర్థులతోనే భర్తీ చేస్తూ వచ్చాయి. బీఎడ్ అభ్యర్థుల అభ్యర్థనతో.. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని, చైల్డ్ సైకాలజీ సబ్జెక్టును ప్రత్యేకంగా చదువుకుంటామని అనేకసార్లు బీఎడ్ అభ్యర్థులు ఎన్సీటీఈని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టింది. 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఎడ్ పూర్తి చేసిన వారు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు అర్హులేనని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్జీటీగా నియమితులైన రెండేళ్లలోగా ఎలిమెంటరీ విద్యలో 6 నెలల బ్రిడ్జి కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఎలిమెంటరీ విద్యలో బ్రిడ్జి కోర్సు లేదు. దానిని ఎన్సీటీఈ ప్రవేశ పెడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు డీఎడ్ అభ్యర్థులకు ఇప్పటివరకు ఎస్జీటీ పోస్టుల్లో ఉన్న పూర్తి అవకాశం తగ్గిపోనుంది. డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ఇద్దరికి వాటిల్లో అవకాశం ఉండనుంది. మళ్లీ పూర్వవైభవం వస్తుందా? ఒకప్పుడు ఏడాది కోర్సుగానే ఉన్న బీఎడ్‌ను ఎన్సీటీఈ 2014లో రెండేళ్ల కోర్సుగా మార్పు చేయడం, బీఎడ్ వారికి ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం తొలగించడంతో బీఎడ్‌కు డిమాండ్ తగ్గిపోయింది. గతంలో బీఎడ్‌లో చేరేందుకు ఏటా లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2018–19లో బీఎడ్‌లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌కు 38 వేల మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్సీటీఈ తాజా నిర్ణయంతో బీఎడ్‌కు మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని, ప్రైవేటు పాఠశాలల్లోనూ అవకాశాలు విస్తృతం అవుతాయని అధికారులు చెబుతున్నారు. -
ఇంగ్లిష్, తెలుగు మీడియాలకు వేర్వేరు పరీక్షలే
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు ఇంగ్లిష్ మీడియం, తెలుగు మీడియానికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకునేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. గతంలో అభ్యర్థులు ఏ మీడియం పోస్టుకు దరఖాస్తు చేసుకుంటున్నారో ముందుగానే తెలియజేయాల్సి ఉండేది. ఏదైనా ఒకే మీడియానికే దర ఖాస్తు చేసుకునే వీలుండేది. అయితే ఇప్పుడు ఒకే అభ్యర్థికి రెండింటికీ అర్హతలుంటే రెండింటికీ దర ఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. రెండు మీడియాలకు వేర్వేరుగానే పరీక్షలు నిర్వహించేలా చర్య లు చేపట్టింది. దీంతో అభ్యర్థులు రెండు మీడియా ల పోస్టులకు వేర్వేరుగానే దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి వేర్వేరుగానే హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. వెబ్సైట్లో పరీక్షల షెడ్యూల్.. వివిధ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడికి సంబంధించి న షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఎస్జీ టీ పోస్టులకు 2018 ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు నిర్వహిస్తామని పేర్కొంది. వాటికి సంబంధించిన ప్రాథమిక కీలను మార్చి 1 నుంచి 5 వరకు ప్రకటిస్తామని, వాటిపై అభ్యంతరాలను అదే నెల 2 నుం చి 10 వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఫైనల్ కీని మార్చి 25న ప్రకటించి, ఏప్రిల్ 16 నుంచి 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనుంది. పోస్టులకు ఎంపికైన వారి జాబితాలను మే 10న ప్రకటించనున్నట్లు వివరించింది. స్టాఫ్ నర్సు పోస్టులు పెంపు.. వైద్యశాఖలో స్టాఫ్ నర్సు పోస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచిందని టీఎస్పీఎస్సీ తెలిపింది. 242 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, మరో 1,361 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్టాఫ్ నర్సు పోస్టులకు దరఖాస్తుల గడువును జనవరి 8 వరకు పొడిగించినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. అర్హతలు కలిగిన వారు వచ్చే నెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. -
ఏడు జిల్లాల్లో ఎస్జీటీ పోస్టులు సున్నా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులపై అభ్యర్థులు అంచనాల్లో పడ్డారు. తమ జిల్లాల్లో పోస్టుల పరిస్థితిని చూసి పెదవి విరుస్తున్నారు. కొన్ని జిల్లాల్లో పోస్టులే లేకపోగా.. చాలా జిల్లాల్లో తక్కువ పోస్టులు ఉండటంపై ఆవేదన చెందుతున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల కోసం 1.5 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తుండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసేవారు 2.5 లక్షల మందికి పైగా ఉన్నారు. నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య దారుణంగా ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పోస్టులు లేని జిల్లాల్లో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా అదనంగా పోస్టులు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు.ఇలాగైతే చదివేదెలా?: అభ్యర్థుల్లో దాదాపు 95% మంది తెలుగు మీడియం పోస్టుల కోసమే ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తెలుగు మీడియంలో.. అదీ ఏజెన్సీ ప్రాంత పోస్టులను తీసేస్తే (వీటికి మైదాన ప్రాంత అభ్యర్థులు అనర్హులు) ఇక మైదాన, పట్టణ ప్రాంతాల్లో పోస్టులే ఉండవని చెబుతున్నారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో తెలుగు మీడియం ఎస్జీటీ పోస్టు ఒక్కటీ లేదు. మరో 8 జిల్లాల్లో ఏజెన్సీ పోస్టులను మినహాయిస్తే ఎస్జీటీ పోస్టులు 11లోపే ఉన్నాయి. ఇలా సాధారణ అభ్యర్థుల విషయంలో 15 జిల్లాల్లో పోస్టులు దాదాపుగా లేనట్టే లెక్క. మరో 3 జిల్లాల్లో 50లోపే పోస్టులు ఉండటంతో అభ్యర్థులు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో పడ్డారు. ఇక తెలుగు మీడియం స్కూల్ అసిస్టెంట్ పోస్టులదీ అదే పరిస్థితి. ఇవి ఆరు జిల్లాల్లో 10లోపు పోస్టులే ఉన్నాయి. మరో 15 జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య 50లోపే ఉంది. సామర్థ్యాల్లో తేడాతో నష్టం! జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) ద్వారా కాకుండా పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి జిల్లాలోని 20 శాతం ఓపెన్ కోటా పోస్టుల్లో అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులే. అభ్యర్థులు ఇచ్చుకున్న ఆప్షన్ ప్రకారం.. మెరిట్ ఉన్న వారికి ఏదో ఒక జిల్లాలో ఆ పోస్టుల్లో ఎంపిక అవుతారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇది కరెక్టే. అయినా సామాజిక అంతరాలు, ప్రాంతాల వారీగా అభ్యర్థుల సామర్థ్యాల అంచనాకు వచ్చేసరికి ఇది నష్టం చేస్తుందని వెనుకబడిన జిల్లాలకు చెందిన అభ్యర్థులు వాపోతున్నారు. ఉదాహరణకు ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థుల సామర్థ్యాలకు నల్లగొండ జిల్లాకు చెందిన అభ్యర్థుల సామర్థ్యాలకు మధ్య వ్యత్యాసం భారీగా ఉంటుందని చెబుతున్నారు. అలాంటపుడు నల్లగొండ జిల్లాకు చెందిన అభ్యర్థులు ఓపెన్ కోటాలో తమకు వచ్చే మెరిట్ ప్రకారం ఆసిఫాబాద్ జిల్లాలో ఎంపిక కాగలుగుతారు తప్ప ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థులు నల్లగొండ జిల్లాలోని ఓపెన్ కోటాలో మెరిట్ ప్రకారం ఎంపిక కావడం అసాధ్యమని పేర్కొంటున్నారు. దీనివల్ల ఆసిఫాబాద్ జిల్లా అభ్యర్థులు ఓపెన్ కోటాలోని పలు పోస్టులను నష్టపోవాల్సి వస్తుందని వివరిస్తున్నారు. అదనపు పోస్టులు ఇస్తేనే మేలు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోస్టులు లేని జిల్లాల్లో అదనపు పోస్టులు ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. లేదంటే ఏళ్ల తరబడి ఈ పోస్టుల కోసమే ప్రిపేర్ అవుతున్న తాము తీవ్రంగా నష్ట్రపోవాల్సి వస్తుందంటున్నారు. ప్రస్తుతం ప్రకటించిన పోస్టులు 2016 సెప్టెంబర్ నాటికి ఖాళీ అయినవే. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఖాళీ అయిన పోస్టులను, వచ్చే ఏడాది మార్చి వరకు ఖాళీ కాబోయే పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరుతున్నారు. కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం? కొన్ని జిల్లాల్లో పోస్టులు లేకపోవడం.. మరికొన్ని జిల్లాల్లో పోస్టులు తక్కువగా ఉండటమే కాకుండా కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయడంపై కోర్టును ఆశ్రయించేందుకు రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘాలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని జోన్లలో 10 జిల్లాలనే పేర్కొన్నారు. అందులో 31 జిల్లాలు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లేని కొత్త జిల్లాల ప్రకారం ఎలా నోటిఫికేషన్ ఇస్తారని కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. పోస్టుల పరిస్థితి ఇదీ.. తెలుగు మీడియం ఎస్జీటీ పోస్టులు లేని జిల్లాలు: వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం. మైదాన ప్రాంతంలో పది లోపే పోస్టులు ఉన్న జిల్లాలు: జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి, సిద్దిపేట. 50లోపు పోస్టులు ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మైదాన ప్రాంతంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 10లోపే ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి, వరంగల్ అర్బన్.50లోపు పోస్టులు ఉన్నవి: నిర్మల్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, కామరెడ్డి, భూపాలపల్లి, మహబూబాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూల్; మేడ్చెల్, హైదరాబాద్; వరంగల్ రూరల్, జనగాం, ఖమ్మం. -
స్కూల్ అసిస్టెంట్ల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి
* 23 మంది అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు సైతం * ఎంపికైనట్టు గుర్తింపు * రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదన * అనుమతి వచ్చిన వెంటనే కొత్తవారి ఎంపిక శ్రీకాకుళం: జిల్లా నుంచి డీఎస్సీ-14లో స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలుగా ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన స్థానిక ప్రభుత్వబాలుర పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. మాజీ సైనికుల కేటగిరీ నుంచి ఓ మహిళ ఎంపిక కాగా దానిని అధికారులు తిరస్కరించారు. మరో మహిళ తను ఈ ఉద్యోగం చేపట్టనని లిఖితపూరకంగా తెలియజేశారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారిలో 23 మంది ఎస్జీటీ స్థాయి పోస్టులకు కూడా ఎంపికైనట్లు అధికారులు గుర్తించారు. వారంతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో చేరేందుకు సుముఖత తెలపడంతో లిఖితపూరకం హామీను తీసుకున్నారు. వీటన్నింటినీ రాష్ట్ర స్థాయికి నివేదించారు. అక్కడ పరిశీలన పూర్తయి అనుమతులు వచ్చిన వెంటనే ఎస్జీటీ పోస్టులకు కొత్త వారిని ఎంపిక చేస్తారు. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తిచేసి అటుతరువాత నియామకాలు జరుపుతారు. ఈ నెలాఖరు నాటికి పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. -
బీఈడీలకు ఎస్జీటీ అవకాశం కల్పించండి: వైఎస్ జగన్
హైదరాబాద్: బీఈడీ అభ్యర్థులకు డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడలకు లేఖ రాశారు. ఏపీలో బీఈడీ అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్నారని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ సంఖ్యలో ఉన్నాయని వివరించారు. అందువల్ల బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లో అర్హత కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎన్సీటీఈ వారికి ఈ అవకాశం లేకుండా చేసిందన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు ఈ వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏపీలో దాదాపు రెండు లక్షల మంది బీఈడీ అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు. వారి ఆశలమేరకు ఎన్సీటీఈ నిబంధనలను సవరించి ఈ వెసులుబాటు కల్పించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన బీఈడీ విద్యార్థులు
హైదరాబాద్: డీఎస్సీ, టెట్‌పై బీఈడీ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. జీఓ నెంబర్ 38ని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జీఓ 38పై ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పు పట్టిందని విద్యార్థులు తెలిపారు. జూన్ 3 వరకు డీఎస్సీ ఎంపిక జాబితాను ప్రకటించవద్దని హైకోర్టు సూచించినట్లు చెప్పారు. టెట్, టీఆర్టీలో ప్రస్తుత నిబంధనలు ఆర్టీఏ యాక్ట్‌కు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని బీఈడీ విద్యార్థులు శేఖర్, అనిత కోరారు. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే నాలుగున్నర లక్షల మందికి మేలు జరుగుతుందని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సమయంలో హామీ వచ్చారని వారు తెలిపారు. ఇప్పడు ఆయన మాట నిలబెట్టుకోవలసిన అవసరం ఉందని వారన్నారు. -
హైకోర్టును ఆశ్రయించిన బీఈడీ విద్యార్థులు
-
'రుణ మాఫీ లేదు... కొత్త రుణాలు లేవు'
- బీఈడీ చదివిన వారికీ ఎస్జీటీ పోస్టులకు అవకాశం ఇవ్వాలి - జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్‌ను కోరిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సాక్షి, హైదరాబాద్: రుణ మాఫీ హామీని అమలు చేయకపోగా కొత్త రుణాలు మంజూరులోనూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఈ విషయంలో జోక్యం చేసుకొని న్యాయం చేయాలని పీపీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బీఈడీ చదివిన వారికి కూడా పశ్చిమ బెంగాల్ తరహాలో ఎస్జీటీ పోస్టులకూ అవకాశం కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం పార్టీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం, శైలజానాథ్, కొండ్రు మురళీ మోహన్‌తో కలిసి గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ 2014-15లో పంట రుణాలను కనీసం రెన్యూవల్ చేయకపోవడంతో రైతులు బీమా చెల్లించలేక దాదాపు రూ. 2 వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చిదన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రైతులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ భారాన్ని అంతా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. 2013-14 ఖరీఫ్ సీజన్‌కు గాను పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారంగా రూ. 7360 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా అందులో కేవలం రూ. 1260 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మిగిలిన రూ. 6100 కోట్లను వెంటనే విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులతో పెద్ద ఎత్తున పంటలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయని వీరికి కూడా నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ చదివిన వారిని కూడా అర్హులుగా పరిగణిస్తూ పరీక్షకు అనుమతించేలా చూడాలని కోరారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బీఈడీ చదివిన వారిని ఎస్జీటీ పోస్టులకు అర్హులుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని అనుమతి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మే నెల 9 నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నందున ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు సాధించేలా చర్యలు తీసుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది నిరుద్యోగులు బీఈడీ చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని వీరిలో చాలా మందికి వయో పరిమితి దాటి పోతుందనే ఆందోళన వారిలో వ్యక్తం అవుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా బీఈడీ చదివిన వారికి ఎస్జీటీలుగా నియమించేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినందున ప్రభుత్వం స్పందించాలన్నారు. బీకాం, బీఈడీ విద్యార్హతలున్న వారిని టీచర్ పోస్టులకు అనర్హులుగా పరిగణిస్తూ హాల్ టిక్కెట్లు ఇవ్వడం లేదని వారికి కూడా న్యాయం చేయాలని కోరారు. -
ఊరించి.. ఉసూరుమనిపించి!
కర్నూలు విద్య: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం మాట తప్పుతోంది. తాజాగా నిరుద్యోగ బీఎడ్‌ల ఆశలపై నీళ్లు చల్లింది. ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పిస్తామని నమ్మబలికిన చంద్రబాబునాయుడు.. చివరకు కేంద్రం అనుమతి ఇవ్వలేదంటూ చేతులెత్తేశారు. గురువారం రాష్ట్రంలో 9,061 టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 730 ఉపాధ్యాయుల భర్తీకి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించగా అన్నింటికీ ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ప్రాథమిక పాఠశాల విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డీఎడ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులే అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఇదిలాఉంటే ఎన్నికల హామీలో భాగంగా బీఎడ్‌లకు ఎస్జీటీ పోస్టులకు అవకాశం కల్పించేందుకు ఎన్సీఈఆర్టీ నిబంధనలను సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. ఇలాంటి ప్రతిపాదననే చేసిన పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సైతం నిబంధనలు అంగీకరించబోవని స్పష్టం చేశామని.. ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టంగా నిబంధనలు సండలించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇచ్చిన హామీ నిలుపుకోవడంలో భాగంగా గత ఏడాది ప్రైమరీ స్కూళ్లను అప్పర్ ప్రైమరీ స్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేసిన వాటిలో స్కూల్ అసిస్టెంట్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత తప్పదనే భావనతో ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవడంలో ఆలస్యమవుతుందనే సాకుతో చడీచప్పుడు కాకుండా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఎన్నికల హామీ విస్మరించిన బాబు తీరుపై బీఎడ్ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు డీఎస్సీగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ఇకపై టెట్‌కామ్ టెర్ట్‌గా మార్పు చేశారు. గత ప్రభుత్వం నిర్వహించిన టెట్‌కు స్వస్తి పలికారు. రెండింటికీ ఒకే పరీక్షను నిర్వహించనున్నారు. ఇదివరకు టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు సైతం తాజాగా పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఎక్కువ మార్కులనే పరిగణనలోకి తీసుకోనున్నారు. మూడు గంటల రాత పరీక్షలో భాగంగా ప్రశ్న పత్రాన్ని చదివేందుకు 15 నిముషాల ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. ఎస్జీటీ ప్రశ్న పత్రంలో 180 ప్రశ్నలకు 180 మార్కులు.. స్కూల్ అసిస్టెంట్‌లో 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు.