ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని కలలు కంటున్న నిరుద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపెడుతోంది.
విజయనగరం అర్బన్:ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని కలలు కంటున్న నిరుద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపెడుతోంది. అనేక నిబంధన లు, అర్హతలపై కొత్త షరతులు అభ్యర్థుల్లో కల వరం రేపాయి. డీఎస్సీలో భాగంగా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు దరఖాస్తు చేసేం దుకు ఆన్‌లైన్ కేంద్రాలకు వెళుతున్న అభ్యర్థులు సర్వర్ ఓపెన్ కాక గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు తుది గడువు శుక్రవారంతో ముగియాల్సి ఉండగా ఈ నెల 21 వరకు తాజాగా పెంచారు. అదే విధంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు గడువు పొడిగించారు. సంక్రాంతి సెలవుల దృష్ట్యా మూడు, నాలుగు రోజుల వ్యవధిలో డీఎస్సీకి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు అన్ని విభాగాలల్లో కలిపి జిల్లాలో దాదాపుగా 14 వేల దరఖాస్తులు అందాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చే సిన తరువాత హార్డ్ కాపీని విడిగా అందజేసేందుకు స్థానిక కలెక్టరేట్‌లోని డీఈఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కౌంటర్‌కు మూడు రోజుల వ్యవధిలో రోజుకు 1300 నుంచి రెండువేల చొప్పున దరఖాస్తులు అందాయి.
గడువు పొడిగింపుతో నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఊరట
డీఎస్సీ దరఖాస్తుకు గడువు పొడిగించాలని నిరుద్యోగ యువత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా ఎట్టకేలకు విద్యాశాఖ స్పందించింది. ఫీజు చెల్లింపునకు 21, ఆన్‌లైన్ దరఖాస్తులకు 22వ తేదీ వరకు గడువు పొడించినట్లు విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. చివరి రోజుల్లో దరఖాస్తులు చేసుకుంటామని భావించిన నిరుద్యోగులు సంక్రాంతి మూడు రోజుల పాటు దరఖాస్తులను స్వీకరించకపోవడంతో చాలా వరకు ఆందోళన పడ్డారు.
తాజాగా గడువు పొడిగించడం వల్ల అనేక మంది నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఊరట చెందారు.