
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2008 డీఎస్సీలో అర్హులైన వారిని కాంట్రాక్టు ఎస్జీటీలుగా నియమించగా మిగిలిపోయిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులకు, ఆర్జేడీలకు విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు సోమవారం ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2,193 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో మినిమమ్ టైం స్కేల్ మీద తీసుకోవాలని జూన్ నెలలో ఆదేశాలు వెలువడ్డాయి. వీరిలో 144 మంది వివిధ కారణాల వల్ల డ్యూటీలలో చేరలేదు. ఈ మిగులు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్ డీఈవోలకు సూచించారని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక నేతలు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, కరణం హరికృష్ణ, సింహాచలం పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
తాగుబోతు రాతలేల?
పాతాళ గంగ.. కరువు తీరంగ
Comments
Please login to add a commentAdd a comment