స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ | The green signal for the posts of staff nurses | Sakshi
Sakshi News home page

స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Published Thu, Mar 10 2016 4:06 AM | Last Updated on Mon, Oct 29 2018 8:29 PM

స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - Sakshi

స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

 ఫలించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కృషి
 
నెల్లూరు(అగ్రికల్చర్): నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఖాళీగా ఉన్న 362 స్టాఫ్ నర్స్‌ల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఆసుపత్రిలోని ఖాళీలు భర్తీ చేయాలని జిల్లాలో నిర్వహించిన ఆందోళనకు ప్రభుత్వం స్పందించిందన్నారు. ఈ మేరకు 362 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి జీఓ ఎంఎస్ విడుదల చేసినట్లు తెలిపారు. పోస్టుల భర్తీలో ఎమ్మెల్యే చేసిన కృషిని జిల్లా ప్రజలు కొనియాడారు.

సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పించాలి
 నెల్లూరు నగరం నుంచే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది పేదలు వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నందున, హాస్పిటల్‌లో సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పించి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement