school assistant
-
సీఎం సారూ... ఇక్కడ ఐదు తరగతులకు ఒక్కరే సారు!
బొంరాస్‌పేట: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం రేగడిమైలారం ఉన్నత పాఠశాలను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఆరు నుంచి పదో తరగతి వరకు 146 మంది విద్యార్థులు ఉండగా ఒకే ఉపాధ్యాయుడు బోధన చేస్తున్నారు. అక్కడ పనిచేసేందుకు చాలా మంది స్కూల్ అసిస్టెంట్లు సుముఖంగా ఉన్నప్పటికీ పాఠశాలకు అధికారిక పోస్టులు మంజూరు కాకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. అప్‌గ్రేడ్ చేసి.. వదిలేశారు! రేగడిమైలారం ప్రాథమిక పాఠశాలను 2005–06లో ప్రాథమికోన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేశారు. అప్పట్లో స్కూల్‌కు ఫిజికల్ సైన్స్ టీచర్‌ను మాత్రమే నియమించారు. 2007లో ఎనిమిదో తరగతిని సైతం అందుబాటులోకి తెచి్చనా కొత్త పోస్టులు ఇవ్వలేదు. 2016 వరకు ప్రైమరీ సిబ్బందితోనే 8వ తరగతి వరకూ నెట్టుకొచ్చారు. 2017–18లో పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసినా కొత్త పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో 2006లో వచి్చన ఒకే ఒక్క ఫిజికల్ సైన్స్ టీచర్‌తోనే 18 ఏళ్లుగా హైస్కూల్‌ను నడిపిస్తున్నారు.గతేడాది ఆరు నుంచి పదో తరగతి వరకు 154 మంది విద్యార్థులు చదివారు. వారిలో 28 మంది టెన్త్ విద్యార్థులు ఉండగా 9 మందే ఉత్తీర్ణులయ్యా రు. ఈసారి పాఠశాలలో మొత్తం 146 మంది ఉండగా వారిలో 19 మంది టెన్త్ చదువుతున్నారు. ఒకే ఆవరణలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కొనసాగుతుండగా ప్రైమరీ స్కూల్లో ఏడుగురు ఎస్జీటీలు, హైసూ్కల్లో ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో హైసూ్కల్ విద్యార్థులకూ ప్రైమరీ టీచర్లే పాఠాలు బోధిస్తున్నారు. సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఈ స్కూల్ హైదరాబాద్– బీజాపూర్ హైవేను ఆనుకొని ఉండటంతోపాటు సీఎం సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. కలుపు తీసేందుకు వెళ్తున్నా.. బడికి వెళ్లి చదువుకోవాలని ఉన్నా పాఠాలు చెప్పేవారు లేరు. ఎలాగూ క్లాసులు జరగడం లేదు. కనీసం అమ్మానాన్నలకు ఆసరాగా ఉందామని సమయం దొరికినప్పుడల్లా పత్తిలో కలుపు తీసేందుకు వెళ్తున్నా. – భూమిక, ఎనిమిదో తరగతి, రేగడిమైలారంఎవరికీ న్యాయం చేయలేకున్నాం పీఎస్, జెడ్పీహెచ్‌ఎస్‌లు ఒకే ఆవరణలో ఉన్నందునహైసూ్కల్ విద్యార్థులకు డిçప్యుటేషన్‌పై మేమే పాఠాలు చెబుతున్నాం. దీంతో అటు ప్రైమరీ, ఇటు హైసూ్కల్ విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నాం. అధికారులు, సీఎం స్పందించి పోస్టులు ఇవ్వాలి. – మల్లేశ్, పీఎస్ హెచ్ఎం, రేగడిమైలారం -
రేపట్నుంచి స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: స్కూల్ అసిస్టెంట్ టీచర్ల బదిలీల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అధికారులు అనుమతించారు. అయితే, మల్టీజోన్–2 పరిధిలో కోర్టు స్టే కారణంగా స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు బదిలీలు చేపట్టడం లేదని, 33 జిల్లాల్లో ప్రభుత్వ టీచర్లకు మాత్రం బదిలీలు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం మంగళవారం ఆదేశించింది. -
ఏపీలో భారీగా టీచర్ల బదిలీలు
సాక్షి, విజయవాడ: ఏపీలో భారీగా టీచర్ల బదిలీలు చేపట్టింది విద్యాశాఖ. 56, 829 మంది టీచర్లను బదిలీ చేస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో టీచర్ల బదిలీలు చేపట్టింది. ఉద్యోగుల సీనియారిటీ, మెరిట్ ఆధారంగా టీచర్ల బదిలీల నిర్వహణ చేపట్టింది. ఉమ్మడి 13 జిల్లాల్లోనూ బదిలీ ప్రక్రియ షురూ చేసింది ఏపీ విద్యాశాఖ. -
సారూ..ఇదేమి తీరు!
వారిది సమాజంలో ఉన్నత స్థానం. భావిభారత పౌరులను తయారు చేసే బాధ్యత గల ఉద్యోగం. అలాంటి స్థానంలో ఉన్న కొందరు అడ్డదారులు తొక్కారు. పదోన్నతి కోసం ఏకంగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. తద్వారా ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించారు. 2009 ఫిబ్రవరి నుంచి ఈ దందా సాగింది. సాక్షి,అనంతపురం: ఉపాధ్యాయుల నియామకం కోసం 2009 సంవత్సరంలో మెగా డీఎస్సీ నిర్వహించారు. ఆ సమయంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో 70 శాతం పదోన్నతుల ద్వారా, 30 శాతం నేరుగా భర్తీ చేశారు. భారీ స్థాయిలో పదోన్నతులకు అవకాశం కల్పించడంతో కొందరు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చదవకపోయినా.. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. అప్పట్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్‌లో 380, ఫిజికల్ సైన్స్‌లో 398, మేథమేటిక్స్‌లో 412, బయలాజికల్ సైన్స్‌లో 370, సోషల్ స్టడీస్‌లో 450 మందికి పదోన్నతులు దక్కాయి. ఇంగ్లిష్‌లో అక్రమాలు అత్యధికం.. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి దక్కాలంటే బీఈడీలో సంబంధిత సబ్జెక్టు (మెథడాలజీ) చదివి ఉండాలి. అయితే ఇంగ్లిష్ సబ్జెక్టుకు మాత్రం బీఈడీలో సంబంధిత మెథడాలజీతో పాటు డిగ్రీలో ఇంగ్లిష్ లిటరేచర్ లేదా ఎంఏ ఇంగ్లిష్ చదివి ఉండాలి. ఒకే దఫా 380 మందికి ఇంగ్లిష్ ఎస్ఏలుగా పదోన్నతులు వచ్చాయి. దీంతో పీజీ పూర్తి చేయని వారు కూడా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందారు. 52 మంది ఇలా అక్రమ మార్గంలో పదోన్నతులు తీసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల అంశంపై ఫిర్యాదులు వెళ్లడంతో అప్పటి విద్యాశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య విచారణకు ఆదేశించారు. సీబీసీఐడీ దర్యాప్తు కూడా చేయించారు. అయితే సీబీసీఐడీ దర్యాప్తునకు అప్పటి విద్యాశాఖ అధికారులు తగిన సహకారం అందించలేదు. కమిషనర్ నేరుగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనప్పటికీ ఉద్దేశపూర్వకంగానే వివరాలివ్వకుండా జాప్యం చేశారు. ఇద్దరిని సస్పెండ్ చేసి.. భారీఎత్తున సాగిన అక్రమ పదోన్నతుల వ్యవహారాన్ని మరుగున పరిచేందుకు అప్పటి విద్యాశాఖ అధికారులు తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని గుర్తింపు లేని యూనివర్సిటీల పేరిట ఎంఏ ఇంగ్లిష్ పీజీ సర్టిఫికెట్లు సమర్పించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి మొత్తం వ్యవహారాన్ని మరుగున పడేలా చేశారు. ఈ రెండు మాత్రమే నకిలీ సర్టిఫికెట్లు అని పదేపదే ప్రచారం చేయడం ద్వారా మిగిలిన వారి గుట్టురట్టు కాకుండా జాగ్రత్త పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం.. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు దూరవిద్య విధానంలో పీజీ చేయాలంటే ముందస్తుగా అధికారుల అనుమతి తీసుకోవాలి. వారాంతాల్లో జరిగే దూరవిద్య తరగతులకు హాజరుకావాలి. పరీక్షలు జరిగినప్పుడు.. అందుకు సంబంధించిన పూర్వానుమతి తీసుకోవాలి. కానీ ఇవేవీ లేకుండానే యూజీసీ నిషేధం విధించిన అలగప్ప, వినాయక మిషన్స్, మధురై కామరాజ్, భారతీయార్ వంటి వర్సిటీల పేరిట ఎంఏ ఇంగ్లిష్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల పేర్లతోనూ సర్టిఫికెట్లు తెచ్చినప్పటికీ ..నిబంధనలు పాటించలేదని పూనం మాలకొండయ్య ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. 2009లోనే కాకుండా ఆ తర్వాత చేపట్టిన పదోన్నతుల్లోనూ ఇంగ్లిష్తో పాటు మరికొన్ని సబ్జెక్టుల్లో కొందరు అక్రమ మార్గాలు అనుసరించినట్లు తెలుస్తోంది. అక్రమ పదోన్నతుల వ్యవహారం ఉపాధ్యాయ వర్గాల్లో తరచూ చర్చకు వస్తోంది. ఇటీవల కూడా ఏసీబీకి, విద్యాశాఖ కమిషనర్‌కు కొందరు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. -
ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు ఊరట..
సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు ఊరట లభించింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. నూతన జిల్లాల ఆవిర్భావం తర్వాత పాత జిల్లా ప్రాతిపదికనా.. లేక కొత్త జిల్లా ప్రకారం పదోన్నతులు ఇవ్వాలా అనే సందిగ్ధంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఫలితంగా పైస్థాయి పోస్టులు ఖాళీ అవుతున్నప్పటికీ కిందిస్థాయి టీచర్లకు పదోన్నతులు రావ డం లేదు. ఈ అంశంపై ఉపాధ్యాయ సం ఘాలు ప్రభుత్వానికి పలుమార్లు వినతులు సమర్పించాయి. ఈ క్రమంలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మంత్రి సబితా రెడ్డి సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి పదోన్నతుల అంశాన్ని సులభంగా పరిష్కరించేలా చూడాలని సూచనలు చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పాత పద్ధతిలో పదోన్నతులు కల్పిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాన్ని విద్యా శాఖాధికారులు స్పష్టం చేయడంతో ఆ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోర్టు అనుమతికి చర్యలు... నూతన జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టాలని కోర్టు గతంలో స్పష్టం చేసింది. గత విద్యా సంవత్సరం ఉపాధ్యాయ బదిలీల సమయంలో పలువురు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. నూతన జిల్లా ప్రాతిపదికన బది లీలు చేపట్టాలని పలు పిటిషన్లు దాఖలు కాగా... వాటిని విచారించిన కోర్టు పాత జిల్లా ప్రాతిపదికన బదిలీలు, కొత్త జిల్లా ప్రాతిపదికన పదోన్నతులు చేపట్టవచ్చని సూచించింది. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా పరిధిని పరిగణిస్తూ బదిలీల ప్రక్రియ పూర్తి చేయగా, పదోన్నతుల అంశం మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. ఈ క్రమంలో టీచర్ల బదిలీలు చేపట్టాలనే డిమాండ్‌తో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో పరిష్కార చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త జిల్లా ప్రకారం పదోన్నతులు ఇవ్వాలంటే ఉద్యోగుల విభజన జరగలేదనే అంశం ఇబ్బందికరంగా మారుతుందని భావించిన ప్రభుత్వం... ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ప్రమోషన్లు ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు సీనియార్టీ జాబితాను రూపొందించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశిస్తూనే... కోర్టు అనుమతి కోసం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా అధికారులకు సూచించింది. స్కూల్ అసిస్టెంట్ వరకే... తాజాగా బదిలీల ప్రక్రియ చేపట్టాల్సివస్తే కేవలం ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ వరకు మాత్రమే పదోన్నతులు ఇచ్చే వీలుంది. స్కూల్ అసిస్టెంట్ నుంచి జీహెచ్ఎం (గెజిటెడ్ హెడ్మాస్టర్) పదోన్నతుల్లో జోనల్ సమస్య ఉంది. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టు జోనల్ పరిధిలో ఉండడం, తాజాగా నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఏ ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వాలనేదానిపై స్పష్టత లేదు. మరోవైపు ఎంఈఓ, డిప్యూటీ ఈవో పదోన్నతులపైనా జోనల్ అంశంతో పాటు సర్వీసు రూల్స్‌తో ముడిపడి ఉంది. దీంతో ఈ పోస్టులకు పదోన్నతులు ఇవ్వడం ప్రస్తుతానికి కష్టమనే చెప్పొచ్చు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులతో రాష్ట్రవ్యాప్తంగా 6,500 పోస్టులు భర్తీ చేసే వీలున్నట్లు విద్యాశాఖ వర్గాల సమాచారం. -
నరక'వేతన'
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం మండల సమాఖ్యల ద్వారా నియమించిన పారిశుద్ధ్య కార్మికులకు ఈ విద్యా సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా వేతనం ఇవ్వకుండా వారి కుటుంబాలను ప్రభుత్వం పస్తులు పెట్టింది. పాఠశాలలను బట్టి, విద్యార్థుల సంఖ్యను బట్టి వారికి అరకొరగా వేతనం నిర్ణయించిన సర్కారు దానినీ కనీసం మూడు నెలలకో, ఆరు నెలలకో కూడా విడుదల చేయకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతోంది. సాధారణంగా నివాస గృహాల్లో నలుగురుకు మించకుండా వినియోగించే మరుగుదొడ్లను శుభ్రం చేయడానికే పారిశుద్ధ్య కార్మికులు రూ.1000పైగా వేతనం తీసుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో అసలు ఆ పని చేయడానికీ కార్మికులు ముందుకు రాని పరిస్థితి ఉంది. అటువంటి వారికి వేతనం ఎక్కువగా నిర్ణయించాల్సి ఉండగా అతితక్కువ వేతనాన్ని నిర్ణయించింది. అయినా పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కార్మికులు ఆ అరకొర వేతనానికీ సిద్ధపడ్డారు. అయినా ప్రభుత్వం వారికి వేతనాలు ఇవ్వకుండా కాలం వెళ్ళబుచ్చడంతో కార్మికులు తిండిమెతుకుల కోసం కూడా అప్పు చేయాల్సి వస్తోంది. రూ.800 నుంచిరూ. 4 వేల లోపు వేతనాలు.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 3,297 ఉన్నాయి. వాటిలో 2,550 ప్రాథమిక, 251 ప్రాథమికోన్నత, 496 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2,916 పాఠశాలల్లోమాత్రమే పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం నియమించింది. వీటిల్లో 20 మంది నుంచి సుమారు వెయ్యి మంది వరకూ విద్యార్థులు ఉన్న పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి పారిశుద్ధ్య నిర్వహణకు కార్మికులకు రూ.800 నుంచి రూ. 4వేల వరకూ వేతనంగా నిర్ణయించారు. డీఆర్డీఏ, అటవీశాఖల నుంచి చెల్లింపులు.. పాఠశాల పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీశాఖల నుంచి చెల్లింపులు చేస్తోంది. అటవీ శాఖ నుంచి 1,466 మంది కార్మికులకు, గ్రామీణాభివృద్ధిసంస్థ నుంచి 1,450 మంది కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే అటవీ శాఖ నుంచి చెల్లిస్తున్న కార్మికులకు గత జనవరి నుంచి వేతనాలు నిలిచిపోగా గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అంటే గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ ఒక్క నయాపైసా కూడా వేతనాలు చెల్లించలేదు. ఈ లెక్కన అటవీశాఖ నుంచి సుమారు రూ. 1.30 కోట్లు, గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి రూ. 2.60 కోట్లు మొత్తం కలిపి సుమారు రూ.3.90 కోట్లు వేతనాల బకాయిలు ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖకు రూ.100 కోట్ల బడ్జెట్ విడుదల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాల పారిశుద్ధ్య కార్మికుల వేతనాల కోసం 2017–18, 2018–19 సంవత్సరాలకు ప్రభుత్వం గత జనవరిలో పాఠశాల విద్యాశాఖకు రూ.100 కోట్లు విడుదల చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ అటవీశాఖకు గానీ, గ్రామీణాభివృద్ధి సంస్థకు గానీ పాఠశాల విద్యాశాఖ నిధులు విడుదల చేయలేదు. దీంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిన మండల సమాఖ్యలు చేతులెత్తేశాయి. ఈ నెలలోనే అన్ని తరగతులకూ సమ్మెటివ్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో విద్యా సంవత్సరం కూడా ముగిసిపోతోంది. తిరిగి పాఠశాలలు తెరిచే వరకూ పారిశుద్ధ్య కార్మికుల అవసరమే ఉండదు కనుక వారికి వేతనాలు చెల్లించే విషయంలో అధికారులు పెద్దగా పట్టించుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. -
పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి!
సాక్షి, బజార్హత్నూర్(బోథ్): చిన్నపాటి జ్వరానికే ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలో జరిగింది. ఈ ఘటన అందరినీ విస్తుగొల్పింది. అయితే, చిన్నారి మృతికి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బజార్హత్నూర్ మండలం కొలాంగూడ గ్రామానికి చెందిన కొడప మల్లేశ్వరి అదే మండలంలోని మాడగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి చదువుతోది. గురువారం ఉదయం నుంచి మల్లేశ్వరి జ్వరంతో బాదపడుతుంటే పాఠశాలకు చెందిన ఏఎన్ఎం అనుసూయ పారసెటమల్ మాత్రలు ఇచ్చింది. కానీ, సాయంత్రం వరకు జ్వరం తగ్గకపోవడం, వాంతులు, విరేచనాలు కూడా కావడంతో ఆ సమయంలో హెచ్ఎం రమేష్, ఏఎన్ఎం అనసూయ అందుబాటులో లేకపోడడంతో వార్డెన్ దేవరావ్ బజార్హత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బోథ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున మల్లీశ్వరి అపస్మారకస్థితికి చేరుకుంది. దీంతో వెంటనే ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. కానీ, అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు రిమ్స్ వైద్యులు తెలపడంతో మృతదేహాన్ని స్వగ్రామమైన కొలాంగూడ గ్రామానికి తరలించారు. ఈ క్రమంలోనే చిన్నారి మృతదేహాన్ని అంబు లెన్స్‌లో తీసుకెళ్లుండగా తన కూతురు మరణానికి పాఠశాల సిబ్బందే కారణమని మృతురాలి తండ్రి కొడప నారాయణ హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేయబోయారు. కానీ, గ్రామస్తులు సముదాయించి అతన్ని శాంతింపజేశారు. కుటుంబ సభ్యులు కూడా తమకు న్యాయం చేసేవరకు చిన్నారి మృతదేహంను తీసుకోమని బీష్మించారు. పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రెండెకరాల సాగుభూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై అబ్దుల్బాఖీ, ఏటీడీవో సౌజన్య ఫోన్లో ఐటీడీఏ డీడీ చందనతో మాట్లాడి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని తీసుకెళ్లారు. రాత్రి దాకా చెప్పలేదు.. చిన్నారి మల్లీశ్వరి గురువారం ఉదయం నుంచే జ్వరంతో బాదపడుతున్నా.. ఈ విషయాన్ని తమ కు తెలుపలేదనీ, రాత్రి మాత్రం బజార్హత్నూర్ పీహెచ్‌సీకి తీసుకెళ్తున్నామని మాత్రం తెలిపారని తల్లితండ్రులు కొడప నారాయణ, రుక్మబాయి బోరున విలపిస్తూ వివరించారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒక మాట కూడా తెలుపలేదని రాత్రి కూడా ఇదే విషయమడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడారని మారోపించారు. గురువారమే తమకు చెప్పి ఉంటే ఎలాగోలా కూతురిని కాపాడుకునేవాళ్లమని వారు కన్నీరుమున్నీరయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. మల్లీశ్వరి మృతి విషయం తెలుసుకున్న ఏటీడీవో సౌజన్య కొలాంగూడ గ్రామానికి చేరుకుని ఆమె తల్లితండ్రులను ఓదార్చారు. అనంతరం మాడగూడ ఆశ్రమ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రతీ తరగతి గదికి వెళ్లి విద్యార్థులను విచారించారు. భోజనాన్ని, తాగునీరు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థిని మృతి రిపోర్ట్‌ను ఉన్నతాధికారులకు పంపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. పాఠశాలలో హెల్త్ క్యాంప్ విద్యార్థిని మృతి సంఘటనతో అప్రమత్తమైన వైద్యారోగ్య సిబ్బంది మాడగూడ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో శుక్రవారం ప్రభుత్వ వైద్యుడు హరీష్ అధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అన్ని తరగతుల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. హెల్త్ అసిస్టెంట్ గాజుల రమేష్, ఏఎన్ఎం అనసూయ పాల్గొన్నారు. -
భాషా పండిట్లు, పీఈటీలు ఇక స్కూల్ అసిస్టెంట్లు..!
భువనగిరి : తమ ఉద్యోగాలను అప్‌గ్రేడ్ చేయాలని తెలుగు, హిందీ భాషా పండిట్లతో పాటు పీఈటీలు ఏళ్ల తరబడి చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ మాట్లాడుతున్న గండమల్ల విశ్వరూపం ఎల్బీ స్టేడియంలో 2017 డిసెంబర్లో జరిగిన తెలుగు భాషా ప్రపంచ మహాసభల సందర్భంగా భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తామని సీఎం కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు వారికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భాషా పండితులకు పాతికేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో గ్రేడ్–2 పండితుల స్థాయిలోనే పదవీ విరమణ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో 270 మందికి లబ్ధి చేకూరనుంది. పాతికేళ్లుగా తక్కువ వేతనంతోనే విధులు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,446 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇందులో ఎస్జీటీలు అందరూ ప్రాథమిక పాఠశాలల్లో, స్కూల్ అసిస్టెంట్లు హైస్కూళ్లలో విద్యాబోధన చేస్తున్నారు. ఎస్జీటీ కేటగిరీలో ఎంపికైన భాషా పండితులు, పీఈటీలు మాత్రం హైస్కూళ్లలో పని చేస్తుంటారు. వీరు ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా పని చేస్తున్నప్పటికీ ఎస్జీటీల జీతభత్యాలు మాత్రమే లభిస్తున్నాయి. రైట్ టు యాక్ట్ ప్రకారం పనికి తగిన వేతనం చెల్లించాలని పాతికేళ్లుగా భాషా పండితులు, పీఈటీలు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అప్‌గ్రేడ్ చేయాలంటూ 2002లో ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేయడంతో అప్పటి ప్రభుత్వం స్పందించి 2017 ఫిబ్రవరి 3వ తేదీన 17, 18జీఓలను తీసుకువచ్చి పదోన్నతులకు పచ్చజెండా ఊపింది. ఆ జీఓలపై ఇతర ఉపాధ్యాయ సంఘాలు కోర్టుకు వెళ్లడంతో దశాబ్ధన్నర కాలంగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. 273 మందికి అప్‌గ్రేడ్ జిల్లాలో 63 ప్రాథమికోన్నత, 466 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 1,446మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో 1,095పని చేస్తుండగా, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 351మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ప్రభుత్వం భాషా పండితులకు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయనుండటంతో జిల్లాలోని 273 మందికి పదోన్నతి లభించనుంది. జిల్లాలో 120మంది తెలుగు, 73 హిందీ భాషా పండితులు, 80మంది పీఈటీలు ఉన్నారు. వీరిందరినీ అప్‌గ్రేడ్ చేయడంతో స్కూల్‌అసిస్టెంట్లకు లభించే జీతభత్యాలతోపాటు పదోన్నతులు కూడా లభించనున్నాయి. ఫలితం దక్కింది దశాబ్ద కాలం పాటు భాషా పం డితులు చేసిన సుధీర్ఘపోరా టానికి ఫలితం దక్కింది. చాలా సంవత్సరాల నుంచి స్కూల్ అసిస్టెంట్ హోదాలో ఉన్నప్పటికీ వేతనాలు రాక, పండితులు ఇబ్బందులు పడ్డారు. భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్లుగా మార్చడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. –కందుల ఉపేందర్, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షుడు సంతోషంగా ఉంది గ్రేడ్–2 హోదాలో ఉన్న భాషా పండితులకు పని ఎక్కువగా ఉండటంతోపాటు వేతనం తక్కువగా ఉండేది. ఈ విధంగా చాలా సంవత్సరాల పాటు పని చేయడం జరిగింది. ప్రస్తుతం గ్రేడ్2 హోదాలో ఉన్న పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా మార్చడంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంతోషంగా ఉంది. –మహేశ్వరం విజయ, ఉత్తటూరు, రామన్నపేట మండలం స్కూల్ అసిస్టెంట్ హోదా దక్కనుంది గ్రేడ్2 హోదాతో దశాబ్ధన్నర కా లం పాటు పాఠశాలలో పని చేశా. గ్రేడ్2 హోదాలో ఉన్న త మకు ఎస్ఏ హోదా ఇవ్వాలని 1998 నుంచి ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చాం. 2003లో రెండుసార్లు జీవోల ద్వారా పదోన్నతులు కల్పిస్తామని చెప్పిన జరగలేదు. ప్రస్తుతం ఈవిషయంలో ప్రభుత్వం మార్పులు చేసి అప్‌గ్రేడ్ చేయడం పట్ల సంతోషంగా ఉంది. –మర్రి జయశ్రీ, భాషా పండితురాలు, ఖప్రాయపల్లి -
భాషా పండితులు అప్ గ్రేడ్‌కు ఓకే చెప్పిన కేసీఆర్
సాక్షి, హైదరాబాదు : రాష్ట్రంలోని రెండవ శ్రేణి భాషా పండితులు, పీఈటీల పోస్టులను.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు భాషా పండితుల పోస్టులను అప్ గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై తెలంగాణ రాష్ట్రంలో గ్రేడ్ 2 పండిట్ల పోస్టులుండవన్నారు అధికారులు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది భాషా పండితులకు మేలు జరుగుతుందని తెలిపారు. భాషా పండిట్లు, పీఈటీలను స్కూలు అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వుల పట్ల టీచర్ ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్థన్ రెడ్డి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ ప్రగతి భవన్లో మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. భాషా పండితుల చిరకాల కోరికను కేసీఆర్ నెరవేర్చారన్నారు. విద్యారంగ చరిత్రలో ఇదొక అపూర్వ నిర్ణయంగా నిలిచిపోతుందని అభిప్రాయ పడ్డారు. సీఎం కేసీఆర్‌కు తెలుగు భాషపై ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమన్నారు. -
ఈ నెల 24 నుంచే డీఎస్సీ పరీక్షలు
సాక్షి, విజయవాడ : డిసెంబర్ 24 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తొలి విడతలో స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. రెండో విడత జనవరి 18 నుంచి ఎస్జీటీ పరీక్షలు జరుపుతామని పేర్కొన్నారు. తొలి విడత పరీక్షలకు 2,43,185 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. డీఎస్సీ కోసం 124 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. -
బీఈడీ అభ్యర్థులకు తీపి కబురు
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అభ్యర్థులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఎనిమిదేళ్లుగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు దూరమైన బీఎడ్ అభ్యర్థులకు మళ్లీ ఎస్జీటీ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 4 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు ఎస్జీటీ పోస్టులకూ అర్హులు కానున్నారు. అయితే ఒకటి నుంచి 5వ తరగతి వరకూ బోధించేందుకు టీచర్‌గా ఎంపికయ్యే బీఎడ్ అభ్యర్థి తాను నియామకం అయిన తేదీ నుంచి రెండేళ్లలోగా తాము గుర్తించిన విద్యా సంస్థ నుంచి ఎలిమెంటరీ విద్యలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని ఎన్సీటీఈ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అసలేం జరిగిందంటే.. బీఎడ్‌లో చైల్డ్ సైకాలజీ లేదని, చిన్న పిల్లలకు వారు బోధించేందుకు అర్హులు కాదని, 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఎస్జీటీ పోస్టులకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) అభ్యర్థులే అర్హులంటూ 2008లో డీఎడ్ అభ్యర్థుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయిం చింది. వాదోపవాదాల తర్వాత 2010లో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులని, బీఎడ్ అభ్యర్థులు అర్హులు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు బీఎడ్ వారు అర్హులు కాదని 2010 ఆగస్టు 23న ఎన్సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో చేపట్టిన నియామకాల్లో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను తీసుకోలేదు. వారిని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం చేసింది. ఎస్జీటీ పోస్టులను డీఎడ్ అభ్యర్థులతోనే భర్తీ చేస్తూ వచ్చాయి. బీఎడ్ అభ్యర్థుల అభ్యర్థనతో.. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని, చైల్డ్ సైకాలజీ సబ్జెక్టును ప్రత్యేకంగా చదువుకుంటామని అనేకసార్లు బీఎడ్ అభ్యర్థులు ఎన్సీటీఈని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టింది. 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఎడ్ పూర్తి చేసిన వారు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు అర్హులేనని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్జీటీగా నియమితులైన రెండేళ్లలోగా ఎలిమెంటరీ విద్యలో 6 నెలల బ్రిడ్జి కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఎలిమెంటరీ విద్యలో బ్రిడ్జి కోర్సు లేదు. దానిని ఎన్సీటీఈ ప్రవేశ పెడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు డీఎడ్ అభ్యర్థులకు ఇప్పటివరకు ఎస్జీటీ పోస్టుల్లో ఉన్న పూర్తి అవకాశం తగ్గిపోనుంది. డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ఇద్దరికి వాటిల్లో అవకాశం ఉండనుంది. మళ్లీ పూర్వవైభవం వస్తుందా? ఒకప్పుడు ఏడాది కోర్సుగానే ఉన్న బీఎడ్‌ను ఎన్సీటీఈ 2014లో రెండేళ్ల కోర్సుగా మార్పు చేయడం, బీఎడ్ వారికి ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం తొలగించడంతో బీఎడ్‌కు డిమాండ్ తగ్గిపోయింది. గతంలో బీఎడ్‌లో చేరేందుకు ఏటా లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2018–19లో బీఎడ్‌లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌కు 38 వేల మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్సీటీఈ తాజా నిర్ణయంతో బీఎడ్‌కు మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని, ప్రైవేటు పాఠశాలల్లోనూ అవకాశాలు విస్తృతం అవుతాయని అధికారులు చెబుతున్నారు. -
‘స్కూల్ అసిస్టెంట్’ ఫలితాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. అభ్యర్థికి వచ్చిన మార్కుల వివరాలతో పాటు మెరిట్ ఆధారంగా వారికి రాష్ట్ర ర్యాంకులను కేటాయించింది. పోస్టుల భర్తీలో పారదర్శకతతో పాటు జిల్లాలోని 20 శాతం ఓపెన్ కేటగిరీ పోస్టులకు అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పించడంతో ఈ ర్యాంకులను ప్రకటించింది. 1941 స్కూల్ ఆసిస్టెంట్ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా అభ్యర్థికి వచ్చిన రాష్ట్ర ర్యాంకు, హాల్‌టికెట్ నంబరు, మార్కులు, రిజర్వేషన్ కేటగిరీ, జిల్లా వివరాలతో ఫలితాలను ప్రకటించింది. మొత్తం 27 సబ్జెక్టులకు 1,17,410 మందితో మెరిట్ జాబితాను రూపొందించింది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం జారీ చేసిన ర్యాంకుల జాబితాల నుంచి ఒక్కో పోస్టుకు 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను సిద్ధం చేసి ఆయా జిల్లాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పంపించనుంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక జిల్లాల నుంచి వచ్చిన జాబితాలను బట్టి అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనుంది. మరోవైపు సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, పండిట్ పోస్టులకు సంబంధించిన ర్యాంకులను కూడా త్వరలోనే ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. అభ్యర్థికి వచ్చిన మార్కుల వివరాలతోపాటు మెరిట్ ఆధారంగా వారికి రాష్ట్ర ర్యాంకులను కేటాయించింది. పోస్టుల భర్తీలో పారదర్శకతతో పాటు జిల్లాలోని 20 శాతం ఓపెన్ కేటగిరీ పోస్టులకు అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పించడంతో ఈ ర్యాంకులను ప్రకటించింది. 1941 స్కూల్ ఆసిస్టెంట్ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా అభ్యర్థికి వచ్చిన రాష్ట్ర ర్యాంకు, హాల్‌టికెట్ నంబరు, మార్కులు, రిజర్వేషన్ కేటగిరీ, జిల్లా వివరాలతో ఫలితాలను ప్రకటించింది. మొత్తం 27 సబ్జెక్టులకు 1,17,410 మందితో మెరిట్ జాబితాను రూపొందించింది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. గతంలో ఫలితాలను వెల్లడించిన అనంతరం ఒక పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచేది. ఆ తర్వాత రోస్టర్ వారీగా మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసేది. తుది ఎంపిక జాబితా ప్రకటించిన తర్వాతే అభ్యర్థి మార్కులు తెలుసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మార్కులను ముందు గానే ప్రకటించడం ద్వారా అభ్యర్థుల్లో ఎలాంటి అనుమా నాలకు తావులేకుండా చర్యలు చేపట్టింది. ఇకపై అన్ని పోస్టులకు ఇదే విధానాన్ని అమలు చేయనుంది. ప్రస్తుతం జారీ చేసిన ర్యాంకుల జాబితాల నుంచి ఒక్కో పోస్టుకు 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను సిద్ధం చేసి ఆయా జిల్లాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పంపించనుంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక జిల్లాల నుంచి వచ్చిన జాబితా లను బట్టి అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనుంది. మరోవైపు సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, పండిట్ పోస్టులకు సంబంధించిన ర్యాంకులను కూడా త్వరలోనే ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
జూనియర్ లెక్చరర్లుగా టీచర్లకు పదోన్నతులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హతలు కలి గిన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చ రర్లుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రభు త్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పంచాయతీరాజ్ టీచర్ పోస్టులను లోకల్ కేడర్‌గా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఆర్గనైజ్ చేయిం చిన ప్రభుత్వం.. పంచాయతీరాజ్, ప్రభుత్వ టీచర్లకు ఒకే రకమైన (ఏకీకృత) సర్వీసు రూల్స్ రూపక ల్పనలో పడింది. మరోవైపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్న తులు కల్పించేందుకు సిద్ధం అవుతోంది. స్కూల్ అసిస్టెంట్లకే జూని యర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించే ఉత్తర్వులను రద్దు చేస్తూ 2008 సెప్టెంబర్ 18న ప్రభుత్వం జారీ చేసిన జీవో 223ని ఉపసంహరించే దిశగా ఆలోచనలు చేస్తోంది. నేడు ఉన్నతస్థాయి సమావేశం ఈనెల 26న పాఠశాల, ఇంటర్మీడియెట్ విద్యా కమిషనర్లు, ఇతర అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జీవో 223ని సవరించాలా లేక ఉపసంహరించాలా? ఎక్కువ సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏం చేయాలన్న అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇంటర్మీడియెట్ విద్యలో ఉద్యోగాల భర్తీకి అనుసరించాల్సి నిబంధనలపై కూడా చర్చిస్తారు. -
ఎస్ఏ పోస్టులు అంతంతమాత్రమే..
- కొత్త డీఎస్సీలో 1,754 స్కూల్ అసిస్టెంట్లు - తెలుగు మీడియంలో 4,779 ఎస్జీటీ పోస్టులు - మొత్తంగా 8,792 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: త్వరలో భర్తీ చేయాలని భావిస్తున్న ఉపాధ్యాయ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు చాలా తక్కువగా ఉన్నట్లు విద్యా శాఖ లెక్కల్లో తేలింది. లక్షల మంది బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఎదురుచూస్తున్న ఎస్ఏ పోస్టులు కొన్ని జిల్లాల్లో ఒక్కటీ లేవని తెలిసింది. త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఉర్దూ మీడియం మినహా 1,754 ఎస్ఏ పోస్టులనే ఇతర మీడియంలలో భర్తీ చేసేలా ప్రభుత్వం నుంచి విద్యా శాఖ ఆమోదం పొందింది. అయితే గతంలో పాఠశాలల మూసివేత కారణంగా పక్కన పెట్టిన అనేక పోస్టులను డీఈవో పూల్‌లో పెట్టేశారు. వాటి భర్తీకి ప్రస్తుతం చర్యలు చేపట్టకపోవడం కారణంగా త్వరలో భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టులు తక్కువగా ఉన్నట్లు తెలిసింది. విద్యా శాఖ 8,792 పోస్టుల భర్తీకే ప్రతిపాదనలు పంపడంతో వాటినే టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల విషయంలో మాత్రం విద్యా శాఖ ముందు చూపుతో ఆలోచించింది. అందుకే 4,779 ఎస్జీటీ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రాథమిక పాఠశాలల్లోనే ఎస్జీటీ పోస్టులు ఉన్నందున కాస్త ఎక్కువ సంఖ్యలో వాటి భర్తీకి ఓకే చెప్పింది. అయినా డీఈవోల అధీనంలో మరిన్ని పోస్టులు ఉన్నట్లు సమాచారం. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలను ఇన్నాళ్లు బయట పెట్టని విద్యా శాఖ ఆ వివరాలను పేర్కొంటూ మంగళవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రస్తుతం టెట్ పరీక్ష నిర్వహించామని, త్వరలోనే టీఎస్పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఉర్దూ మీడియంలో 900 పోస్టులను, తెలుగు సహా ఇతర మీడియంలలో 7,892 పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది. -
తక్షణమే పదోన్నతులు కల్పించాలి
శ్రీకాకుళం: ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు తక్షణమే పదోన్నతులను కల్పించాలని లేని పక్షంలో ఆందోళన ఉ«ధృతం చేస్తామని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌదరి రవీంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కోరుతూ మూడో రోజు ధర్నాను ఆదివారం రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజులుగా ధర్నా చేస్తున్నా ఆశించిన రీతిలో పదోన్నతుల ఫైలులో కదలిక లేకపోవడం శోచనీయమన్నారు. పదోన్నతులతోపాటు సబ్జెక్టుల వారీగా రోస్టర్ పాయింట్ల జాబితా కాపీని విడుదల చేసి ప్రతి ఉపాధ్యాయునికి అందజేయాలని yì మాండ్ చేశారు. ధర్నాలో యూటీఎఫ్ పట్టణ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రామారావు, పి.సూర్యప్రకాశరావు, ఎస్ఎస్ ప్రధాన్, ఎ.చిన్నవాడు, టి.వైకుంఠరావు, పి.మోహనరావు, డీవీ సత్యనారాయణ, వి.త్రినాథరావు, బి.శ్రీకాంత్, అర్జునరావు, కనకరాజు, రామదాసు, బి.వెంకటరావు, టి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
8 మందికి డబుల్ ధమాకా
►ప్రశాంతంగా ఎస్ఏ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ►11 మంది గైర్హాజరు నేడూ పరిశీలనకు అవకాశం ►ఒకరికి ట్రిపుల్ ఛాన్స్ అనంతపురం ఎడ్యుకేషన్ : డీఎస్సీ-14 స్కూల్ అసిస్టెంట్ల సెలక్షన్ జాబితాలోని అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం ప్రశాంతంగా సాగింది. జిల్లా కేంద్రంలోని గిల్డ్‌ఆఫ్ సర్వీస్ స్కూల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ఉదయాన్నే అభ్యర్థులు కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా విద్యాధికారి (డీఈఓ) అంజయ్య, విద్యా శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ (ఏడీ) లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖ అధికారులు ఆయా రిజర్వేషన్ అభ్యర్థుల కులధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 98 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు గాను 89 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. మిగిలిన తొమ్మిది పోస్టులకు ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేరు. 89 పోస్టులకు గాను తొలిరోజు 78 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చారు. తెలుగులో ఒకరు, ఫిజికల్ సైన్స్‌లో ఒకరు, ఇంగ్లిష్‌లో ముగ్గురు, గణితంలో ముగ్గురు, సోషియల్‌లో ముగ్గురు గైర్హాజరయ్యారు. వీరందరికీ ఫోన్లలో సమాచారం అందించారు. శనివారం కూడా ఈ ప్రక్రియ సాగుతుందని డీఈఓ తెలిపారు. ఎనిమిది మందికి ‘డబుల్‌ధమాకా’ ఎనిమిది అభ్యర్థులు రెండేసి పోస్టులకు ఎంపికయ్యారు. ఎస్జీటీలో నలుగురు, తెలుగు పండిట్లో ఇద్దరు, ఇంగ్లిష్, సోషియల్‌లో ఒక్కొక్కరు చొప్పున రెండేసి పోస్టులకు ఎంపికయ్యారు. ఓ మహిళ తెలుగు పండిత్ పాటు ఇంగ్లిష్, సోషియల్ పోస్టులకు ఎంపిక కావడం విశేషం. -
స్కూల్ అసిస్టెంట్ల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి
* 23 మంది అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు సైతం * ఎంపికైనట్టు గుర్తింపు * రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదన * అనుమతి వచ్చిన వెంటనే కొత్తవారి ఎంపిక శ్రీకాకుళం: జిల్లా నుంచి డీఎస్సీ-14లో స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలుగా ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన స్థానిక ప్రభుత్వబాలుర పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. మాజీ సైనికుల కేటగిరీ నుంచి ఓ మహిళ ఎంపిక కాగా దానిని అధికారులు తిరస్కరించారు. మరో మహిళ తను ఈ ఉద్యోగం చేపట్టనని లిఖితపూరకంగా తెలియజేశారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారిలో 23 మంది ఎస్జీటీ స్థాయి పోస్టులకు కూడా ఎంపికైనట్లు అధికారులు గుర్తించారు. వారంతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో చేరేందుకు సుముఖత తెలపడంతో లిఖితపూరకం హామీను తీసుకున్నారు. వీటన్నింటినీ రాష్ట్ర స్థాయికి నివేదించారు. అక్కడ పరిశీలన పూర్తయి అనుమతులు వచ్చిన వెంటనే ఎస్జీటీ పోస్టులకు కొత్త వారిని ఎంపిక చేస్తారు. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తిచేసి అటుతరువాత నియామకాలు జరుపుతారు. ఈ నెలాఖరు నాటికి పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. -
చదువు సాగేనా..!
♦ వీవీ పోస్టులకు అర్హుల కొరత ♦ ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులతో తెలుగు మీడియం పోస్టులు భర్తీ సాక్షి, సిటీబ్యూరో : జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు కనీసం విద్యావలంటీర్లు (వీవీ) కూడా కరువయ్యారు. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో మొత్తం 386 వీవీ పోస్టుల నియామకానికి విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా ఆన్లైన్లో సుమారు 1800 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో వెరిఫికేషన్ల అనంతరం వెయ్యి మంది మిగిలారు. 275 ఎస్జీటీ, 111 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు విద్యా శాఖ కసరత్తు చేయగా.. కొన్ని సబ్జెక్ట్‌లకు అర్హులైన అభ్యర్థులు దొరకలేదన్న విషయం వెల్లడైంది. ఇదిలా ఉంటే ఎంపిక చేసిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఎవరు, ఎప్పుడు ఇవ్వాలన్న అంశాలపై జిల్లా విద్యాశాఖకు స్పష్టత కొరవడింది. నియామక పత్రాల అందజేతకు సోమవారంతో గడువు ముగిసినా ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలు కాలేదు. మాధ్యమంతోనే గందరగోళం.. వివిధ మాధ్యమాల్లోని (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ తదితర) 275 ఎస్జీటీ పోస్టులకు 400 మంది దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో వీవీ పోస్టులు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది ఇంగ్లిష్ మీడియం బోధనకు ఆప్షన్లు ఇచ్చారు. ఈ క్రమంలో ఆంగ్ల మాధ్యమంలోని పోస్టులన్నీ భర్తీ అయ్యాయి. అయితే తెలుగు మీడియానికి వచ్చేసరికి పోస్టుల సంఖ్యకు అనుగుణంగా అభ్యర్థులు లేక ఆయా పోస్టులను భర్తీ చేయడంలో అధికారులు చేతులెత్తేశారు. తెలుగు మీడియంలోని 182 పోస్టులకు నిర్దిష్టమైన అర్హత గలిగిన అభ్యర్థుల కొరత ఏర్పడింది. ఫలితంగా తాత్కాలిక ఎంపిక జాబితా విడుదల చేసిన ఆదివారం నాటికి 127 పోస్టులను మాత్రమే భర్తీ చేయగలిగారు. అదికూడా డీఎడ్ అభ్యర్థులు లేకపోవడంతో బీఈడీ అభ్యర్థులతో సర్దుబాటు చేశారు. మిగిలిన 55 పోస్టుల భర్తీ ప్రక్రియ సోమవారం పూర్తి చేశారు. తెలుగు మీడియం అభ్యర్థులు లేకపోవడంతో.. వారి స్థానాల్లో ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులను నియమించారు. వీళ్లలో కొంతమంది స్థానిక మండ లానికి చెందిన వారు కాకపోవడంతో కూడా ఇబ్బందులు తలెత్తాయి. ఎంపికైన వీవీలకు స్కూళ్ల కేటాయింపునకు ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం నుంచి అధికారులకు స్పష్టత రాలేదు. ఈ క్రమంలో మెరిట్, సీనియారిటీ ప్రాతిపదికన స్కూళ్లు కేటాయించాలని అధికారులు యోచిస్తున్నారు. ఆ బాధ్యతను డిప్యూటీ ఐఓఎస్‌లకు అప్పగించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. అయితే స్కూళ్ల కేటాయింపులో అధికారులకు చిక్కులు తప్పవన్న భావన వ్యక్తమవుతోంది. ఇందులో పనిచేయాల్సిన పాఠశాలలు నివాస ప్రాంతాలకు దూరంగా ఉండడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. -
బదిలీల కౌన్సెలింగ్ వాయిదా
నల్లగొండ: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ వాయిదా పడింది. స్పౌజ్ కేటగిరీలో మార్పులు చేస్తూ విద్యాశాఖ డెరైక్టర్ నుంచి బుధవారం స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చాయి. అదీగాక ఉపాధ్యాయుల నుంచి భారీ సంఖ్యలో అభ్యంతరాలు వస్తున్నందున వాటిన్నింటినీ సరిచేసి తుది సీనియారిటీ జాబితాను తయారు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ముందు ప్రకటించిన ప్రకారం కాకుండా జిల్లా విద్యాశాఖ రోజువారీ తాత్కాలిక షెడ్యూల్ ఖరారు చేస్తూ బుధవారం రాత్రి 9గంటలకు ప్రకటించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16 తేదీ నాటికి పూర్తికావాల్సిన బదిలీల ప్రకియ కాస్తా 18వ తేదీ వరకు పొడిగించాల్సి వచ్చింది. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు కలిపి రోజుకు వెయ్యి మంది చొప్పున బదిలీ చేయాలని నిర్ణయించారు. కానీ ఆచరణలోకి వచ్చే సరికి ఇది కష్టసాధ్యమవు తుందని అధికారులు చెబుతున్నారు. ఎస్జీటీల కౌన్సెలింగ్ విషయంలోనే గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు జిల్లా స్థాయిలో కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం 20 నాటికి పూర్తియ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే బుధవారం స్కూల్ అసిస్టెంట్ 56 మందికి హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. సాయత్రం 6.30 గంటలకు మొదలైన కౌన్సెలింగ్ రాత్రి 9. 30 గంటలకు పూర్తిచేశారు. స్పౌజ్ కేటగిరీలో మార్పు.. నిన్నమొన్నటి వరకు స్పౌజ్ కేటగిరీలో భార్యభర్త ఇద్దరికి అవకాశం కల్పించారు. కానీ మారిన నిబంధనల ప్రకారం ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే స్పౌజ్ కేటగిరీకి వర్తింపజేయాలని డెరైక్టరేట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో ఈ కేటగిరీలో ఇద్దరు దరఖాస్తు చేసుకున్న టీచర్లను సీనియారిటీ జాబితా నుంచి తొలగించాల్సి ఉంది. ఈ క్రమంలో స్పౌజ్ కేటగిరీ టీచర్ల నుంచి మళ్లీ దరఖాస్తులు తీసుకోవాల్సి రావడంతో బుధ వారం ప్రకటించాల్సిన స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ తుది జాబితాను గురువారానికి వాయిదా వేశారు. అలాగే గురువారం జరగాల్సిన స్కూల్ అసిస్టెంట్ల బదిలీలను శుక్రవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. -
ప్రశాంతంగా టెట్ కమ్ టీఆర్టీ
నెల్లూరు (అర్బన్) : టెట్ కమ్ టీఆర్టీకి సంబంధించి ఆదివారం ఉదయం లాంగ్వేజ్ పండిట్స్‌కు నగరంలోని 13 కేంద్రాల్లో, మధ్యాహ్నం రెండు కేంద్రాల్లో పీఈటీలకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. లాంగ్వేజ్ పండిట్స్ పరీక్షకు 2985 మందికి గాను 2573 మంది హాజరయ్యారు. 412 మంది గైర్హాజరయ్యారు. లాంగ్వేజ్ పండిట్ తెలుగులో 2306 మందికిగాను 2046 మంది హాజరయ్యారు. 260 మంది గైర్హాజరయ్యారు. హిందీలో 629 మందికిగాను 489 మంది హాజరుకాగా 140 మంది గైర్హాజరయ్యారు. ఉర్దూలో 50 మందికి గాను 38 మంది హాజరుకాగా 12 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయులు తెలిపారు. పీఈటీ పరీక్షకు 447 మందికి గాను 384 మంది హాజరుకాగా 63 మంది గైర్హాజరయ్యారు. డీకేడబ్ల్యూ కాలేజీలోని పరీక్ష కేంద్రాన్ని డీఈఓ పరిశీలించారు. నేడు స్కూల్ అసిస్టెంట్స్ పరీక్ష టెట్ కమ్ టీఆర్టీ పరీక్షలో భాగంగా సోమవారం లాంగ్వేజ్ పండిట్స్ (స్కూల్ అసిస్టెంట్స్‌కు 14 కేంద్రాల్లో, నాన్ లాంగ్వేజ్‌కు 33 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. లాంగ్వేజ్ పండిట్స్ 3038, నాన్ లాంగ్వేజెస్‌కు సంబంధించి 7762 మంది పరీక్ష రాయనున్నారు. -
డీఎస్సీకి 14 వేల దరఖాస్తులు
విజయనగరం అర్బన్:ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని కలలు కంటున్న నిరుద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపెడుతోంది. అనేక నిబంధన లు, అర్హతలపై కొత్త షరతులు అభ్యర్థుల్లో కల వరం రేపాయి. డీఎస్సీలో భాగంగా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు దరఖాస్తు చేసేం దుకు ఆన్లైన్ కేంద్రాలకు వెళుతున్న అభ్యర్థులు సర్వర్ ఓపెన్ కాక గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు తుది గడువు శుక్రవారంతో ముగియాల్సి ఉండగా ఈ నెల 21 వరకు తాజాగా పెంచారు. అదే విధంగా ఆన్లైన్లో దరఖాస్తులకు ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు గడువు పొడిగించారు. సంక్రాంతి సెలవుల దృష్ట్యా మూడు, నాలుగు రోజుల వ్యవధిలో డీఎస్సీకి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు అన్ని విభాగాలల్లో కలిపి జిల్లాలో దాదాపుగా 14 వేల దరఖాస్తులు అందాయి. ఆన్లైన్లో దరఖాస్తు చే సిన తరువాత హార్డ్ కాపీని విడిగా అందజేసేందుకు స్థానిక కలెక్టరేట్లోని డీఈఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కౌంటర్‌కు మూడు రోజుల వ్యవధిలో రోజుకు 1300 నుంచి రెండువేల చొప్పున దరఖాస్తులు అందాయి. గడువు పొడిగింపుతో నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఊరట డీఎస్సీ దరఖాస్తుకు గడువు పొడిగించాలని నిరుద్యోగ యువత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా ఎట్టకేలకు విద్యాశాఖ స్పందించింది. ఫీజు చెల్లింపునకు 21, ఆన్లైన్ దరఖాస్తులకు 22వ తేదీ వరకు గడువు పొడించినట్లు విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. చివరి రోజుల్లో దరఖాస్తులు చేసుకుంటామని భావించిన నిరుద్యోగులు సంక్రాంతి మూడు రోజుల పాటు దరఖాస్తులను స్వీకరించకపోవడంతో చాలా వరకు ఆందోళన పడ్డారు. తాజాగా గడువు పొడిగించడం వల్ల అనేక మంది నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఊరట చెందారు. -
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలో మొత్తం 688 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి గతంలో ఎన్నడూ లేని విధంగా టెట్, డీఎస్సీలకు ఉమ్మడిగా రాత పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టిఆర్టి)ల ఉమ్మడి పరీక్షకు బుధవారం నుంచి అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. జిల్లాలో మొత్తం 839 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా ప్రభుత్వం కేవలం 688 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఖాళీల్లో 151 పోస్టులకు ప్రభుత్వం కోత విధించింది. స్కూలు అసిస్టెంట్లు, భాషా పండితులు, సెకండరీ గ్రేడు టీచర్లు, వ్యాయామోపాధ్యాయ పోస్టులను నోటిఫికేషన్లో ప్రకటించారు. స్కూలు అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్ , ఫిజికల్ ఎడ్యుకేషన్, తెలుగు గ్రేడ్-2 భాషా పండితులు ఒక్క పోస్టు కూడా ఈ డీఎస్సీలో ప్రకటించలేదు. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 3వ తేదీ నుంచి 2015 జనవరి 17వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఠీఠీఠీ.ఛీట్ఛ్చఞ.జౌఠి.జీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అభ్యర్థులు తమ వివరాలన్నింటినీ ఆ దరఖాస్తులో అప్లోడ్ చేయాలి. వివరాలను అప్లోడ్ చేసిన అనంతరం దరఖాస్తు ప్రింటవుట్ కాపీ తీసుకొని దానికి అభ్యర్థుల విద్యార్హతలు, స్టడీ సర్టిఫికేట్లు, కులధ్రువీకరణ పత్రాలు, ఇతర అర్హతా పత్రాలను స్వయంగా సంతకాలు చేసి ప్రింటవుట్ కాపీని జతపరిచి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలి. ఈ వివరాలన్నీ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ధ్రువీకరిస్తేనే ఆ విద్యార్థుల హాల్‌టికెట్లు జనరేట్ అవుతాయి. అభ్యర్థులు దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించిన తర్వాత తప్పనిసరిగా ఆ ప్రింటవుట్‌ను డీఈఓ కార్యాలయంలోనే అందజేయాలి. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించకుండా నేరుగా డీఈఓ కార్యాలయాల్లో స్వీకరించరు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. మేలో రాత పరీక్షలు ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి నిర్వహిస్తున్న టెట్, టి.ఆర్.టి. ఉమ్మడి రాతపరీక్షను 2015 మేలో నిర్వహించనున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు 2015 మే 9న, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్లకు మే 10న, స్కూలు అసిస్టెంట్లు (లాంగ్వేజెస్ అండ్ నాన్ లాంగ్వేజెస్) మే 11న రాతపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రాత పరీక్షకు సంబంధించిన సిలబస్, మార్గదర్శకాలు, జిల్లాలవారీగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను వెబ్సైట్లో ఉంచారు. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి ఈ వివరాలను తెలుసుకోవచ్చు. భారీగా దరఖాస్తులు టి.ఆర్.టి, టెట్ ఉమ్మడి పరీక్షకు జిల్లా నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేయనున్నారు. రాష్ట్రంలో మరే ఇతర జిల్లాల్లో లేని విధంగా డీఈడీ, బీఈడీ కళాశాలలున్నాయి. జిల్లాలో మొత్తం 45 బీఈడీ కళాశాలలు, 64 డీఈడీ కళాశాలలున్నాయి. జిల్లాలో ప్రతి సంవత్సరం సుమారు 10 వేల మంది అభ్యర్థులు బీఈడీ, డీఈడీ సర్టిఫికేట్లతో కళాశాల నుంచి బయటకు వస్తున్నారు. డీఎస్సీపై ఆశతో విద్యార్థులందరూ వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లోని ఖాళీల వివరాలు, డీఎస్సీకి ప్రకటించిన పోస్టులు, కుదించిన పోస్టుల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం. -
1,416 టీచర్ పోస్టులు ఖాళీ
నాగిరెడ్డిపేట : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,416 ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసాచారి పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలోపు ఈ పోస్టులు భర్తీ కావొచ్చన్నారు. మాల్తుమ్మెద ఉన్నత పాఠశాలలో మంగళవారం పలు పాఠశాలల హెచ్ఎంలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పాఠశాలలోని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల పనితీరుకు సంబంధించి సూచనలిచ్చేందుకు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధనతీరు, బోధనోపకరణాల వినియోగం, పరీక్షల నిర్వహణపై ప్రత్యేకమైన ఫార్మాట్‌ను రూపొందించామని, దీనిని ఉపాధ్యాయులే పూరించి ప్రధానోపాధ్యాయుడికి సమర్పిస్తారని పేర్కొన్నారు. ఈ ఫార్మాట్‌ను హెచ్ఎం తనిఖీచేసి మండల విద్యావనరులకేంద్రానికి పంపుతారన్నారు. అక్కడ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలకు ఆయా మండల కేంద్రాల్లో ఈ నెల 27 నుంచి తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులపై శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ తెలిపారు. 1, 2తరగతులకు సంబంధించి తెలుగు, గణితం సబ్జెక్టులపై, 3, 4, 5 తరగతులకు సంబంధించి ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఒక్కో సబ్జెక్టుపై మూడు రోజుల చొప్పున శిక్షణ ఉంటుందన్నారు. జిల్లాలో గతేడాది పదో తరగతి పరీక్షల్లో 89.31 శాతం ఉత్తీర్ణులయ్యారని, ఈసారి వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంతో సాగుతున్నామని డీఈఓ తెలిపారు. జిల్లాలో 566 పాఠశాలల్లో గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నెలాఖరులో లేదా వచ్చేనెలలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం జరగవచ్చన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దుచేస్తామన్నారు. అనంతరం ఆయన గోపాల్పేట ఉన్నత పాఠశాలను, మోడల్ స్కూల్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈఓ గోవర్ధన్‌రెడ్డి, మాల్తుమ్మెద, గోపాల్పేట, ఆత్మకూర్ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు ప్రతాప్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్, అరుణజ్యోతి ఉన్నారు. -
ఎన్నాళ్లో ఈ నిరీక్షణ!
* బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల ఆరాటం * డీఎస్సీ ప్రకటనలో సర్కారు జాప్యం * జిల్లాలో శిక్షణ పొందుతున్న 48 వేలమంది నిరుద్యోగులు * మంచి రాబడి కళ్లజూస్తున్న కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు భానుగుడి (కాకినాడ) : జిల్లాలో ప్రస్తుతం డీఎడ్, బీఎడ్ ఉత్తీర్ణులు 54 వేలమందికి మించి ఉండొచ్చని అంచనా. వీరితో పాటు ఇతర జిల్లాల నుంచి సైతం అభ్యర్థులు జిల్లాలో ఉన్న పలు కోచింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. కాకినాడ, రాజమండ్రి, ఇతర ప్రాంతాలలోని పలు కేంద్రాల్లో ఇప్పటికే 48 వేలమందికి పైగా శిక్షణ పొందుతున్నారు. వీరంతా పలు వసతి గృహాలలో, ప్రైవేట్ రూమ్‌లలో నెలకు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు చెల్లించి ఉంటున్నారు. 3 నెలలకు పైగా కోచింగ్‌కు ఒక్కో అభ్యర్థీ రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చుచేస్తున్నారు. ఇదే అదనుగా అటు కోచింగ్ కేంద్రాలు, ఇటు బాలుర వసతి గృహాలు మంచి రాబడిని కళ్లజూస్తున్నాయి. జిల్లాలో ఖాళీలు ఇవీ.. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ అన్ని విభాగాలకు సంబంధించి 331 ఖాళీలున్నాయి. ఇందులో ప్రతి పోస్టునూ దృష్టిలో ఉంచుకుంటే ఒక్కో ఉద్యోగానికి 150 మందికి పైగా అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ గణితం (25), బయొలాజికల్ సైన్సు(26), సోషల్ (79), ఇంగ్లీష్ (15), తెలుగు (27), హిందీ (14), ఉర్దూ(1), ఫిజికల్ డెరైక్టర్ (1), లాంగ్వేజ్ పండిట్ తెలుగు (83), లాంగ్వేజ్ పండిట్ ఉర్దు (1), లాంగ్వేజ్ పండిట్ సంస్కృతం(5), లాంగ్వేజ్ పండిట్ హిందీ(29), పీఈటీ(19) ఖాళీలున్నాయి. ఇందులో సోషల్‌లో ఒక్కో పోస్టుకు 3 వందల మందికి పైగా పోటీపడుతున్నారు. ఇదే తరహాలో మిగిలిన సబ్జెక్టులకు పోటీ ఉంది. ఇదిలా ఉండగా ఎస్జీటీ పోస్టులకు సంబంధించి 877 ఖాళీలున్నాయి. ప్రస్తుతం డీఎడ్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు సైతం డీఎస్సీకి అర్హత కల్పించనుండడంతో జిల్లాలో టెట్ క్వాలిఫై అయిన వారు 1600 మంది, డీఎడ్ పూర్తిచేసిన వారు 8 వందల మంది, ప్రస్తుతం డిఎడ్ పరీక్షలు పూర్తిచేసుకుంటున్న వారు 1800 మంది అభ్యర్థులు వెరసి 4200 మంది పోటీపడుతున్నారు. జిల్లాలో ఉన్న ఎస్జీటీ పోస్టుల సంఖ్యతో పోలిస్తే 1:4.8 గా ఈ నిష్పతి ఉండడం విశేషం. స్కూల్ అసిస్టెంట్లకు మరింత పోటీ స్కూల్ అసిస్టెంట్లకు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పోటీ మరింత పెరగనుంది. జిల్లాలో 2014 టెట్ పరీక్షకు 22,890 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా 19,921 మంది హాజరయ్యారు. 16 వేలమందికి పైగా ఉత్తీర్ణత సాధించారు. గతంలో టెట్ ఉత్తీర్ణులైన వారు, కాని వారిని కలుపుకొంటే జిల్లాలో 50 వేల మందికి పైగా ఉన్నట్టు అంచనా. వీరిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ పరీక్షకు పోటీపడే వారే 26 వేలకు మించి ఉండొచ్చని సమాచారం. గందరగోళం..అయోమయం. ప్రభుత్వం ప్రస్తుతం బీఎడ్ అభ్యర్థులకు సైతం ఎస్జీటీ అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, ఇటీవల పశ్చిమ బెంగాల్ వినతిని కేంద్రం తిరస్కరించిన నేపథ్యంలో అటు బీఎడ్ అభ్యర్థులు అవకాశం కోసం ఆశగా చూస్తుండగా, డీఎడ్ అభ్యర్థులు బీఎడ్ వారికీ అనుమతిస్తే తమ అవకాశాలకు గండిపడుతుందని ఆందోళన చెందుతున్నారు.