staff nurse posts
-
2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేపట్టింది. ఇటీవల ల్యాబ్ టెక్నీíÙయన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం.. బుధవారం 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. తెలంగాణ మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, సంస్థల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా అనుభవమున్న అభ్యర్థులు.. అనుభవ ధ్రువీకరణ పత్రాలు పొందాలని సూచించారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.36,750 – రూ.1,06,990 మధ్య ఉంటుందని తెలిపారు. స్టాఫ్‌నర్స్ పోస్టులను బహుళ ఐచ్చిక ఎంపిక విధానంలో రాతపరీక్ష ఆధారంగా భర్తీ చేస్తారు. పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన/చేస్తున్న వారికి గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా అనుభవమున్న వారు ధ్రువీకరణ పత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్‌లో ఏ సేవలు అందించి ఉంటే.. ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింపజేస్తారు. మరిన్ని వివరాలకు తమ వెబ్సైట్ ( https://mhsrb.telangana.gov.in) ను సందర్శించాలని ఆయన కోరారు. ఇదీ సిలబస్.. అనాటమీ, ఫిజియాలజీలో 14 అంశాలు, మైక్రోబయాలజీలో 6 అంశాలు, సైకాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎనీ్వరాన్మెంటల్ హైజీన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ గైనకాల జికల్, గైనకాలజియల్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్, ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్టె్మంట్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్లకు సంబంధించి రాత పరీక్ష సిలబస్ ఉంటుంది. జోన్లవారీగా స్థానికులకు 95% రిజర్వేషన్ స్టాఫ్‌నర్స్ పోస్టులను జోన్లవారీగా భర్తీ చేయనున్నారు. ఆయా జోన్ల అభ్యర్థులకు 95 శాతం పోస్టులను కేటాయిస్తారు. మిగతావి ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. జోన్–1లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు.. జోన్–2లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.. జోన్–3లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.. జోన్–4లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్.. జోన్–5లో సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగాం.. జోన్–6లో మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్.. జోన్–7లో పాలమూరు, నారాయణపేట, జోగుళాంబ–గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. నోటిఫికేషన్‌లోని ముఖ్యాంశాలివీ.. » అభ్యర్థులు నోటిఫికేషన్ తేదీ నాటికి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు తేదీ నాటికి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకోవాలి. » ఎవరైనా అభ్యర్థి ఈ అర్హతలకు సమానమైన ఇతర అర్హతలను కలిగి ఉంటే.. ఆ విషయాన్ని బోర్డు ఏర్పాటు చేసిన ’నిపుణుల కమిటీ’కి రిఫర్ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. » దరఖాస్తుదారులకు కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 46 ఏళ్ల వయో పరిమితి ఉంటుంది. వయసును 2024 జూలై 1 ఆధారంగా లెక్కిస్తారు. వివిధ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. » ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుల్లో మార్పులు చేయడానికి వచ్చే నెల 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్‌కు అవకాశం కల్పించారు. » నవంబర్ 17వ తేదీన సీబీటీ పద్ధతిలో రాత పరీక్ష ఉంటుంది. » హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అభ్యర్థులు తమ ప్రాధాన్యం ప్రకారం సెంటర్లను ఎంపిక చేసుకోవాలి. -
TG: కొలువు సరే.. జీతాలేవీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటగా చేపట్టిన నియామకం నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీ. ఎల్బీ స్టేడియంలో జనవరి 31వ తేదీన అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేశారు. తర్వాత వారంతా తమకు కేటాయించిన ఆస్పత్రుల్లో విధుల్లో చేరిపోయారు. మూడు నెలలుగా ఆస్పత్రుల్లో రేయింబవళ్లు డ్యూటీలు చేస్తున్నారు. కానీ వారికి ఇప్పటివరకు ఒక్కపైసా వేతనం అందలేదు. తొలి జీతం అందుకుని సంతోషంతో కుటుంబ సభ్యులకు స్వీట్లు పంచుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ పోస్టులకు ఎంపికైవారిలో చాలా మంది వారి స్వస్థలాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో నియామకం అయ్యారు. అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వారికి మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో.. అద్దె కూడా చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత వల్లే తమకు వేతనాలు అందడం లేదని.. నర్సింగ్ ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్లు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 డిసెంబర్ 30వ తేదీన 5,204 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. గత ఏడాది ఆగస్టు 2న పరీక్ష నిర్వహించింది. 40,936 మంది దరఖాస్తు చేయగా.. 38,674 మంది పరీక్షలు రాశారు. ఫలితాలు వెల్లడించి, నియామకాలు చేపట్టాల్సి ఉన్నా.. ఎన్నికల నేపథ్యంలో ప్రక్రియ ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 15న ఆ నోటిఫికేషన్‌కు మరో 1,890 పోస్టులను కలిపింది. మొత్తంగా డీఎంఈ పరిధిలో 5,650 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 757, ఎంఎన్‌జే, గురుకులాల్లో మిగతా పోస్టులను సిద్ధం చేశారు. ఫలితాల తర్వాత 6,956 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీలు, ఇతర స్పెషాలిటీ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వారికి పోస్టింగ్ ఇచ్చారు. వీరిలో బీసీలు 45.97 శాతం, ఎస్సీలు 30.64 శాతం, ఎస్టీలు 12.81 శాతం మంది ఉన్నారు. ఆర్థోపెడికల్లీ చాలెంజ్డ్ కేటగిరీలో అభ్యర్థులు లేకపోవడంతో 138 పోస్టులు భర్తీ కాలేదు. కొత్తగా ఎంపికైన నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు రూ.36,750– రూ.1,06,990గా పేస్కేల్ ఖరారు చేశారు. దీంతోపాటు టీఏ, డీఏ, హెచ్ఆర్ఏ తదితర అలవెన్సులు ఉంటాయి. కొత్తగా ఎంపికై వారందరికీ కలిపి నెలకు దాదాపు రూ.35 కోట్లు ఖజానా నుంచి చెల్లించాల్సి ఉంటుంది. దొరికిందే చాన్స్‌గా ‘ముడుపుల’ వ్యవహారం వాస్తవానికి డ్యూటీలో చేరిన 15 రోజుల్లోగా నియామక ప్రక్రియ పూర్తికావాలి. కానీ మూడు నెలల తర్వాత కూడా కొన్నిచోట్ల క్లర్కుల స్థాయిలోనే ఫైళ్లు ఆగిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో నర్సింగ్ ఆఫీసర్లకు ఎంప్లాయి ఐడీలు కూడా ఇవ్వలేదు. ట్రెజరీలకు వివరాలు పంపలేదు. మూడు నెలలుగా వేతనాలు రాక నర్సింగ్ ఆఫీసర్లు ఇబ్బంది పడుతుంటే.. కిందిస్థాయి సిబ్బంది ‘ముడుపులు’ అందితేనే ఫైల్ కదులుతుందని డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఐడీ, ప్రాన్ కార్డుల కోసం హెచ్ఓడీ, డీఎంహెచ్ఓ ఆఫీసు స్టాఫ్ డబ్బులు అడుగుతున్నారని ఓ నర్సింగ్ ఆఫీసర్ వాపోయారు. ముడుపులు ఇచ్చినోళ్ల వివరాలను మాత్రమే ట్రెజరీకి పంపుతున్నారని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి.. తమకు వెంటనే వేతనాలు అందేలా చూడాలని నర్సింగ్ ఆఫీసర్లు కోరుతున్నారు. వేతనాలు వెంటనే ఇవ్వాలి.. కొత్తగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు వేతనాలు ఇవ్వలేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వేతనాలు మంజూరు చేయాలని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చాం. శాశ్వత పద్ధతిలో నియమితులైన వారందరికీ వేతనాలు, గుర్తింపు కార్డులు త్వరగా ఇవ్వాలి.. – వి.మరియమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ ప్రభుత్వం నుంచి ఆమోదం రావాలి మొదటిసారి శాలరీలు డ్రా చేయాలంటే అందరూ చేరేంతవరకు ఆగాల్సి ఉంటుంది. నర్సింగ్ ఆఫీసర్లు అంతా చేరడానికి ఫిబ్రవరి వరకు పట్టింది. తర్వాత వాళ్ల నుంచి 27 కాలమ్స్ డేటా సేకరించాలి. కానీ ఆ డేటాను అందరూ ఇవ్వడం లేదు. కొందరు పాన్‌కార్డు లేదంటారు. అంతేకాదు ప్రతీ దానికి ఒక డాక్యుమెంట్ కావాలి. వివరాలన్నీ ఒకేసారి పట్టుకొని రావాలని ట్రెజరీ అధికారులు అంటున్నారు. ఇవన్నీ అందజేస్తే అప్పుడు నర్సింగ్ ఆఫీసర్లకు ఎంప్లాయీ ఐడీ ఇస్తారు. ఐడీ వచ్చాక ముంబై నుంచి ప్రాన్ నంబర్ తెప్పించాలి. చాలా మంది వివరాలు సరిగా ఇవ్వలేదు. దాంతో ఆలస్యం అవుతోంది. సప్లిమెంటరీ బిల్లులు తొందరగా పాస్ కావు. రెగ్యులర్ బిల్లు అయితే ప్రభుత్వం వెంటనే జీతాలు వేస్తుంది. ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్లది సప్లిమెంటరీ బిల్లు కావడం వల్లే ఈ సమస్య. – డాక్టర్ వాణి, డీఎంఈ 3 నెలలైనా ప్రక్రియ పూర్తి చేయక.. నర్సింగ్ ఆఫీసర్ల నియామక ప్రక్రియను ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం పర్యవేక్షించాలి. అభ్యర్థులు తమ నియామక పత్రాలను సంబంధిత ఆస్పత్రి సూపరింటెండెంట్, డీ ఎంహెచ్‌వోకు అందజేస్తే.. వారికి సర్వీస్ నిబంధనల ప్రకారం.. ఎంప్లాయ్ ఐడీ, బ్యాంక్ ఖాతా కేటాయిస్తారు. ఆ వివరాలను ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయానికి, అక్కడి నుంచి నర్సింగ్ విభాగానికి పంపి అప్డేట్ చేస్తారు. అప్పటి నుంచీ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు లభిస్తుంది. అయితే 3 నెలలైనా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, కిందిస్థాయి అధికారుల అవినీతితోనే జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
నియామక పత్రాల పేరిట ఆర్భాటం
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచించిందని ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పిన రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎల్బీస్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేశారని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్‌నర్స్‌ల భర్తీ నోటిఫికేషన్ ప్రకటించి, నియామక పత్రాలు ఇచ్చారా? అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. సొమ్మొకడిది సోకు ఇంకొకడిది.. అన్నట్టు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడంలో రేవంత్ వ్యవహరించిన తీరునే తప్పు బడుతున్నామన్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏమైంది? ‘ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 1న గ్రూప్–1 నోటిఫికేషన్ ఇస్తామన్న హామీ ఏమైంది? రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబంధు పెంపు, రూ.500 సిలిండర్, 4,000 నెలవారీ పింఛన్, మహాలక్ష్మి ద్వారా రూ.2,500 పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి వంటి హామీల లిస్ట్‌లో నేడు జాబ్ కేలెండర్ కూడా చేరింది’అని హరీశ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1.65 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయగా, మరో 40 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీపై మీరు చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటే స్వాగతిస్తామన్నారు. -
స్టాఫ్‌నర్స్ ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్‌నర్స్ పోస్టుల మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మేంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ నెల 18వ తేదీన విడుదల చేసిన రాత పరీక్ష ఫలితాలపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. మొత్తం స్టాఫ్‌నర్స్ పోస్టులకు 40,936 మంది దరఖాస్తు చేశారు. అందులో 38,674 మంది రాత పరీక్ష రాశారు. వారిలో నుంచి 8,892 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచినట్లు ఆయన వివరించారు. శనివారం (30వ తేదీ) నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని చెప్పారు. వెరిఫికేషన్ ఎక్కడంటే.. ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ (ఈస్ట్), 120/పీ, సెయింట్ మైకేల్స్ కాలనీ, అభ్యుదయన గర్, అభ్యుదయ నగర్ కాలనీ, బండ్లగూడ జాగీర్, హైదరాబాద్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. దరఖాస్తుదారులు ఒరిజినల్ సర్టిఫికె ట్లు, డాక్యుమెంట్లతోపాటు వాటికి సంబంధించి రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలి. అలాగే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తు ఫారమ్ పీడీఎఫ్‌ను వెంట తీసుకొని రావాలి. ఎవరెవరు ఏయే సర్టిఫికెట్లు తేవాలంటే.. ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ రుజువు సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ వర్తించేవారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికెట్ తీసుకురావాలి. నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ అందించని బీసీలను ఓసీలుగా పరిగణిస్తారు. ఈడబ్ల్యూఏఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులు తాజా ఆదాయ ధ్రువీకరణపత్రం తీసుకురావాలి. స్పోర్ట్స్ కేటగిరీ కింద రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేసే వారు స్పోర్ట్స్ సర్టిఫికెట్ తీసుకురావాలి. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ తీసుకురావాలి. స్థానికతను తెలిపే సర్టిఫికెట్లు, జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో వెంట తీసుకొని రావాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు తేకుంటే అభ్యర్థిత్వం రద్దు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాకపోవడం లేదా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోతే వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తారు. ప్రొవిజినల్ జాబితా ఎంపిక జాబితా కాదని గోపీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, 7,094 స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వచ్చిన వారిలో అనర్హులుండి, పోస్టుల కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధిస్తే, తమ వద్ద ఉన్న అర్హుల జాబితా నుంచి మరికొందరిని పిలుస్తామని ఆయన తెలిపారు. నిర్ణీత రోజుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయం... ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే ఆరో తేదీ వరకు ప్రతి రోజూ మూడు సెషన్లలో సర్టిఫికెట్ల వెరిఫి కేషన్ నిర్వహిస్తారు. ప్రతీ సెషన్లో 400 నుంచి 500 మంది సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఈ మేర కు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మొదటి సెషన్: ఉదయం 9.15 నుంచి 11.15 గంటల వరకు రెండో సెషన్: మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మూడో సెషన్: మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు -
1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) పరిధిలోని బోధనాస్పత్రుల్లో 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రత్యక్ష నియామకం పద్ధతిలో వీటిని భర్తీ చేయనుంది. కాగా, జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఐదు వైద్య కళాశాలలు మాత్రమే ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 26కు చేరిందన్నారు. వచ్చే ఏడాదిలో మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువవుతుండటంతో పాటు, తెలంగాణ బిడ్డలకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన వైద్యులను, నర్సులను, ఇతర సిబ్బందిని భర్తీ చేస్తుందన్నారు. ఇప్పటికే 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, వారిని బోధనాస్పత్రుల్లో నియమించుకున్నామని, 5,204 స్టాఫ్ నర్సుల నియామక ప్రక్రియ కొనసాగుతోందని ఇందుకు సంబంధించి ఆగస్టులో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. -
జేఎన్టీయూ ఆధ్వర్యంలో స్టాఫ్ నర్సుల రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్సుల పోస్టులకు నిర్వహించే రాత పరీక్ష బాధ్యతను జేఎన్టీయూకు అప్పగించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. జేఎన్టీయూ ఆధ్వర్యంలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అయితే పరీక్ష పేపర్‌ను మాత్రం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోనే తయారు చేస్తారు. మే నెలలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇటీవల టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ నేపథ్యంలో స్టాఫ్ నర్స్ పోస్టుల పరీక్షను నిర్వహించడంపై అధికారుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు భారీగా కసరత్తు ప్రారంభించారు. టీఎస్పీఎస్సీ లీకేజీని దృష్టిలో పెట్టుకొని అదనపు చర్యలు తీసుకుంటున్నారు. భారీ డిమాండ్... స్టాఫ్ నర్స్ పోస్టులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. వైద్య ఆరోగ్యశాఖ 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. వాటిని తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ భర్తీ చేయనుంది. మొత్తంగా 40 వేల దరఖాస్తులు వచ్చినట్లు బోర్డు వెల్లడించింది. ఒక్కో స్టాఫ్ నర్స్ పోస్టుకు ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ. 36,750 – రూ. 1,06,990 మధ్య ఉంటుంది. దాంతో అభ్యర్థుల నుంచి భారీగా డిమాండ్ ఏర్పడింది. కాగా వేలాది మంది అభ్యర్థులు ఇప్పటికే కోచింగ్ తీసుకుంటున్నారు. కాగా, రాత పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. రాతపరీక్ష సిలబస్ ఇదీ.. అనాటమీ ఫిజియాలజీలలో 14 అంశాలు, మైక్రోబయాలజీలో 6 అంశాలు, సై కాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎన్విరాన్మెంటల్ హైజీన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ గైనకాలాజికల్ నర్సింగ్, గైనకాలజియల్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్, ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్లకు సంబంధించి రాత పరీక్ష సిలబస్ ఉంటుంది. ఈ మేరకు అభ్యర్థులు తయారు కావాలని నిపుణులు సూచిస్తున్నారు. -
5,204 స్టాఫ్ నర్స్ పోస్టులు.. 40 వేల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్‌నర్స్ పోస్టులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. వైద్య, ఆరోగ్య శాఖ నెలన్నర క్రితం 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. వాటిని తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువు బుధవారమే ముగియగా, తాజాగా దానిని 21వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటివరకు ఏకంగా 40 వేల దరఖాస్తులు రాగా, గడువు పొడిగింపుతో మరో 15 వేల మంది దరఖాస్తు చేసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వెయిటేజీకి సంబంధించి అనుభవ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఆలస్యం, ఇతరత్రా కారణాలతో అనేకమంది దరఖాస్తు చేసుకోలేకపోవడంతో గడువు పొడిగించారు. ఒక్కో ఉద్యోగానికి 10 నుంచి 11 మంది పోటీ పడే అవకాశముందని అంచనా. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.36,750–1,06,990 మధ్య ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిశాక రాత పరీక్ష వివరాలను మెడికల్ బోర్డు ప్రకటించనుంది. ఏదైనా ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహించే అవకాశముంది. పరీక్షకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు మెడికల్ బోర్డు తెలిపింది. అధికారుల అలసత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరో గ్య కేంద్రాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారు అనుభవ ధ్రువీకరణ పత్రా లు పొందాలని బోర్డు సూచించింది. రాత పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి 6 నెలలకు 2.5, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. అయితే అనేకమంది అభ్యర్థులకు సంబంధిత ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు అనుభవ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో చుక్కలు చూపిస్తున్నారు. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ల జారీలో కూడా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని కోసం ఎమ్మార్వో ఆఫీసుల్లోని కొందరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.5 వేల వరకు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సంబంధిత అధికారులు దీనిపై దృష్టిపెట్టి ధ్రువీకరణ పత్రాలు సులువుగా జారీచేసేలా ఆదేశాలు జారీచేయాలని నర్సింగ్ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
‘సాక్షి’ ఎఫెక్ట్: స్టాఫ్ నర్సుల ఎంపిక నిలుపుదల
మహారాణిపేట(విశాఖ దక్షిణ): స్టాఫ్ నర్సుల పోస్టు ల భర్తీని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఎంపిక జాబితాలో తమకు అన్యాయం జరిగిందని నిరుద్యోగ నర్సులు, వెయిటేజీ మార్కులు కలపలేదని తాత్కాలిక ఉద్యోగులు బుధవారం కూడా తన నిరసన గళం వినిపించారు. దాదాపు 30 నుంచి 40 మందికి వెయిటేజ్ మార్కులు కలపలేదని విషయం బయటకు రావడంతో.. ఈ జాబితాను పునఃపరిశీలన కోసం అధికారులు భర్తీ ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. స్టాఫ్ నర్సుల ఎంపికలో గందరగోళంపై బుధవారం ‘సాక్షి’లో కథనం రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తప్పుల తడకలతో కూడిన 172 మంది అభ్యర్థుల జాబితాను మళ్లీ పరిశీలన చేస్తున్నారు. కొంత మందికి అనవసరంగా ఎలా మార్కులు కలిశాయన్న దానిపై యంత్రాంగం దృష్టి పెట్టింది. అమరావతి నుంచి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విశాఖ చేరుకుని జాబితాను పరిశీలిస్తున్నారు. సిబ్బంది తీరుపై మండిపాటు.. స్టాఫ్ నర్సుల పోస్టుల కోసం ఇప్పటివరకు నాలుగు సార్లు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది జాబితాను తయారు చేశారు. జీఓ ప్రకారం జాబితా తయారు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. ఎంపికలో సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులను తప్పించడం, అనర్హులను అందలం ఎక్కించడం కోసం సిబ్బంది చేతివాటం ప్రదర్శించారన్న విమర్శలు ఉన్నాయి. ఎంపికైన 172 మందిలో 100 మంది సర్టిఫికెట్లను మంగళవారం పరిశీలించారు. బుధవారం మరో 30 మంది సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. జాబితాను పునఃపరిశీలన చేస్తున్న క్రమంలో ఇందులో ఎంత మంది పేర్లు ఉంటాయో.. ఊడుతాయో తెలియని పరిస్థితి. కాగా.. ఎంపిక జాబితా రూపొందించడంలో సిబ్బంది తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తమ జీవితాలతో సిబ్బంది చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మార్కులు కలపడం, మరోసారి తొలగించడం, ఎంపిక జాబితాలో కొందరి పేర్లు ఇప్పుడు తొలగించడం.. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పనితీరుకు అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు. అభ్యర్థుల్లో ఉత్కంఠ.. పోస్టుల సంఖ్య పెరగడం, కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి అదనపు మార్కులు కలపడం వంటి నిర్ణయాలు రావడంతో మెరిట్ లిస్ట్‌కు వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ ఉమాసుందరి ఆధ్వర్యంలో తుది మెరుగులు దిద్దుతున్నారు. అమరావతి నుంచి వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా ఇందుకు సహకారం అందిస్తున్నారు. దీంతో కొత్త జాబితా కోసం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కాగా..అర్హులకు అన్యాయం జరగదని డాక్టర్ ఉమా సుందరి హామీ ఇస్తున్నారు. -
స్టాఫ్ నర్సు పోస్టుల ఫైనల్ మెరిట్ జాబితా విడుదల
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీలో భాగంగా ఫైనల్ మెరిట్ జాబితాను జోన్– 2, 3, 4లలో విడుదల చేశారు. జోన్–1లో ఫైనల్ మెరిట్ జాబితా విడుదల కావాల్సి ఉంది. 957 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి గత నెల మొదటి వారంలో వైద్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు జోన్లలో 40 వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా జోన్–2లో 12,295 మంది ఉన్నారు. ఫైనల్ మెరిట్ జాబితా వెలువడిన నేపథ్యంలో ఈ వారంలో ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేసి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది. -
5,204 స్టాఫ్ నర్సు పోస్టులు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ వైద్యారోగ్య విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఆయా పోస్టులకు తగిన అర్హతలున్నవారు తమ వెబ్సైట్ (https://mhsrb. telangana.gov.in)లో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే నెల 25వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి ఫిబ్రవరి 15న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, సంస్థల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ అనుభవమున్న వ్యక్తులు అనుభవ ధ్రువీకరణ పత్రాలు పొందాలని సూచించారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.36,750 – రూ.1,06,990 మధ్య ఉంటుందని తెలిపారు. అనుభవ ధ్రువీకరణతో.. స్టాఫ్ నర్సు పోస్టులను బహుళ ఐచ్చిక ఎంపిక విధానంలో రాతపరీక్ష ఆధారంగా భర్తీ చేస్తారు. పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. ఇప్పటికే వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన/చేస్తున్న వారికి గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించినవారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ అనుభవమున్నవారు ధ్రువీకరణ పత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌లో ఏ సేవలు అందించి ఉంటే.. ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింపజేస్తారు. ఉదాహరణకు స్టాఫ్ నర్స్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గతంలో కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ నర్స్‌గా చేసిన కాలానికి సంబంధించిన పాయింట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఏఎన్ఎంగా, ఇతర సేవలు అందించి ఉన్నా దానిని పరిగణనలోకి తీసుకోరు. రాత పరీక్ష సిలబస్ ఇదీ.. అనాటమీ ఫిజియాలజీలో 14 అంశాలపై, మైక్రోబయాలజీలో 6 అంశాలు, సైకాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎన్విరాన్మెంటల్ హైజీన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ గైనకాలాజికల్, గైనకాలజియల్ నర్సింగ్, కమ్యూని టీ హెల్త్ నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్, ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్ లకు సంబంధించి రాత పరీక్ష సిలబస్ ఉంటుంది. జోన్లవారీగా స్థానికులకు 95% రిజర్వేషన్ నర్సు పోస్టులను జోన్లవారీగా భర్తీ చేయనున్నారు. ఆయా జోన్లకు అభ్యర్థులకే 95% పోస్టులను కేటా యిస్తారు. మిగతావి ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తా రు.జోన్–1లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్ జిల్లాలు.. జోన్–2లో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.. జోన్–3లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.. జోన్–4లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్.. జోన్–5లో సూర్యాపేట, నల్లగొండ, భువన గిరి, జనగాం.. జోన్–6లో మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్.. జోన్–7లో పాలమూరు, నారాయణపేట, జోగుళాంబ–గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. నోటిఫికేషన్‌లోని ముఖ్యాంశాలివీ.. ►అభ్యర్థులు నోటిఫికేషన్ తేదీ నాటికి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు తేదీ నాటికి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకోవాలి. ►ఎవరైనా అభ్యర్థి ఈ అర్హతలకు సమానమైన ఇతర అర్హతలను కలిగి ఉంటే.. ఆ విషయాన్ని బోర్డు ఏర్పాటు చేసిన ’నిపుణుల కమిటీ’కి రిఫర్ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. ►దరఖాస్తుదారులకు కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 44 ఏళ్ల వయో పరిమితి ఉంటుంది. వయసును 2022 జూలై ఆధారంగా లెక్కిస్తారు. వివిధ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. ►అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులో వివరాలు నమోదు చేయడంతోపాటు అవసరమైన పత్రాల సాఫ్ట్ కాపీ (పీడీఎఫ్)లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ►ఆధార్ కార్డ్, పదో తరగతి సర్టిఫికెట్, జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అనుభవ ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), స్థానికత గుర్తింపు కోసం 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదివిన సర్టిఫికెట్లు లేదా నివాస ధ్రువీకరణ పత్రం, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే సదరు కుల ధ్రువీకరణ పత్రం, బీసీల విషయంలో తాజా నాన్–క్రీమీలేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరేవారు తాజా ’ఆదాయం, ఆస్తి సర్టిఫికెట్’, స్పోర్ట్స్ సర్టిఫికెట్, సదరం నుంచి దివ్యాంగ సర్టిఫి కెట్, ఎన్సీసీ ధ్రువపత్రం వంటివి అవస రాన్ని బట్టి జత చేయాల్సి ఉంటుంది. ►దరఖాస్తు రుసుము రూ.120, పరీక్ష ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ కేటగిరీలకు మినహాయింపు ఉంటుంది. ►ఆన్లైన్లో ఒకసారి సమర్పించిన దరఖాస్తుల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. రాతపరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు. ►ఓఎంఆర్ విధానంలో ఇంగ్లిష్‌లో నిర్వహించే రాతపరీక్షలో 80 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ►హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. -
957 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 957 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇటీవల 461 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దానికి అదనంగా 496 పోస్టులను కలిపి మొత్తం 957 పోస్టులతో సవరించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. శుక్రవారం నుంచి దరఖాస్తు ఫారాలను http://cfw.ap.nic.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ నెల ఎనిమిదో తేదీ వరకూ దరఖాస్తు ఫారాలు వెబ్సైట్లో ఉంటాయి. వీటిని డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసిన దరఖాస్తులను సంబంధిత రీజినల్ డైరెక్టర్ కార్యాలయాల్లో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుంది. జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ మిడ్ వైఫర్)/ బీఎస్సీ (నర్సింగ్) కోర్సులు పూర్తి చేసి 42 ఏళ్లలోపు వయసున్న వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, విభిన్న ప్రతిభావంతులకు 10 ఏళ్ల పాటు వయో పరిమితిలో సడలింపునిచ్చారు. దరఖాస్తు రుసుమును ఓసీ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ. 300గా నిర్ణయించారు. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రూపొందించే మెరిట్ లిస్ట్‌ను వచ్చే ఏడాది ఆగస్టు వరకు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరులకు కొరత లేకుండా ఉండేందుకు గత మూడున్నరేళ్ల కాలంలో వైద్య ఆరోగ్యశాఖలో 46 వేలకు పైగా పోస్టులను ఈ ప్రభుత్వం భర్తీ చేయడం గమనార్హం. -
AP: వైద్యారోగ్యశాఖలో నోటిఫికేషన్ రిలీజ్.. పూర్తి వివరాలు ఇవే..
సాక్షి, అమరావతి: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్ పోస్టుల నియమాకానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కాగా, 957 స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ పద్దతిన శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పోస్టులకు డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు అప్లికేషన్స్‌ను స్వీకరించనున్నారు. పూర్తి చేసిన అప్లికేషన్లను డిసెంబర్ 9లోగా ఆయా రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో అందజేయాలి. ఇక, మెరిట్ లిస్ట్ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగనుంది. వచ్చిన దరఖాస్తుల్లో ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను 19వ తేదీన తీస్తారు. అనంతరం, 20వ తేదీన సెలక్షన్ లిస్ట్‌ను తీసి.. డిసెంబర్ 21, 22వ తేదీల్లో కౌన్సిలింగ్, అపాంట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల చిరునామాలు ఇవే.. విశాఖపట్నం ఆర్డీ కార్యాలయం: రీజనల్ డైరెక్టర్, బుల్లయ్య కాలేజీ ఎదురుగా, రేసపువానిపాలెం రాజమండ్రి ఆర్డీ కార్యాలయం: జిల్లా ఆసుపత్రి ప్రాంగణం , రాజమండ్రి గుంటూరు ఆర్డీ కార్యాలయం: పాత ఇటుకులబట్టి రోడ్ , అశ్విని ఆసుపత్రి వెనుక, గుంటూరు వైఎస్సార్ కడప ఆర్డీ కార్యాలయం: పాత రిమ్స్ ప్రాంగణం, కడప - జోన్ల వారీగా ఖాళీల వివరాల కోసం https://cfw.ap.nic.in/ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. -
461 స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ప్రభుత్వాస్పత్రుల్లోని 461 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు జోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. బుధవారం నుంచి డిసెంబర్ 5 వరకు http://cfw.ap.nic.in వెబ్సైట్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా వైద్య, ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి 42 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్–సర్వీస్మెన్లకు మూడేళ్లు, విభిన్న ప్రతిభావంతులకు 10 ఏళ్ల పాటు వయోపరిమితి నుంచి సడలింపు ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుమును రూ.500గా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ.300గా నిర్దేశించారు. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వైద్య శాఖ తెలిపింది. కోవిడ్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ తదితర ఇతర వెయిటేజ్‌లు వర్తిస్తాయని పేర్కొంది. భవిష్యత్‌లో ఖాళీ అయ్యే నర్సింగ్ పోస్టుల భర్తీకి అనుగుణంగా ఈ నోటిఫికేషన్ మెరిట్ లిస్ట్‌ను వచ్చే ఏడాది ఆగస్టు వరకు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావివ్వకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2019 నుంచి 46 వేలకు పైగా పోస్టుల భర్తీని ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కాంట్రాక్ట్ పద్ధతిలో 461 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. -
చెప్పిందొకటి.. ఇచ్చిందొకటి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ పరిధిలోని ఆస్పత్రుల్లో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో నిర్దేశిత అంశాల నుంచి కాకుండా ఇతర ప్రశ్నలు ఇచ్చారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మెరిట్ జాబితాపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థ 84 జూనియర్ స్టాఫ్ నర్స్ ‘డి’గ్రేడ్ పోస్టుల భర్తీకి భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా కొత్తగూడెం, పాల్వంచల్లోని 18 కేంద్రాల్లో ఆదివారం రాత పరీక్షను నిర్వహించింది. అయితే, హాల్‌టికెట్‌లో పేర్కొన్నట్లుగా నర్స్ ఉద్యోగ ప్రశ్న లు కాకుండా 90% ల్యాబ్ టెక్నీషియన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాల్‌టికెట్, ప్రశ్నపత్రం అభ్యర్థులకు ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. ఇదిలాఉంటే ప్రశ్నపత్రంలో 150 ప్రశ్నలు ఇచ్చి, ఓఎంఆర్ షీట్లో మాత్రం సమాధానాలు ఇవ్వడానికి 200 గడులు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది. అనర్హత ఎలా?: రాత పరీక్షకు 11,133 మంది దరఖాస్తు చేసుకోగా 7,666 మంది హాజరయ్యారు. వీరిలో పది శాతం మందిని సంస్థ అనర్హులుగా ప్రకటించింది. అయితే 25.33 మార్కులు వచ్చిన ఓ అభ్యర్థిని అనర్హుడిగా పేర్కొన్న సంస్థ అవే మార్కు లు వచ్చిన మరికొందరి పేర్లను మెరిట్ జాబితాలో పొందుపరిచింది. దీనిపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్నుంచీ సింగరేణిలో నియామకాలపై విమర్శలు వస్తుండగా, తాజా పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. కాగా, ఈ విషయంపై సంస్థ జీఎం పర్సనల్(రిక్రూట్మెంట్ సెల్) అందెల ఆనందరావును ‘సాక్షి’వివరణ కోరగా ప్రశ్నపత్రాన్ని నిపుణులతోనే సిద్ధం చేయించామని తెలిపారు. ప్రశ్నపేపర్ అభ్యర్థులకు ఇచ్చే విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తామని వెల్లడించారు. -
రిమ్స్ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల దందా
సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్ అస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యొగాల అమ్మకాల దందా బయటపడింది. స్డాప్ నర్సు ఉద్యోగానికి రూ. లక్ష 50 వేలు చెల్లించాలని మద్యవర్తులు నిరుద్యోగులతో బేరసాలకు దిగారు. స్టాప్ నర్సు ఉద్యోగానికి ఎంపికైన సుప్రియను డబ్బులు చెల్లించాలని బ్రోకర్ డిమాండ్ చేశాడు. మద్యవర్తి రూ.లక్షకు బేరం కుదుర్చుకున్నాడు. ఇలా ఐదుగురు నిరుద్యోగులతో మద్యవర్తులు బెరసారాలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల వేలంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. దీనిపై బాదిత కుటుంబ సభ్యులు రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రిమ్స్ డైరెక్టర్ బాధితులకు తెలిపారు. -
సింగరేణిలో ఉద్యోగాలు; హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో నియామకం చేపట్టనున్న జూనియర్ స్టాఫ్‌నర్స్ పోస్టులకు నిర్ణీత అర్హతలున్న పురుష అభ్యర్థుల దరఖాస్తులను కూడా స్వీకరించాలని సింగరేణి కాలరీస్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన నేపథ్యంలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువు పెంచాలని స్పష్టం చేసింది. ఈ నియామకాలన్నీ కూడా తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, ఇది రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు విఘాతమంటూ సింగరేణి ఉద్యోగి మహ్మద్ ఫసియుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించేలా ఆదేశించాలని, ఈ మేరకు పలు సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మహిళలు మాత్రమే అర్హులంటూ సింగరేణి కాలరీస్ విధానపరమైన నిర్ణయమేమీ తీసుకోకపోయినా గత కొన్నేళ్లుగా మహిళా అభ్యర్థులతోనే ఈ పోస్టులను భర్తీ చేయడం సంప్రదాయంగా వస్తోందని సింగరేణి తరఫు న్యాయవాది వివరించారు. ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. విధానపరమైన నిర్ణయం తీసుకోనప్పుడు పురుష అభ్యర్థులు కూడా ఆ పోస్టులకు అర్హులేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్; తపాలాశాఖలో ఉద్యోగాలు బెల్లో 16 ట్రెయినీ ఇంజనీర్ పోస్టులు -
ఇంగ్లిష్, తెలుగు మీడియాలకు వేర్వేరు పరీక్షలే
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు ఇంగ్లిష్ మీడియం, తెలుగు మీడియానికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకునేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. గతంలో అభ్యర్థులు ఏ మీడియం పోస్టుకు దరఖాస్తు చేసుకుంటున్నారో ముందుగానే తెలియజేయాల్సి ఉండేది. ఏదైనా ఒకే మీడియానికే దర ఖాస్తు చేసుకునే వీలుండేది. అయితే ఇప్పుడు ఒకే అభ్యర్థికి రెండింటికీ అర్హతలుంటే రెండింటికీ దర ఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. రెండు మీడియాలకు వేర్వేరుగానే పరీక్షలు నిర్వహించేలా చర్య లు చేపట్టింది. దీంతో అభ్యర్థులు రెండు మీడియా ల పోస్టులకు వేర్వేరుగానే దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి వేర్వేరుగానే హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. వెబ్సైట్లో పరీక్షల షెడ్యూల్.. వివిధ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడికి సంబంధించి న షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఎస్జీ టీ పోస్టులకు 2018 ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు నిర్వహిస్తామని పేర్కొంది. వాటికి సంబంధించిన ప్రాథమిక కీలను మార్చి 1 నుంచి 5 వరకు ప్రకటిస్తామని, వాటిపై అభ్యంతరాలను అదే నెల 2 నుం చి 10 వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఫైనల్ కీని మార్చి 25న ప్రకటించి, ఏప్రిల్ 16 నుంచి 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనుంది. పోస్టులకు ఎంపికైన వారి జాబితాలను మే 10న ప్రకటించనున్నట్లు వివరించింది. స్టాఫ్ నర్సు పోస్టులు పెంపు.. వైద్యశాఖలో స్టాఫ్ నర్సు పోస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచిందని టీఎస్పీఎస్సీ తెలిపింది. 242 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, మరో 1,361 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్టాఫ్ నర్సు పోస్టులకు దరఖాస్తుల గడువును జనవరి 8 వరకు పొడిగించినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. అర్హతలు కలిగిన వారు వచ్చే నెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. -
స్టాఫ్‌నర్సు పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల
అనంతపురం మెడికల్ : జిల్లాలో 20 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి సంబంధించి ప్రొవిజినల్ జనరల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసినట్లు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల జిల్లా సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) డాక్టర్ రమేశ్‌నాథ్ తెలిపారు. ఏడాదిపాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన 896 మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఈ జాబితా కలెక్టరేట్, డీఎంహెచ్ఓ, సర్వజనాస్పత్రి, డీసీహెచ్ఎస్ కార్యాలయాల్లోని నోటీస్ బోర్డుల్లో అందుబాటులో ఉంచామన్నారు. అభ్యర్థులు జాబితాను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 15వ తేదీ సాయంత్రంలోపు డీసీహెచ్ఎస్ కార్యాలయంలో తెలియజేయాలన్నారు. -
స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఫలించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కృషి నెల్లూరు(అగ్రికల్చర్): నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఖాళీగా ఉన్న 362 స్టాఫ్ నర్స్‌ల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఆసుపత్రిలోని ఖాళీలు భర్తీ చేయాలని జిల్లాలో నిర్వహించిన ఆందోళనకు ప్రభుత్వం స్పందించిందన్నారు. ఈ మేరకు 362 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి జీఓ ఎంఎస్ విడుదల చేసినట్లు తెలిపారు. పోస్టుల భర్తీలో ఎమ్మెల్యే చేసిన కృషిని జిల్లా ప్రజలు కొనియాడారు. సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పించాలి నెల్లూరు నగరం నుంచే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది పేదలు వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నందున, హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పించి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు.