
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు(మంగళవారం) జరగాల్సిన డీఎస్సీ-2024 ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. కొత్త కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా సాంకేతిక కారణాల వల్లే వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు.
డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న కొత్త టీచర్లకు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించిన సంగతిత తెలిసిందే. నూతన టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. అయితే.. డాటా రానందున కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ తెలిపింది. రేపు(బుధవారం) కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Comments
Please login to add a commentAdd a comment