విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంక న ప్రక్రియ(స్పాట్)కు సీనియర్ ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. జిల్లాకు వచ్చిన జవాబు పత్రాలకు సరిపడ సీనియర్ ఉపాధ్యాయులు కంటే 15 శాతం అదనంగా ఉపాధ్యాయులను ఎంపిక చేసినా గురువారం నాటికి వంద మంది వరకు ఉపాధ్యాయుల కొరత ఉన్నట్టు విద్యాశాఖాధికారులు గుర్తించారు. తొలుత ఎంపిక చేసిన ఉపాధ్యాయుల జాబితాపై వచ్చిన అభ్యంతరాల వల్ల కొందరికి అనుమతి నిరాకరించగా.. పలువురు సీనియర్లు అనారోగ్యంతో విధులకు రాలేమ ని చెప్పడంతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది.
స్కూల్ అసిస్టెంట్ టీచర్‌గా సీనియూర్టీ ఉన్నా ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేసి టెన్త్ సబ్జెక్టులు బోధించని వారు కావడంతో పలువురికి విధులు అప్పగించలేదు. దీంతో దాదాపు అన్ని సబ్జెక్టులకు ఈ సమస్య అనివార్యమైంది. ఈ సమస్యను పరిష్కరించడానికి జిల్లా విద్యాశాధికారి జి.కృష్ణారావు, ఉప విద్యాశాఖాధికారులు నాగమణి, సత్యనారాయణ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. తాజా సీనియూర్టీ జాబితాను తీసుకొని విధులకు హాజరు కావాలని కోరుతూ నేరుగా ఉపాధ్యాయునికి బుధవారం సాయంత్రం ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చా రు. ఈ మేరకు అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు సరిపడే సంఖ్యలో గురువారం ఉదయం హాజరయ్యూరని జిల్లా విద్యాశాఖాధికారి జి.కృష్ణారావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
విద్యుత్ కోతకు ప్రత్యామ్నాయ చర్యలు
విద్యుత్ కోత వల్ల మూల్యాంకన ప్రక్రియకు ఆటంకం జరగకుండా ప్రత్యామ్నాయంగా జనరేటర్‌ను ఏర్పాటు చేశామని డీఈఓ కృష్ణారావు చెప్పారు. మూల్యాంకన ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన పాఠశాలల్లో కొన్ని గదులకు విద్యుత్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని లేకుం టే చీకట్లు ఏర్పడతాయని తెలిపారు. ఇటువంటి చోట్ల స్పాట్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండే లా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. మహిళా టీచర్లకు కనీస సదుపాయూలు కల్పించామని తెలిపారు.
టెన్త్ స్పాట్‌కు సీనియర్ టీచర్ల కొరత
Published Fri, Apr 18 2014 2:29 AM | Last Updated on Sat, Sep 15 2018 5:09 PM
Advertisement
Advertisement