2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ | Notification for 2050 Nursing Officer Posts | Sakshi
Sakshi News home page

2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

Published Thu, Sep 19 2024 3:24 AM | Last Updated on Thu, Sep 19 2024 3:24 AM

Notification for 2050 Nursing Officer Posts

28 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 

వచ్చే నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు 

నవంబర్‌ 17వ తేదీన సీబీటీ పద్ధతిలో రాత పరీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేపట్టింది. ఇటీవల ల్యాబ్‌ టెక్నీíÙయన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీచేసిన ప్రభుత్వం.. బుధవారం 2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్స్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. తెలంగాణ మెడికల్, హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. 

రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, సంస్థల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా అనుభవమున్న అభ్యర్థులు.. అనుభవ ధ్రువీకరణ పత్రాలు పొందాలని సూచించారు. ఈ పోస్టులకు పేస్కేల్‌ రూ.36,750 – రూ.1,06,990 మధ్య ఉంటుందని తెలిపారు. స్టాఫ్‌నర్స్‌ పోస్టులను బహుళ ఐచ్చిక ఎంపిక విధానంలో రాతపరీక్ష ఆధారంగా భర్తీ చేస్తారు. పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. ఇప్పటికే    వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేసిన/చేస్తున్న వారికి గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. 

గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా అనుభవమున్న వారు ధ్రువీకరణ పత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు/ఔట్‌ సోర్సింగ్‌లో ఏ సేవలు అందించి ఉంటే.. ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింపజేస్తారు. మరిన్ని వివరాలకు తమ వెబ్‌సైట్‌ ( https://mhsrb.telangana.gov.in) ను సందర్శించాలని ఆయన కోరారు.  

ఇదీ సిలబస్‌.. 
అనాటమీ, ఫిజియాలజీలో 14 అంశాలు, మైక్రోబయాలజీలో 6 అంశాలు, సైకాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ నర్సింగ్, ఫస్ట్‌ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్, ఎనీ్వరాన్‌మెంటల్‌ హైజీన్, హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్, న్యూట్రిషన్, మెడికల్‌ సర్జికల్‌ నర్సింగ్, మెంటల్‌ హెల్త్, చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్, మిడ్‌ వైఫరీ గైనకాల జికల్, గైనకాలజియల్‌ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్, నర్సింగ్‌ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్‌ టు రీసెర్చ్, ప్రొఫెషనల్‌ ట్రెండ్స్‌ అండ్‌ అడ్జస్టె్మంట్, నర్సింగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ వార్డ్‌ మేనేజ్‌మెంట్‌లకు సంబంధించి రాత పరీక్ష సిలబస్‌ ఉంటుంది. 

జోన్లవారీగా స్థానికులకు 95% రిజర్వేషన్‌ 
స్టాఫ్‌నర్స్‌ పోస్టులను జోన్లవారీగా భర్తీ చేయనున్నారు. ఆయా జోన్ల అభ్యర్థులకు 95 శాతం పోస్టులను కేటాయిస్తారు. మిగతావి ఓపెన్‌ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. జోన్‌–1లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు.. జోన్‌–2లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.. జోన్‌–3లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.. జోన్‌–4లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్‌.. జోన్‌–5లో సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగాం.. జోన్‌–6లో మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌.. జోన్‌–7లో పాలమూరు, నారాయణపేట, జోగుళాంబ–గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలు ఉన్నాయి. 

నోటిఫికేషన్‌లోని ముఖ్యాంశాలివీ.. 
»  అభ్యర్థులు నోటిఫికేషన్‌ తేదీ నాటికి బీఎస్సీ నర్సింగ్‌ లేదా జీఎన్‌ఎం పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు తేదీ నాటికి తెలంగాణ స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవాలి. 
» ఎవరైనా అభ్యర్థి ఈ అర్హతలకు సమానమైన ఇతర అర్హతలను కలిగి ఉంటే.. ఆ విషయాన్ని బోర్డు ఏర్పాటు చేసిన ’నిపుణుల కమిటీ’కి రిఫర్‌ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. 
»  దరఖాస్తుదారులకు కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 46 ఏళ్ల వయో పరిమితి ఉంటుంది. వయసును 2024 జూలై 1 ఆధారంగా లెక్కిస్తారు. వివిధ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. 
»  ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తుల్లో మార్పులు చేయడానికి వచ్చే నెల 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్‌కు అవకాశం కల్పించారు.  
»  నవంబర్‌ 17వ తేదీన సీబీటీ పద్ధతిలో రాత పరీక్ష ఉంటుంది.  
»  హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అభ్యర్థులు తమ ప్రాధాన్యం ప్రకారం సెంటర్లను ఎంపిక చేసుకోవాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement