ఇంటికో ఉద్యోగం ఏది బాబూ..?
విజయనగరం క్రైం : ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని తుంగ లోకి తొక్కారని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్య దర్శి కోట అప్పన్న విమర్శించారు. శనివారం ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్ద నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించా లని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు ప్రచారం చేశారని, కానీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఇచ్చిన హామీని గాలికి వదిలేసి నిరుద్యో గులను దగా చేశారన్నారు. ఇప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. లక్షలు ఖర్చు పెట్టి చదువుకున్న చదువులు బూడిదలో పోసిన పన్నీరయ్యారన్న దిగులతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. 50 మంది విద్యార్థులకు తక్కువగా ఉన్న వసతిగృహాలను ప్రభుత్వం మూసివేయాలన్న దుర్మార్గమైన ఆలోచనను వ్యతిరేకిస్తూ కడపలో ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ యువజన, విద్యార్థి సం ఘాలు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు సమస్యలను తెలుసుకో కుండా పోలీసులను ఉసుగోల్పి లాఠీచార్జి, అరెస్ట్‌లు చేయించడం అత్యంత దారుణమన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు వెలగాడ రాజేష్, బీసపు సాయికిరణ్, మజ్జి చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.