సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులు ఇంగ్లిష్ మీడియం, తెలుగు మీడియానికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకునేలా టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. గతంలో అభ్యర్థులు ఏ మీడియం పోస్టుకు దరఖాస్తు చేసుకుంటున్నారో ముందుగానే తెలియజేయాల్సి ఉండేది. ఏదైనా ఒకే మీడియానికే దర ఖాస్తు చేసుకునే వీలుండేది. అయితే ఇప్పుడు ఒకే అభ్యర్థికి రెండింటికీ అర్హతలుంటే రెండింటికీ దర ఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. రెండు మీడియాలకు వేర్వేరుగానే పరీక్షలు నిర్వహించేలా చర్య లు చేపట్టింది. దీంతో అభ్యర్థులు రెండు మీడియా ల పోస్టులకు వేర్వేరుగానే దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి వేర్వేరుగానే హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూల్..
వివిధ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడికి సంబంధించి న షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఎస్‌జీ టీ పోస్టులకు 2018 ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు నిర్వహిస్తామని పేర్కొంది. వాటికి సంబంధించిన ప్రాథమిక కీలను మార్చి 1 నుంచి 5 వరకు ప్రకటిస్తామని, వాటిపై అభ్యంతరాలను అదే నెల 2 నుం చి 10 వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఫైనల్ కీని మార్చి 25న ప్రకటించి, ఏప్రిల్ 16 నుంచి 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనుంది. పోస్టులకు ఎంపికైన వారి జాబితాలను మే 10న ప్రకటించనున్నట్లు వివరించింది.
స్టాఫ్ నర్సు పోస్టులు పెంపు..
వైద్యశాఖలో స్టాఫ్ నర్సు పోస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచిందని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 242 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, మరో 1,361 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్టాఫ్ నర్సు పోస్టులకు దరఖాస్తుల గడువును జనవరి 8 వరకు పొడిగించినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అర్హతలు కలిగిన వారు వచ్చే నెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment