
సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ క్రమంలో వారికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆనం విజయకుమార్ రెడ్డి.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. 31వ డివిజన్‌కి చెందిన టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 200 మంది టీడీపీ కీలక కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి. ఈ సందర్బంగా విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. అలాగే, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అధికార పార్టీలకు చెందిన కార్యకర్తలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకపోవడంతో కూటమి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సర్కార్‌పై మండిపడుతున్నారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నెల్లూరులో పతాక స్థాయికి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి అరాచకాలు
కోటంరెడ్డి దురాగతాల్ని భరించలేక టీడీపీని వీడి వైయస్ఆర్సీపీలో చేరిన 200 మంది కార్యకర్తలు
టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు 200 మంది కార్యకర్తలకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ… pic.twitter.com/ST1wReMtti— YSR Congress Party (@YSRCParty) January 27, 2025
Comments
Please login to add a commentAdd a comment