
హైకోర్టును ఆశ్రయించిన బీఈడీ విద్యార్థులు
హైదరాబాద్: డీఎస్సీ, టెట్పై బీఈడీ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. జీఓ నెంబర్ 38ని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జీఓ 38పై ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పు పట్టిందని విద్యార్థులు తెలిపారు. జూన్ 3 వరకు డీఎస్సీ ఎంపిక జాబితాను ప్రకటించవద్దని హైకోర్టు సూచించినట్లు చెప్పారు. టెట్, టీఆర్టీలో ప్రస్తుత నిబంధనలు ఆర్టీఏ యాక్ట్కు విరుద్ధంగా ఉన్నాయన్నారు.
ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని బీఈడీ విద్యార్థులు శేఖర్, అనిత కోరారు. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే నాలుగున్నర లక్షల మందికి మేలు జరుగుతుందని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సమయంలో హామీ వచ్చారని వారు తెలిపారు. ఇప్పడు ఆయన మాట నిలబెట్టుకోవలసిన అవసరం ఉందని వారన్నారు.