స్టాఫ్‌నర్సు పోస్టుల మెరిట్‌ లిస్ట్‌ విడుదల | staff nurse posts merit list release | Sakshi
Sakshi News home page

స్టాఫ్‌నర్సు పోస్టుల మెరిట్‌ లిస్ట్‌ విడుదల

Published Thu, Mar 9 2017 12:32 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

staff nurse posts merit list release

అనంతపురం మెడికల్‌ : జిల్లాలో 20 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి సంబంధించి ప్రొవిజినల్‌ జనరల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేసినట్లు వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల జిల్లా సమన్వయ అధికారి (డీసీహెచ్‌ఎస్‌) డాక్టర్‌ రమేశ్‌నాథ్‌ తెలిపారు. ఏడాదిపాటు కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేయడానికి జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ అర్హత కలిగిన 896 మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఈ జాబితా కలెక్టరేట్, డీఎంహెచ్‌ఓ, సర్వజనాస్పత్రి, డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయాల్లోని నోటీస్‌ బోర్డుల్లో అందుబాటులో ఉంచామన్నారు. అభ్యర్థులు జాబితాను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 15వ తేదీ సాయంత్రంలోపు డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయంలో తెలియజేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement